సింధూ నాగరికత --- మాదిరి ప్రశ్నలు 1


1. మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం ఏది?
 1) ఇత్తడి
 2) తగరం
 3) ఇనుము
 4) రాగి

2. హరప్పా ప్రజలు పూజించిన పక్షి ఏది?
 1) పావురం
 2) నెమలి
 3) కాకి
 4) గద్ద

3. కింది వాటిలో సింధూ లోయ నాగరికత ప్రత్యేకత ఏది?
 1) భవన నిర్మాణం
 2) పట్టణ ప్రణాళిక
 3) మురుగునీటి కాలువల నిర్మాణం
 4) పైవన్నీ

4. హరప్పా నాగరికతలో గొప్పదైన స్నాన వాటిక ఏ ప్రాంతంలో బయటపడింది?
 1) రూపార్
 2) హరప్పా
 3) కాలీబంగన్
 4) మొహంజోదారో

5. ‘మొహంజోదారో’ అంటే అర్థం ఏమిటి?
 1) మౌండ్ ఆఫ్ ది గ్రేట్
 2) మౌండ్‌ ఆఫ్ ది లివింగ్
 3) మౌండ్ ఆఫ్ ది సర్వైవర్
 4) మౌండ్ ఆఫ్ ది డెడ్

6. హరప్పా సంస్కృతికి చెందిన ప్రజల లిపి ఏ రకమైంది?
 1) హీరోగ్లిఫిక్
 2) క్యూనీఫారం
 3) నాగవల్లికల లిపి
 4) సౌహాట్

7. కింద పేర్కొన్న ఏ ప్రాంతంలో హరప్పా నాగరికతకు సంబంధించిన అవశేషాలు లభించలేదు?
 1) మద్రాస్
 2) కాలీబంగన్
 3) బన్వాలి
 4) మొహంజోదారో

8. సింధూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలను ప్రారంభించిన కాలం నాటి భారతదేశ వైస్రాయి ఎవరు?
 1) లార్డ్ రిప్పన్
 2) లార్డ్ కర్జన్
 3) లార్డ్ రీడింగ్
 4) లార్డ్ మింటో
9. ‘లోథాల్’ అంటే అర్థం ఏమిటి?
 1) రెండో మృతుల దిబ్బ
 2) నల్లగాజులు
 3) దున్నిన భూమి
 4) పైవన్నీ

10. సింధూ నాగరికత ప్రజల ముఖ్య వృత్తి ఏది?
 1) పశుపోషణ
 2) చేనేత
 3) వ్యవసాయం
 4) వర్తక వాణిజ్యం

11. సింధూ నాగరికత అత్యున్నతంగా విలసిల్లిన కాలంగా చరిత్రకారులు కింది వాటిలో దేన్ని పేర్కొంటారు?
 1) క్రీ.పూ. 2300  1750
 2) క్రీ.పూ. 2500  1500
 3) క్రీ.పూ. 2500  1900
 4) క్రీ.పూ. 600  324

12. మెసపటోమియన్లు సింధూ ప్రజలను ఏ పేరుతో పిలిచారు?
 1) శిలాజాట
 2) టోటెన్లు
 3) స్వస్తిక్‌లు
 4) మెలోహ
 

13. మొహంజోదారోలో బయల్పడిన మహా స్నానవాటిక నిర్మాణాన్ని చరిత్రకారులు దేనికి సంకేతంగా పేర్కొన్నారు?
 1) సింధూ ప్రజల సాంకేతిక ప్రగతి
 2) సింధూ ప్రజల మత విశ్వాసం
 3) సింధూ ప్రజల నిర్మాణ కౌశలం
 4) పైవన్నీ

14. ‘శిలాజాట’ అంటే అర్థం ఏమిటి?
 1) వరి పొట్టు
 2) ద్రాక్ష పంట
 3) బొగ్గు ముక్క
 4) నాట్యగత్తె

15. ‘సింధూ ప్రజలు ఆరాధించిన పశుపతే.. బహుశా తర్వాతి శివుడి రూపం’ అని ఎవరు పేర్కొన్నారు?
 1) ఎస్.ఆర్. రావు
 2) సర్ జాన్ మార్షల్
 3) దయారాం సహాని
 4) ఆర్.డి. బెనర్జీ

16. సింధూ నాగరికత ఏ లోహ యుగానికి సంబంధించింది?
 1) రాగి
 2) ఇనుము
 3) కంచు
 4) ఏదీకాదు

17. ‘దస్యులు’ అంటే అర్థం ఏమిటి?
 1) తెల్లనివారు
 2) తూర్పు దేశ ప్రజలు
 3) నల్లనివారు
 4) దక్షిణ దేశ ప్రజలు

18. యుద్ధాల్లో ఉపయోగించే ఏ వస్తువు సింధూ ప్రజలకు తెలియదు?
 1) శిరస్త్రాణం
 2) ఈటె
 3) విల్లంబు
 4) ధనస్సు

19. ‘బంగారు (సువర్ణ) నది’ అని కింది వాటిలో దేన్ని పిలిచేవారు?
 1) రావి
 2) జీలం
 3) గంగా
 4) సింధూ

20.‘యవలు’ అని వేటిని పిలిచేవారు?
 1) బార్లీ
 2) గోధుమ
 3) నువ్వులు
 4) వరి

21.సింధూ ప్రజలను అంతం చేసినవారిగా కింది వారిలో ఎవరిని భావిస్తున్నారు?
 1) ఆర్యులు
 2) గ్రీకులు
 3) అరబ్బులు
 4) తురుష్కులు

22.కింది వాటిలో ‘పశుపతి’ చుట్టూ పరివేష్టితమైన జంతువుల్లో లేనిది ఏది?
 1) సింహం
 2) ఖడ్గమృగం
 3) పులి
 4) దున్నపోతు

23.‘హరప్పా నాగరికత’కు ఆ పేరు పెట్టిన వారెవరు?
 1) మాక్స్ ముల్లర్
 2) దయానంద సరస్వతి
 3) సర్ జాన్ మార్షల్
 4) సర్ విలియం జోన్స్

24. కింద పేర్కొన్న వారిలో కాలీబంగన్ ప్రాంతంలో పరిశోధ నలు ఎవరు చేశారు?
 1) జగపతి ఘోష్
 2) ఆర్.ఎస్. బిస్త్
 3) ఎస్.ఆర్. రావు
 4) దయారాం సహాని

25.హరప్పా నాగరికతకు సంబంధించి దక్షిణ ప్రాంత సరిహద్దు ఏది?
 1) సుట్కజెండార్
 2) అలంఘీర్‌పూర్
 3) మాండ
 4) దైమాబాద్

26. సింధూ ప్రజలు ‘రాగి’ని ఏ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్లు భావిస్తున్నారు?
 1) ఖేత్రి (రాజస్థాన్)
 2) కోలార్ (కర్ణాటక)
 3) పర్షియా (ఇరాన్)
 4) ఉమ్మ (మెసపటోమియా)

27. సింధూ నాగరికతకు చెందిన ప్రజల దుస్తుల మూట బయటపడిన ప్రాంతం ఏది?
 1) ఎరిడు
 2) కిష్
 3) ఉమ్మ
 4) నినవే

28. ‘ఆర్య మతాధికారులు, సింధూ మతాధికారులకు మధ్య జరిగిన పోరాటం వల్ల సింధూ నాగరికత అంతరించింది’ అని ఎవరు పేర్కొన్నారు?
 1) జ్యోతిరావ్ పూలే
 2) దయానంద సరస్వతి
 3) బాల గంగాధర తిలక్
 4) రోమిల్లా థాపర్







 FOR PDF : CLICK HERE

1.     4     2.    1     3.    4     4.    4     5.    4
6.    3     7.    1     8.    3     9.    1     10.   3
11.   1     12.   4     13.   4     14.   3     15.   2
16.   3     17.   3     18.   1     19.   4     20.  1
21.   1     22.   1     23.   3     24.   1     25.   4
26.   1     27.   3     28.   1

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...