* ధ్వని ఒక శక్తి స్వరూపం. ఇది కంపిస్తున్న
తరంగాల రూపంలో అన్ని దిశల్లో ప్రయాణిస్తుంది. ఈ తరంగాలు మన చెవిలో
కర్ణభేరిని 1/10 సెకన్ల కాలంలో తాకినట్లయితే మానవుడికి వినికిడి జ్ఞానం
కలుగుతుంది.
* కంపించే కణాలు ఉన్న పదార్థాల్లో మాత్రమే ధ్వని జనించి ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రయాణిస్తుంది.
ఉదా: ఇనుము, ఇత్తడి, రాగి మొదలైనవి.
* కంపించేందుకు వీలులేని కణాలు ఉన్న పదార్థాల్లో ధ్వని జనించదు, ప్రయాణించజాలదు.
ఉదా: స్వచ్ఛమైన ప్లాస్టిక్ వస్తువులు, రబ్బరు, వరిపొట్టు, రంపపు పొట్టు, దూది బట్టలు, థర్మోకోల్ మొదలైనవి.
* ఇటువంటి పదార్థాలను ఉపయోగించి 'సౌండ్ ప్రూఫ్ రూమ్స్'ని నిర్మిస్తారు.
* ధ్వని తరంగాలు ప్రయాణించేందుకు యానకం అవసరం కాబట్టి
ఎటువంటి యానకం లేని శూన్య ప్రదేశంలో ధ్వని వేగం శూన్యంగా ఉంటుంది. దీన్ని
నిరూపించిన వారు 'రాబర్ట్ బాయిల్'.
* ఎటువంటి యానకం లేని విశ్వాంతరాళంలో, చంద్రునిపై ధ్వనివేగం శూన్యం.
ఉదా: చంద్రునిపై తూపాకి పేల్చినప్పుడు, అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు వెలవడే ధ్వనిని వినలేము.
* చంద్రునిపై అనునాద ప్రయోగం 'రెసోనెన్స్ ఎక్స్‌పరిమెంట్', సంగీత కచేరి చేయలేము.
* చంద్రునిపై వాతావరణం లేకపోవడం వల్ల పగలు, రాత్రి సమయంలో ఎప్పుడైనా నిశ్శబ్దంగా ఉంటుంది.
* చంద్రునిపై సగటు పగటి ఉష్ణోగ్రత 100oC ఉంటుంది.
* కంపించే ప్రతి వస్తువు నుంచి ధ్వని పుడుతుంది.
శ్రావ్య అవధి
* ఆరోగ్యవంతుడైన మానవుడు 20 Hz నుంచి 20,000 Hz వరకు
ధ్వని తరంగాలు మాత్రమే వినగలడు. ఈ అవధిని 'శ్రావ్య అవధి' అని ఈ తరంగాలను
'శ్రావ్య తరంగాలు' అని అంటారు.
పరశ్రావ్యాలు
* శ్రావ్య అవధిలో 20Hz కంటే తక్కువ పౌనఃపున్యం ఉన్న
తరంగాలను 'పరాశ్రావ్యాలు' అంటారు. వీటిని నేలపై ఉన్న పాము, సముద్రంలో ఉన్న
తిమింగలాలు, కుక్కలు వినగలవు.
* పరశ్రావ్యాలు ఉత్పత్తి చేసేందుకు అత్యధిక శక్తి ఉన్న
వస్తువులు అవసరం. కాబట్టి ఈ తరంగాలను సాధారణంగా భూమి కంపించినప్పుడు,
అణుబాంబులు విస్ఫోటనం చెందినప్పుడు, భారీ వాహనం అత్యధిక లగేజీని
మోసుకెళ్తున్నప్పుడు ఈ తరంగాలు జనిస్తాయి.
అతిధ్వనులు
* శ్రావ్య అవధిలో 20,000 Hz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్న
తరంగాలను 'అతిధ్వనులు' అంటారు. వీటిని ప్రయోగశాలలో ఫిజో (PIEZEVO) విద్యుత్
ఫలితం పద్ధతిలో తయారు చేస్తారు.
* అతిధ్వనులను కుక్క 50 వేలHZ వరకు, గబ్బిలం, తాబేలు, డాల్ఫిన్లు 1,00,000 Hz వరకు వినగలవు.
అనువర్తనాలు లేదా ఉపయోగాలు
* పాలలో, నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నశింపచేసేందుకు
* సముద్రం లోతు కనుగొనేందుకు ఉపయోగించే సోనార్‌లో SONAR: Sound Navigation and Ranging.
* మొదట సోనార్‌ను నిర్మించిన వారు - నిక్సన్ (NIXON).
* 0oCల నీటి ఉపరితలంపై ఈ తరంగాలను పంపినప్పుడు 100oC వద్ద మరుగుతున్న స్థితిని పొందుతుంది.
* దోమలను పారదోలేందుకు, చేపలను వేటాడేందుకు
* విరిగిన దంతాలను తొలగించేందుకు, సోల్డరింగ్‌లో
* కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి
* శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేసేందుకు (అల్ట్రా స్కానింగ్)
* లోహఫలకం, పైపులు, బాయిలర్లలో పగుళ్లు ఏర్పడిన వాటిని గుర్తించేందుకు
* సముద్రంలో చేపలు ఎక్కువగా లభించే ప్రాంతాలను గుర్తించేందుకు ఈ తరంగాలను వాడతారు.
No comments:
Post a Comment