జికా వైరస్‌

 

అసలేమిటీ జికా వైరస్‌?

  • జికా వ్యాధి జికా వైరస్‌ వల్ల వస్తుంది. 
  • ఈ వైరస్‌ను తొలిసారి 1947లో ఉగాండా అడవుల్లోని రీసస్‌ కోతిలో గుర్తించారు. 
  • ఈ వ్యాధి 1954లో నైజీరియాలో బయటపడింది. అనేక ఆఫ్రికన్‌ దేశాలు, ఆసియాలోని భారత్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, థాయ్‌లాండ్, వియత్నాం లాంటి దేశాల్లో కూడా ఈ వ్యాధి ప్రబలింది. 
  • జికా వైరస్‌ 2016 ఫిబ్రవరి వరకు 39 దేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. 
  • దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ  (WHO)  ప్రజా ఆరోగ్య అత్యయిక స్థితిగా ప్రకటించింది. ఈ వ్యాధికి ఎడిస్‌ ఈజిప్టి, ఎడిస్‌ ఆల్బోపిక్టస్‌ రకం దోమలు వాహకాలుగా పనిచేస్తాయి.


ఎలా వ్యాపిస్తుంది? 

  • ఈ వైరస్‌ కలిగిన ఆడ ఎడిస్‌ దోమ కుట్టడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. 
  •  అంతేకాకుండా లైంగికంగా సంక్రమించే అవకాశం ఉందని భావిస్తున్నారు. 
  • గర్భిణులకు ఈ వ్యాధి సోకినట్లయితే పుట్టబోయే పిల్లలకూ వ్యాపించే అవకాశం ఉంటుంది.
  • ఈ పిల్లలు మైక్రోసెఫాలి (తల చిన్నగా ఉండటం) అనే లక్షణంతో ఉంటారు.


జికా వైరస్ సోకి తే లక్షణాలు

  • తలనొప్పి
  • కీళ్ల నొప్పులు
  • జ్వరం
  • వాంతులు
  • కళ్లు ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి
  • జికా వైరస్ ఒంట్లో చేరిన అందరిలోను లక్షణాలు కనిపించకపోవచ్చు. జ్వరం వంటి లక్షణాలు వారం రోజుల లోపు తగ్గిపోతాయి.



ఎలా నిర్ధారిస్తారు? చికిత్స ఏమిటి? 

  • ఈ వ్యాధిలో రక్త నమూనాలను రియల్‌టైమ్‌ పాలిమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌  (RT - PCR)  ద్వారా నిర్ధారించవచ్చు. 
  • జికా వ్యాధికి నిర్దిష్టమైన చికిత్సంటూ ఏమీలేదు. రోగి లక్షణాలను గమనించి వైద్యం అందిస్తారు. 
  • రోగులకు విశ్రాంతి అవసరం. వీరు ఎక్కువగా నీటిని తాగాలి. 
  • జ్వరం తగ్గడానికి పారాసిటమల్‌ లాంటి ఔషధాలను ఇవ్వాలి.  
  • ఈ వ్యాధి ఒకసారి సోకిన తర్వాత రెండోసారి రాదు.

 

నివారణా చర్యలేంటి?

  • దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • పొడుగైన షర్ట్‌, ప్యాంట్‌ను ధరించాలి. ఎయిర్‌ కండిషన్‌, కిటికీలు ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. 
  • రెండు నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు దోమల తెరను వాడాలి. 
  • పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. 
  • వ్యక్తిగతశుభ్రతపాటించాలనివైద్యనిపుణులుసూచిస్తున్నారు.

 

 వ్యాక్సిన్


       హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ జికా వ్యాక్ పేరుతో వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది .అయితే అది ఇంకా ప్రీ-కికికల్ ప్రయోగ దశలో ఉందనీ, చాలాత్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు.

 


 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...