నిపా వైరస్‌


నిపా వైరస్ అరుదైన, తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్ వ్యాధి. గబ్బిలాలు, పందులు, మనుషులలో ఎవరి నుంచి ఎవరికైనా వైరస్సోకుతుంది. 1998లో మలేషియాలో మొదటిసారిగా వైరస్కనుగొనబడింది, అటుతర్వాత 2004లో బంగ్లాదేశ్ లోకి వచ్చింది, ప్రస్తుతం వైరస్కేరళలోకి ప్రవేశించింది.

వైరస్ పేరు
                మలేసియాలోని సుంగాయ్ నిపా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలిసారిగా వైరస్ ను కనుగొన్నారు కాబట్టి, దీనిని నిపా వైరస్గా నామకరణం చేశారు. వ్యాధితో మలేషియా 105 మంది మృతి చెందగా, సింగపూర్లో పందులను పెంచే పశుపోషకులు మృతి చెందారు.

 

లక్షణాలు

వైరస్ సోకిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాస తీసుకోలేకపోవడం, తల తిరుగుడు, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్టు అనిపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. గాలి ద్వారా సోకదు, అప్పటికే వైరస్సోకిన జంతువు లేదా మనిషి నుండి మాత్రమే వ్యాపిస్తుంది.
ఫ్రూట్బ్యాట్గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు వ్యాధి వ్యాప్తికి తొలి వాహకులు. ఇవి కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్ఇతరులకు సోకుతుంది. 2004లో బంగ్లాదేశ్ లో వైరస్సోకిన గబ్బిళాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకిందని వైద్యులు తెలిపారు.

చికిత్స :
  1. వ్యాధిని అరికట్టడానికి ప్రత్యేకంగా టీకాలు లేవు.
  2. రోగుల్ని విడిగా ఉంచి కృత్రిమ పద్ధతుల్లో శ్వాస అందిస్తూ స్వస్థతకు ప్రయత్నిస్తారు.
  3. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. రిబావిన్ మాత్రల ద్వారా కొంత వరకూ ప్రయోజనం ఉండవచ్చు.

భారత ఉపఖండంలో ఎప్పుడెప్పుడు వచ్చింది ?
  • 2001లో సిలిగుడి, పశ్చిమబెంగాల్.. 66 మందికి వైరస్ సోకగా 45 మంది మరణించారు.
  • 2011లో బంగ్లాదేశ్.. వైరస్ సోకిన 56 మందిలో 50 మంది మృత్యువాత
  • 2018  కేరళలో

మరణాల రేటు :
  • వ్యాధి సోకిన వారిలో దాదాపు 70 శాతం మంది మరణిస్తారు.
 
జాగ్రత్తలు..
  1. జంతువులు, పక్షులు కొరికి వదిలేసిన పళ్లు తినకూడదు. గబ్బిలాలు తిరిగే చోట ఆహార పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
  2. నిపా రోగుల దగ్గరకి వెళ్లి వచ్చిన తర్వాత చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి.
  3. రోగులకు సేవలు అందించేటప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్లు, చేతులకు తొడుగులు ధరించాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...