జీర్ణ రసాలు జీర్ణాశయాన్ని ఎందుకు గాయపరచలేవు?



          త్రేన్పులు వచ్చినప్పుడు ఒక్కోసారి తిన్న పదార్థాలు గొంతులోకి రావటం దానితో గొంతు మంట పుట్టటం మీకు అనుభవమేనా? ఈ మంటకు కారణం మన జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ ఆమ్లమే(HCl)! హైడ్రోక్లోరిక్ ఆమ్లం  మనం తిన్న పదార్థాలు జీర్ణం కావటానికి సహాయ పడుతుంది. ఈ ఆమ్లం ఎంత గాఢముగా ఉంటుందంటే ఇది రేజర్ బ్లేడును కూడా కరిగించగలదు. మరి ఇంత గాఢత ఉన్న ఆమ్లం నిజానికి మన జీర్ణాశయాన్ని కూడా గాయపరచాలి. కానీ అలా జరగటం లేదు.
         
        ఎందుకంటే, మన జీర్ణాశయ గోడలు పొరల రూపంలో ఉంటాయి. ఆ పొరల్లోని కణాలు ఎప్పటికప్పుడు చనిపోతూ కొత్త కణాలు తయారవుతూ ఉంటాయి. దానివల్ల జీర్ణాశయ గోడల్లోని పొరలు ఎంతో దృఢముగా ఉంటాయి. జీర్ణరసాలు నష్టం కలిగించని రీతిలో ఉంటాయి. అయితే సమయానికి ఆహారం తీసుకోవాలి. లేదంటే భోజన వేళకు జీర్ణకోశంలో తయారయ్యే ఈ ద్రవాలు అక్కడ ఆహారం లేకపోయేసరికి జీర్ణాశయంలో నిల్వ ఉండిపోయి అక్కడి గోడల్ని గాయపరుస్తాయి. ఫలితముగా అల్సర్ లాంటి రుగ్మతలు మొదలవుతాయి. 
 

జీర్ణ వ్యవస్థ

జీర్ణ వ్యవస్థ - మాదిరి ప్రశ్నలు 2

జీర్ణ వ్యవస్థ - మాదిరి ప్రశ్నలు 1

దంతాలు

విటమిన్లు



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...