వీటిని రిట్టెర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్య అవధి
100Å- 4000Å. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల శక్తి చాలా ఎక్కువ.
క్వార్‌ట్జ గాజు మినహా మిగతా గాజు పదార్థాలన్నీ ఈ కిరణాలను
శోషించుకుంటాయి. అందువల్ల క్వార్‌ట్జతో నిర్మించిన కటకాలు, పట్టకాలను
ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
గమనిక: అతినీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి.
అనువర్తనాలు:
- పాలు, నీళ్లలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నశింపజేయడానికి, ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అతినీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు.
గమనిక: ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం వాటిలో సోడియం బెంజోయేట్‌ను కలుపుతారు.
- వైద్య రంగంలో స్టెరిలైజేషన్ కోసం (హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేయడానికి) ఈ కిరణాలను ఉపయోగిస్తారు.
- పాడైన కోడిగుడ్లను గుర్తించడానికి వాడతారు.
- సహజ, కృతిమ దంతాల మధ్య తేడాలను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
- టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారాల్లోనూ వినియోగిస్తారు.
- తొలిదశలో ఉన్న కేన్సర్ గడ్డలను కరిగించడానికి వీటిని వాడతారు.
- వేలిముద్రలను విశ్లేషించడానికి వాడతారు.
- వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ జరపడానికి వీటిని ఉపయోగించుకుంటాయి.
- అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు 1 మి.మీ. లోతుకు చొచ్చుకెళ్లి విటమిన్-డిని ప్రేరేపిస్తాయి. రికెట్స్ వ్యాధి రాకుండా విటమిన్-డి తోడ్పడుతుంది.
- నకిలీ డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను గుర్తించడానికి వినియోగిస్తారు.
No comments:
Post a Comment