రాజ్యాంగంలోని 123వ అధికరణ ప్రకారం పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి 'ఆర్డినెన్స్'ను జారీ చేస్తారు. పార్లమెంట్ చేసిన శాసనాలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆర్డినెన్సులకు కూడా అలాంటి ప్రభావం ఉంటుంది. కాని ఇవి తాత్కాలిక స్వభావం కలిగి ఉంటాయి.
రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారం న్యాయశాఖతో సంబంధం లేకుండా స్వతంత్రమైన అధికారం. అంటే ఇది కార్యనిర్వాహక అధికారమన్న మాట. రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం కల్పించడంలో రెండు లక్ష్యాలు గలవు. (ఎ) న్యాయాల అమలులో న్యాయశాఖ చేసిన తప్పిదాలను సరిదిద్దడం, (బి). చాలా కఠినంగా శిక్ష విధించారని రాష్ట్రపతి భావించినప్పుడు ఖైదీలకు ఉపశమనం ఇవ్వడం. కేంద్ర కేబినెట్ యొక్క సలహా మేరకే క్షమాభిక్ష అధికారాన్ని రాష్ట్రపతి వినియోగించుకోవాలి. రాష్ట్రపతి ప్రకటించే తన నిర్ణయానికి కారణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం శిక్ష చాలా కఠినంగా ఉందనే కారణాలు మాత్రమే ఉపశమనం కలిగించాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలు తప్పుగా ఉన్నాయన్న నెపంతో కూడా ఉపశమనం కలిగించవచ్చు. కేవలం రాష్ట్రపతి నిర్ణయం సహేతుకంగా లేనప్పుడు, దురేద్దశంతో ఉన్నప్పుడు, విచక్షణాయుతంగా ఉన్నప్పుడు తప్ప అతని నిర్ణయం న్యాయసమీక్ష క్రిందికి రాదు. రాష్ట్రపతి ఏ విధంగా క్షమాభిక్ష అధికారాన్ని వినియోగించాలో సుప్రీంకోర్టు విధివిధానాలను రూపొందించే అవకాశం లేదు.
రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారంలోకి ఈ క్రింది అంశాలు వస్తాయి. అవి:
రాజ్యాంగంలో 161వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర గవర్నరు కూడా క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. గవర్నర్ కూడా ఇటువంటి నేరాలలో (రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకంగా గల) అయినా శిక్షలు విధించబడిన ముద్దాయిలకు క్షమాభిక్ష, మార్పు, మినహాయింపు, విరామము, నిలుపుదల ప్రసాదించవచ్చు. కాని గవర్నర్‌కు గల క్షమాభిక్ష అధికారం రాష్ట్రపతికి గల అధికారము క్రింది విధంగా విభేదించును.
పార్లమెంట్ ఉభయసభలచే ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారాలంటే వాటిపై రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం. ఏదైనా బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించి రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపితే రాష్ట్రపతికి క్రింది మూడు మార్గాలు ఉంటాయి. (111వ అధికరణ ప్రకారం)
అలా పంపిన బిల్లులు పార్లమెంట్ సవరణలు చేసి లేదా చేయకుండా ఆమోదించి రాష్ట్రపతికి తిరిగి పంపితే తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి.
అప్పల్యూట్ వీటో అంటే పార్లమెంట్ లో ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిన బిల్లులను రాష్ట్రపతి తిరస్కరించడం, అలాంటి సందర్భంలో ఆ బిల్లు చట్టంగా మారకుండానే రద్దువుతుంది. ఈ వీటోను క్రింది రెండు సందర్భాలలో వినియోగంచుకోవచ్చు.
ఏదైనా బిల్లును రాష్ట్రపతి పున: పరిశీలన నిమిత్తం పార్లమెంట్ కు పంపిన సందర్భంలో ఆ సస్పెన్సివ్ వీటోను వినియోగించడం జరుగుతుంది. కాని, అలా పార్లమెంట్ కు చేరిన బిల్లును సవరించి లేదా సవరణలు చేయకుండా ఆమోదించి రాష్ట్రపతి అనుమతి కొరకు పంపినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అంటే రాష్ట్రపతికి గల సస్పెన్సివ్ వీటోను పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఎదుర్కో గలదు.
ఈ వీటోను ద్రవ్య బిల్లుల విషయంలో వినియోగించడానికి వీలులేదు. అంటే భారత రాష్ట్రపతి ద్రవ్య బిల్లులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. కాని పున:పరిశీలన నిమిత్తం పార్లమెంట్ కు పంపరాదు. సాధారణంగా ద్రవ్య బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్రపతి ఆమోద ముద్ర పాందుతాయి.
ఈ సందర్భంలో రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చిన బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా తన దగ్గరే ఉం చుకుంటాడు. ఈ విధంగా బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాగే ఉంచుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లులను ఎంతకాలం లోపు ఆమోదించాలన్న అంశం రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొన బడలేదు. కాబట్టి ఈ పాకెట్ వీటోను రాష్ట్రపతి ఎటువంటి కాల పరిమితి లేకుండా వినియోగించుకుంటాడు.
రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం ఉండదు. 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971 ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది.
రాష్ట్ర శాసనాలకు సంబంధించిన విషయాలలో కూడా రాష్ట్రపతికి వీటో అధికారం ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారాలంటే తప్పనిసరిగా ఆ బిల్లులు గవర్నర్ లేదా రాష్ట్రపతి (ఒక వేళ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినపుడు) ఆమోద ముద్ర పొందాలి.
రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు గవర్నర్ కు 4 మార్గాలుంటాయి. (200వ అధికరణ ప్రకారం)
రాష్ట్ర శాసన సభలచే ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం రిజర్వు చేసినప్పుడు, రాష్ట్రపతికి మూడు మార్గాలుంటాయి. (201వ అధికరణ ప్రకారం)
అలా పంపిన బిల్లును రాష్ట్ర శాసన సభ సవరణలతో సవరణలు లేకుండా ఆమోదించి తిరిగి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సినవసరం లేదు. అంతేగాక అలాంటి బిల్లులు రాష్ట్రపతి ఎంతకాలం తమ దగ్గర ఉంచుకోవాలో కాలపరిమితిని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. అంటే ఈ బిల్లుల విషయంలో రాష్ట్రపతి పాకెట్ వీటోను వినియోగించకునే అవకాశం గలదు.
కార్యనిర్వాహక అధికారాలు (Executive Powers)
భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి కూడా ఒక భాగమే. రాష్ట్రపతికి కింది శాసనాధికారాలు ఉన్నాయి.
రాష్ట్రపతి యొక్క ఆర్ధికాధికారాలు మరియు విధులు ఈ క్రింది విధంగా ఉంటాయి.
రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాలు మరియు విధులు క్రింది. విధంగా ఉంటాయి.
భారతదేశం ఇతర ప్రపంచదేశాలలో చేసుకునే అన్ని ఒప్పందాలు, సందులు రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. అయితే వాటిని తరువాత పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యవహారాలలో మరియు వేదికలలో భారతదేశ ప్రతినిధిగా ఉంటూ రాయబారులను, హైకమీషనర్లను స్వాగతించేది, పంపించేంది భారత రాష్ట్రపతి.
భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి, అంటే దేశంలో రక్షణ దళాలన్నింటికీ సుప్రీం కమాండర్ గా ఉంటాడు. ఆ హెూదాలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతులను నియమిస్తాడు. పార్లమెంట్ యొక్క అనుమతి ఆధారంగా యుద్ధాన్ని ప్రకటించే హక్కు సంధి చేసుకునే హక్కు రాష్ట్రపతికి గలదు.
పైన తెలిపిన సాధారణ అధికారాలతో పాటు, క్రింద తెలిపిన మూడు రకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రపతికి రాజ్యాంగం కొన్ని అసాధారణ అధికారాలు ఇచ్చింది.
రాజ్యాంగంలోని పార్లమెంటరీ తరహా పద్ధతి ప్రకారం రాష్ట్రపతి నామమాత్ర కార్య నిర్వాహణాధికారిగా, ప్రధాని వాస్తవ కార్యనిర్వాహణాధికారిగా ఉంటారు. అనగా రాష్ట్రపతి రాజ్యాధినేతగా, ప్రధాని ప్రభుత్వాధినేతగా ఉంటారు.
ప్రధాని ఎంపిక, నియామకం గురించి రాజ్యాంగం ఎలాంటి ప్రక్రియనూ ప్రస్తావించలేదు. ప్రధాని రాష్ట్రపతిచే నియమింపబడతాడు అని 75వ ఆర్టికల్ పేర్కొంటుంది. దీని అర్థం రాష్ట్రపతి తన ఇష్టానుసారం ఎవరినైనా ప్రధాని నియమించవచ్చని కాదు. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలోని సాంప్రదాయాలను అనుసరించి రాష్ట్రపతి లోక్ సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానిగా నియమించాలి.
లోక్ సభలో ఏ పార్టీకీ మెజారిటీరాకుంటే రాష్ట్రపతి ప్రధాని ఎంపికలో, నియామకంలో తన వ్యక్తిగత విచక్షణను చూపవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా రాష్ట్రపతి లోక్ సభలో అతి పెద్ద మెజారిటీ పార్టీ నాయకుడిని లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ప్రధాని నియమించి, అతన్ని నెల రోజుల్లో సభలో విశ్వాసాన్ని కోరుతాడు. 1979లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయినప్పుడు నీలం సంజీవరెడ్డి (ఆనాటి రాష్ట్రపతి) సంకీర్ణ పార్టీల నాయకుడైన చరణ్ సింగ్ ని ప్రధానిగా నియమించి నెల రోజులలో సభా విశ్వాసాన్ని పొందమని కోరారు. ఈ విధంగా తన విచక్షణాధికారాన్ని రాష్ట్రపతి తొలిసారి వినియోగించారు.
అధికారంలో ఉన్న ప్రధాని మరణిస్తే తక్షణం ఆ పదవికి మరో వ్యక్తి దొరక్కపోతే రాష్ట్రపతి ప్రధాని నియామకంలో స్వయంగా నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా ఉంది. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆనాటి రాష్ట్రపతి జైల్ సింగ్.. రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమిం చారు. ఈ సందర్భంలో ఆయన తాత్కాలిక ప్రధాన మంత్రిని నియమించే పాత సాంప్రదాయాన్ని విస్మరించారు.తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ రాజీవ్ గాంధీని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రధాని మరణాంతరం అధికార పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రపతి అతడిని ప్రధానిగా నియమించాల్సి వస్తుంది.
1980లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ప్రధాని నియామకానికి ముందే తన మెజారిటీని నిరూపించుకునే అవసరం లేదు. రాష్ట్రపతి మొదట అతనిని ప్రధానిగా నియమించవచ్చు. అతనికి గడువునిచ్చి లోక్ సభలో మెజారిటీని నిరూపించుకోమని కోరవచ్చును. ఉదాహరణకు చరణ్ సింగ్ (1979), వీపీ సింగ్ (1989), చంద్రశేఖర్ (1990), దేవగౌడ (1996), ఐకే గుజ్రాల్ (1997) మరియు తిరిగి ఏబీ వాజ్ పేయి (1998) ఈ విధంగానే నియమింపబడ్డారు.
1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం ప్రకారం పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తిని ప్రధానిగా నియమించవచ్చు. కాని 6 నెలల్లో పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి. రాజ్యాంగపరంగా ప్రధాని పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి. లేకుంటే పదవిని కోల్పోతాడు.
రాజ్యాంగపరంగా ప్రధాని పార్లమెంటులో ఏ సభలోనైనా సభ్యుడు కావొచ్చు. ఇందిరాగాంధీ (1966), దేవగౌడ (1966), మన్మోహన్ సింగ్ (2004) వారి నియామక సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. కాని బ్రిటన్‌లో ప్రధానమంత్రి పార్లమెంటులోని దిగువ సభ (House of Commans)లో తప్పక సభ్యుడై ఉండాలి.
పదవిలో ప్రవేశించటానికి ముందు ప్రధానమంత్రి, రాష్ట్రపతి సమక్షంలో పదవీ ప్రమాణం మరియు రహస్య గోపన ప్రమాణం (oath of office and oath of secrecy) చేస్తారు. పదవీ ప్రయాణంలో ప్రధాని తాను
రహస్య గోపన ప్రమాణంలో ప్రధానమంత్రి తన దృష్టికి తేబడిన లేదా తనకు తెలియ వచ్చిన ఏ విషయమునైన కేంద్ర మంత్రిగా తన కర్తవ్యాలను ఆవశ్యక మయితే తప్ప ఎవిరికి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ వెల్లడించను అని ప్రమాణం చేస్తారు.
ప్రధానమంత్రి పదవీకాలం (term) నిర్ణయింపబడలేదు. అతడు రాష్ట్రపతి ఇష్టమున్నంత కాలం పదవిలో ఉంటాడు. అయితే రాష్ట్రపతి ప్రధానిని ఎప్పుడంటే అప్పుడు తొలగించలేడు. లోక్ సభలో ప్రధానికి మెజారిటీ ఉన్నంతకాలం రాష్ట్రపతి అతన్ని తొలగించలేదు. లోక్ సభలో విశ్వాసం కోల్పోతే ప్రధాని రాజీనామా చేయాలి. లేకుంటే రాష్ట్రపతి అతన్ని తొలగించవచ్చు.
ప్రధాని జీతభత్యాలను పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. పార్లమెంట్ సభ్యుడు పొందే జీతభత్యాలను ప్రధాని పొందుతాడు. దీనితో పాటు అతనికి సత్కార భత్యం (sumptuary allowance), ఉచిత నివాసం, ప్రయాణ భత్యం, వైద్య సౌకర్యాలు ఉంటాయి.
మంత్రి మండలితో సంబంధం
కేంద్రమంత్రి మండలి అధ్యక్షుడుగా ప్రధానమంత్రికి ఈ అధికారాలు ఉంటాయి.
మంత్రిమండలికి ప్రధాని అధినేత కాబట్టి ప్రధాని రాజీనామా ఇచ్చినా లేక మరణించినా ఇతర మంత్రులు అధికార నిర్వహణ చేయలేరు. పదవిలో ఉన్న ప్రధాని రాజీనామా లేదా మరణం ద్వారా ప్రస్తుత మంత్రి మండలి రద్దయినట్లే. తద్వారా శూన్యత ఏర్పడుతుంది. ఏ ఇతర మంత్రి రాజీనామా లేదా మరణం వలన ఖాళీ మాత్రమే ఏర్పడుతుంది. ప్రధాని తనకు ఇష్టముంటే ఆ ఖాళీని భర్తీ చేయవచ్చు. లేదంటే చేయకపోవచ్చు.
ప్రధాని దిగువ సభ నాయకుడు. ఈ హెదాలో ఆయనకు ఈ అధికారాలు ఉంటాయి.
ఈ విధంగా దేశ వ్యవస్థలోని రాజకీయ పరిపాలన రంగాల్లో ప్రధాని ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. బి.ఆర్.అంబేద్కర్ ఇలా అన్నారు.. మన రాజ్యాంగంలో ఎవరినైనా అమెరికా అధ్యక్షుడితో పోల్చవలిసి వస్తే అతడు ప్రధానే కానీ రాష్ట్రపతి కాడు అన్నారు.
ఈ క్రింది రాజ్యాంగ అంశాలు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి గల బాంధవ్యాన్ని తెలియపరుస్తాయి.
1. ఆయారామ్, గయారామ్ : పార్టీ ఫిరాయింపులు జరిపే వారికి ముద్దుపేరు. వీరిరువురూ హర్యానాలో 1967-68లో తరచూ పార్టీలు మారడం వల్ల ఆ విధంగా పిలుస్తున్నారు.
2. ఫ్లోర్‌క్రాసింగ్ : ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడం.
3. కోరమ్ : సభ జరగడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య. భారతదేశ చట్ట సభలలో
కోరమ్ 1/10వ వంతుగా నిర్ణయించారు. ఉదా : లోక్‌సభలో కోరమ్ 55 మంది
సభ్యులుకాగా, రాజ్యసభలో 25 మంది సభ్యులు.
4. లేమ్‌డక్ సెషన్ : బ్రిటన్ సామాన్యుల సభ (హైస్ ఆఫ్ కామన్స్)
ఎన్నికలు జరిగిన తరువాత అంతకుముందు సభసభ్యులుగా ఉండి ప్రస్తుత సభకు ఎన్నిక
కానివారిని, నూతనంగా ఎన్నికైన సభ్యులను కలిపి చిట్టచివరి సమావేశాన్ని
ఏర్పాటు చేస్తారు. దీనిని లేమ్‌డక్ సెషన్ అంటారు. ఈ విధానం భారతదేశంలో
అమలులో లేదు.
5. విజేతృభాగ నిర్ణయ పద్ధతి : ఈ పద్ధతి అమెరికాలో అమలులో ఉండేది. ఎన్నికలలో
గెలిచిన పార్టీ తన మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించడాన్ని
విజేతృభాగ నిర్ణయ పద్ధతి అంటారు. 1828లో ఆండ్రూజాక్సన్ అనే అమెరికా
అధ్యక్షుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1887లో ఉడ్రోవిల్సన్ ఈ పద్ధతిని
రద్దు చేశారు.
6. అధికార పృథక్కరణ సిద్ధాంతం : ఈ సిద్ధాంతాన్ని మాంటెస్క్యూ
ప్రతిపాదించాడు. ప్రభుత్వ అంగాలైన కార్యనిర్వాహక వర్గం, శాసననిర్మాణశాఖ,
న్యాయశాఖల మధ్య సంబంధాన్ని ఈ సిద్ధాంతం వివరిస్తుంది.
7. నిరోధ సమతౌల్యాలు (చెక్స్ అండ్ బ్యాలెన్సెస్) : అమెరికా రాజ్యాంగం ఈ
సిద్ధాంతంపై ఆధారపడింది. ప్రభుత్వ అంగాలు మూడు ఒకదానిని మరొకటి
నిరోధించుకుంటూ సమతుల్యంతో పనిచేస్తాయి.
8. షాడో క్యాబినెట్ : బ్రిటన్ దేశంలో అమలులో ఉన్నది. బ్రిటన్‌లో
ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా ఒక ఛాయా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి
మంత్రిత్వ శాఖలను తన సభ్యులకు అప్పగిస్తుంది. ఆయా శాఖలలో వారు అనుభవం
పొందుతారు.
9. హంగ్ పార్లమెంట్ : లోక్‌సభ సాధారణ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితిని హంగ్ పార్లమెంట్ అంటారు.
10. రీ కాల్ : స్విట్జర్లాండ్‌లో అమలులో ఉన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్య
పద్ధతులలో ఇది ఒకటి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సక్రమంగా పనిచేయని పక్షంలో
ప్రజలు వారిని వెనుకకు పిలుస్తారు.
11. న్యాయ సమీక్షాధికారం : కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణశాఖ
రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే (అల్ట్రావైరెస్) అవి
చెల్లవు (నల్ అండ్ వాయిడ్) అని న్యాయవ్యవస్థ ప్రకటించడం. 1803లో
మాడిసన్ వార్సెస్ మార్బురీ కేసులో అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తి జాన్ మార్షల్ న్యాయసమీక్షాధికారాన్ని ప్రకటించాడు.
12. శ్వేతపత్రం : ప్రభుత్వం ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా, అధికారపూర్వకంగా ప్రకటించే పత్రాలు.
13. ఫోర్త్ ఎస్టేట్ : పత్రికా రంగాన్ని, మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా
వ్యవహరిస్తారు. బ్రిటిష్ పార్లమెంట్‌సభ్యుడు ఎడ్‌బర్గ్ మొదటిసారిగా ఈ
పదాన్ని ఉపయోగించాడు.
14. ఫిప్త్ ఎస్టేట్ : ఇటీవల కాలంలో 'సోషల్ మీడియాను' ఫిఫ్త్ ఎస్టేట్‌గా వ్యవహరిస్తున్నారు.
15. సుమోటో : న్యాయవ్యవస్థ తనంతట తానుగా, స్వయం ప్రేరితంగా, పిటిషన్ అవసరం లేకుండా ఒక అంశాన్ని విచారణకు స్వీకరించడం.
16. గెర్రిమాండరింగ్ : నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను తమకు అనుకూలంగా
అధికారంలో ఉన్న పార్టీ చేపట్టడాన్ని గెర్రిమాండరింగ్ అంటారు.
17. ఫిల్‌బస్టరింగ్ : శాసనభలు, చట్టసభలు సమావేశాలు సరిగా జరగకుండా
ఉండటానికి సభ్యులు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయడం, అమెరికాలో ఫిల్‌బస్టరింగ్
అనే సెనేటర్ ఈ పద్ధతిని ఉపయోగించాడు.
18. వాయిదా తీర్మానం (ఎడ్‌జర్న్‌మెంట్ మోషన్) : అత్యవసర ప్రజాసంబంధిత
విషయంపై చర్చించడానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుంది. సభ్యుడు ఈ తీర్మానం
ప్రవేశపెట్టదలిస్తే స్పీకర్‌కు ఆరోజు ఉదయం 10 గంటలులోగా లిఖితపూర్వక
తీర్మానాన్ని అందజేయాలి. దీనికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం.
19. అడ్వకేట్ జనరల్ : రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడుని. 167వ నిబంధన ప్రకారం గవర్నర్‌చేత నియమిస్తారు.
20. అటార్నీ జనరల్ : భారత ప్రభుత్వ ప్రథమ న్యాయ సలహాదారుడు. 76వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ద్వారా నియమిస్తారు.
21. కొలీజియం : న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేయడానికి భారతదేశంలో
కొలీజియం ఏర్పడింది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్
న్యాయమూర్తులు ఉంటారు.
22. వార్షిక ఆర్థిక పట్టిక (యాన్యువల్ ఫైనార్షియల్ స్టేట్‌మెంట్) :
భారతదేశంలో రాజ్యాంగంలో 112వ నిబంధన ప్రకారం బడ్జెట్‌ను వార్షిక ఆర్థిక
పట్టిక అని పిలుస్తారు.
23. ఉపకల్పనా బిల్లు (అప్రాప్రియేషన్ బిల్) : బడ్జెట్‌పై చర్చ సందర్భంలో
వివిధ శాఖలన్నీ చేసిన గ్రాంట్ల కోసం డిమాండ్స్, అన్నింటికీ కలిపి ఉపకల్పనా
బిల్లుగా ప్రతిపాదిస్తారు.
24. సంకీర్ణం (కొయాలియేషన్) : ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు భిన్నమైన పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.
25. సమిష్టి బాధ్యత : పార్లమెంటరీ విధానంలో మంత్రిమండలి సమిష్టిగాను, వ్యక్తిగతంగానూ ప్రజలు ఎన్నుకున్న సభకు బాధ్యత వహించాలి.
26. సంఘటిత నిధి : భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలన్నింటినీ 266వ నిబంధన ప్రకారం ఏర్పడిన సంఘటిత నిధికి జమ కడతారు.
27. ఆగంతక నిధి : ఊహించని వ్యయాలను భరించడానికి రాష్ట్రపతి అధీనంలో 267వ నిబంధన ప్రకారం ఆగంతక నిధిని ఏర్పాటు చేశారు.
28. కోత తీర్మానం : పార్లమెంటరీ విధానంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా
సభ్యులు బడ్జెట్ ప్రతిపాదనల పట్ల నిరసన తెలపడానికి కోత తీర్మానాలు
ప్రతిపాదించవచ్చు.
29. అత్యవసర పరిస్థితి : రాజ్యాంగంలో 352వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆంతరంగిక, బాహ్య అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.
30. రాష్ట్రపతిపాలన : రాజ్యాంగంలో 356వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి
రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పటికి సుమారు 125 సార్లు
విధించారు.
31. ఆర్థిక అత్యవసర పరిస్థితి : దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు
రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని 360వ నిబంధన ప్రకారం
విధించవచ్చు. ఇప్పటివరకూ విధించలేదు.
32. ఆర్థిక బిల్లు : బడ్జెట్ ఆమోదించే చివరి దశలో ఆర్థికమంత్రి పన్నుల ప్రతిపాదనలన్నింటినీ కలిపి ఆర్థిక బిల్లుగా ప్రతిపాదిస్తాడు.
33. ఆర్థిక సంఘం : కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ కోసం రాష్ట్రపతి
280వ నిబంధన ప్రకారం ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు.
34. గిలిటెనింగ్ : బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గ్రాంట్ల కోసం డిమాండ్ చర్చ
జరుగుతున్నప్పుడు, కేటాయించిన సమయం అయిపోయిన తర్వాత, మిగిలిపోయిన
డిమాండ్లనన్నింటినీ ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించడాన్ని గిలిటెనింగ్
అంటారు.
35. హెబియస్ కార్పస్ : అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో
హాజరుపరచమని సుప్రీంకోర్టు 32వ నిబంధన ప్రకారం, హైకోర్టు 226వ నిబంధన
ప్రకారం జారీ చేసే రిట్.
36. అంతర్‌రాష్ట్ర మండలి : కేంద్ర-రాష్ట్ర వివాదాలు, అంతర్‌రాష్ట్ర వివాదాల పరిష్కారానికి 263వ నిబంధన ప్రకారం ఏర్పడినది.
37. ఆర్డినెన్స్ : పార్లమెంట్ సమావేశాలలో లేనప్పుడు అత్యవసర విషయాలపై రాష్ట్రపతి ద్వారా ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయిస్తుంది.
38. నిర్ణాయకపు ఓటు : ఒక బిల్లుపై అధికారపక్షానికి, ప్రతిపక్షానికి సమానంగా
ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్ నిర్ణాయకపు ఓటును వినియోగించవచ్చు.
39. జీరో అవర్ : ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభాకార్యక్రమాలు మొదలయ్యే
ముందు కాలాన్ని జీరో అవర్ అంటారు. 1962 నుంచి భారత పార్లమెంట్‌లో ఈ పద్ధతి
అమలులో ఉంది. ఈ సమయంలో ముందస్తు నోటీసు లేకుండా ఏ అంశంపైనైనా వివరణ
కోరవచ్చు.
40. ఎడ్‌జర్న్‌సైన్‌డై (నిరవధిక వాయిదా) : లోక్‌సభ సమావేశాలు నిర్ణయించిన
కాల వ్యవధిలో పూర్తి అయిన తరువాత స్పీకర్ సభను నివరధిక వాయిదా వేస్తాడు.
41. ప్రోరోగ్ : సభ సమావేశాలను ముగింపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ప్రోరోగ్ అంటారు.
42. ఆపద్ధర్మ ప్రభుత్వం : అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు
ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ కొనసాగే ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ
ప్రభుత్వం అంటారు.
43. పృథకరించు సిద్ధాంతం (డాక్ట్రిన్ ఆఫ్ సెవెరబిలిటీ) : ఒక చట్టంలోని
కొన్ని నిబంధనలు రాజ్యాంగానికి భంగకరమని న్యాయస్థానం ప్రకటించినప్పుడు, ఆ
నిబంధనలను రాజ్యాంగ అనుకూల నిబంధనల నుంచి వేరు చేసి, భంగకర నిబంధనలు
చెల్లవు, రాజ్యాంగ అనుకూల నిబంధనలు చెల్లుతాయి అని ప్రకటించడం.
44. గ్రహణ సిద్ధాంతం (డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్) : రాజ్యాంగం అమలులోకి
రాకముందు అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగం 'అమలులోకి వచ్చిన తరువాత రాజ్యాంగ
విరుద్ధంగా భావిస్తే, ఆ చట్టాలు చెల్లుబాటు విషయంలో సుప్రీంకోర్టు ఈ
సూత్రాన్ని వినియోగిస్తుంది.
45. సమన్యాయ పాలన (రూల్ ఆఫ్ లా) : ఈ సూత్రాన్ని బ్రిటన్ నుంచి గ్రహించారు. దీని ప్రకారం చట్టం ముందు పౌరులందరూ సమానులే.
46. ఉభయసభల సంయుక్త సమావేశం : రాజ్యాంగంలో 108వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అవసరమైనప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు.
47. అవశిష్టాధికారాలు : కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో చేరని అధికారాలను
అవశిష్టాధికారాలు అంటారు. భారతదేశంలో ఇవి కేంద్రానికి కలవు.
48. పిత్ అండ్ సబ్‌స్టెన్స్ (డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్
సబ్‌స్టెన్స్) : అధికార విభజన జరిగినప్పుడు ఒక జాబితాలో పొందుపరిచిన అంశం,
మరొక జాబితాలో పొందుపరచిన అంశంతో కొంత మేరకు అతిక్రమం జరగవచ్చు. అలా
జరిగినప్పటికీ ఆ చట్టాలను రద్దు చేయరు. దీనిని పిత్ అండ్ సబ్‌స్టెన్స్
అంటారు.
భారత పార్లమెంట్ ద్విసభ్యమైనది. ఏదైనా బిల్లును ఆమోదించడానికి రెండు సభల సమ్మతి అవసరం. ఏదేమైనా, భారత రాజ్యాంగాన్ని రూపొందించినవారు రాజ్యసభ ఎగువ సభకు మరియు దిగువ సభకు అంటే లోక్సభకు మధ్య ప్రతిష్టంభన పరిస్థితులను ఊహించారు. అందువల్ల, భారత రాజ్యాంగం ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఉభయ సభల సంయుక్త సమావేశాలకు అవకాశం కల్పిస్తుంది.
పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి (ఆర్టికల్ 108) పిలుస్తారు మరియు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు లేదా ఆయన లేనప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేదా ఆయన లేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. పై అధికారులు ఎవరైనా లేనట్లయితే, పార్లమెంటులోని ఏ ఇతర సభ్యుడు సభ యొక్క ఏకాభిప్రాయంతో అధ్యక్షత వహించవచ్చు.
రాజ్యాంగ నిబంధనలు : రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం, కింది పరిస్థితులలో పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని పిలుస్తారు.
ఒక బిల్లును ఒక సభ ఆమోదించిన తరువాత మరియు మరొక సభకు సమర్పించిన తరువాత
(ఎ) బిల్లును ఇతర సభ తిరస్కరించింది; లేదా (బి) బిల్లులో చేయాల్సిన సవరణలకు చివరకు విభేదించాయి; లేదా (సి) బిల్లును ఆమోదించకుండా ఇతర సభ ద్వారా బిల్లును స్వీకరించిన తేదీ నుండి ఆరునెలల కన్నా ఎక్కువ కాలం గడిచినా, రాష్ట్రపతి, ప్రజల సభ రద్దు కారణంగా బిల్లు ముగియకపోతే తప్ప
పై షరతులు సంతృప్తికరంగా ఉంటే, భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సిట్టింగ్‌ను పిలవవచ్చు.
ఉమ్మడి సిట్టింగ్లకు మినహాయింపు : అన్ని బిల్లులను పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి సూచించలేము. రెండు మినహాయింపులు ఉన్నాయి:
1. డబ్బు బిల్లు : భారత రాజ్యాంగం ప్రకారం, డబ్బు బిల్లులకు లోక్సభ ఆమోదం మాత్రమే అవసరం. లోక్సభకు రాజ్యసభ సిఫార్సులు చేయవచ్చు, దానిని అంగీకరించాల్సిన అవసరం లేదు. రాజ్యసభ 14 రోజుల్లోపు డబ్బు బిల్లును ఆమోదించకపోయినా, పైన పేర్కొన్న కాలం ముగిసిన తరువాత పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినట్లు భావిస్తారు. అందువల్ల, ఉమ్మడి సమావేశాన్ని పిలవవలసిన అవసరం డబ్బు బిల్లు విషయంలో ఎప్పుడూ తలెత్తదు.
2. రాజ్యాంగ సవరణ బిల్లు : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీ (ప్రత్యేక మెజారిటీ) ద్వారా సవరించవచ్చు. ఉభయ సభల మధ్య విభేదాలు ఏర్పడితే, పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని పిలిచే నిబంధన లేదు.
ఇప్పటివరకు ఉమ్మడి సెషన్‌కు సూచించే బిల్లులు : భారత పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి 4 బిల్లులు మాత్రమే పిలవబడ్డాయి, అంటే వరకట్న నిషేధ చట్టం- 1961, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ చట్టం- 1977, పోటా- 2002, మహిళా ప్రాతినిధ్య బిల్లు -2008 (బిల్ పనిచేయనిది) ..
జాయింట్ సెషన్‌లో ఆమోదించిన బిల్లులు
జాతీయ మహిళా కమిషన్ జనవరి 31, 1992న ''జాతీయ మహిళా కమిషన్
చట్టం - 1990'' ప్రకారం ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ,
రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. రాజ్యాంగ పరంగా మహిళలకు కల్పించిన రక్షణల
అమలును పర్యవేక్షించడం దీని ప్రధాన లక్ష్యం. భారత ప్రభుత్వానికి మహిళా
సంక్షేమానికి చేయాల్సిన శాసనాలకు సంబంధించి సూచనలు ఇస్తుంది. జాతీయ మహిళా
కమిషన్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
నిర్మాణం : జాతీయ మహిళా కమిషన్ బహుళ సభ్య సంఘం. ఇందులో
ఒక ఛైర్‌పర్సన్, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.
ఛైర్‌పర్సన్, సభ్యులకు మహిళా సమస్యలపై, న్యాయశాస్త్రంలోగాని, కార్మిక
సామర్థ్య నిర్వహణలోగాని, మహిళా సాధికారికతపై గాని పూర్తిగా అవగాహన ఉండాలి.
కమిషన్‌లో ఒకరు షెడ్యూల్డ్ కులాలకు, మరొకరు షెడ్యూల్డ్ తెగలకు చెందిన
వారు ఉండాలి. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుత జాతీయ
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రేఖా శర్మ .
పదవీకాలం : ఛైర్‌పర్సన్, సభ్యుల పదవీకాలం మూడు
సంవత్సరాలు. వీరు పదవీకాలం కంటే ముందే రాజీనామా చేయదలిస్తే రాజీనామా
పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికే ఇవ్వాలి. ఒకవేళ వీరు విధుల పట్ల
నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు లేదా అసమర్థులుగా ఉన్నప్పుడు కేంద్ర
ప్రభుత్వం వీరిని తొలగిస్తుంది.
అధికారాలు - విధులు : జాతీయ మహిళా కమిషన్ చట్టం ఈ కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు కల్పించింది. అవి...
ఎ. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, ప్రభుత్వ పరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పరీక్షించి పర్యవేక్షించడం.
బి. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా వారికి సంబంధించిన రాజ్యాంగ రక్షణలు సమర్థవంతంగా అమలయ్యే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం.
సి. రాజ్యాంగపరంగా మహిళా సంక్షేమ సంబంధిత అంశాలను సమీక్షించి, చేయవలసిన సంవరణను సూచించడం.
డి. మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, మహిళల అభివృద్ధికి సంబంధించిన
చట్టాలు అమలుకాని సందర్భంలో మహిళా సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ఈ
కమిషన్ తనంత తానుగా (సుమోటో) జోక్యం చేసుకుని కేసును స్వీకరించి
పరిష్కరిస్తుంది.
ఇ. మహిళల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలకు సంబంధించి సలహాలిస్తుంది.
ఎఫ్. పరివారిక్ మహిళా లోక్ అదాలత్‌ల ద్వారా బాల్య వివాహాల నిరోధానికి
కృషి చేయడం. వరకట్న నిషేధ చట్టం- 1961ను సమీక్షించి వివాహ, ఆస్తి తగాదాల
కేసులను పరిష్కరించడం. సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించి మహిళా సమస్యల
పట్ల సమాజంలో అవగాహన కల్పించడం.
జి. జైళ్లను లేదా ఇతర నిర్బంధ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ నిర్బంధంలో ఉన్న
వారికి కనీస సౌకర్యాలు కల్పన గురించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను
ఇస్తుంది.
జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్లు
ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు
Advertisement