దవడ
ఎముకల్లోని ప్రత్యేక సంచుల లాంటి నిర్మాణాల్లో దంతాలు అమరి ఉంటాయి(THECODONT). క్షీరదాల్లో
ఎక్కువగా అసమదంతాలు.. ముఖ్యంగా నాలుగు రకాల దంతాలు ఉంటాయి. కుంతకాలు కొరికే
దంతాలు. రదనికలు చీల్చే దంతాలు. ఇవి మాంసాహార జీవుల్లో బాగా అభివృద్ధి చెందుతాయి.
అగ్రచర్వణకాలు నమిలే దంతాలు. సాధారణంగా
శిశువు పుట్టిన తర్వాత వచ్చేవి పాలదంతాలు. ఇవి 20 ఉంటాయి. ప్రతి దవడ అర్ధభాగంలో రెండు కుంతకాలు, ఒక
రదనిక, రెండు చర్వణకాలు ఉంటాయి. ఇవన్నీ ఊడిపోయి మళ్లీ వస్తాయి. ఇలా రెండు
సార్లు ఏర్పడే దంతాల సంఖ్య 20. ఆ తర్వాత ఒకేసారి ఏర్పడేవి 12. ఇవన్నీ చర్వణకాలు.
ఇవి ప్రతి దవడ అర్ధభాగంలో మూడు ఉంటాయి. ఇలా శాశ్వత దంతాలు 32 ఉంటాయి. ప్రతి దవడ
అర్ధభాగంలో రెండు కుంతకాలు, ఒక రదనిక, రెండు అగ్రచర్వణకాలు, మూడు చర్వణకాలు
ఉంటాయి. ప్రతి
దవడ అర్ధభాగంలోని చివరి చర్వణం జ్ఞానదంతం. ఇవి మొత్తం నాలుగు ఉంటాయి.
18 నుంచి 31 ఏళ్ల మధ్య ఇవి వస్తాయి. సాధారణంగా దంత నిర్మాణంలో వేరు, మెడ, కిరీటం
అనే మూడు భాగాలు ఉంటాయి. బయటకు కన్పించే భాగం కిరీటం.
SEE ALSO: జీర్ణ వ్యవస్థ
క్రమ
సంఖ్య
|
దంతరకము
|
దవడ అర్ధభాగంలో దంతాల సంఖ్య
|
మొత్తం
|
ఆకారం
|
విధులు
|
1
|
కుంతకాలు
|
2
|
8
|
వెడల్పుగా
|
కొరుకుటకు
|
2
|
రదనికలు
|
1
|
4
|
మొనదేలి
|
చీల్చుటకు
|
3
|
అగ్రచర్వణకాలు
|
2
|
8
|
చదునుగా
|
నమలుటకు
|
4
|
చర్వణకాలు
|
3
|
12
|
చదునుగా
|
విసురుటకు
|
మొత్తం
|
8
|
32
|
SEE ALSO: నిపా వైరస్
మొత్తం దంతం డెంటిన్
అనే అస్థి పదార్థంతో తయారవుతుంది. కిరీటంపై మెరిసే పింగాణి (ఎనామిల్) ఉంటుంది. ఇది శరీరంలో అత్యంత గట్టి పదార్థం. దంత
విన్యాసాన్ని భిన్నం రూపంలో తెలియజేస్తారు. పైదవడ అర్ధ భాగంలోని దంతాలను కుంతకాలు,
రదనికలు, అగ్రచర్వణకాలు, చర్వణకాల క్రమంలో లవంలో, కింది దవడలోని దంతాలను అదే
క్రమంలో హారంలో చూపించడాన్నే ‘దంతవిన్యాసం’ అంటారు.
డెంటల్ ఫార్ములా
క్షిరదాల్లో
జెనరల్ డెంటల్ ఫార్ములా
|
3
1 4 3
3
1 4 3
|
44
|
పంది
|
3 1 4 3
3 1 4 3
|
44
|
హ్యూమన్స్
|
2 1 2 3
2 1 2 3
|
32
|
కుక్క
|
3 1 4 2
3 1 4 3
|
42
|
కోతి
|
2 1 2 3
2 1 2 3
|
32
|
కుందేలు
|
2 0 3 3
1 0 2 3
|
28
|
ఎలుక
|
1 0 3 3
1 0 3 3
|
16
|
ఏనుగు
|
1 0 3 3
0 0 3 3
|
26
|
ఆవు, మేక, గొర్రెలు
|
0 0 3 3
3 1 3 3
|
32
|
No comments:
Post a Comment