రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు
ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26
జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్
విడుదల చేయనుంది. వచ్చే ఉగాది నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం
లక్ష్యంగా పెట్టుకుంది.
ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న
ప్రతిపాదనకు లోబడుతూనే, భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను
దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దుల్ని నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని
వెసులుబాట్లు కల్పించింది. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలుండగా, అరకు లోక్‌సభ
స్థానం భౌగోళిక విస్తీర్ణం చాలా పెద్దది కావడంతో... దాన్ని రెండు జిల్లాలుగా
ఏర్పాటు చేస్తున్నారు.
- ప్రకాశం జిల్లా (Praksam District) పెద్ద
జిల్లా - 14,322 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
- విశాఖపట్నం (Visakhapatnam) అతి చిన్న జిల్లా
– 928 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం
- కర్నూలు 23.66 లక్షల జనాభాతో పెద్ద జిల్లా
- అల్లూరి
సీతారామరాజు జిల్లా (అరకు) 9.54 లక్షల జనాభాతో చిన్న జిల్లా
1.శ్రీకాకుళం
జిల్లా
- కేంద్రం – శ్రీకాకుళం
- 8
నియోజకవర్గాలు: ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస,
పాతపట్నం, నరసన్నపేట.
- రెవెన్యూ
డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16)
- మొత్తం 30
మండలాలు.
- జిల్లా
వైశాల్యం 4,591 చ.కి.మీ,
- జనాభా
21.91 లక్షలు ఉంది.
2. విజయనగరం
జిల్లా
- కేంద్రం - విజయనగరం
- 7
నియోజకవర్గాలు: రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం,
శృంగవరపుకోట.
- రెవెన్యూ
డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15)
- మొత్తం
మండలాలు 26 ఉండనున్నాయి.
- జిల్లా
వైశాల్యం 3,846 చ.కి.మీ.
- జనాభా
18.84 లక్షలు ఉంది.
3. మన్యం జిల్లా
- కేంద్రం – పార్వతీపురం
- 4 నియోజకవర్గాలు:
పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు.
- రెవెన్యూ
డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10).
- మొత్తం 16
మండలాలు ఉన్నాయి.
- జిల్లా
వైశాల్యం 3,935 చ.కి.మీ.
- జనాభా
9.72లక్షలు ఉంది.
4. అల్లూరి
సీతారామరాజు జిల్లా
- కేంద్రం – పాడేరు
- 3
నియోజకవర్గాలు: పాడేరు, అరకు, రంపచోడవరం.
- రెవెన్యూ
డివిజన్లు కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11).
- మొత్తం 22 మండలాలు.
- జిల్లా
వైశాల్యం 12,251 చ.కి.మీ.
-
జనాభా 9.54
లక్షలు ఉంది.
5. విశాఖపట్నం
జిల్లా
- కేంద్రం –
విశాఖపట్నం
- 6
నియోజకవర్గాలు: భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక.
- రెవెన్యూ
డివిజన్లు కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5)
- మొత్తం 10
మండలాలు ఉన్నాయి.
- జిల్లా
వైశాల్యం 928 చ.కి.మీ.
- జనాభా
18.13 లక్షలుగా ఉంది.
6. అనకాపల్లి
జిల్లా
- కేంద్రం – అనకాపల్లి
- 7
నియోజకవర్గాలు: పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి,
పెందుర్తి.
- రెవెన్యూ
డివిజన్లు నర్సీపట్నం(10), అనకాపల్లి(15).
- 25 మండలాలు
ఉన్నాయి.
- జిల్లా
వైశాల్యం 4,412 చ.కి.మీ.
- జనాభా
18.73 లక్షలు ఉంది.
7. తూర్పుగోదావరి
జిల్లా
- కేంద్రం – కాకినాడ
- 7
నియోజకవర్గాలు: తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్,
కాకినాడ నగరం.
- రెవెన్యూ
డివిజన్లు పెద్దాపురం(12),కాకినాడ(7)
- మొత్తం 19
మండలాలు ఉన్నాయి.
- జిల్లా
వైశాల్యం 2,605 చ.కి.మీ.
- జనాభా
19.37 లక్షలు ఉంది.
8. కోనసీమ
జిల్లా
- కేంద్రం – అమలాపురం
- 7
నియోజకవర్గాలు: రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు,
పి.గన్నవరం.
- రెవెన్యూ
డివిజన్లు రామచంద్రాపురం(8), అమలాపురం(16).
- మొత్తం 24
మండలాలు ఉండనున్నాయి.
- జిల్లా
వైశాల్యం 2,615 చ.కి.మీ.
- జనాభా
18.73 లక్షలు ఉంది.
9. రాజమహేంద్రవరం
జిల్లా
- కేంద్రం – రాజమహేంద్రవరం
- 7
నియోజకవర్గాలు: అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు,
నిడదవోలు, గోపాలపురం.
- రెవెన్యూ
డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10).
- 20 మండలాలు
ఉండనున్నాయి.
- జిల్లా
వైశాల్యం 2,709 చ.కి.మీ.
- జనాభా:
19.03 లక్షలు ఉంది.
10. నరసాపురం
జిల్లా
- కేంద్రం – భీమవరం
- 7
నియోజకవర్గాలు: ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం.
- రెవెన్యూ
డివిజన్లు నరసాపురం(8), కొత్తగా భీమవరం(11).
- మొత్తం 19
మండలాలు ఉండనున్నాయి.
- జిల్లా
వైశాల్యం 2,178 చ.కి.మీ.
- జనాభా
17.80 లక్షలు ఉంది.
11. పశ్చిమగోదావరి
జిల్లా
- కేంద్రం – ఏలూరు
- 7
నియోజకవర్గాలు: ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు
కలిపి.
- రెవెన్యూ
డివిజన్లు ఏలూరు(12), జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6).
- మొత్తం 27
మండలాలు ఉన్నాయి.
- జిల్లా
వైశాల్యం 6,413 చ.కి.మీ.
- జనాభా:
20.03 లక్షలుగా ఉంది.
12. కృష్ణా
జిల్లా
- కేంద్రం – మచిలీపట్నం
- 7
నియోజకవర్గాలు: గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ.
- రెవెన్యూ
డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12).
- మొత్తం 25
మండలాలు.
- జిల్లా
వైశాల్యం: 3,775 చ.కి.మీ.
- జనాభా:
17.35 లక్షలు.
13. ఎన్టీఆర్
జిల్లా
- కేంద్రం – విజయవాడ
- 7
నియోజకవర్గాలు: పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు.
- రెవెన్యూ
డివిజన్లు విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7)
- మొత్తం
కలిపి 20 మండలాలు ఉండనున్నాయి.
- జిల్లా
వైశాల్యం 3,316 చ.కి.మీ.
- జనాభా:
22.19 లక్షలు.
14. గుంటూరు
జిల్లా
- కేంద్రం – గుంటూరు
- 7
నియోజకవర్గాలు: తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి,
తెనాలి కలుపుకొని.
- రెవెన్యూ
డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8).
- మొత్తం 18 మండలాలు.
- జిల్లా
వైశాల్యం: 2,443 చ.కి.మీ.
- జనాభా:
20.91 లక్షలు.
15. బాపట్ల
జిల్లా
- కేంద్రం – బాపట్ల
- 6
నియోజకవర్గాలు: వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల.
- రెవెన్యూ
డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13)
- మొత్తం 25
మండలాలు ఉండనున్నాయి.
- జిల్లా
వైశాల్యం : 3,829 చ.కి.మీ,
- జనాభా :
15.87 లక్షలు ఉంది.
16. పల్నాడు
జిల్లా
- కేంద్రం – నరసరావుపేట
- 7
నియోజకవర్గాలు: పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ,
సత్తెనపల్లి.
- రెవెన్యూ
డివిజన్లు గురజాల (14), నరసరావుపేట(14)
- మొత్తం 28
మండలాలు.
- జిల్లా
వైశాల్యం : 7,298 చ.కి.మీ,
- జనాభా :
20.42 లక్షలు.
17. ప్రకాశం
జిల్లా
- కేంద్రం – ఒంగోలు
- 8
నియోజకవర్గాలు: యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు,
కొండెపి, దర్శి, కనిగిరి.
- రెవెన్యూ
డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13)
- మొత్తం 38
మండలాలు.
- జిల్లా
వైశాల్యం : 14,322 చ.కి.మీ,
- జనాభా :
22.88 లక్షలు.
18. శ్రీ
పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా
- కేంద్రం – నెల్లూరు
- 8
నియోజకవర్గాలు: కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి,
ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు.
- రెవెన్యూ
డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12)
- మొత్తం 35
మండలాలు.
- జిల్లా
వైశాల్యం : 9,141 చ.కి.మీ,
- జనాభా :
23.37 లక్షలు.
19. కర్నూలు
జిల్లా
- కేంద్రం – కర్నూలు
- 8
నియోజకవర్గాలు: పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం,
ఆదోని, ఆలూరు.
- రెవెన్యూ
డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17)
- మొత్తం 28
మండలాలు.
- జిల్లా
వైశాల్యం : 8,507 చ.కి.మీ,
- జనాభా :
23.66 లక్షలు.
20. నంద్యాల
జిల్లా
- కేంద్రం – నంద్యాల
- 6
నియోజకవర్గాలు: నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్, నందికొట్కూరు.
- రెవెన్యూ
డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్ (8), కొత్తగా ఆత్మకూరు(10)
- మొత్తం 27
మండలాలు.
- వైశాల్యం :
9,155 చ.కి.మీ,
- జనాభా :
16.87 లక్షలు.
21. అనంతపురం
జిల్లా
- కేంద్రం – అనంతపురం
- 8
నియోజకవర్గాలు: రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం
అర్బన్, తాడిపత్రి, గుంతకల్.
- రెవెన్యూ
డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్(8)
- మొత్తం 34
మండలాలు.
- వైశాల్యం :
11,359 చ.కి.మీ
- జనాభా :
23.59 లక్షలు.
22. శ్రీసత్యసాయి
జిల్లా
- కేంద్రం – పుట్టపర్తి
- 6
నియోజకవర్గాలు: మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి.
- రెవెన్యూ
డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8)
- మొత్తం 29
మండలాలు ఉంటాయి.
- వైశాల్యం :
7,771 చ.కి.మీ,
- జనాభా :
17.22 లక్షలు.
23. వైఎస్సార్
కడప జిల్లా
- కేంద్రం – కడప
- 7
నియోజకవర్గాలు: కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు,
మైదుకూరు.
- రెవెన్యూ
డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12)
- మొత్తం 34
మండలాలు ఉన్నాయి.
- వైశాల్యం :
10,723 చ.కి.మీ,
24. అన్నమయ్య
జిల్లా
- కేంద్రం – రాయచోటి
- 6
నియోజకవర్గాలు: రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి.
- రెవెన్యూ
డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11)
- మొత్తం 32
మండలాలు.
- వైశాల్యం :
8,459 చ.కి.మీ,
- జనాభా :
17.68 లక్షలు.
25. చిత్తూరు
జిల్లా
- కేంద్రం – చిత్తూరు
- 7
నియోజకవర్గాలు: నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం,
పుంగనూరు.
- రెవెన్యూ
డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15)
- మొత్తం
కలిపి 33 మండలాలు ఉంటాయి.
- వైశాల్యం :
7,210 చ.కి.మీ,
- జనాభా :
19.85 లక్షలు
26. శ్రీ
బాలాజీ జిల్లా
- కేంద్రం – తిరుపతి
- 7
నియోజకవర్గాలు: సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి,
శ్రీకాళహస్తి కలుపుని.
- రెవెన్యూ
డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11)
- మొత్తం 35
మండలాలు.
- జిల్లా
వైశాల్యం : 9,176 చ.కి.మీ,
- జనాభా :
22.18 లక్షలు ఉంది.