Showing posts with label PERSONS. Show all posts
Showing posts with label PERSONS. Show all posts

చంద్రశేఖర్ ఆజాద్

  


          భారత స్వాతంత్రోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎంద‌రికో స్పూర్తిదాయకంగా నిలిచారు. రవి అస్త‌మించని బ్రిటీష్ సామ్రాజ్యం అని ప్రగ‌ల్భాలు పలికే ఆనాటి తెల్ల‌దొరల ప్రభుత్వం ఆజాద్ ని సజీవంగా పట్టుకోలేకపోయింది. 1931 ఫిబ్రవ‌రి 27న ఆల్ఫ్రెడ్ పార్క్‌ లో నిర్వ‌హించిన ప్రజాగరన్ కార్య ్జ‌క్రమంలో ఆయన హ‌తుడయ్యేంతవర‌కు పోలీసులు ఎప్పుడూ ఆయ‌న్ని కనీసం తాకే సాహసం కూడా చేయలేకపోయారు.

         చంద్రశేఖర్ ఆజాద్ తన తుదిశ్వాస వర‌కు భారత స్వాతంత్య్రం కోసమే బతికారు. ఆయన మధ్యప్రదేశ్ లోని భాబ్రా గ్రామంలో 1906 జూలై 23న జ‌న్మించారు. వారి స్వ‌స్థ‌లం ఉతర్త‌ప్రదేశ్ ఉన్నావో జిల్లాలోని బద‌ర్కా గ్రామం. కానీ తన తండ్రి సీతారామ్ తివారీ క‌రువు కారణంగా స్వ‌గ్రామాన్ని విడిచిపెట్టి బ‌తుకుదెరువు కోసం తన కుటుంబాన్ని మధ్యప్రదేశ్ లోని భాబ్రాకు తరలించారట. ఆయనది చిన్నతనం నుంచి తిరుగుబాటు ధోరణి. ఆయన చదువుకంటే క్రీడ‌ల్లో ఎక్కువ ఆస‌క్తి కనబరిచేవారు. తన పేరులో ఆజాద్ అనే ప‌దాన్ని జోడించడం వెనుక ఒక ఆస‌క్తికరమైన కథనం ఉంది.

          జలియన్ వాలాబాగ్ మారణ‌కాండ యువ చంద్రశేఖర్ ని కదిలించింది. అతని త‌ల్లి చంద్రశేఖర్ ని సంస్కృత పండితుడిగా చూడాలనుకుంది. కానీ ఆయన దేశాన్ని విముక్తి చేసే మార్గాన్నే ఎంచుకున్నారు. 1921లో స‌హాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయంలో ద‌ర్నాలో కూర్చున్న 15 ఏళ్ళ చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచారు. అప్పుడు మెజిస్ట్రేట్ నీ పేరు, తండ్రి పేరు, నీ అడ్రస్ ఏమని ప్ర‌శ్నించగా.. దానికి చంద్రశేఖర్ నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వ‌తంత్ర‌, నా అడ్రస్ జైలు అని సమాధానం చెప్పారు. ఆ జవాబుకు అతనికి శిక్ష ప‌డింది. కానీ, ఆజాద్ అనేది తన పేరుతో శాశ్వ‌తంగా ముడిపడిపోయింది.

         ఎంతో ఉధృతంగా సాగుతున్న స‌హాయ నిరాకరణోద్యమాన్ని చౌరీ- చౌరా ఘటనతో నిలిపివేయడం ఆయ‌న్ని నిరాశపరచింది. శాంతియుత మార్గాలతో స్వాతంత్ర్యాన్ని సాధించలేమని భావించి తన మ‌కాం బ‌నారస్ కు మార్చుకున్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో బెనారస్ విప్ల‌వ కార్యకలాపాల‌కు కేంద్రంగా ఉండేది. 

         1924 అక్టోబర్ లో కాన్పూర్ లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారు. త‌ర్వాత అదే హిందుస్థాన్ సోషలిస్ట్రిపబ్లికన్ అసోసియేషన్గా మారింది. రామ్ ప్ర‌సాద్ బిస్మిల్, జోగేష్ చట‌ర్జీ, చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్లా, శ‌చీంద్ర‌నాథ్ సన్యాల్, అష్ఫాఖుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి, భగత్ సింగ్, భగవతి చరణ్ వోహ్రా, సుఖదేవ్ వంటి గొప్ప విప్ల‌వకారులు ఆ అసోసియేషన్ కి ముఖ్య స‌భ్యులుగా ఉన్నారు. త‌ర్వాత దశాబ్దంలో ఈ పేర్ల‌న్నీ దేశ ప్రజలని ఎంతగానో ఆక‌ర్షించి అనేక మంది వారి బాటను అనుస‌రించేందుకు దోహదప‌డ్డాయి బ్రిటీష్ వారిని భయపెట్టాయి. త‌ర్వాత 1925లో జ‌రిగిన కకోరి రైలు సంఘటనలో ఈ సంస్థ‌కు చెందిన చాలా మంది స‌భ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆజాద్, కుందన్లాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

         1927 డిసెంబర్ 17న డి.ఎస్.పి జాన్ సాండర్స్ ని హత్య చేసిన అనంతరం భగత్ సింగ్, రాజ్ గురులు డిఎవి కాలేజ్ వైపు పరుగులు తీస్తుండగా చందన్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ వారి వెంటప‌డ్డాడు. చందన్ సింగ్ భగత్‌సింగ్ కి అతి చేరువగా సమీపించి అత‌న్ని ప‌ట్టుకునే ప్రయత్నం చేయగా దూరం నుంచి చంద్రశేఖర్ ఆజాద్ కాల్చిన తూటా అతని కాలిలో దిగబడింది.

         1929లో సెంట్రల్ అసెంబ్లీబాంబు దాడి కేసులో ఈ సంస్థ‌కు చెందిన అనేక మంది స‌భ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఈ సంఘటన‌ల్లో కీలకపాత్ర పోషించిన ఆజాద్ ని మాత్రం ప‌ట్టుకోలేకపోయారు. ఆజాద్ జన్మస్థ‌లం అయిన భాబ్రాని సందర్శంచిన తొలి ప్ర‌దాని న‌రేంద్ర మోదీ. ప్రధాని న‌రేంద్ర మోదీ 2016లో తను చేప‌ట్టిన ‘జర యాద్ కరో కుర్బానీ’ (త్యాగాన్ని స్మ‌రించుకుందాం) కార్యక్రమాన్ని ఈ గ్రామం నుంచే ఆయన మొదలుపెట్టారు.

స్వామి దయానంద సరస్వతి

 


        1824 ఫిబ్రవరి 12వ తేదీన గుజరాత్ లోని టంకారాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన దయానంద సరస్వతి తొలి పేరు మూల్ శంకర్. హిందూ కేలెండర్ ప్రకారం ఫాల్గుణ మాసం కృష్ణ పక్షంలో ఆయన జన్మదిన వేడుక జరుగుతుంది. కుటుంబం సంపన్నమైనది కావడంతో ఆయన ప్రారంభ జీవితం ఎంతో సౌకర్యవంతంగా సాగింది. 20 సంవత్సరాల పాటు ఆయన దేవాలయాలు, ప్రారనా స ్థ ్థలాలు, పవిత్ర స్థలాల సందర్శనకు దేశం అంతటా తిరిగారు. తనలోని అనుమానాల నివృత్తి కోసం ఆయన పర్వతాలు, అడవుల్లో ఉన్న ఎందరో యోగులను కలిశారు, కానీ, ఎవరి నుంచి సంతృప్తికరమైన సమాధానం పొందలేకపోయారు. చివరికి ఆయన మధురలో స్వామి విరాజానందను కలిశారు. మూల్ శంకర్ ఆయన శిష్యుడుగా చేరారు. వేదాల నుంచి నేరుగా అధ్యయనం చేయాలని విరాజానంద ఆయనను ఆదేశించారు. అధ్యయనం సందర్భంగా జీవితం, మరణంపై గల అనుమానాలన్నింటికీ ఆయన సమాధానం చెప్పారు. మూల్ శంకర్ కు వైదిక జ్ఞానాన్ని సమాజంలో ప్రచారం చేసే బాధ్యత స్వామి విరాజానంద అప్పగించారు. అతనికి రిషి దయానందగా నామకరణం చేశారు.

         1875 ఏప్రిల్ లో ముంబైలో దయానంద సరస్వతి ఆర్య సమాజం స్థాపించారు. అది ఒక హిందూ సంస్కరణోద్యమం. ఊహాత్మకమైన విశ్వాసాల నుంచి బయటపడాలన్నది ఆ సమాజం ధ్యేయం. వేదాల శక్తి అపారమైనదని ఆయన భావించేవారు. తత్వశాస్ర్తానికి కర్మ సిద్ధాంతం, పునరన్మ, బ్రహ్మచర ్జ ్యం, సన్యాసం అనే నాలుగు మూలస్తంభాలను ఆయన అందించారు.

        1876లో తొలిసారిగా స్వరాజ్య పిలుపు ఇచ్చింది ఆయనే అని చెబుతారు. ఆ తర్వాత లోకమాన్య తిలక్ ఆ పిలుపును ముందుకు నడిపించారు. సత్యార్ ప్రకాశ్ గు థ్ రించి రాస్ ఆయన భక్ తూ తిజ్ఞానంతో పాటు సమాజంలో నైతిక విలువల పెంపునకు, సంఘ సంస్కరణకు ప్రాధాన్యం ఇచ్చారు. కపటత్వం, ఆగ్రహం, క్రూరత్వం, మహిళలపై దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. మతంలో మూఢనమ్మకాలు, దురాచారాలు, కపట వైఖరిని వ్యతిరేకించిన ఆయన వాసవ మత ్త స్వభావాన్ని ఆవిష్కరించారు.

         స్వామి దయానంద సరస్వతి మత చైతన్యం రగిలించడమే కాదు దేశాన్ని పరాయి పాలన నుంచి విముక్తం చేయడానికి జాతీయ తిరుగుబాటుకు కూడా తన వంతు సహకారం అందించారు. ఆర్య సమాజం ద్వారా సామాజిక సంస్కరణల కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. అస్పృశ్యత, సతి, బాల్య వివాహాలు, నరబలి, మత సంకుచిత వాదం, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా తీవ్ర పోరాటం చేశారు. వితంతు పునర్వివాహం, మత స్వేచ్ఛ, సౌభ్రాతృత్వానికి మద్దతు పలికారు.

         స్వామి దయానంద సరస్వతి 1883లో జోధ్ పూర్ మహారాజు వద్దకు వెళ్లారని చెబుతారు. స్వామి దయానంద సరస్వతి నుంచి స్ఫూర్తి పొందిన రాజా యశ్వంత్ సింగ్ ఒక రాజనర్తకితో తనకు గల సంబంధం తెగతెంపులు చేసుకున్నారు. దాంతో ఆగ్రహం చెందిన రాజనర్తకి వంటవానితో కలిసి కుట్ర చేసి స్వామీజీకి అందించిన ఆహారంలో గాజుముక్కలు కలిపింది. ఈ కారణంగా స్వామీజీ ఆరోగ్యం క్షీణించి 1883 అక్టోబర్ 30వ తేదీన మరణించారు.


Related Posts Plugin for WordPress, Blogger...