Showing posts with label ఫిజిక్స్. Show all posts
Showing posts with label ఫిజిక్స్. Show all posts

ఆధునిక భౌతిక శాస్త్రం --- మాదిరి ప్రశ్నలు 1

 

1.   సహజ రేడియోధార్మికతలో విడుదలయ్యే కిరణాలేవి?
జవాబు: α, ß, γ
2.   α, ß, γ కిరణాలకు మరో పేరు?
జవాబు: బెక్వరల్ కిరణాలు
3.   α-కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్యలో తగ్గుదల?
జవాబు: 2 యూనిట్‌లు
4.   α-కణం విడుదలైనప్పుడు ద్రవ్యరాశి సంఖ్యలో తగ్గుదల?
జవాబు: 4 యూనిట్‌లు
5.   α-కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త?
జవాబు: రూథర్‌ఫర్డ్
6.   అత్యధిక అయనీకరణ సామర్థ్యం ఉన్న కణం?
జవాబు: α-కణం
7.   అత్యధిక చొచ్చుకుపోయే సామర్థ్యం ఉన్న కణం?
జవాబు: γ -కణం
8.   సహజ రేడియోధార్మికత ప్రక్రియలో ß కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్యలో పెరుగుదల?
జవాబు: 1 యూనిట్
9.   ß-కణాన్ని కనుగొన్నవారు?
జవాబు: రూథర్‌ఫర్డ్
10.     γ-కణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్యలో మార్పు?
జవాబు: ఉండదు
11.     γ-కణాన్ని కనుగొన్నవారు?
జవాబు: విల్లార్డ్
12.     రేడియోధార్మిక శ్రేణులు ఎన్ని రకాలు?
జవాబు: నాలుగు రకాలు. అవి..
ఎ. థోరియం శ్రేణి లేదా4n శేణి
బి. యురేనియం శ్రేణి లేదా 4n+2 శ్రేణి
సి. ఆక్టీనియం శ్రేణి లేదా 4n+3 శ్రేణి
డి. నెఫ్ట్యూనియం శ్రేణి లేదా 4n+1 శ్రేణి
13.     సహజ రేడియోధార్మిక శ్రేణుల్లో చిట్టచివరి మూలకం?
జవాబు: సీసం (పరమాణు సంఖ్య = 82, లాటిన్ నామం ప్లంబం pb)
14.     రేడియోధార్మికతకు ప్రమాణాలేవి?
జవాబు: బెక్వరల్, రూథర్‌ఫర్డ్, క్యూరి (రేడియోధార్మికతకు చిన్న ప్రమాణం Bq (బెక్వరల్))
Bq =
విఘటనం/ సెకన్
రూథర్‌ఫర్డ్ (R.d) = 106  విఘటనం/సెకన్
రూథర్‌ఫర్డ్ (R.d) = 106 Bq
క్యూరీ (C.I) = 3.7×1010  విఘటనం/సెకన్
                  = 3.7×1010  Bq
                  = 3.7×104  ×106  Bq
క్యూరీ (C.I) = 3.7×104  R.d (R.d - రూథర్‌ఫర్డ్)
రేడియోధార్మికతకు అతి పెద్ద ప్రమాణం క్యూరీ.
15.     ప్రకృతిలోని ప్రాథమిక బలాల్లో అత్యంత బలమైంది?
జవాబు: బలమైన కేంద్రక బలం
16.     కేంద్రక బలాలను మీసాన్ సిద్ధాంతంతో వివరించిందెవరు?
జవాబు: యుకావా
17.     పరమాణు కేంద్రకం పాల్గొనే చర్యలు?
జవాబు: కేంద్రక విచ్ఛిత్తి, కేంద్రక సంలీనం
18.     కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను వివరించిందెవరు?
జవాబు: అట్టోహాన్, స్ట్రాస్‌మన్, లిసేవెయిట్‌నర్
19.     కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ జరగడానికి ఉపయుక్తమైన కణం?
జవాబు: ఉష్ణీయ న్యూట్రాన్
20.     ఉష్ణీయ న్యూట్రాన్ అంటే?
జవాబు: తక్కువ వేగం ఉన్న న్యూట్రాన్ (ఉష్ణీయ న్యూట్రాన్ శక్తి 0.04 ev కంటే తక్కువగా ఉంటుంది)
21.     కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్లు ఏ శ్రేణిలో ఉంటాయి?
జవాబు: గుణ శ్రేణి న్యూట్రాన్లు విడుదలయ్యే క్రమం: 3, 9, 27, 81, 243, 729....
22.     కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియ ఒక యురేనియం మూలకం అంతరించిపోయే వరకు జరుగుతుంది. ఈ చర్య పేరు?
జవాబు: శృంఖల చర్య
23.     శృంఖల చర్య ఎన్ని రకాలుగా జరుతుంది?
జవాబు: రెండు రకాలుగా. అవి..
ఎ. అనియంత్రిత శృంఖల చర్య
బి. నియంత్రిత శృంఖల చర్య
24.     అనియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేసేది?
జవాబు: ఆటమ్ బాంబు (అణు బాంబు)
25.     అణు బాంబు సృష్టికర్తలు?
జవాబు: అట్టోహాన్, స్ట్రాస్‌మన్
26.     అణు బాంబును మొట్టమొదటిసారిగా ఏ దేశంపై ప్రయోగించారు?
జవాబు: జపాన్
27.     అణు బాంబును మొదటిసారిగా ఏ నగరంపై విసిరారు?
జవాబు: హిరోషిమా
ఆగస్టు 6న హిరోషిమాపై అణు బాంబువేశారు. కాబట్టి ఆగస్టు 6ను హిరోషిమా డే అని పిలుస్తారు. హిరోషిమాపై విసిరిన బాంబు పేరు లిటిల్ బాయ్.
28.     అణు బాంబును జపాన్‌లోని ‘నాగసాకి’ నగరంపై వేసిన రోజు?
జవాబు: ఆగస్టు 9. అందుకే ఆగస్టు 9ని నాగసాకి డే అని పిలుస్తారు. నాగసాకి నగరంపై వేసిన బాంబు పేరు ఫ్యాట్‌మాన్.
29.     నియంత్రిత శృంఖల చర్య ఆధారంగా పనిచేసే పరికరం?
జవాబు: న్యూక్లియర్ రియాక్టర్
30.     న్యూక్లియర్ రియాక్టర్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
జవాబు: ఎన్‌రిక్ ఫెర్మి
అమెరికాకు చెందిన ఫెర్మి 1942 డిసెంబర్‌లో న్యూక్లియర్ రియాక్టర్‌ను రూపొందించాడు. ఇతణ్ని న్యూక్లియర్ రియాక్టర్ పితామహుడిగా పిలుస్తారు. ఫెర్మి గౌరవార్థం పరమాణు కేంద్రక పరిమాణాన్ని ఫెర్మిలలో కొలుస్తారు. పరమాణు కేంద్రక వ్యాసార్ధం విలువ = 10-15  m
31.     న్యూక్లియర్ రియాక్టర్‌లో ఎన్ని ప్రధాన భాగాలుంటాయి?
జవాబు: 5
32.     న్యూక్లియర్‌లో ఉపయోగించే ఇంధన పదార్థాలు ఏవి?
జవాబు: యురేనియం, థోరియం, ఫ్లూటోనియం.
ఈ ఇంధన పదార్థాలను స్తూపాకార అల్యూమినియం గొట్టాల్లో నింపుతారు.
33.     న్యూక్లియర్ రియాక్టర్‌లోని మితకారి పదార్థం ప్రయోజనం?
జవాబు: న్యూట్రాన్‌ల వేగం తగ్గించడం
34.     న్యూక్లియర్ రియాక్టర్‌లో మితకారిగా ఉపయోగించే పదార్థాలు?
జవాబు: భారజలం, గ్రాఫైట్, బెరీలియం, పారఫిన్.
భారజలానికి మరో పేరు డ్యూటీరియం ఆక్సైడ్. దీన్ని యురే అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
o    ప్రస్తుతం ఇండియాలో 9 భారజల కేంద్రాలు ఉన్నాయి.
o    భారతదేశంలో మొదట పంజాబ్‌లోని నంగాల్‌లో భారజల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
o    తెలంగాణ రాష్ర్టంలోని ఏకైక భారజల కేంద్రం ఖమ్మం జిల్లాలోని మణుగూరులో ఉంది.
o    గ్రాఫెట్‌ను లెడ్ పెన్సిళ్ల తయారీలో, భారీ యంత్రాల్లో కందెనగా ఉపయోగిస్తారు.
o    లెడ్ పెన్సిల్‌లో లెడ్ ఉండదు.
o    గ్రాఫెట్ కార్బన్ రూపాంతరం.
o    కార్బన్‌కు అలోహ ధర్మం ఉన్నప్పటికీ గ్రాఫైట్ లోహ ధర్మాన్ని పాటిస్తుంది.
o    కార్బన్‌ను ‘కింగ్ ఆఫ్ ది ఎలిమెంట్స్’ అని పిలుస్తారు.
35.     న్యూక్లియర్ రియాక్టర్‌లో వాడే నియంత్రణ కడ్డీల ప్రయోజనం?
జవాబు: చర్యా వేగాన్ని తగ్గించడం
36.     న్యూక్లియర్ రియాక్టర్‌లో ఉపయోగించే నియంత్రణ కడ్డీలు?
జవాబు: బోరాన్, కాడ్మియం
37.     న్యూక్లియర్ రియాక్టర్‌లో జరిగే కేంద్రక చర్యల వల్ల విడుదలయ్యే ఉష్ణాన్ని బయటకు తీసుకొచ్చేందుకు ఉపయోగపడేది?
జవాబు: శీతల కారిణి (శీతల కారిణిగా ఉపయోగించే పదార్థాలు భారజలం, ద్రవ సోడియం)
38.     కేంద్రక సంలీన చర్యలకు మరో పేరు?
జవాబు: ఉష్ణకేంద్రక చర్యలు
39.     సూర్యుడు, నక్షత్రాల్లో నిరంతరం జరిగే చర్యలు?
జవాబు: కేంద్రక సంలీన చర్యలు
40.     సూర్యుడి నుంచి లభించే విటమిన్?
జవాబు: విటమిన్-డి
41.     హైడ్రోజన్ బాంబు ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
జవాబు: అనియంత్రిత కేంద్రక సంలీన చర్య
హైడ్రోజన్ బాంబును ఎడ్వర్డ్ టెల్లర్ తయారు చేశారు. ఇతడిని హైడ్రోజన్ బాంబు పితామహుడిగా పిలుస్తారు. మొదటి హైడ్రోజన్ బాంబు పేరు మైక్.
42.     కేంద్రక సంలీన చర్యలు భూమి, చంద్రుడిపై జరగకపోవడానికి కారణం?
జవాబు: హైడ్రోజన్‌కు ఉన్న స్వల్ప పలాయన వేగం.
వాయు కణాలు తప్పించుకొని పోయేందుకు కావల్సిన కనీస వేగాన్ని పలాయన వేగం (Ve) అంటారు.
o    భూమిపై హైడ్రోజన్ పలాయన వేగం - 11.2 కి.మీ./సెకన్
o    చంద్రుడిపై హైడ్రోజన్ పలాయన వేగం - 2.38 కి.మీ./సెకన్
o    సూర్యుడిపై హైడ్రోజన్ పలాయన వేగం - 620 కి.మీ./సెకన్
43.     కేంద్రక సంలీన చర్యలో పాల్గొనే మూలకం?
జవాబు: హైడ్రోజన్
44.     కేంద్రక సంలీన చర్య జరిగిన తర్వాత ఏర్పడే మూలకం?
జవాబు: హీలియం
45.     సూర్యుడికి మరో పేరు?
జవాబు: హీలియో

ఆధునిక భౌతిక శాస్త్రం --- మాదిరి ప్రశ్నలు 2

 

1. బెకరల్‌ కిరణం కానిది?
ఎ) బీటా బి) ఆల్ఫా
సి) కాస్మిక్‌ డి) గామా

2. రేడియోధార్మికతను కొలవడానికి ఉపయోగించే పెద్ద ప్రమాణం ఏది?
ఎ) రూథర్‌ఫర్డ్‌ బి) క్యూరీ
సి) బెకరల్‌ డి) హెన్రీ

3. రేడియోధార్మిక మూలకం ఉష్ణోగ్రత, పీడనాన్ని పెంచినప్పుడు దాని రేడియోధార్మికత?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) రెండింతలు అవుతుంది

4. రేడియోధార్మిక వికిరణాలను కనుక్కోవడానికి ఉపయోగించే సాధనం?
ఎ) క్లౌడ్‌ చాంబర్‌
బి) గిగ్గర్‌ ముల్లర్‌ కౌంటర్‌
సి) సింటిలేషన్‌ కౌంటర్‌
డి) పైవన్నీ

5. కాంతివేగంతో ప్రయాణించే రేడియోధార్మిక కిరణం ఏది?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ

6. కాస్మిక్‌ కిరణాల అధ్యయనం కోసం 1985 ఏప్రిల్‌ 29న భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి?
ఎ) రోహిణి బి) అనురాధ
సి) అవతార్‌ డి) భాస్కర

7. కాస్మిక్‌ కిరణాల తీవ్రత అధికంగా ఉండే ప్రదేశం?
ఎ) భూమి ధవాలు బి) భూమధ్యరేఖ
సి) భూమి కేంద్రం వద్ద
డి) అన్ని పర్వతాల పైన

8. కాస్మిక్‌ కిరణాల అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త?
ఎ) హెచ్‌.జె. బాబా
బి) ప్రొఫెసర్‌ సతీష్‌ ధావన్‌
సి) సర్‌ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌
డి) డాక్టర్‌ అబ్దుల్‌ కలాం

9. ఐసోటోపులను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్‌ బి) ఆస్టన్‌
సి) మేడమ్‌ క్యూరీ డి) రూథర్‌ఫర్డ్‌

10. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు?
ఎ) రూథర్‌ఫర్డ్‌ బి) ఫెర్మి
సి) విలియం బ్రాగ్‌ డి) మాక్స్‌ వెబర్‌

11. సహజ రేడియోధార్మికతను కనుగొన్నశాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్‌ బి) మేడమ్‌ క్యూరీ
సి) రూథర్‌ఫర్డ్‌ డి) ఐన్‌స్టీన్‌

12. సహజ రేడియోధార్మికత మూలకాల్లో స్థిర రూప మూలకం?
ఎ) యురేనియం బి) థోరియం
సి) సీసం డి) టంగ్‌స్టన్‌

13. సహజ రేడియోధార్మికత పరమాణువు ఏ భాగానికి సంబంధించింది?
ఎ) అంతర కర్పరం బి) బాహ్య కర్పరం
సి) ఆకారం డి) కేంద్రకం

14. రేడియో ధార్మిక మూలకాల్లో భారయుతమైన కణం?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ

15. హీలియం పరమాణువు కేంద్రకంతో పోలిన రేడియోధార్మికత కిరణం ఏది?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) ఏదీకాదు

16. కేంద్రక విచ్ఛిత్తిని కనుగొన్నవారు?
ఎ) ఐరీన్‌ క్యూరీ బి) రూథర్‌ఫర్డ్‌
సి) ఐన్‌స్టీన్‌ డి) ఆటోహాన్‌, ట్రాస్‌మాన్‌

17. మొదటి అణురియాక్టర్‌ను నిర్మించిన శాస్త్రవేత్త?
ఎ) ఐన్‌స్టీన్‌ బి) ఫెర్మి
సి) హెచ్‌.జె. బాబా డి) మాక్స్‌ ప్లాంక్‌

18. న్యూక్లియర్‌ రియాక్టర్‌లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) భారజలం బి) గ్రాఫైట్‌ కడ్డీలు
సి) బెరీలియం డి) పైవన్నీ

19. న్యూక్లియర్‌ రియాక్టర్‌లో నియంత్రణకారిగా ఉపయోగించే కడ్డీలు?
ఎ) కాడ్మియం బి) బోరాన్‌
సి) స్టీల్‌ డి) పైవన్నీ

20. అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) ఎడ్వర్డ్‌ టెల్లర్‌ బి) ఓపెన్‌ హైమర్‌
సి) స్పెన్నర్‌ డి) రూథర్‌ఫర్డ్‌

21. మ్యు మెజాన్‌ల ద్రవ్యరాశిని ఎలక్ట్రాన్‌ ద్రవ్యరాశితో పోల్చినపుడు?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) సగం

22. కిందివాటిలో అర్ధజీవిత కాలం తక్కువగా ఉన్న కణం ఏది?
ఎ) రేడియం బి) యురేనియం
సి) ప్రొటెక్టేనియం డి) ఫ్లుటోనియం

23. కత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నవారు?
ఎ) రూథర్‌ఫర్డ్‌
బి) మేడమ్‌ క్యూరీ
సి) ఫ్రెడ్రిక్‌ జోలాయిట్‌ క్యూరీ, ఐరీన్‌ క్యూరీ
డి) ఐన్‌స్టీన్‌

24. కిందివాటిలో కత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది?
ఎ) యురేనియం బి) ఫ్లుటోనియం
సి) క్యూరియం డి) లారెన్షియం

25. పరమాణు కేంద్రకంలో పనిచేసే బలాలు?
ఎ) సంసంజన బి) అసంజన
సి) కూలుంబ్‌ డి) వికర్షణ

26.అణుశక్తిని ఎందులో ఉపయోగిస్తారు?
ఎ) విద్యుత్‌ ఉత్పాదన
బి) జలాంతర్గాములు నడపడం
సి) ఐసోటోప్‌లు ఉత్పత్తి చేయడం
డి) పైవన్నీ

27. భారతదేశం నిర్మించిన తొలి పరిశోధనా అణు రియాక్టర్‌ పేరేమిటి?
ఎ) అప్సర బి) సైరస్‌
సి) పూర్ణిమ డి) ధ్రువ

28. సూర్యుడు, నక్షత్రాల్లో జరిగే చర్య?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి బి) కేంద్రక సంలీనం
సి) ఉష్ణగ్రాహక డి) ఏదీకాదు

29. కేంద్రక సంలీనం సూత్రం ఆధారంగా నిర్మించిన బాంబు?
ఎ) అణుబాంబు బి) హైడ్రోజన్‌ బాంబు
సి) ఎ, బి డి) ఏదీకాదు

30. కిరణజన్య సంయోగక్రియను అధ్యయనం చేయడానికి ఉపయోగించే ఐసోటోప్‌?
ఎ) 6జ12 బి) ూ సి) × డి) 8ఉ18

31. ఎక్స్‌ - కిరణాల తరంగదైర్ఘ్యం సాధారణ కాంతి కిరణాల తరంగదైర్ఘ్యం కంటే?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) రెండు రెట్లు ఎక్కువ

32. కాంతి విద్యుత్‌ ఘటాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
ఎ) రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసం
బి) ధ్వని ప్రత్యుత్పాదనలో
సి) దొంగలను పట్టుకునే అలారంలో
డి) పైవన్నీ

33. 'ఎలక్ట్రాన్‌ కవల కణం'గా పిలిచే పాజిట్రాన్‌ను కనుగొన్నవారు?
ఎ) పౌలి బి) పోవెల్‌
సి) అండర్సన్‌ డి) ఒపియాలిని

34. పదార్థంలోని తేలిక, బరువైన ఐసోటోప్‌లను దేనితో వేరు చేస్తారు?
ఎ) ఫొటోగ్రాఫిక్‌ ఫిల్మ్‌
బి) గిగ్గర్‌ ముల్లర్‌ కౌంటర్‌
సి) కేథోడ్‌ నాళం
డి) ఐసోట్రాన్‌

35. విశ్వంలో అతి శక్తిమంతమైన కిరణాలు ఏవి?
ఎ) లేజర్‌ బి) ఎక్స్‌-కిరణాలు
సి) కాస్మిక్‌ డి) రేడియో తరంగాలు

36. విశ్వ కిరణాలను ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) విక్టర్‌ హెస్‌ బి) ఐన్‌స్టీన్‌
సి) పౌలి డి) కాంప్టన్‌

37. ఎక్స్‌ - కిరణాల ప్రయోజనం ఏమిటి?
ఎ) స్ఫటిక నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు
బి) పెయింటింగ్‌ నాణ్యతను గుర్తించడానికి వాడతారు
సి) ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయడంలో వినియోగిస్తారు
డి) పైవన్నీ

38. వైద్యరంగంలో ఏ రకమైన ఎక్స్‌ కిరణాలను వినియోగిస్తారు?
ఎ) మదు బి) కఠిన
సి) సాధారణ డి) పైవన్నీ

39. కఠిన కాస్మిక్‌ కిరణాలను ఏది వెదజల్లుతుంది?
ఎ) నోవా బి) సూపర్‌ నోవా
సి) సూర్యుడు డి) గ్రహాలు

40. కాస్మిక్‌ కిరణాల తరంగదైర్ఘ్యం?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) మధ్యస్థం డి) పైవన్నీ

41. రేడియో థెరపీలో ఏ కిరణాలను వినియోగిస్తారు?
ఎ) లేజర్‌ బి) గామా తరంగాలు
సి) రేడియో తరంగాలు డి) పైవన్నీ

42. కాస్మిక్‌ కిరణాల్లో అధికంగా ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు

43. ప్రతిదీప్తి ప్రభావాన్ని ప్రదర్శించేవి?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు

44.థర్మల్‌ న్యూట్రాన్లను దేనిలో వినియోగిస్తారు?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) టెలివిజన్‌లో
డి) కేన్సర్‌ వ్యాధి నివారణలో

45. సి.టి. స్కానింగ్‌లో వేటిని వినియోగిస్తారు?
ఎ) కేథోడ్‌ కిరణాలు
బి) కాస్మిక్‌ కిరణాలు
సి) ఎక్స్‌-కిరణాలు
డి) రేడియో తరంగాలు

46. పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొనిపోయే కిరణాలు ఏవి?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ

47. ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు ఉండి, వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉన్న వివిధ మూలకాల పరమాణువులను ఏమంటారు?
ఎ) ఐసోటోపులు బి) ఐసోబార్‌లు
సి) ఐసోటోన్‌లు డి) ఐసోట్రాన్‌లు

48. కేన్సర్‌ వ్యాధి నివారణలో ఉపయోగించే కిరణాలు?
ఎ) ఆల్ఫా బి) గామా
సి) బీటా డి) కాస్మిక్‌

49. ఒక స్థిర మూలకాన్ని రేడియోధార్మిక మూలకంగా మార్చడాన్ని ఏమంటారు?
ఎ) సహజ రేడియోధార్మికత
బి) కత్రిమ రేడియో ధార్మికత
సి) మూలకాల కత్రిమ పరివర్తన
డి) పైవన్నీ

50. థైరాయిడ్‌ గ్రంథిని పరిశీలించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోప్‌?
ఎ) చీa బి) ×తీ సి) × డి) జశీ

51.కేన్సర్‌ గడ్డలను కరిగించడానికి ఏ రేడియో ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు?
ఎ) జ14 బి) జఉ60
సి) చీa డి) V

52. శరీరంలో రక్తం గడ్డకట్టిన ప్రాంతాలను గుర్తించడానికి ఏ రేడియో ఐసోటోపు ఉపయోగిస్తారు?
ఎ) చీa బి) జశీ
సి) × డి) 6జ14

53. శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగిం చే రేడియో ఐసోటోపు?
ఎ) 92ఖ238 బి) ూb
సి) ుష్ట్ర డి) 6జ14

54. భూమి వయసును అంచనా వేయడంలో ఉపయో గించే రేడియో ఐసోటోప్‌?
ఎ) × బి) చీa సి) ఖ డి) ుష్ట్ర

55. తణధాన్యాలు, ఉల్లిపాయలు, పప్పు లాంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వేటిని ఉపయోగిస్తారు?
ఎ) ఆల్ఫా కిరణాలు బి) పాజిట్రాన్లు
సి) ఎక్స్‌- కిరణాలు డి) గామా కిరణాలు


సమాధానాలు
1.సి 2.బి 3.సి 4.డి 5.సి
6.బి 7.ఎ 8.ఎ 9.బి 10.ఎ
11.ఎ 12.సి 13.డి 14.ఎ 15.ఎ
16.డి 17.బి 18.డి 19.డి 20.బి
21.ఎ 22.సి 23.సి 24.ఎ 25.సి
26.డి 27.ఎ 28.బి 29.బి 30.డి
31.బి 32.డి 33.సి 34.డి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.బి 40.ఎ
41.డి 42.బి 43.డి 44.ఎ 45.సి
46.సి 47. బి 48.బి 49.బి 50.సి
51.బి 52.ఎ 53.డి 54.సి 55.డి
Related Posts Plugin for WordPress, Blogger...