విటమిన్లు





       విటమిన్లు శరీరానికి అత్యంత ఆవశ్యకమైన పోషకాలు. సూక్ష్మ మోతాదులో తీసుకున్నప్పటికీ స్థూల ప్రయోజనాలను కలిగిస్తాయి. జీవక్రియలు సక్రమంగా జరగడానికి తోడ్పడటమే కాకుండా పలు రకాల వ్యాధుల బారి నుంచి కూడా కాపాడతాయి.
          విటమిన్లు శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు. కణాల్లో జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఇవి చాలా అవసరం. సర్ హెచ్.జి.హోప్‌కిన్స్ 1912లో మొదటిసారిగా పాలలో విటమిన్లను గుర్తించారు. విటమిన్‌లకు ఆ పేరుపెట్టిన శాస్త్రవేత్త ఫంక్. Vital, Amines అనే పదాల నుంచి 'Vitamins' అనే పదం రూపొందింది
కరిగే విధానాన్ని బట్టి విటమిన్‌లను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి
1) నీటిలో కరిగే విటమిన్‌లు
ఉదా: విటమిన్- బి, సి
2) కొవ్వుల్లో కరిగే విటమిన్‌లు
ఉదా: విటమిన్- ఎ, డి, ఇ, కె   



విటమిన్ పేరు
రసాయన నామం
 ఎందులో కరుగుతుంది?
రోజువారీ మోతాదు
(male, age 19–70)
మోతాదు తగ్గితే వచ్చే జబ్బు
మోతాదు మించితే వచ్చే జబ్బు
విటమిన్ ఎ
రెటినాల్
కొవ్వులు
900 µg
రేచీకటి.
 గ్జీరాఫ్తాల్మియా.
కార్నియా మెత్తపడటం
Hypervitaminosis A
విటమిన్ బి1
థయామిన్
నీరు
1.2 mg
బెరిబెరి

విటమిన్ బి2
రిబోఫ్లావిన్
నీరు
1.3 mg
Ariboflavinosis, CHELOSIS, GLOSSITIS

విటమిన్ బి3
నికోటినిక్ ఆమ్లం
నీరు
16.0 mg
పెల్లాగ్రా
"Niacin flush"
విటమిన్ బి5
పాంటోథెనిక్ ఆమ్లం
నీరు
5.0 mg
Paresthesia burning of foot

విటమిన్ బి6
పైరిడాక్సిన్
నీరు
1.3-1.7 mg
రక్తహీనత
Impairment of proprioception
విటమిన్ బి7
బయోటిన్
నీరు
30.0 µg
None identified

విటమిన్ బి9
ఫోలిక్ ఆమ్లం
నీరు
400 µg
Deficiency during pregnancy is associated with birth defects, such as neural tube defects

విటమిన్ బి12
సయనో కోబాలమిన్
నీరు
2.4 µg
పెర్నిషస్ (ఆడంబరం లేకుండా హాని చేసే) రక్తహీనత

విటమిన్ సి
ఎస్కార్బిక్ ఆమ్లం
నీరు
90.0 mg
శీతాదం (స్కర్వీ)
Refer to Vitamin C megadosage
విటమిన్ డి
ErgoCalciferol and
Cholecalciferol
కొవ్వులు
5.0 µg-10 µg
Rickets and Osteomalacia
Hypervitaminosis D
విటమిన్ ఇ
టోకోఫెరాల్ and
టోకోట్రీనాల్
కొవ్వులు
15.0 mg
Deficiency is very rare; mild hemolytic anemia in newborn infants.

విటమిన్ కె
నాప్థోక్వినోన్ Phylloquinone
కొవ్వులు




----------------------------------------------------------------------------------
విటమిన్- ఎ
దీని రసాయనిక నామం రెటినాల్.
విటమిన్-ఎ జీవక్రియలు
          కంటిలోని రెటీనాలో ఉన్న దండ కణాలు పనిచేయడానికి ఇది అవసరం.
చర్మ మృదుత్వానికి, చర్మవ్యాధులు రాకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
పంటిలో ఎనామిల్ తయారుచేసే అమైలోబ్లాస్ట్ కణాలకు ఇది చాలా ముఖ్యం.
వ్యాధి నిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడానికి దోహదపడుతుంది.
ఇది అస్థిమజ్జలో ఎర్రరక్తకణాల తయారీ ప్రక్రియకు ఇనుమును చేరవేసి హిమోగ్లోబిన్ సంశ్లేషణను ప్రోత్సహిస్తుంది.

లోపిస్తే... 
  • రేచీకటి: దీన్ని నిక్టలోపియా అని అంటారు. విటమిన్-ఎ లోపం వల్ల రెటీనాలోని దండకణాల్లో రొడాప్సిన్ ఏర్పడదు. దీంతో రేచీకటి వస్తుంది.
  • గ్జీరాఫ్తాల్మియా: దీన్నే కార్నియల్ గ్జీరోసిస్ అంటారు. విటమిన్-ఎ లోపం వల్ల కంటి నీరు స్రవించడం తగ్గి ఈ వ్యాధి వస్తుంది.
  • కార్నియా మెత్తపడటం:దీన్నే కార్నియల్ అల్సరేషన్ అంటారు. కంటిలోని కార్నియాపై వ్రణాలు ఏర్పడి అది పగిలిపోతుంది. ఫలితంగా అంధత్వం కలుగుతుంది.

లభించే ఆహారం :
          క్యారెట్లు, బొప్పాయి, పండిన గుమ్మడి పండు, మునగ, బచ్చలి,పుచ్చకాయల్లో విటమిన్-ఎ లభిస్తుంది. ఆవు పాలు, కాలేయం, వెన్న, కోడిగుడ్డు పచ్చసొన, చేప కాలేయపు నూనెలో కూడా ఇది ఉంటుంది.

ఎక్కువైతే కలిగే ప్రభావాలు:
          విటమిన్-ఎ శరీరానికి ఎక్కువైతే చర్మ వ్యాధులు, ఎముకల్లో నొప్పి, తలనొప్పి, వాంతి లాంటి సమస్యలు వస్తాయి. రక్తస్కంధనం త్వరగా జరగకపోవడంతో గాయాలైనప్పుడు అధిక రక్తస్రావమవుతుంది.
----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------
విటమిన్-బి
          విటమిన్-బిలో అనేక రకాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి బి-కాంప్లెక్స్ విటమిన్‌లు అంటారు. అవి బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9, బి12. 

----------------------------------------------------------------------------------
విటమిన్-బి1 
          దీని రసాయనిక నామం థయామిన్. దీని లోపం వల్ల వచ్చే మార్పులు నాడీవ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. అందుకే దీన్ని యాంటీన్యూరిటిక్ విటమిన్ అంటారు.

లోపిస్తే... 
          థయామిన్ లోపం వల్ల పక్షుల్లో పాలిన్యూరైటిస్, మనిషిలో బెరిబెరి వ్యాధులు కలుగుతాయి. ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉన్నప్పుడు వెర్నిక్స్ సిండ్రోమ్ అనే వ్యాధి కలుగుతుంది.

లభించే ఆహారం : 
          విత్తనాల బాహ్య పొరల్లో, తవుడు, ఎండు బఠాణీలు, చిక్కుడు, దంపుడు బియ్యం లాంటి వాటిలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్ బి2 
          దీని రసానిక నామం రైబోఫ్లావిన్. ఈ విటమిన్‌ను లాక్టోఫ్లావిన్, ఓవో ఫ్లావిన్, ఎల్లో ఎంజైమ్, హెపటోఫ్లావిన్, వెరిడోఫ్లావిన్, విటమిన్-జి అనే పేర్లతో కూడా పిలుస్తారు.

లోపిస్తే...
  • కీలోసిస్- నోటి మూలల్లోని కణాలు చీలి ఉంటాయి.
  • గ్లాసైటిస్- నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.
  • సెబోరిక్ డెర్మటైటిస్- ముక్కు, పైపెదవి మధ్య చర్మం సొరచేప చర్మంలా గరుకుగా మారుతుంది.

లభించే ఆహారం : 
          పాలు, కాలేయం, గుడ్లు, వెన్న, వేరుశనగ, చిక్కుడు, ఈస్ట్ లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్-బి3
          దీని రసానిక నామం నియాసిన్.

లోపిస్తే... 
          ఈ విటమిన్ లోపం వల్ల పెల్లగ్రా అనే వ్యాధి వస్తుంది. ఇటాలియన్ భాషలో పెల్లగ్రా అంటే 'గరుకు చర్మం' అని అర్థం. పెల్లగ్రాలో విరేచనాలు, చర్మం దురదపెట్టడం, మతి భ్రమణం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి దీన్నే త్రీడీ వ్యాధి అంటారు. ఈ లక్షణాలు ఎక్కువైతే చివరకు మరణిస్తారు. ఇటీవల ఈ వ్యాధిని ఫోర్‌డీ వ్యాధి అని కూడా పిలుస్తున్నారు. నియాసిన్ రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

లభించే ఆహారం :
                   మాంసం, కాలేయం, చేపలు, ఎండిన చిక్కుళ్లు, బియ్యం తవుడు, బఠాణీలు, గోధుమ, లేత బీజాల్లో ఎక్కువగా లభిస్తుంది.
----------------------------------------------------------------------------------
 SEE ALSO: దంతాలు
----------------------------------------------------------------------------------
విటమిన్-బి5
                   దీని రసాయనిక నామం పాంటోథెనిక్ ఆమ్లం.
లోపిస్తే... 
ఈ విటమిన్ లోపం వల్ల అలసట, తలనొప్పి, కండరాలు పట్టివేయడం, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్ల స్రావం తగ్గడం, కాళ్లలో మంట వంటి లక్షణాలు కలుగుతాయి. ఈ విటమిన్ పక్షులకు అవసరం. ఇది ముఖ్యంగా కోళ్లలో చర్మ వ్యాధిని నిర్మూలిస్తుంది. కాబట్టి దీన్ని చిక్ యాంటీ డెర్మటైటిక్ ఫాక్టర్ అంటారు.

లభించే ఆహారం : 
         పాంటోథెనిక్ ఆమ్లం మనం తినే ప్రతి ఆహారంలో కొద్దిగా ఉంటుంది. కాబట్టి దీని లోపం సాధారణంగా రాదు. మన పేగులోని బాక్టీరియా ఈ విటమిన్‌ను కొంత వరకు సంశ్లేసిస్తుంది. ఈస్టు, కాలేయం, కోడిగుడ్లు, పాలలో లభ్యమవుతుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్-బి6
          దీని రసాయనిక నామం పైరిడాక్సిన్. ఈ విటమిన్ గుండె, రక్తనాళాల ఆరోగ్యానికి, న్యూరోట్రాన్స్‌మిటర్ల సంశ్లేషణలో, ఎర్రరక్తకణాలోని హిమోగ్లోబిన్ సంశ్లేషణకు, వ్యాధి నిరోధక శక్తి నిర్వహణకు అవసరం. క్షయవ్యాధికి, ఆస్తమాకు, అధిక రక్తపీడనానికి వాడే కొన్ని ఔషధాలను తీసకొంటున్నప్పుడు విటమిన్- బి6ను అదనంగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి విటమిన్-బి6కు వ్యతిరేకంగా పనిచేస్తాయి.

లోపిస్తే... 
           ఈ విటమిన్ లోపం వల్ల రక్తహీనత, అధిక స్ల్కీరోసిస్, మూత్రపిండంలో రాళ్లు, వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతినడం, పెరుగుదల కుంటుపడటం, మానసికంగా కుంగిపోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.
లభించే ఆహారం : విటమిన్-బి6 పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, పాలు, కోడిగుడ్డు పచ్చసొనలో ఉంటుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్-బి7
           దీని రసాయనిక నామం బయోటిన్. దీన్ని విటమిన్-హెచ్ అని కూడా అంటారు. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. కాబట్టి ఈ విటమిన్‌ను షాంపూల్లో, కండిషనర్‌లలో మాయిశ్చరైజింగ్ ఏజెంట్‌గా వాడతారు. ఈ విటమిన్ పచ్చి కోడిగుడ్డులో ఉండే పదార్థం బారినుంచి మనకు రక్షణ కల్పిస్తుంది. కాబట్టి దీన్ని యాంటీ ఎగ్ వైట్ ఇంజ్యూరీ ఫ్యాక్టర్ అంటారు.

లోపిస్తే... 
           ఈ విటమిన్ లోపం వల్ల ఆకలి మందగించడం, అలసట, మానసికంగా కుంగి పోవడం, వికారం, కండరాల నొప్పులు కలుగుతాయి.

లభించే ఆహారం : 
బయోటిన్ పేగులోని సూక్ష్మజీవుల ద్వారా మనకు కొంత వరకు లభ్యమవుతుంది. కాలేయం, ఈస్ట్, కోడిగుడ్డు, కూరగాయలు, విత్తనాల వంటి వాటిలో ఈ విటమిన్ లభిస్తుంది.
----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------
విటమిన్-బి9
         దీని రసాయనిక నామం ఫోలిక్ ఆమ్లం. దీన్ని విటమిన్-ఎమ్ అని కూడా అంటారు. ఇది డీఎన్ఏ సంశ్లేషణకు, కణవిభజన జరగడానికి అవసరం. రక్తకణ ఉత్పత్తిలో ఉపయోగపడుతుంది.

లోపిస్తే...
        ఫోలిక్ ఆమ్లం గర్భిణి స్త్రీలకు ఎక్కువగా అవసరం. గర్భస్థశిశువుకు నాడీకణాలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. గర్భిణులకు ఫోలిక్ ఆమ్లం అందకపోతే నాడీ సంబంధ వ్యాధులైన స్పైనా బిఫిడా, ఎనెన్‌సెఫాలి కలుగుతాయి. సాధారణ వ్యక్తుల్లో ఈ విటమిన్ లోపం వల్ల మాక్రోసైటిక్ అనీమియా, మెగాలో బ్లాస్టిక్ అనీమియా అనే వ్యాధులు వస్తాయి.

లభించే ఆహారం :  కాలేయం, ఆకుకూరలు, పాలు, మాంసం, గోధుమ గింజల నూనెలో ఉంటుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్- బి12
       దీని రసాయనిక నామం కోబాలమైన్ లేదా సైనకోబాలమైన్. దీనిలో కోబాల్ట్ మూలకం ఉండటం వల్ల ఈ పేరు పెట్టారు. ఈ విటమిన్ మెదడు, నాడీవ్యవస్థ అభివృద్ధిలో, రక్తకణ ఉత్పాదన, డీఎన్ఏ తయారీలో అవసరం. ఇది కాలేయంలో వివిధ రూపాల్లో నిల్వ ఉంటుంది. ఈ విటమిన్‌నే ఎనిమల్ ప్రొటీన్ ఫ్యాక్టర్ అని కూడా అంటారు.

లోపిస్తే ... 
   ఈ విటమిన్ లోపం వల్ల పెరినీషియస్ అనీమియా, హోమోసిస్టీనిమియా లాంటి వ్యాధులు కలుగుతాయి. అంతేకాకుండా అలసట, జ్ఞాపక శక్తి క్షీణత, ఎర్రరక్తకణాల అభివృద్ధి కుంటుపడుతుంది.

లభించే ఆహారం : 
విటమిన్- బి12 మొక్కల నుంచి అరుదుగా లభిస్తుంది. పాలు, మాంసం, గుడ్డు, కాలేయం లాంటి వాటి ద్వారా ఎక్కువగా దొరుకుతుంది. మనిషి జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియా దీన్ని కొంత వరకు సంశ్లేషణం చెందిస్తుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్-సి
          విటమిన్-సి రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. ఇది వేడికి తొందరగా విచ్ఛిన్నమవుతుంది.

ఎందుకు అవసరం?
           విటమిన్-సి శక్తిమంతమైన ప్రతిఆక్సీకరణి(యాంటీ ఆక్సిడెంట్)గా వ్యవహరిస్తుంది. కొల్లేజన్ అనే ప్రొటీన్ పోగుల తయారికీ ఇది చాలా అవసరం. జలుబును తగ్గించడం, అంటువ్యాధులకు కారణమయ్యే సూక్ష్మజీవులను నిరోధించడంలో విటమిన్-సి ప్రధానపాత్ర వహిస్తుంది. తెల్లరక్తకణాలు తమ విధిని నిర్వహించడానికి ఈ విటమిన్‌ను వాడుకుంటాయి. చిన్నపేగులో నుంచి ఇనుము శోషణకు, ఇనుమును మన శరీరం వాడుకోవడానికి కూడా ఇది చాలా అవసరం. గాయాలు మానడానికి, ధమనుల్లో కొవ్వు పేరుకుపోయి వచ్చే అథిరోస్ల్కీరోసిస్‌ను నివారించడానికి కూడా విటమిన్-సి అవసరం.

లోపిస్తే..?
          విటమిన్-సి లోపం అధికంగా ఉన్నప్పుడు స్కర్వీ వ్యాధి వస్తుంది. వివిధ ప్రాంతాల్లో రక్తస్రావం కావడం, దంతాలు కదలడం, కీళ్లలో వాపు, నొప్పి లాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి.

లభించే పదార్థాలు
          విటమిన్-సి జంతు సంబంధ పదార్థాల్లో తక్కువగా, వృక్ష సంబంధ పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది. రోజ్‌హిప్ పళ్లలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత అత్యధికంగా ఉసిరిలో ఉంటుంది. నిమ్మజాతి ఫలాలు, పుల్లని పదార్థాల్లో ఎక్కువగా ఉంటుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్-డి
         అనేక రూపాల్లో ఇది లభ్యమవుతుంది. అవి డి1, డి2, డి3, డి4, డి5. వీటిలో డి2, డి3 రూపాలు ముఖ్యమైనవి. డి2ను ఎర్గోకాల్సిఫెరాల్, డి3ను కోల్‌కాల్సిఫెరాల్ అంటారు. ఈ రెండింటిని కలిపి కాల్సిఫెరాల్స్ అంటారు. ఈమేరకు విటమిన్-డి రసాయనిక నామం కాల్సిఫెరాల్.
                   మన చర్మంలోని 7-డి హైడ్రోకొలెస్ట్రాల్ సూర్యరశ్మికి గురైనప్పుడు వివిధ చర్యల ద్వారా చివరకు మూత్రపిండాల్లో కాల్సిట్రయాల్ ఏర్పడుతుంది. విటమిన్-డి చేసే పనులన్నింటిని ఇది నిర్వహిస్తుంది. కాల్సిట్రయాల్‌ను చైతన్యవంత విటమిన్-డి3 అంటారు.

ఎందుకు అవసరం?
          పేగుల్లో నుంచి కాల్షియం శోషణకు, ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫేట్ లవణాలను స్థిరీకరించడానికి విటమిన్-డి అవసరం. పిండాభివృద్ధి, యవ్వన దశల్లో దేహకణాల సంఖ్యను పెంచడానికి ఈ విటమిన్ అవసరం. దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు కలిగే కణవాపును విటమిన్-డి తగ్గిస్తుంది.

లోపిస్తే..?
         పిల్లల్లో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధిలో కాళ్లు వంగినట్లు, ధనస్సు ఆకారంలో ఉంటాయి. పెద్దవారిలో ఆస్టియోమలాసియా వస్తుంది. ఎముకలు మెత్తబడటం ఈ వ్యాధి ముఖ్యలక్షణం. వృద్ధుల్లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఈ వ్యాధి లక్షణం.. ఎముకల్లో కాల్షియం తగ్గి బలహీనంగా మారి తొందరగా విరిగిపోవడం.

లభించే పదార్ధాలు
        చేపలు, వెన్న, కాలేయం, కోడిగుడ్డు నుంచి ఈ విటమిన్ లభిస్తుంది. కాడ్‌చేప కాలేయపు నూనెలో ఎక్కువగా ఉంటుంది. ధాన్యాలు, కూరగాయల్లో చాలా తక్కువగా ఉంటుంది.
----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------
విటమిన్-ఇ
     దీని రసాయనిక నామం టోకోఫెరాల్. విటమిన్-ఇ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా టోకోఫెరాల్స్ రూపంలో లభ్యమవుతుంది. వీటిలో ఆల్ఫాటోకోఫెరాల్ జీవశాస్త్రపరంగా ఎక్కువ చైతన్యవంతమైంది.

ఎందుకు అవసరం?
        ఈ విటమిన్ శక్తిమంతమైన ఆక్సీకరణి. ఇది శరీరాన్ని అనేక విషప్రభావాల బారి నుంచి రక్షిస్తుంది. ఇది విటమిన్-ఎ, విటమిన్-సి, సెలీనియం లాంటి వాటితో కలిసి పనిచేస్తుంది. ఆక్సీకరణిగా పనిచేయడం వల్ల కణత్వచాలను కాపాడి తొందరగా వృద్ధాప్యం రాకుండా చూస్తుంది. సంతానోత్పత్తికి ఇది దోహదపడుతుంది. దీన్ని వంధ్యత్వ ప్రతికారక విటమిన్ (యాంటీస్టెరిలిటీ విటమిన్) అని కూడా అంటారు. ఈ విటమిన్‌ను చర్మ సౌందర్య లేపనాల్లో ఉపయోగిస్తారు. నాడీకణాలను కాపాడటంలో, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రత్యేకపాత్ర వహిస్తుంది. బాగా వ్యాయామం చేసేవారికి, ఈతగాళ్లకు, పరుగు పందెంలో పాల్గొనే క్రీడాకారులకు విటమిన్-ఇ అవసరమెక్కువ.

లోపిస్తే..?
         సాధారణంగా విటమిన్-ఇ లోపం రావడం అరుదు. కొన్ని సందర్భాల్లో ఈ విటమిన్ లోపం వల్ల కింది సమస్యలు ఏర్పడతాయి.
  • వ్యాధి నిరోధక శక్తి తగ్గడంరెటినోపతి
  • రేఖిత కండర మయోపతి
  • ఎర్రరక్త కణాలు పగిలిపోవడం రక్తహీనత
 లభించే పదార్థాలు
        కోడిగుడ్లు, మాంసం, కాలేయం, సోయాబీన్స్, పొద్దుతిరుగుడు, వేరుశనగ, కుసుమ లాంటి నూనెల్లో ఈ విటమిన్ ఉంటుంది. ధాన్యాలు.. జంతువుల కొవ్వుల్లో కూడా ఉంటుంది. గోధుమ బీజనూనెలో ఎక్కువగా ఉంటుంది.
----------------------------------------------------------------------------------
విటమిన్-కె
         విటమిన్-కె సహజంగా రెండు రకాలుగా లభ్యమవుతుంది. మొక్కల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె1. దీని రసాయనిక నామం ఫిల్లోక్వినోన్. జంతుకణాలు, బ్యాక్టీరియాల నుంచి లభ్యమయ్యేది విటమిన్-కె2. దీని రసాయనిక నామం మెనక్వినోన్.

ఎందుకు అవసరం?
      మన శరీరంలో విటమిన్-కె వల్ల రక్తం గడ్డకట్టడానికి అవసరమైన ప్రొత్రాంబిన్, ఫ్యాక్టర్-VII, IX, X తయారవడం, పిల్లల్లో ఎముకలు సక్రమంగా పెరగడానికి విటమిన్-డి తో పాటు విటమిన్-కె కూడా అవసరం.

లోపిస్తే..?
       విటమిన్-కె లోపం వల్ల రక్తం తొందరగా గడ్డకట్టదు. కొందరిలో రక్తహీనత, దవడలు, ముక్కు నుంచి రక్తస్రావం, కరోనరి గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టిన పిల్లల్లో రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. కాబట్టి, పుట్టిన వెంటనే పిల్లలకు విటమిన్-కె ఇస్తారు.

లభించే పదార్థాలు
          విటమిన్-కె దాదాపుగా అన్ని ఆహార పదార్థాల్లో కొద్ది మోతాదులోనైనా ఉంటుంది. దీన్ని మనపేగులోని బ్యాక్టీరియా సంశ్లేషిస్తుంది. ముఖ్యంగా పాలకూర, క్యాబేజీ, కాలీఫ్లవర్, సోయాబీన్, గోధుమ, కాలేయం లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది.
----------------------------------------------------------------------------------
కోలిన్
        ఈ రసాయనాన్ని బి-కాంప్లెక్స్ విటమిన్లలో భాగంగా పరిగణిస్తారు. నాడీమండలం సరిగా పనిచేయడానికి, గుండె స్పందనలకు, కాలేయ నిర్వహణకు, థైమస్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటానికి ఇది అవసరం. గర్భంలో పెరుగుతున్న పిండానికి నాడీవ్యవస్థలో ఇది అసిటైల్ కోలిన్ రూపంలో కీలకపాత్ర వహిస్తుంది.

లోపిస్తే..?
         కోలిన్ లోపం వల్ల రక్తపీడనం పెరుగుతుంది. పక్షవాతం, గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కండర కణాలు విధ్వంసానికి గురవుతాయి. మహిళలకు గర్భధారణ సమయంలో కోలిన్ లోపం వల్ల నెలలు నిండకముందే శిశువులు జన్మించడం, తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం వంటి వాటికి అవకాశం ఉంది.

లభ్యమయ్యే పదార్థాలు
         కోలిన్ జంతువులు, మొక్కల్లో విస్తారంగా ఉంటుంది. మన శరీరంలో కొంతవరకు తయారవుతుంది. ఈస్ట్, కాలేయం, చేపలు, గోధుమ బీజ నూనె, కోడిగుడ్డులోని పచ్చసొన లాంటి వాటిలో ఉంటుంది.
----------------------------------------------------------------------------------
----------------------------------------------------------------------------------
ఇనాసిటాల్
         ఇనాసిటాల్ విటమిన్-బి8 గా పరిగణిస్తున్నారు. దీన్ని కండరపు చక్కెర అంటారు. ఇది వెంట్రుకల పెరుగుదలకు తోడ్పడుతుంది. కణాంతర కాల్షియం నియంత్రణకు అవసరం. కణ సంశ్లేషణ, జన్యు సంకేతాలు వ్యక్తపరచడం, కణ సమాచారం చేరవేయడం లాంటి వాటిలో కీలకపాత్ర వహిస్తుంది. న్యూరో ట్రాన్స్‌మీటర్ల సంశ్లేషణలో పాల్గొంటుంది.

లోపిస్తే..?
          ఇనాసిటాల్ లోపం వల్ల కేశ నష్టం, జ్ఞాపకశక్తి లోపించడం, మలబద్దకం, రక్తంలో చెడ్డకొలెస్ట్రాల్ పెరగడం, అథెరోస్ల్కీరోసిస్, గర్భస్థ శిశువులో నాడీనాళం లోపం ఏర్పడవచ్చు.

లభించే పదార్థాలు
          ధాన్యాలు, చిక్కుడుజాతి కూరగాయలు, ఆకుకూరలు, అరటి, నారింజ, బత్తాయి, కోడిగుడ్డులోని పచ్చసొన

1 comment:

Related Posts Plugin for WordPress, Blogger...