1.జీవులకు పేర్లు పెట్టే పద్థతిని ఏమంటారు? ద్వినామీకరణము
2.ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు? లిన్నేయస్
3.లిన్నేయస్ రచించిన జంతుశాస్త్ర గ్రంధమేది? సిస్టమా నేచురే
4.లిన్నేయస్ రచించిన వృక్షశాస్త్రగ్రంధమేది? స్పీషిస్ ప్లాంటారమ్
5.కార్టేడా అంటే ఏమిటి? నోటో కార్డ్‌గల జంతువు
6.ఏకకణ జీవులు ఏ ఫైలం క్రిందకు వస్తాయి? ప్రోటోజోవా
7.శరీరం అంతటా కండరాలు ఉండే స్పాంజీలు ఏ ఫైలం క్రిందకు వస్తాయి? పొరిఫెరా
8.శరీర కుహరం ఉండే హైడ్రా ఏ ఫైలం క్రిందకు వస్తాయి? సీలెంటిరేటా
9.వానపాము ఏ ఫైలం క్రిందకు వస్తాయి? అనిలెడా
10.అతినిద్రా జబ్బును వ్యాపింపచేసే జీవి? సిట్సి- సిట్సి ఈగ
11.అతినిద్రా జబ్బు ఏఖండంలో ఎక్కువగా కనిపిస్తుంది? ఆఫ్రికా ఖండం
12.కాలా అజార్ వ్యాధికి కారణమైన ఏకకణ జీవి? లీష్మానియా డోనోవాని
13.మలేరియా వ్యాధికి కారణమైన జీవి? ప్లాస్మోడియం
14.మలేరియాను వ్యాప్తి చేసే దోమ? ఎనాఫిలిస్ దోమ
15.ప్లాస్మోడియం అనే ఏకకణజీవి వలన మలేరియ వస్తుందని కనిపెట్టిన శాస్త్రవేత్త? సర్ రోనాల్డ్ రాస్
16.దోమ గుడ్లను తిని దోమలను నిర్మూలించడానికి ఉపయోగించే చేపలు? గాంబూసియా
17.స్పాంజీల శరీరం మీదనున్న రంధ్రాలను ఏమంటారు? ఆస్టియంలు
18.సముద్రపు పువ్వు మరియు సాదుపీతలు జరిపే సహజీవనాన్ని ఏమంటారు ? కమెన్సిలిజం
19.పగడాల రసాయనిక సంఘటనం ఏమిటి? కాల్షియం కార్బోనేట్
20.మానవునిలో జీవించే బద్దె పురుగు శాస్త్రీయ నామం? టీనియా సోలియం
21.లివర్‌ప్లూక్ ఏయే జంతువులలో తన జీవితచక్రాన్ని పూర్తిచేస్తుంది. ? నత్త మరియు గొర్రె
22.మానవునిలో బోదకాలుకు కారణమైన ఫైలేరియా పరాన్నజీవుల జాతి? నిమాటి హెల్మింథస్
23.వ్యవసాయదారుల మిత్రుడని పేరుపొందిన జీవి? వానపాము
24.తేనేటీగలు, లక్కపురుగులు ఏజాతికి చెందినవి? ఆర్థ్రోపొడా
25.జంతువులలో అతిపెద్గ వర్గం ఏది? ఆర్ధ్రోపొడా
26.నత్తలు, ముత్యపు చిప్పలు, ఆల్చిప్పలు ఏజాతికి చెందినవి? మొలస్కా
27.శంఖువులు, నత్త గుల్లలు , ముత్యపు చిప్పలలో ఉండే రసాయన పదార్థం ఏమిటి? కాల్షియం కార్బోనేట్
28.తిరోగమన రూపవిక్రియను ప్రదర్శించే జంతువు? అసిడియా
29.అస్థిపంజరం శరీరం బయట ఉండే జంతువులేవి? మొలస్కా జాతి జంతువులు
30.ఉభయ చర జీవులలో విస్తారంగా వ్యాపించిన జంతువు? కప్ప
31.సరీసృపాలలో ఉండే రక్తం? శీతల రక్తం
32. పక్షుల గుండెలో ఎన్ని గదులుంటాయి? నాలుగు
33.బండ్లులాగటానికి ఉపయోగించే పక్షి? నిప్పుకోడి
34.కివి పక్షులు ఎక్కడ నివశిస్తాయి ? న్యూజిలాండ్
35.జలచరంగా మారిన పక్షి ఏది? పెంగ్విన్
36.పిల్లలకు పాలిచ్చి పెంచే జంతువులను ఏమంటారు? క్షీరదాలు
37.మగ జంతువులుకూడా పాలివ్వగల క్షీరద జాతి? ఎకిడ్నా
38.సరీసృపాల లక్షణాలు గల క్షీరద జాతి? ప్రోటోధీరియా
39.ఏనుగు శాస్త్రీయ నామం? ఎలిఫాస్ ఇండికస్
40.తిమింగలాల్లో ఉండే కొవ్వు పొరను ఏమంటారు? బ్లబ్బర్
41.గబ్బిలం కాళ్లను, చేతులను కప్పుచూ ఉండే పలుచని పొరను ఏమంటారు. పెటాజియం
42.ధ్వని, ప్రతిధ్వనులను బట్టి దారితెలుసుకొని ప్రయాణించే జీవులు. ? గబ్బిలం
42.డైనోసార్ అనే ప్రాచీనకాల జంతువు ఏ జాతికి చెందినది? సరీసృపాలు
43.క్షీరదాలలో పెరుగుతున్న పిండాన్ని, మావితో కలిపేది ఏది? బొడ్డుతాడు
44.పట్టు పురుగుల ఆహారం ఏమిటి? మల్బరీ ఆకులు
45.అత్యున్నత సంఘజీవులు? చీమలు
46.తేనేటీగల పెంపెకాన్ని ఏమంటారు? ఎపికల్చర్
47. చేపల పెంపకాన్ని ఏమంటారు? పిసికల్చర్
48. అడవులపెంపకాన్ని ఏమంటారు? సిల్వికల్చర్
49.ద్రాక్షతోటల పెంపకాన్ని ఏమంటారు? విటికల్చర్
50.అకశేరుకాలంటే. ? వెన్నుముకలేని జంతువులు
బయాలజీ బిట్ బ్యాంకు 1
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment