జీర్ణ వ్యవస్థ - మాదిరి ప్రశ్నలు 1


జీర్ణ వ్యవస్థ - మాదిరి ప్రశ్నలు 1
1.    పిత్తాశయ సంకోచాన్ని ప్రేరేపించే హార్మోన్?
 1) సెక్రిటిన్    2) గ్యాస్ట్రిన్
 3) ఎంటిరో గ్యాస్ట్రిన్4) కొలిసిస్టో కైనిన్
2.   పిండి పదార్థాలను జీర్ణం చేసే ఎంజైమ్?
1) ప్రోటియేజెస్    2) లైపేజెస్
3) అమైలేజెస్    4) ఏదీకాదు
3.   చిన్న పేగు పొడవు ఎంత?
1) 6.5 మీ.    2) 8.5 మీ.
3) 12 మీ.    4) 2 మీ.
4.   ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యేందుకు కావాల్సినవి? (డీఎస్సీ-2006)
1) గ్లైకోజన్
2) ఎమైలేజ్
3) సెల్యూలోజ్
4) సుక్రోజ్
5.   సోడియం కోలేట్, సోడియం డీ ఆక్సీకోలేట్ అనేవి? (డీఎస్సీ-2006)
1) పైత్యరస లవణాలు
2) పైత్యరస వర్ణకాలు
3) క్లోమ రస లవణాలు
4) క్లోమ రస వర్ణకాలు
6.   మానవుడిలో సంవరిణీ కండరాలు వ్యాకోచించినప్పుడు? (డీఎస్సీ-2006)
1) జీర్ణక్రియ వల్ల ఏర్పడ్డ అంత్య ఉత్పన్నకాలు పేగులో శోషణమవుతాయి
2) కొవ్వులు జీర్ణమవుతాయి
3)జీర్ణక్రియ ఆంత్య ఉత్పన్నకాలను చూషకాలు పీల్చుకుంటాయి
4) మలం పాయువు ద్వారా బయటకు పోతుంది
7.   ‘కైమ్’ ఏ స్థితిలో ఉంటుంది? (డీఎస్సీ - 2004)
1) క్షారం, ఆమ్లంగా
2) ఆమ్ల స్థితి
3) క్షార స్థితి
4) సమతుల్య స్థితి
8.   ‘మ్యూసిన్’ అనే శ్లేష్మ పదార్థాన్ని స్రవించేది? (డీఎస్సీ - 2004)
1) అథోజంబికా
2) అథో జిహ్విక
3) జఠర గ్రంథులు
4) పెరోటిడ్ గ్రంథులు
9.   రెనిన్ అనే ఎంజైమ్? (డీఎస్సీ-2004)
1) కొవ్వులను కొవ్వు ఆమ్లాలుగా మారుస్తుంది
2) అమైనో ఆమ్లాలను ప్రోటీన్‌లుగా మారుస్తుంది
3) పిండి పదార్థాన్ని మాల్టోజ్‌గా మారుస్తుంది
4) పాలను పెరుగుగా మారుస్తుంది
10. మనం తీసుకునే ఆహారంలో సెల్యూలోజ్ లేకపోతే? (డీఎస్సీ - 2004)
1) ఆహారం పూర్తిగా జీర్ణం అవదు, పేగు ల కదలిక క్రమబద్ధంగా ఉంటుంది.
2) ఆహారం పూర్తిగా జీర్ణం అవదు, మలబద్దకం ఏర్పడుతుంది.
3) పేగుల కదలిక క్రమబద్ధంగా ఉండి, మలబద్దకం ఏర్పడుతుంది.
4) ఆహారం పూర్తిగా జీర్ణమై, మలబద్దకం ఏర్పడదు
11.  పెరిస్టాలిటిక్ చలనాలు గల మానవుడి జీర్ణ మండలంలోని భాగం? (డీఎస్సీ-2002)
1) జీర్ణాశయం
2) ఆంత్రమూలం
3) కాలేయం
4) ఆహార వాహిక
12. ప్రౌఢ మానవుడి నోటిలో నములు దంతాల (అగ్ర చర్వణకాలు) సంఖ్య? (డీఎస్సీ-2002)
1) 8
2) 4
3) 12
4) 2
13. లాలాజలం లక్షణం? (డీఎస్సీ-2001)
1) క్షారం, ఆమ్లం
2) కొద్దిగా క్షారం
3) పూర్తిగా నీరు కలిగి ఉండటం
4) కొద్దిగా ఆమ్లం
14. శరీరంలో పునరుత్పత్తి శక్తి ఉన్న అవయవం?
1) క్లోమం    2) కాలేయం
3) ఉండూకం    4) ప్లీహం
15. చిన్నపేగులోని పొడవైన భాగం?
1) ఇలియం    2) జెజునం
3) ఆంత్రమూలం    4) కోలన్
16.  పొడవైన రదనికలు ఉన్న జీవి?
 1) సీల్     2) ఆటర్
3) వాల్స్    4) బీవర్
17. కిందివాటిలో అవశేష అవయవం ఏది?
1) ఉండూకం    2) బాహ్య చెవి
3) అనుత్రికం    4) పైవన్నీ
18.  లాలాజలం pH విలువ?
1) 5.2     2) 6.7
3) 7.4        4) 8.0
19. అతి తక్కువ కొవ్వు ఉన్న జీవి?
1) ఆవు     2) గేదె
3) మేక    4) ఒంటె
20.        పసి పిల్లల జఠర రసంలో ప్రత్యేకంగా కన్పించే ఎంజైమ్?
1) కెసిన్    2) రెనిన్
3) పారాకెసిన్    4) గ్యాస్ట్రిన్
21. కిందివాటిలో హార్మోన్‌ను గుర్తించండి.
1) గ్యాస్ట్రిన్    2) సెక్రిటిన్
3) ప్యాంక్రియోజైమిన్    4) పైవన్నీ
22.        మానవుడు జీర్ణం చేసుకోలేని పదార్థమేది?
1) సెల్యూలోజ్    2) సుక్రోజ్
3) స్టార్చ్     4) పైవన్నీ
23.        ఏ గ్రంథులను Krypts of Leber-kuhn అంటారు?
1) లాలా జల గ్రంథులు    2) క్లోమం
3) జఠర గ్రంథులు    4) ఆంత్ర గ్రంథులు 
24.        కిందివాటిలో టేబుల్ షుగర్ ఏది?
1) మాల్టోజ్     2) సుక్రోజ్
3) లాక్టోజ్     4) స్టార్చ్
25.        లాలాజల గ్రంథులకు సంబంధించి సరైన ప్రవచనం?
1) లాలాజల గ్రంథులు 4 జతలుంటాయి
2) పెరోటిడ్ గ్రంథులు నాలుక కింద ఉంటాయి.
3) లాలాజల గ్రంథుల స్రావంలో టయలిన్ ఉంటుంది.
4) లాలాజలం తటస్థంగా ఉంటుంది.
26.        జీర్ణ వ్యవస్థలోని ఏ భాగంలో జీర్ణక్రియ జరగదు?
1) నోరు
2) ఆంత్రమూలం
3) చిన్నపేగు
4) ఆహార వాహిక
27.        ప్రౌఢ మానవుడిలో ఉండే మొత్తం కుంతకాల సంఖ్య?
1) 4
2) 8
3) 12
4) 6


 FOR PDF: CLICK HERE
సమాధానాలు
1.     4
6.   4
11.   4
16.   3
21.   4
26.   4
2.     3
7.   2
12.   1
17.   4
22.   4
27.   2
3.     1
8.   3
13.   2
18.   2
23.   1

4.     2
9.   4
14.   2
19.   4
24.   4

5.     1
10.   3
15.   1
20.   2
25.   3

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...