కాంతి: దృష్టి లోపాలు- రకాలు

 

 హ్రస్వదృష్టి: కంటికి దగ్గరగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలిగి, దూరంగా ఉన్న వాటిని సరిగా చూడలేకపోవడాన్ని ‘హ్రస్వదృష్టి’ అంటారు. తగిన నాభ్యంతరం ఉన్న వికేంద్రీకరణ (పుటాకార) కటకాన్ని ఉపయోగించి ఈ లోపాన్ని నివారించవచ్చు.

దూరదృష్టి(లేదా)దీర్ఘదృష్టి: కంటికి దూరంగా ఉన్న వస్తువులను మాత్రమే చూడగలిగి దగ్గరగా ఉన్న వాటిని చూడలేకపోవడాన్ని ‘దూరదృష్టి’ అంటారు. తగిన నాభ్యంతరం ఉన్న కేంద్రీకరణ(కుంభాకార) కటకాన్ని ఉపయోగించి ఈ లోపాన్ని నివారించవచ్చు.
అసమదృష్టి: కంటిలోని కార్నియాలో లోపం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ లోపం ఉన్న వ్యక్తులు ఒక వస్తువును చూసినప్పుడు అది అడ్డుగీతలు లేదా నిలువు గీతలుగా మాత్రమే కనిపిస్తుంది. ఈ లోపాన్ని సవరించడానికి స్తూపాకార కటకం వాడతారు.
చత్వారం: కొంత మందిలో వయసు పెరుగుతున్న కొద్దీ కన్ను దాని నేత్రానుగున్యతను కోల్పోతుంది. ఫలితంగా దగ్గరగా ఉన్న వస్తువును లేదా కొంత దూరంలో ఉన్న వస్తువును చూడటం వీలుకాదు. ఈ దృష్టి లోపాన్ని సవరించడానికి ద్వినాభి కటకాన్ని ఉపయోగిస్తారు.
రేచీకటి: విటమిన్-ఎ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. రేచీకటితో బాధపడే వారు పగటి సమయంలో మాత్రమే చూడగలుగుతారు. రాత్రివేళలో కృత్రిమ కాంతి జనకాల నుంచి వచ్చే కాంతి తీవ్రత వీరిలో దృష్టిజ్ఞానాన్ని ప్రేరేపించదు. ఈ సమస్య నివారణకు విటమిన్-ఎ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
వర్ణాంధత్వం: కంటిలోని కోన్లలో తలెత్తే లోపం వల్ల వర్ణాంధత్వం కలుగుతుంది. ఈ సమస్య ఉన్నవారు అన్ని రంగులను గుర్తించలేరు. తల్లిదండ్రుల జన్యువుల ద్వారా పిల్లలకు సంక్రమిస్తుంది. ఈ దృష్టి లోపాన్ని నివారించడానికి ఎలాంటి ఔషధాలు, చికిత్సా విధానం అందుబాటులో లేదు.
అదృశ్య వికిరణాలు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...