ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్.....


ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,91,063.61 కోట్లతో ఏపీ బడ్జెట్ను గురువారం (మార్చి 8) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ 1,50,270 కోట్లుగా, మూలధన వ్యయాన్ని రూ 28,678 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక లోటును రూ 24,205 కోట్లుగా బడ్జెట్లో పేర్కొన్నారు. గతంతో పోలిస్తే బడ్జెట్ 21.70 శాతం పెరిగింది. బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. నిస్ఫృహ నుంచి ఆశ, భ్రమల నుంచి విశ్వాసం, నిరాదరణ నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనం సాగిస్తోందని యనమల అన్నారు.
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకెళ్తున్నామని యనమల అన్నారు. కేంద్రం ఉదాసీనత కనబరచకపోతే మరింత వృద్ధి, ప్రగతి సాధ్యమయ్యేదని అభిప్రాయపడ్డారు. హామీల అమలుకు, ఇతర రాష్ట్రాలతో సమానంగా నిలిచేవరకు పట్టుదలతో పోరాడతామన్నారు. మూడేళ్లలో జాతీయ సగటు వృద్ధి 7.3 శాతంతో పోలిస్తే.. రాష్ట్రం రెండంకెల వృద్ధి సాధించడం హర్షనీయం అన్నారు.
2019 ఎన్నికల నేపథ్యంలో సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా ప్రజాకర్షక బడ్జెట్ను రూపొందించారు. సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను సభకు సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2018-19 హైలైట్స్..
మొత్తం బడ్జెట్ రూ.లక్షా 91 వేల 63 కోట్లు
రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు
మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు
ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు
వృద్ధిరేటు : 10.96శాతం

సంక్షేమ రంగం
  • సాంఘిక సంక్షేమానికి రూ.13,722కోట్లు
  • వెనుకబడిన వైశ్యులకు రూ. 35కోట్లు
  • కాపులకు రూ.వెయ్యి కోట్లు
  • కాపు సామాజిక విద్యార్థులకు రూ.750కోట్లు
  • దూదేకులవారికి కేటాయింపులు.. రూ.40కోట్లు
  • నాయీ బ్రాహ్మణులకు రూ.30కోట్లు
  • వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100కోట్లు
  • వాల్మీకీ బోయిలకు రూ. 50కోట్లు
  • క్రిస్టియన్ మైనారిటీలకు రూ.75కోట్లు
  • మహిళా శిశు సంక్షేమానికి రూ.2839
  • గిరిజన సంక్షేమం రూ.250 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.4477కోట్లు
  • కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902కోట్లు
  • సామాజిక భద్రతకు రూ.3వేల 29కోట్లు
  • చేనేతల సంక్షేమానికి రూ.250కోట్లు
  • డ్వాక్రా మహిళలకు రూ.1000 కోట్లు
  • చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100కోట్లు
  • నీరు చెట్టు పథకానికి రూ.500 కోట్లు

విద్యుత్, వ్యవసాయం, సాగునీటి రంగం
  • సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు
  • ఇరిగేషన్ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు
  • వ్యవసాయానికి రూ.12వేల 355కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ.5వేల 52కోట్లు
  • రుణమాఫీకి రూ.4100కోట్లు

పరిశ్రమలు, రవాణా
  • పరిశ్రమలకు రూ.3వేల 78కోట్లు
  • రవాణా రంగానికి రూ.4వేల 653కోట్లు
  • పర్యావరణ రంగానికి రూ.4వేల 899కోట్లు
  • ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు రూ.300కోట్లు
  • రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,653కోట్లు
  • రోడ్ల అభివృద్ధికి రూ.1413 కోట్లు
     
గ్రామీణ, గృహ, పట్టణ రంగాలు
  • గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు
  • గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు
  • గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575కోట్లు
  • మున్సిపల్ శాఖకు రూ.7,761కోట్లు
  • మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623కోట్లు
  • విశాఖ చెన్నై కారిడార్ రూ.1168కోట్లు
  • స్మార్ట్ సిటీలకు రూ.800కోట్లు
  • స్వచ్ఛభారత్కు రూ,1450కోట్లు
  • ఆర్టీసీకి రూ.200కోట్లు
  • అమరావతి నిర్మాణానికి రూ.7,741కోట్లు
  • అమృత్ పథకానికి రూ.490 కోట్లు

విద్యా, వైద్యం, సాంకేతిక రంగం
  • సాధారణ విద్యారంగానికి రూ.24,180కోట్లు
  • సాంకేతిక విద్యకు రూ.818కోట్లు
  • స్కిల్ డెవలప్మెంట్కు రూ.300 కోట్లు
  • మోడల్ స్కూల్స్ రూ.377కోట్లు
  • రెసిడెన్షియల్ స్కూల్స్కు రూ.670కోట్లు
  • నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు
  • క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635 కోట్లు
  • వైద్యరంగానికి రూ.8,463కోట్లు
  • సమాచార శాఖకు రూ.224కోట్లు
  • వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20కోట్లు
  • సాంస్కృతిక రంగం రూ.94.98కోట్లు
  • ఎన్టీఆర్ వైద్య సేవలు రూ.1000 కోట్లు
  • వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ.357కోట్లు
  • మున్సిపల్ శాఖకు రూ.7,761కోట్లు
  • ఎంఎస్ఎంఈ రంగానికి రూ.200 కోట్లు
  • పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075కో్ట్లు
  • ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద రూ.1000కోట్లు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...