పాలు (Milk )

 

  • పాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం: భారత్‌
  • పాలను ‘కొవ్వు విస్తరించి ఉన్న నీరు’ అంటారు. దీన్నే ఇమల్షన్‌ అంటారు.
  • పాలలో ప్రొటీన్స్‌, కార్బొహైడ్రేట్స్‌తో పాటు Ca, K, Fe ఉంటాయి.
  • ఆవు పాలలో అధికంగా ఉండే విటమిన్లు: B, A
  • ఆవు పాలలో పసుపు రంగుకు కారణం: రెబో ఫ్ల్లేవిన్‌ (Vitamin-B2 )
  • బర్రె పాలలో కొవ్వు శాతం: 7.2%

 
  • పాలు పుల్లగా మారినపుడు ఉత్పత్తి అయ్యే ఆమ్లం: లాక్టిక్‌ ఆమ్లం
  • పాలు కిణ్వ ప్రక్రియలో పెరుగుగా మారేందుకు తోడ్పడేవి: లాక్టో బాసిల్లన్‌, ఈస్ట్‌
  • పాలను సూక్ష్మజీవి రహితం చేసేందుకు వాడే పద్ధతి: ‘పాశ్చరైజేషన్‌’. దీన్ని కనుగొన్నది: లూయీ పాశ్చర్‌
  • పాశ్చరైజేషన్‌ అనగా: పాలను 72oC వేడిచేసి 15 సెకన్ల వరకు నిల్వ ఉంచడం (లేదా) 65 డిగ్రీల సెంటిగ్రేడ్‌ 30 నిమిషాల వరకు ఉంచడం.
  • పాలలోని సూక్ష్మజీవుల (బ్యాక్టీరియాల) సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగించే పరీక్ష: మెథిలిన్‌ బ్లూ క్షయకరణ పరీక్ష, ప్లేట్‌ కౌంట్‌ పద్ధతి.
  • పాలలోని చక్కెర – లాక్టోజ్‌
  • పాలలోని ప్రొటీన్‌ – కెసిన్‌
  • పాలలోని ఎంజైమ్‌ – లాక్టేజ్‌
  • పాలలోని నీటిశాతాన్ని పరీక్షించేది- లాక్టోమీటర్‌, పాలలోని కొవ్వుశాతం ఎండకాలంలో తక్కువగాను, మిగిలిన కాలాల్లో ఎక్కువగాను ఉంటుంది.
  • చిన్నపిల్లల్లో పాలనుగడ్డ కట్టించే ఎంజైమ్‌- రెనిన్‌
  • శ్వేతవిప్లవం (వైట్‌ రివెల్యూషన్‌): పాలు, పాల ఉత్పత్తుల దిగుబడిని పెంచేందుకు చేపట్టిన విప్లవం. దీనిలో భాగంగా ఆపరేషన్‌ ఫ్లడ్‌ కార్యక్రమం నిర్వహించారు.
  • ఫాదర్‌ ఆఫ్‌ వైట్‌ రెవల్యూషన్‌: వర్గీస్‌ కురియన్‌ (2011లో మరణించారు) ఇతను గుజరాత్‌ (ఆనంద్‌ పట్టణం)లో డెయిరీ స్థాపించిన సభ్యులు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...