రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్సు జారీచేసే అధికారం

 

          రాజ్యాంగంలోని 123వ అధికరణ ప్రకారం పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు కేంద్ర కేబినెట్ సిఫార్సుల మేరకు రాష్ట్రపతి 'ఆర్డినెన్స్‌'ను జారీ చేస్తారు. పార్లమెంట్ చేసిన శాసనాలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో ఆర్డినెన్సులకు కూడా అలాంటి ప్రభావం ఉంటుంది. కాని ఇవి తాత్కాలిక స్వభావం కలిగి ఉంటాయి.

  • కేవలం పార్లమెంట్ ఉభయసభలు సమావేశాలలో లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయాల్సి ఉంటుంది. ఒక సభ మాత్రమే సమావేశంలో ఉండి మరో సభ సమావేశంలో లేనప్పుడు కూడా జారీచేయవచ్చు. ఎందుకంటే ఒక శాసనం తయారు చేయాలంటే రెండు సభల ఆమోదం అవసరం రెండు సభలు సమావేశంలో ఉన్నప్పుడు జారీ చేసిన ఆర్డినెన్సులు చెల్లవు.
  • తప్పనిసరిగా ఆర్డినెన్సులు జారీ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని రాష్ట్రపతి సంతృప్తి పడినప్పుడే ఆర్డినెన్సులను జారీ చేస్తాడు. అయితే రాష్ట్రపతి యొక్క సంతృప్తిని దురుద్దేశ్యం కారణంగా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని కూవర్ కేసు (1970)లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంటే రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేయాలనే ఉద్దేశ్యంతోటే పార్ల మెంట్ లో ఏదేని ఒక సభను లేదా ఉభయసభలను రద్దు చేశాడనే కారణంతో న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. 38వ రాజ్యాంగ సవరణ చట్టం-1975 ప్రకారం రాష్ట్రపతి యొక్క నిర్ణయం న్యాయసమీక్షాధికారం క్రిందికి రాదు. కాని 44వ రాజ్యాంగ సవరణ చట్టం-1978 ద్వారా దీనిని తొలగించడం జరిగింది. అంటే ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి నిర్ణయాన్ని న్యాయస్థానాలలో సవాలు చేయవచ్చు.
  • రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సులు కేవలం కాలపరిమితుల విషయంలో తప్ప పార్లమెంట్ యొక్క శాసనాలకు సంబంధించిన అన్ని అంశాలతో సమానంగా ఉంటుంది. అంటే
    • పార్లమెంట్ ఏ అంశాలపై శాసనాల చేయగలదో ఆ అంశాలన్నింటిపై రాష్ట్రపతి ఆర్డినెన్సులు జారీ చేయగలడు.
    • పార్లమెంట్ శాసనాలకు వలె అన్ని నియంత్రణలు ఆర్డినెన్సుకు కూడా వర్తిస్తాయి. అంటే ఆర్డినెన్సులు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించలేవు
  • పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు జారీ చేసిన ఆర్డినెన్సులు పార్లమెంట్ తిరిగి సమావేశం కాగానే దాని ముందు ఉంచాలి. ఒక వేళ పార్లమెంట్ ఈ ఆర్డినెన్సులను ఆమోదిస్తే అప్పుడది చట్టంగా మారుతుంది. పార్లమెంట్ ఆ ఆర్డినెన్సులు ఆమోదించక పోతే పార్లమెంట్ సమావేశం అయిన 6 వారాలు ముగియ గానే ఆర్డినెన్స్ రద్దయిపోతుంది. 6 వారాల కంటే ముందే  ఉభయ సభలు తిరస్కరించినా కూడా ఆర్డినెన్స్ రద్దవుతుంది. పార్లమెంట్ ఉభయ సభల వేర్వేరు తేదీలలో సమావేశమవుతే ఆ తేదీల ఆధారంగా 6 వారాలను లెక్కిస్తారు. దీనిని బట్టి ఒక ఆర్డినెన్సు యొక్క గరిష్ట కాలపరిమితి 6 నెలల 6 వారాలు (పార్లమెంట్ ఆమోదించిన సమయాలలో) పార్లమెంట్ ఉభయసభలు ముందు ఆర్డినెన్సును ఉంచకుండానే ఆర్డినెన్సు రద్దయి పోతే ఆ ఆర్డినెన్సు ద్వారా చేయబడిన చర్యలు పూర్తిగా చెల్లబడుతాయి.
  • ఒకసారి జారీ చేసిన ఆర్డినెన్సును రాష్ట్రపతి ఏ సమయంలో అయినా ఉపసంహరించుకోవచ్చు. అయితే ఆర్డినెన్సు జారీచేసే అధికారం రాష్ట్రపతి యొక్క నిరపేక్షాధికారం పై ఆధారపడి ఉండదు. కేవలం ప్రధాన మంత్రి అధ్యక్షతన గల మంత్రి మండలి యొక్క సలహా ఆధారంగానే రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయాలి లేదా ఉపసంహరించుకోవాలి.ఆర్డినెన్సులు కూడా ఇతర పార్లమెంట్ శాసనాల వలే గడిచి పోయిన కాలం నుండి కూడా అమలులోకి వస్తాయి. వీటి వల్ల అప్పటికే అమలులో గల పార్లమెంట్ శాసనాలకు మార్పులు చేయవచ్చు లేదా తొలగించవచ్చు. ఆర్డినెన్సుల ద్వారా పన్ను చట్టాలను కూడా మార్చవచ్చు. కాని రాజ్యాంగాన్ని సవరించేందుకు ఆర్డినెన్సులను జారీచేయవద్దు.
  • రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్సు జారీ చేసే అధికారము అనేది 352 ప్రకరణలో పేర్కొన్న జాతీయ అత్యవసర పరిస్థితితో సంబంధం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అంటే యుద్ధం, విదేశీ దురాక్రమణ, అంతర్గత కల్లోలాలు లేని సందర్భంలో కూడా రాష్ట్రపతి ఆర్డినెన్సులను జారీ చేయవచ్చు. ఇప్పటి వరకు రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సులకు సంబంధించి ఎలాంటి వివాదాల సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లబడలేదు.
  • డి.సి. ఐద్వా కేసు (1987)లో సుప్రీంకోర్టు ఆర్డినెన్సు లోని సమాచారం మార్చకుండా, కనీసం అసెంబ్లీ యొక్క ఆమోదం పొందేందుకు ప్రయత్నించకుండా వరుసగా ఆర్డినెన్సులు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని, ఒకే ఆర్డినెన్సును మరలా మరలా జారీ చేయడం చట్ట వ్యతిరేక మని  తీర్పునిచ్చింది. ఆర్డినెన్సుల ద్వారా కార్యనిర్వా హక వర్గానికి ఇవ్వబడ్డ శాసనాధికారం ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభ యొక్క శాసనాధికారానికి ప్రత్యామ్నాయంగా ఉండరాదని తెలిపింది.

రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం

        రాజ్యాంగంలో 72వ ప్రకరణ ద్వారా క్రింది తెలిపిన నేరాలుకు సంబంధించి వివరించబడి శిక్షలు పొందిన వ్యక్తుందరికీ క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి గలదు.
  • కేంద్ర న్యాయం (యూనియన్ లా)కు వ్యతిరేకంగా చేసిన నేరాలలో శిక్షలు విధించబడినప్పుడు.
  • కోర్ట్ మార్షల్ (మిలటరీ కోర్టు) ద్వారా శిక్షలు విధించబడి నప్పుడు.
  • మరణశిక్ష విధించబడినప్పుడు

రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారం న్యాయశాఖతో సంబంధం లేకుండా స్వతంత్రమైన అధికారం. అంటే ఇది కార్యనిర్వాహక అధికారమన్న మాట. రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం కల్పించడంలో రెండు లక్ష్యాలు గలవు. (ఎ) న్యాయాల అమలులో న్యాయశాఖ చేసిన తప్పిదాలను సరిదిద్దడం, (బి). చాలా కఠినంగా శిక్ష విధించారని రాష్ట్రపతి భావించినప్పుడు ఖైదీలకు ఉపశమనం ఇవ్వడం. కేంద్ర కేబినెట్ యొక్క సలహా మేరకే క్షమాభిక్ష అధికారాన్ని రాష్ట్రపతి వినియోగించుకోవాలి. రాష్ట్రపతి ప్రకటించే తన నిర్ణయానికి కారణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కేవలం శిక్ష చాలా కఠినంగా ఉందనే కారణాలు మాత్రమే ఉపశమనం కలిగించాల్సిన అవసరం లేదు. సాక్ష్యాలు తప్పుగా ఉన్నాయన్న నెపంతో కూడా ఉపశమనం కలిగించవచ్చు. కేవలం రాష్ట్రపతి నిర్ణయం సహేతుకంగా లేనప్పుడు, దురేద్దశంతో ఉన్నప్పుడు, విచక్షణాయుతంగా ఉన్నప్పుడు తప్ప అతని నిర్ణయం న్యాయసమీక్ష క్రిందికి రాదు. రాష్ట్రపతి ఏ విధంగా క్షమాభిక్ష అధికారాన్ని వినియోగించాలో సుప్రీంకోర్టు విధివిధానాలను రూపొందించే అవకాశం లేదు.

రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారంలోకి ఈ క్రింది అంశాలు వస్తాయి. అవి:

క్షమాభిక్ష (Pardon)

  • దీని ప్రకారం నేరస్తునికి విధించిన అన్ని రకాల తీర్పులు, శిక్షలు, అనర్హతలు అన్నింటిని పూర్తిగా రద్దు చేయడం రాష్ట్రపతికి ఇవ్వడం జరిగింది.

మార్పు (Commutation)

  • అంటే ఒక రమైన శిక్ష స్థానంలో మరొక తక్కువ తీవ్రత గల శిక్షలు విధించడం. ఉదాహరణకు మరణశిక్ష విధించబడిన ముద్దాయికి కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. లేదా కఠిన కారగార శిక్ష విధించబడిన ముద్దాయికి సాధారణ కారాగార శిక్ష విధించడం.

మినహాయింపు (Remission)

  • శిక్ష యొక్క తీవ్రతలో మార్పు చేయకుండా కేవలం శిక్ష కాలంను మాత్రమే మార్చడం. ఉదాహ‌ర‌ణ‌కు రెండు సంవత్సరాల కఠిన కారగారా శిక్ష విధించబడిన ముద్దాయికి ఒక సంవత్సరము కఠిన కారాగార శిక్ష విధించడం.

విరామము (Respite)

  • కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఒక వాస్తవంగా విధించిన శిక్ష స్థానంలో తక్కువ రకపు శిక్షలను విధించడం. ఉదాహరణకు ముద్దాయికి ఏమైనా భౌతిక వికలాంగుడైననూ లేదా గర్భం దాల్చిన కారణంగా శిక్షలను మార్పు చేయడం.

నిలువుదల (Reprieve)

  • కొంత కాలం వరకు న్యాయస్థానం విధించే శిక్షలు అమలు కాకుండా చూడటం (ముఖ్యంగా మరణశిక్ష) రాష్ట్రపతి నుండి క్షమాభిక్ష కోరడానికి ముద్దాయికి అవకాశం ఇవ్వాలనే ఉదేశంతో ఈ సౌకర్యం కల్పించబడును.

రాజ్యాంగంలో 161వ ప్రకరణ ప్రకారం రాష్ట్ర గవర్నరు కూడా క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. గవర్నర్ కూడా ఇటువంటి నేరాలలో (రాష్ట్ర చట్టాలకు వ్యతిరేకంగా గల) అయినా శిక్షలు విధించబడిన ముద్దాయిలకు క్షమాభిక్ష, మార్పు, మినహాయింపు, విరామము, నిలుపుదల ప్రసాదించవచ్చు. కాని గవర్నర్‌కు గల క్షమాభిక్ష అధికారం రాష్ట్రపతికి గల అధికారము క్రింది విధంగా విభేదించును.

  • రాష్ట్రపతి కోర్ట్ మార్షల్ విధించిన శిక్షలకు కూడా క్షమాభిక్ష ప్రసాదిస్తాడు. కాని గవర్నర్ కు ఆ అధికారం లేదు.
  • మరణశిక్ష విధించబడిన ముద్దాయిలను రాష్ట్రపతి క్షమాభిక్ష ప్రసాదించవచ్చు. కాని గవర్నర్ కు ఆ అధికారం లేదు. ఒక వేళ రాష్ట్ర చట్టం మరణశిక్ష పేర్కొన్నప్పుడు కూడా క్షమాభిక్ష ప్రకటించే అధికారం కేవలం రాష్ట్రపతికే ఉంటుంది. అయితే గవర్నర్ మరణశిక్ష విషయంలో నిలుపుదల, మార్పు, మినహాయింపు ప్రసాదించవచ్చు. అంటే మరణశిక్ష విధించబడిన సందర్భంలో రాష్ట్రపతికి మరియు గవర్నర్ కు నిలుపుదల, మార్పు, మినహాయింపు అధికారాలుంటాయి.

 

రాష్ట్రపతి వీటో అధికారం

 

       పార్లమెంట్ ఉభయసభలచే ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారాలంటే వాటిపై రాష్ట్రపతి ఆమోదముద్ర అవసరం. ఏదైనా బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించి రాష్ట్రపతికి ఆమోదం కొరకు పంపితే రాష్ట్రపతికి క్రింది మూడు మార్గాలు ఉంటాయి. (111వ అధికరణ ప్రకారం)

  • ఆ బిల్లును ఆమోదింవచవచ్చు; లేదా
  • ఆ బిల్లును తన దగ్గరే ఉంచుకోవచ్చు; లేదా
  • ఆర్థిక బిల్లులు కాని బిల్లులను పార్లమెంట్ కు తిరిగి పంపవచ్చు.

అలా పంపిన బిల్లులు పార్లమెంట్ సవరణలు చేసి లేదా చేయకుండా ఆమోదించి రాష్ట్రపతికి తిరిగి పంపితే తప్పనిసరిగా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాలి.

అబ్స‌ల్యూట్ వీటో

అప్పల్యూట్ వీటో అంటే పార్లమెంట్ లో ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిన బిల్లులను రాష్ట్రపతి తిరస్కరించడం, అలాంటి సందర్భంలో ఆ బిల్లు చట్టంగా మారకుండానే రద్దువుతుంది. ఈ వీటోను క్రింది రెండు సందర్భాలలో వినియోగంచుకోవచ్చు.

  • ప్రయివేటు సభ్యుల బిల్లు (మంత్రులు కాని పార్లమెంట్ సభ్యులు ప్రవేశపెట్టిన బిల్లులు) బిల్లులు; మరియు
  • పాత కేబినెట్ రాజీనామా చేయక ముందు పార్లమెంట్ ఆమోదించబడిన బిల్లులను కొత్తగా ఏర్పడిన కేబినెట్ రాష్ట్రపతికి ఆమోదించవద్దని సలహా ఇచ్చినప్పుడు

సస్పెన్సివ్ వీటో

ఏదైనా బిల్లును రాష్ట్రపతి పున: పరిశీలన నిమిత్తం పార్లమెంట్ కు పంపిన సందర్భంలో ఆ సస్పెన్సివ్ వీటోను వినియోగించడం జరుగుతుంది. కాని, అలా పార్లమెంట్ కు చేరిన బిల్లును సవరించి లేదా సవరణలు చేయకుండా ఆమోదించి రాష్ట్రపతి అనుమతి కొరకు పంపినట్లయితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి. అంటే రాష్ట్రపతికి గల సస్పెన్సివ్ వీటోను పార్లమెంట్ సాధారణ మెజారిటీతో ఎదుర్కో గలదు.

ఈ వీటోను ద్రవ్య బిల్లుల విషయంలో వినియోగించడానికి వీలులేదు. అంటే భారత రాష్ట్రపతి ద్రవ్య బిల్లులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించ వచ్చు. కాని పున:పరిశీలన నిమిత్తం పార్లమెంట్ కు పంపరాదు. సాధారణంగా ద్రవ్య బిల్లులను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందే రాష్ట్రపతి ఆమోద ముద్ర పాందుతాయి.

పాకెట్ వీటో

ఈ సందర్భంలో రాష్ట్రపతి తన దగ్గరకు వచ్చిన బిల్లులను ఆమోదించకుండా లేదా తిరస్కరించకుండా తన దగ్గరే ఉం చుకుంటాడు. ఈ విధంగా బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాగే ఉంచుకోవడాన్ని పాకెట్ వీటో అంటారు. రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన బిల్లులను ఎంతకాలం లోపు ఆమోదించాలన్న అంశం రాజ్యాంగంలో ఎక్కడ కూడా పేర్కొన బడలేదు. కాబట్టి ఈ పాకెట్ వీటోను రాష్ట్రపతి ఎటువంటి కాల పరిమితి లేకుండా వినియోగించుకుంటాడు.

రాజ్యాంగ సవరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో అధికారం ఉండదు. 24వ రాజ్యాంగ సవరణ చట్టం, 1971 ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లులను రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది.

రాష్ట్ర శాసనాలపై రాష్ట్రపతి వీటో అధికారం

రాష్ట్ర శాసనాలకు సంబంధించిన విషయాలలో కూడా రాష్ట్రపతికి వీటో అధికారం ఉంటుంది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులు చట్టాలుగా మారాలంటే తప్పనిసరిగా ఆ బిల్లులు గవర్నర్ లేదా రాష్ట్రపతి (ఒక వేళ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపినపుడు) ఆమోద ముద్ర పొందాలి.

రాష్ట్ర శాస‌న‌స‌భ ఆమోదించిన బిల్లును గ‌వ‌ర్న‌ర్ ఆమోదం కోసం పంపిన‌ప్పుడు గవర్నర్ కు 4 మార్గాలుంటాయి. (200వ అధికరణ ప్రకారం)

  • ఆ బిల్లును గవర్నర్ ఆమోదించవచ్చు; లేదా
  • ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించవచ్చు, లేదా
  • రాష్ట్ర శాసన సభకు పున:పరిశీలన నిమిత్తం తిరిగి పంపవచ్చు (ద్రవ్య బిల్లులు కానివి), లేదా
  • రాష్ట్రపతి పరిశీలన కోసం బిల్లును రిజర్వు చేయడం.

రాష్ట్ర శాసన సభలచే ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్ రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం రిజర్వు చేసినప్పుడు, రాష్ట్రపతికి మూడు మార్గాలుంటాయి. (201వ అధికరణ ప్రకారం)

  • ఆ బిల్లును ఆమోదించవచ్చు. లేదా
  • ఆ బిల్లును ఆమోదించకుండా తిరస్కరించవచ్చు: లేదా
  • రాష్ట్ర శాసన సభకు పున:పరిశీలన నిమిత్తం తిరిగి పంపమని గవర్నర్ కోరవచ్చు.

అలా పంపిన బిల్లును రాష్ట్ర శాసన సభ సవరణలతో సవరణలు లేకుండా ఆమోదించి తిరిగి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సినవసరం లేదు. అంతేగాక అలాంటి బిల్లులు రాష్ట్రపతి ఎంతకాలం తమ దగ్గర ఉంచుకోవాలో కాలపరిమితిని రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదు. అంటే ఈ బిల్లుల విషయంలో రాష్ట్రపతి పాకెట్ వీటోను వినియోగించకునే అవకాశం గలదు.

రాష్ట్రపతి అధికారాలు మరియు విధులు

 

 కార్యనిర్వాహక అధికారాలు (Executive Powers)

  • దేశంలో అన్ని కార్యనిర్వాహక కార్యక్రమాలు రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి.
  • ప్రధానమంత్రి మరియు మంత్రి మండలిని నియమిస్తాడు. ఇతని ఇష్టం ఉన్నంత కాలం వారు పదవిలో కొనసాగుతాడు.
  • రాష్ట్రపతి భారత అటార్నీజనరల్ ను నియమించి అతని జీతభత్యాలను నిర్ణయిస్తాడు. అటార్నీ జనరల్ రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత కాలం పదవిలో కొనసాగుతాడు.
  • కంప్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ను, ముఖ్య ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లను, యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులను, రాష్ట్ర గవర్నర్లను, ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తాడు.
  • ఎవరైనా మంత్రి తన మంత్రిత్వశాఖ గురించి ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే మంత్రిమండలి దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఆ నిర్ణయాలను సమర్పించమని ప్రధాన మంత్రిని కోరుతాడు.
  • ఎస్సీ, ఎస్టీ మరియు వెనుకబడిన తరగతుల వారి స్థితిగతుల గురించి విచారణ నిమిత్తం కమిటీలు వేసే అధికారం రాష్ట్రపతికి గలదు.
  • కేంద్ర-రాష్ట్రాల మధ్య, అంతర్రాష్ట్రాల మధ్య సమన్వయం మరియు సహకారం పెంపొందించేందుకు అంతర్రా మండలిని నియమిస్తాడు.
  • కేంద్ర పాలిత ప్రాంతాలను పరిపాలకులను నియమించి తానే ప్రత్యక్షంగా పరిపాలన కొనసాగిస్తాడు.
  • దేశంలో ఏ ప్రాంతాన్ని అయినా షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించి, ఆ ప్రాంతాల పరిపాలనకు సంబంధించిన అన్ని అధికారాలు రాష్ట్రపతికి గలవు.

శాసనాధికారాలు (Legislative Powers)

భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి కూడా ఒక భాగమే. రాష్ట్రపతికి కింది శాసనాధికారాలు ఉన్నాయి.

  • పార్లమెంట్ ను సమావేశపరిచే అధికారం, దీర్ఘకాలిక వాయిదా వేసే అధికారం, రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి గలదు. అంతేగాక పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేది కూడా రాష్ట్రపతియే కాని దీనికి లోక్ సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు.
  • ప్రతి సంవత్సరపు మొదటి సమావేశాన్ని మరియు సాధారణ ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తాడు.
  • పార్లమెంట్ లో పెండింగ్ లో గల బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని ఉభయసభలకు పంపతాడు.
  • ఎప్పుడైనా లోక్ సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఒకసారి ఖాళీ అయినట్లయితే ఎవరు ఆ సభకు అధ్యక్షత వహించాలో నిర్ణయించేది భారత రాష్ట్రపతి. అదే విధంగా రాజ్యసభలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులు ఒకే సమయంలో ఖాళీ అయినట్లయితే ఎవరు ఆ సభకు అధ్యక్షత వహించాలో రాష్ట్రపతి నిర్ణయిస్తాడు.
  • సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగం, కళలు, సమాజ సేవల్లో నిష్ణాతులైన వారిలో 12 మందిని రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేస్తారు.
  • లోక్ సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. (తాజాగా దీన్ని తొలగించారు)
  • పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హత విషయాన్ని ఎన్నికల సంఘంతో సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయిస్తాడు.
  • పార్లమెంట్ లో కొన్ని ప్రత్యేక బిల్లులను ప్రవేశపెట్టా లంటే ముందుగా రాష్ట్రపతి అనుమతి అవసరం. ఉదా. సంఘటిత నిధి నుండి ఖర్చు చేయడానికి ఉద్దేశించిన బిల్లులు, నూతన రాష్ట్రం ఏర్పాటు/ రాష్ట్ర సరిహద్దులు మార్చటకు ఉద్దేశించిన బిల్లులు,
  • పార్లమెంట్ ఉభయ సభలచే ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపిన బిల్లులను రాష్ట్రపతి
    • ఆ బిల్లును ఆమోదింవచ్చు.
    • ఆ బిల్లును ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవచ్చు.
    • పార్లమెంట్ కు తిరిగి పంపవచ్చు (ద్రవ్య బిల్లులు తప్ప) ఒక వేళ పార్లమెంట్‌కు తిరిగి పంపబడిన బిల్లులు మరలా పార్లమెంట్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి.
  • రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులు గవర్నరు పంపితే, గవర్నర్ రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపినట్లయితే అప్పుడు రాష్ట్రపతి
    • ఆ బిల్లును ఆమోదింవచ్చు; లేదా
    • ఆ బిల్లును ఆమోదించకుండా తన దగ్గరే ఉంచుకోవచ్చు లేదా
    • ఆ బిల్లును తిరిగి రాష్ట్ర శాసనసభకు పంపమని గవర్నర్‌ను ఆదేశించవచ్చు (ద్రవ్య బిల్లులు తప్ప) అయితే అదే బిల్లును రాష్ట్ర శాసనసభ తిరిగి ఆమోదించి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపినట్లయితే రాష్ట్రపతి ఆ బిల్లులను తప్పని సరిగా మోదించాల్సిన అవసరం లేదు.
  • పార్లమెంట్ సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్సులును జారీచేస్తాడు. అయితే పార్లమెంట్ సమావేశమైన ఆరు వారాలలోపు ఆ ఆర్డినెన్సులు పార్లమెంట్ చేత ఆమోదం పొందాలి. ఈ ఆర్డినెన్సులు రాష్ట్రపతి ఏ సమయంలో అయినా ఉపసంహరించవచ్చు. కంప్రోలర్ ఆడిటర్ జనరల్, యూపీఎస్ సీ, ఆర్థిక సంఘం యొక్క వార్షిక నివేదికలను రాష్ట్రపతి పార్లమెంట్ ముందు ఉంచుతాడు.
  • అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, దాద్రానగర్ హవేలీ, డామన్ మరియు డయ్యూలో శాంతి, సుపరిపాలన కొరకు నిబంధనలు తయారు దౌత్యాధికారాలు చేస్తాడు. పుదుచ్ఛేరి విషయంలో కూడా నిబంధనల ద్వారా శాసనాలను రూపొందిస్తారు. కాని ఆ శాసన సభ రద్దు కాబడి లేదా సుప్తావస్థలో ఉంటుందో అప్పుడు మాత్రమే చేయగలడు.

ఆర్థికాధికారాలు (Financial Powers)

రాష్ట్రపతి యొక్క ఆర్ధికాధికారాలు మరియు విధులు ఈ క్రింది విధంగా ఉంటాయి.

  • పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అన్ని ఆర్ధిక బిల్లులు ముందుగా రాష్ట్రపతి యొక్క అనుమతి పొందాల్సి ఉంటుంది.
  • పార్లమెంట్ ముందు వార్షిక ఆర్ధిక స్టేట్ మెంట్ (కేంద్ర బడ్జెట్)ను ప్రవేశపెట్టేందుకు కారణభూతమవుతాడు.
  • రాష్ట్రపతి యొక్క సూచనలు లేకుండా గ్రాంట్స్ కొరకు డిమాండ్ సమర్పించరాదు.
  • అనుకోకుండా తలెత్తే ఖర్చుల కోసం భారత ఆగంతుక నిధుల నుండి రాష్ట్రపతి అడ్వాన్సులుగా నిధులు కల్పిస్తారు.
  • కేంద్ర-రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి ప్రతి 5 సంవత్సరాలకోసారి ఆర్ధిక సంఘాన్ని నియమిస్తాడు.

న్యాయాధికారాలు (Judicial Powers)

రాష్ట్రపతి యొక్క న్యాయాధికారాలు మరియు విధులు క్రింది. విధంగా ఉంటాయి.

  • సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తు లను మరియు ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు.
  • ఏదేని న్యాయసంబంధ అంశాలపై సుప్రీంకోర్టును సలహా అడిగే అధికారం ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు ఇచ్చిన సలహాని రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదు.
  • క్రింద తెలిపిన నేరాలకు సంబంధించి విధించబడిన శిక్షలు రద్దు చేసే అధికారం, శిక్షకాలం తగ్గించే అధికారం, శిక్షా విధానాన్ని మార్చే అధికారం, శిక్షలను నిలుపుదల చేసే అధికారం భారత రాష్ట్రపతికి గలదు.
    • మార్షల్ కోర్టులు విధించే శిక్షలు,
    • కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా చేసిన నేరాలకు విధించిన శిక్షలు మరియు
    • మరణ శిక్షలు విధించబడిన అన్ని సందర్భాలలో

దౌత్య అధికారాలు (Diplomatic Powers)

భారతదేశం ఇతర ప్రపంచదేశాలలో చేసుకునే అన్ని ఒప్పందాలు, సందులు రాష్ట్రపతి పేరు మీదుగానే జరుగుతాయి. అయితే వాటిని తరువాత పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యవహారాలలో మరియు వేదికలలో భారతదేశ ప్రతినిధిగా ఉంటూ రాయబారులను, హైకమీషనర్లను స్వాగతించేది, పంపించేంది భారత రాష్ట్రపతి.

సైనిక అధికారాలు (Military Powers)

భారతదేశ సర్వ సైన్యాధ్యక్షుడు రాష్ట్రపతి, అంటే దేశంలో రక్షణ దళాలన్నింటికీ సుప్రీం కమాండర్ గా ఉంటాడు. ఆ హెూదాలోనే ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధిపతులను నియమిస్తాడు. పార్లమెంట్ యొక్క అనుమతి ఆధారంగా యుద్ధాన్ని ప్రకటించే హక్కు సంధి చేసుకునే హక్కు రాష్ట్రపతికి గలదు.

అత్యవసర అధికారాలు (Emergency Powers)

పైన తెలిపిన సాధారణ అధికారాలతో పాటు, క్రింద తెలిపిన మూడు రకాల అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్రపతికి రాజ్యాంగం కొన్ని అసాధారణ అధికారాలు ఇచ్చింది.

  • జాతీయ అత్యవసర పరిస్థితి (352వ అధికరణ)
  • రాష్ట్రపతి పాలన (356వ మరియు 365వ అధికరణలు)
  • ఆర్ధిక అత్యవసర పరిస్థితి (360వ అధికరణ)

భార‌త రాష్ట్ర‌ప‌తి

 

భార‌త రాష్ట్ర‌ప‌తి

  • ఆర్టిక‌ల్ 52 ప్ర‌కారం దేశానికి ఒక అధ్య‌క్షుడు ఉంటాడు.
  • దేశ మొద‌టి పౌరుడు రాష్ట్ర‌ప‌తి.
  • దేశానికి స‌ర్వ‌సైన్యాధిప‌తి.
  • ఆర్టిక‌ల్ 53 ప్ర‌కారం కార్య నిర్వ‌హ‌క అధికారాలు రాష్ట్ర‌ప‌తి నిర్వ‌హిస్తాడు.
  • అయితే 1976లో చేసిన 42వ రాజ్యాంగ స‌వ‌ర‌ణ ప్ర‌కారం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ (మంత్రి మండ‌లి) స‌ల‌హాను రాష్ట్ర‌ప‌తి త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి.
  • దేశ తొలి రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్. ఈయ‌న 1952 నుంచి 1962 వ‌ర‌కు ప‌ద‌వీబాధ్య‌త‌లు నిర్వ‌హించారు.
  • తొలి మ‌హిళా రాష్ట్ర‌ప‌తి ప్ర‌తిభా పాటిల్‌. దేశానికి 12వ రాష్ట్ర‌ప‌తి.

రాష్ట్రపతి ఎన్నిక (Election of The President)

  • పార్లమెంట్ ఉభయసభలలో గల ఎన్నుకోబడిన సభ్యులు
  • రాష్ట్రాల విధానసభలలో గల ఎన్నుకోబడిన సభ్యులు మరియు
  • ఢిల్లీ, పుదుచ్చేరి, జ‌మ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలలో ఎన్నుకోబడిన సభ్యులు
  • పార్లమెంట్ ఉభయ సభల్లో, రాష్ట్రాల శాసన సభలలో, ఢిల్లీ, పుదుచ్చేరి, జ‌మ్మూకాశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల శాసన సభ సభ్యులలో గల నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనరు. అంతేగాక ద్విసభా విధానం గల రాష్ట్రాలలో గల విధాన మండలి సభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనరు.
  • రాష్ట్రపతి ఎన్నిక నైష్పత్రిక ప్రాతినిధ్య విధానంలో ఏక ఓటు బదిలీ పద్ధతి ద్వారా రహస్య బాలెట్ ఓటింగ్ లో జరుగుతుంది.
  • రాష్ట్రపతి ఎన్నిక అన్ని వివాదాలను సుప్రీంకోర్టు మాత్రమే పరిశీలించి తీర్పును ప్రకటిస్తుంది. ఇలా ప్రకటించే ఈ తీర్పు అంతిమం.
  • రాష్ట్రపతిగా ఎన్నిక కాబడ్డ వ్యక్తి యొక్క ఎన్నికను సుప్రీంకోర్టు చెల్లదని ప్రకటించినట్లయితే అతను రాష్ట్రపతిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, చర్యలు చెల్లుతాయి. అమలులోనే ఉంటాయి.
  • తొలిసారి ఏక‌గ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ నీలం సంజీవ‌రెడ్డి.
  • భారీ మెజార్టీ సాధించిన ప్రెసిడెంట్ కేఆర్ నారాయ‌ణ‌న్ (10వ రాష్ట్ర‌ప‌తి).
  • పార్టీల మ‌ద్ద‌తు లేకుండా గెలిచిన తొలి ప్రెసిడెంట్ వీవీ గిరి.

రాష్ట్ర‌ప‌తి కావడానికి అర్హతలు, ప్రమాణం మరియు నిబంధలు (Qualifications,Oath and Conditions of the President))

  • భారతీయ పౌరుడై ఉండాలి.
  • 35 సంవ‌త్స‌రాలులు నిండినవాడై ఉండాలి.
  • లోక్ సభ సభ్యుడుగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి.
  • కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వంలో గానీ, స్థానిక సంస్థలలో గానీ లాభదాయక పదవి ఉండొదు. వదవిలో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మరియు ఏ రాష్ట్ర గవర్నర్ అయినా, కేంద్రంలో లేదా రాష్ట్రంలో మంత్రి అయినా లాభదాయపదవి క్రిందికి రారు. కాబట్టి వారందరూ రాష్ట్రపతి పదవికి పోటీ చేయవచ్చు.
  • రాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్‌ను 50 మంది సభ్యులు ధృవీకరించాలి. మరియు 50 మంది సభ్యులు సమర్ధించాలి.
  • రాష్ట్రపతికి పోటీచేసే అభ్యర్థి పార్లమెంటు నిర్ణయించిన మొత్తంలో రూ. 15 వేల ధరావతును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేయాలి.
  • ఎన్నికలలో పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు పొందని యెడల ఆ ధరావతు సొమ్ము కోల్పోవడం జరుగుతుంది.

రాష్ట్ర‌ప‌తి పదవీకాలం, మహాభియోగం మరియు ఖాళీ (Term, Impeachment and Vacancy of the President)

  • రాష్ట్రపతి విధులలోకి వచ్చిన తేదీ నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు. పదవీకాలం ముగియక ముందే కొత్త రాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించాలి.
  • ఉపరాష్ట్రపతికి తన రాజీనామా పత్రాన్ని సమర్పించి పదవి నుండి తప్పుకోవచ్చు. అంతేగాక ఐదు సంవత్సరాలు ముగియక ముందే మహాభియోగ తీర్మానం ఆధారంగా రాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు.
  • ఒకసారి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి తిరిగి రాష్ట్రపతిగా ఎన్నిసార్లు అయినా ఎన్నుకోబడవచ్చు.

రాష్ట్రపతి పదవి ఖాళీ

  • ఐదు సంవత్సరాల కాలపరిమితి పూర్తయి తర్వాత
  • అతని రాజీనామా ద్వారా
  • మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించడం
  • అతని మరణం ద్వారా
  • రాష్ట్రపతి పదవికి అనర్హుడుగా ప్రకటించడం ద్వారా లేదా అతని ఎన్నిక చెల్లనేరదని ప్రకటించిన పక్షంలో
  • రాష్ట్రపతి తన ఐదు సంవత్సరాలు గడువు ముగిసిన తర్వాత కూడా కొత్తగా ఎన్నుకోబడిన రాష్ట్రపతి విధులు చేపట్టే వరకు పదవిలో కొనసాగుతారు. ఇలాంటి సమయాలలో ఉప రాష్ట్రపతి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు వీలులేదు.
  • రాజీనామా, తొలగింపు, మరణం లాటి ఇతర కారణాల చేత రాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లయితే కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే దాకా ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి బాధ్యతలు నిర్వహిస్తాడు. ఎప్పుడైనా రాష్ట్రపతి అనారోగ్యం చేత లేదా అందుబాటులో లేని కారణం చేత విధులు నిర్వర్తించలేని పక్షంలో అతను తిరిగి విధుల్లో చేరేంత వరకు ఉపరాష్ట్రపతి పదవీ బాధ్యతలు నిర్వహిస్తాడు.
  • రాజీనామా, తొలగింపు, మరణం లాంటి ఇతర కారణాల చేత రాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లయితే, ఆ ఖాళీ ఏర్పడిన ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి మిగిలిన సమయానికి కాకుండా పూర్తిగా ఐదు సంవత్సరాల వరకు పదవిలో కొన సాగుతాడు.
  • రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి పదవులు రెండూ ఖాళీ అయిన సందర్భంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (లేదా సుప్రీంకోర్టులో అత్యధిక సీనియర్ న్యాయమూర్తి) రాష్ట్రపతిగా ఉంటూ రాష్ట్రపతి పదవీ బాధ్యతలు నిర్వహిస్తాడు.

మహా భియోగ తీర్మానం (Impeachment)

  • రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లయితే భారత రాష్ట్రపతిని మహా భియోగ తీర్మానం ద్వారా పదవి నుండి తొలగించవచ్చు. కాని భారత రాజ్యాంగం ‘రాజ్యాంగం ఉల్లంఘన’ అనే వాక్యాన్ని నిర్విచించలేదు. మహాభియోగ తీర్మానం గురించి ఆర్టికల్ 61 చెబుతుంది.
  • మహాభియోగ తీర్మానాన్ని పార్లమెంట్ ఉభయసభలలో ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. కానీ ఈ తీర్మానాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టే ముందు ఆ స‌భ‌ల్లో నాలుగింట ఒక‌వంతు మంది స‌భ్యులు సంతకాలు చేసి రాష్ట్రపతికి 14 రోజుల ముందు నోటీసుల ఇవ్వాలి.
  • మహాభియోగ తీర్మానం మొదటి సభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3వ వంతు సభ్యులు ఆమోదించినట్లయితే ఆ బిల్లును రెండవ సభలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. రెండవ సభ ఈ ఆరోపణలను విచారిస్తుంది. ఈ విచారణకు రాష్ట్రపతి హాజరై తన వాదనను వినిపించవచ్చు. అయితే రెండవ సభ కూడా ఆరోపణలు అంగీకరించి మొత్తం సభ్యులలో 2/3వ వంతు మంది సభ్యులు ఆమోదించినట్లయితే, ఆమోదించిన తేదీ నుండి రాష్ట్రపతి పదవి ఖాళీ అయినట్లు ప్రకటించడం జరుగుతుంది.
  • రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనని పార్లమెంట్ ఉభయసభల్లో గల నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానంలో పాల్గొంటారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కాబడ్డ సభ్యులు మరియు ఢిల్లీ, పాండిచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలలో గల ఎన్నిక కాబడ్డ సభ్యులు ఈ మహాభియోగ తీర్మానంలో పాల్గొనరు. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. ఇంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్రపతి కూడా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించ బడలేరు.

ప్ర‌ధాన‌మంత్రి

             రాజ్యాంగంలోని పార్లమెంటరీ తరహా పద్ధతి ప్రకారం రాష్ట్రపతి నామమాత్ర కార్య నిర్వాహణాధికారిగా, ప్రధాని వాస్తవ కార్యనిర్వాహణాధికారిగా ఉంటారు. అనగా రాష్ట్రపతి రాజ్యాధినేతగా, ప్రధాని ప్రభుత్వాధినేతగా ఉంటారు.

 

ప్రధాన మంత్రి నియామకం

      ప్రధాని ఎంపిక, నియామకం గురించి రాజ్యాంగం ఎలాంటి ప్రక్రియనూ ప్రస్తావించలేదు. ప్రధాని రాష్ట్రపతిచే నియమింపబడతాడు అని 75వ ఆర్టిక‌ల్‌ పేర్కొంటుంది. దీని అర్థం రాష్ట్రపతి తన ఇష్టానుసారం ఎవరినైనా ప్రధాని నియమించవచ్చ‌ని కాదు. పార్లమెంటరీ ప్రభుత్వ వ్యవస్థలోని సాంప్రదాయాలను అనుసరించి రాష్ట్రపతి లోక్ సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ప్రధానిగా నియమించాలి. 

        లోక్ సభలో ఏ పార్టీకీ మెజారిటీరాకుంటే రాష్ట్రపతి ప్రధాని ఎంపికలో, నియామకంలో తన వ్యక్తిగత విచక్షణను చూపవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా రాష్ట్రపతి లోక్ సభలో అతి పెద్ద మెజారిటీ పార్టీ నాయకుడిని లేదా సంకీర్ణ పార్టీల నాయకుడిని ప్రధాని నియమించి, అతన్ని నెల రోజుల్లో సభలో విశ్వాసాన్ని కోరుతాడు. 1979లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయినప్పుడు నీలం సంజీవరెడ్డి (ఆనాటి రాష్ట్రపతి) సంకీర్ణ పార్టీల నాయకుడైన చరణ్ సింగ్ ని ప్రధానిగా నియమించి నెల రోజులలో సభా విశ్వాసాన్ని పొందమని కోరారు. ఈ విధంగా తన విచక్షణాధికారాన్ని రాష్ట్రపతి తొలిసారి వినియోగించారు.

        అధికారంలో ఉన్న ప్రధాని మరణిస్తే తక్షణం ఆ పదవికి మ‌రో వ్య‌క్తి దొర‌క్క‌పోతే రాష్ట్రపతి ప్రధాని నియామకంలో స్వయంగా నిర్ణయం తీసుకున్న సందర్భం కూడా ఉంది. 1984లో ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆనాటి రాష్ట్రపతి జైల్ సింగ్.. రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమిం చారు. ఈ సందర్భంలో ఆయన తాత్కాలిక ప్రధాన మంత్రిని నియమించే పాత‌ సాంప్రదాయాన్ని విస్మరించారు.త‌ర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ రాజీవ్ గాంధీని తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రధాని మరణాంతరం అధికార పార్టీ కొత్త నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రపతి అతడిని ప్రధానిగా నియమించాల్సి వ‌స్తుంది.

         1980లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక వ్యక్తి ప్రధాని నియామకానికి ముందే తన మెజారిటీని నిరూపించుకునే అవసరం లేదు. రాష్ట్రపతి మొదట అతనిని ప్రధానిగా నియమించవచ్చు. అతనికి గడువునిచ్చి లోక్ సభలో మెజారిటీని నిరూపించుకోమని కోరవచ్చును. ఉదాహరణకు చరణ్ సింగ్ (1979), వీపీ సింగ్ (1989), చంద్రశేఖర్ (1990), దేవగౌడ (1996), ఐకే గుజ్రాల్ (1997) మరియు తిరిగి ఏబీ వాజ్ పేయి (1998) ఈ విధంగానే నియమింపబడ్డారు.

           1997లో సుప్రీంకోర్టు ఇచ్చిన అభిప్రాయం ప్రకారం పార్లమెంటులో ఏ సభలోనూ సభ్యుడు కాని వ్యక్తిని ప్రధానిగా నియమించవచ్చు. కాని 6 నెలల్లో పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి. రాజ్యాంగపరంగా ప్రధాని పార్లమెంటులో ఏదైనా ఒక సభకు అతడు సభ్యుడు కావాలి. లేకుంటే పదవిని కోల్పోతాడు.

          రాజ్యాంగపరంగా ప్రధాని పార్లమెంటులో ఏ సభలోనైనా సభ్యుడు కావొచ్చు. ఇందిరాగాంధీ (1966), దేవగౌడ (1966), మన్మోహన్ సింగ్ (2004) వారి నియామక సమయంలో రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. కాని బ్రిటన్‌లో ప్రధానమంత్రి పార్లమెంటులోని దిగువ సభ (House of Commans)లో తప్పక సభ్యుడై ఉండాలి.

 

ప్రమాణం, పదవీకాలం, జీతం

         పదవిలో ప్రవేశించటానికి ముందు ప్రధానమంత్రి, రాష్ట్రపతి సమక్షంలో పదవీ ప్రమాణం మరియు రహస్య గోపన ప్రమాణం (oath of office and oath of secrecy) చేస్తారు. పదవీ ప్రయాణంలో ప్రధాని తాను

  • భారత రాజ్యాంగం పట్ల యధార్ధమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉంటానని,
  • భారతదేశ సౌర్యభౌమత్యాన్ని, అఖండతను సమర్ధిస్తానని,
  • తన కర్తవ్యాలని శ్రద్ధాపూర్వకంగా , మనస్సాక్షి పూర్వకంగా నిర్వహిస్తానని, మరియు
  • భయం, పక్షపాతం, ద్వేషం, లేకుండా రాజ్యాంగానికి, శాసనానికి అనుగుణంగా ప్రజలందరికి న్యాయం చేకూర్చదునని ప్రతిజ్ఞ చేస్తారు.

        రహస్య గోపన ప్రమాణంలో ప్రధానమంత్రి తన దృష్టికి తేబడిన లేదా తనకు తెలియ వచ్చిన ఏ విషయమునైన కేంద్ర మంత్రిగా తన కర్తవ్యాలను ఆవశ్యక మయితే తప్ప ఎవిరికి ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ వెల్లడించను అని ప్రమాణం చేస్తారు.

          ప్రధానమంత్రి పదవీకాలం (term) నిర్ణయింపబడలేదు. అతడు రాష్ట్రపతి ఇష్టమున్నంత కాలం పదవిలో ఉంటాడు. అయితే రాష్ట్రపతి ప్రధానిని ఎప్పుడంటే అప్పుడు తొలగించలేడు. లోక్ సభలో ప్రధానికి మెజారిటీ ఉన్నంతకాలం రాష్ట్రపతి అతన్ని తొలగించలేదు. లోక్ సభలో విశ్వాసం కోల్పోతే ప్రధాని రాజీనామా చేయాలి. లేకుంటే రాష్ట్రపతి అతన్ని తొలగించవచ్చు.

           ప్రధాని జీతభత్యాలను పార్లమెంట్ ఎప్పటికప్పుడు నిర్ణయిస్తుంది. పార్లమెంట్ సభ్యుడు పొందే జీతభత్యాలను ప్రధాని పొందుతాడు. దీనితో పాటు అతనికి సత్కార భత్యం (sumptuary allowance), ఉచిత నివాసం, ప్రయాణ భత్యం, వైద్య సౌకర్యాలు ఉంటాయి.

ప్రధానమంత్రి అధికారాలు మరియు విధులు

మంత్రి మండలితో సంబంధం

కేంద్రమంత్రి మండలి అధ్యక్షుడుగా ప్రధానమంత్రికి ఈ అధికారాలు ఉంటాయి.

  • రాష్ట్రపతి మంత్రులను నియమించడానికి ఆయన వ్యక్తులను సిఫార్సు చేస్తాడు. ప్రధాని సిపార్సు చేసిన వారినే రాష్ట్రపతి మంత్రులుగా నియమిస్తారు.
  • మంత్రిమండలి సభ్యులకు శాఖల కేటాయింపు, శాఖల పునర్వ్యవస్థీకరణ వంటి అంశాలను ఆయన ప్రభావితం చేస్తారు.
  • ఆయన ఏ మంత్రినైనా రాజీనామా చేయమని అడగవచ్చు. లేదా అభిప్రాయ భేదాలు ఏర్పడితే ఆ మంత్రిని తొలగించమని రాష్ట్రపతికి సలహా ఇవ్వవచ్చును.
  • మంత్రిమండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తారు. మంత్రిమండలి నిర్ణయాలపై అతడి ప్రభావం ఉంటుంది.
  • మంత్రుల కార్యకలాపాలకి ఆయన మార్గదర్శాన్ని ఆదేశాన్ని, నియంత్రణని సమన్వయాన్ని అందిస్తారు.
  • తాను రాజీనామా ఇస్తే మొత్తం మంత్రిమండలి పడిపోతుంది.

              మంత్రిమండలికి ప్రధాని అధినేత కాబట్టి ప్రధాని రాజీనామా ఇచ్చినా లేక మరణించినా ఇతర మంత్రులు అధికార నిర్వ‌హణ చేయలేరు. పదవిలో ఉన్న ప్రధాని రాజీనామా లేదా మరణం ద్వారా ప్రస్తుత మంత్రి మండలి రద్దయినట్లే. తద్వారా శూన్యత ఏర్పడుతుంది. ఏ ఇతర మంత్రి రాజీనామా లేదా మరణం వలన ఖాళీ మాత్రమే ఏర్పడుతుంది. ప్రధాని తనకు ఇష్టముంటే ఆ ఖాళీని భర్తీ చేయవచ్చు. లేదంటే చేయకపోవచ్చు.

రాష్ట్రపతితో సంబంధం

  • రాష్ట్రపతికి, మంత్రి మండలికి ముఖ్యమైన సంధానకర్త, కేంద్ర మంత్రి మండలి కార్యకలాపాలని, నిర్ణయాలని రాష్ట్రపతికి తెలియజేయడం ప్రధాని బాధ్యత. ప్రధానికి క్రింది బాధ్యతలుంటాయి.
    • కేంద్ర వ్యవహారాలలో పరిపాలనకు సంబంధించిన మంత్రి మండలి తీర్మానాలను, శాసన నిర్మాణ, ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలపడం.
    • రాష్ట్రపతి తనంతటతాను కోరే కేంద్ర వ్యవహారాల పరిపాలనకు శాసన నిర్మాణ ప్రతిపాదనల సమాచారాలని ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెలియజేయడం.
    • ఏదైనా విషయాన్ని ఒక మంత్రి నిర్ణయించి, మంత్రి మండలి పరిశీలించక‌పోతే మంత్రి మండలి పరిశీలనకు సమర్పించమని రాష్ట్రపతి కోరితే ఆ విషయాన్ని మంత్రి మండలికి సమర్పించటం.
  • రాష్ట్రపతికి ప్రముఖ అధికారులను నియ మించమని సలహా ఇస్తారు. ఉదా: భారత అటార్నీ జనరల్, భారత కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు దాని సభ్యులు, ఎలక్షన్ కమీషనర్లు, ఫైనాన్స్ కమీషన్ చైర్మన్ మరియు దాని సభ్యులు మొదలగు వారు.

పార్లమెంట్‌తో సంబంధం

ప్రధాని దిగువ సభ నాయకుడు. ఈ హెదాలో ఆయనకు ఈ అధికారాలు ఉంటాయి.

  • పార్లమెంట్‌ను సమావేశపరచడం, సమాపనం చేయటం వంటి పార్లమెంట్ వ్యవహారాల విషయంలో రాష్ట్రపతికి ప్రధాని సలహాలు ఇస్తారు.
  • లోక్ సభను రద్దు చేయమని రాష్ట్రపతికి ఆయ‌న‌ ఎప్పుడైనా సిఫార్సు చేయవచ్చు.
  • సభలో ప్రభుత్వ విధానాలను ప్రకటించవచ్చు.

ఇతర అధికారాలు, విధులు

  • జాతీయ ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, జాతీయ సమగ్రతా మండలి, అంతర్ రాష్ట్ర మండలి మరియు, జాతీయ జల వనరుల మండలికి ప్ర‌ధాని అధ్యక్షుడుగా ఉంటారు.
  • విదేశాంగ విధాన రూపకల్పనలో ప్రముఖ పాత్ర వహిస్తారు.
  • ఆయన కేంద్ర ప్రభుత్వ ముఖ్య వాచక ప్రతినిధి.
  • అత్యవసర పరిస్థితులలో ఆపదలను తొలగించడానికి కృషి చేస్తారు.
  • జాతీయ నాయకుడుగా అనేక రాష్ట్రాలలోని ప్రజలను కలుసుకొని వారి సమస్యల గురించి విజ్ఞాపనలు అందుకుంటారు.
  • అధికార పార్టీ నాయకుడు.
  • సేవలను అందించటానికి రాజకీయ అధినేతగా వ్యవహరిస్తారు.

ఈ విధంగా దేశ వ్యవస్థలోని రాజకీయ పరిపాలన రంగాల్లో ప్రధాని ఎంతో ప్రముఖమైన పాత్ర పోషిస్తారు. బి.ఆర్.అంబేద్కర్ ఇలా అన్నారు.. మన రాజ్యాంగంలో ఎవ‌రినైనా అమెరికా అధ్య‌క్షుడితో పోల్చ‌వ‌లిసి వ‌స్తే అతడు ప్రధానే కానీ రాష్ట్రపతి కాడు అన్నారు.

రాష్ట్రపతితో బాంధవ్యము

ఈ క్రింది రాజ్యాంగ అంశాలు రాష్ట్రపతికి, ప్రధాన మంత్రికి గల బాంధవ్యాన్ని తెలియపరుస్తాయి.

  • 74వ ప్రకరణ – రాష్ట్రపతికి సహాయ పడటానికి, స‌లహా ఇవ్వడానికి ప్రధాని అధ్యక్షతన మంత్రి మండలి ఉండాలి. రాష్ట్రపతి దాని సలహాలని అనుసరించి విధులను నిర్వర్తించాలి. మంత్రిమండ‌లి సలహాలను పున:పరిశీలించాల‌ని రాష్ట్ర‌ప‌తి కోరవచ్చు. రాష్ట్రపతి సూచన మేరకు మంత్రిమండలి పున: పరిశీలించాక పంపిన స‌ల‌హాల‌ను రాష్ట్రపతి ఆమోదించి తీరాలి.
  • 75వ ప్రకరణ – (a). ప్రధానిని రాష్ట్రపతి నియ మిస్తారు. ప్రధాని సలహా మేరకు రాష్ట్రపతి ఇతర మంత్రులను నియమిస్తారు. రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం మంత్రులు తమ పదవులను కలిగి ఉంటారు. కేంద్ర మంత్రి మండలి లోక్ సభకు సమిష్టి బాధ్యత వహించాలి.
  • 78వ ప్రకరణ – ప్రధాన మంత్రి కర్తవ్యాలు ఏమంటే
    • కేంద్రం వ్యవహారాల్లో పరిపాలనకు సంబంధించిన మంత్రి మండలి తీర్మానాలను, శాసన నిర్మాణ ప్రతిపాదనలను రాష్ట్రపతికి తెలపడం
    • రాష్ట్రపతి తనంతటతాను కోరే కేంద్ర వ్యవహారాల పరిపాలనకు, శాసన నిర్మాణ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారాలని ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి తెల‌ప‌డం
    • ఏదైనా విషయాన్ని ఒక మంత్రి నిర్ణయించి మంత్రి మండలి పరిశీలించక‌పోతే మంత్రి మండలి పరి శీలనకు సమర్పించవలసిందిగా రాష్ట్రపతి కోరిన‌ప్పుడు ఆ విష‌యాన్నిమంత్రి మండలికి సమర్పించ‌డం.

పాలిటీ టెర్మినాలజీ

 1. ఆయారామ్‌, గయారామ్‌ : పార్టీ ఫిరాయింపులు జరిపే వారికి ముద్దుపేరు. వీరిరువురూ హర్యానాలో 1967-68లో తరచూ పార్టీలు మారడం వల్ల ఆ విధంగా పిలుస్తున్నారు.


2. ఫ్లోర్‌క్రాసింగ్‌ : ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు అధికార పక్షంలోకి మారడం.


3. కోరమ్‌ : సభ జరగడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య. భారతదేశ చట్ట సభలలో కోరమ్‌ 1/10వ వంతుగా నిర్ణయించారు. ఉదా : లోక్‌సభలో కోరమ్‌ 55 మంది సభ్యులుకాగా, రాజ్యసభలో 25 మంది సభ్యులు.


4. లేమ్‌డక్‌ సెషన్‌ : బ్రిటన్‌ సామాన్యుల సభ (హైస్‌ ఆఫ్‌ కామన్స్‌) ఎన్నికలు జరిగిన తరువాత అంతకుముందు సభసభ్యులుగా ఉండి ప్రస్తుత సభకు ఎన్నిక కానివారిని, నూతనంగా ఎన్నికైన సభ్యులను కలిపి చిట్టచివరి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిని లేమ్‌డక్‌ సెషన్‌ అంటారు. ఈ విధానం భారతదేశంలో అమలులో లేదు.


5. విజేతృభాగ నిర్ణయ పద్ధతి : ఈ పద్ధతి అమెరికాలో అమలులో ఉండేది. ఎన్నికలలో గెలిచిన పార్టీ తన మద్దతుదారులను ప్రభుత్వ ఉద్యోగాలలో నియమించడాన్ని విజేతృభాగ నిర్ణయ పద్ధతి అంటారు. 1828లో ఆండ్రూజాక్సన్‌ అనే అమెరికా అధ్యక్షుడు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1887లో ఉడ్రోవిల్సన్‌ ఈ పద్ధతిని రద్దు చేశారు.


6. అధికార పృథక్కరణ సిద్ధాంతం : ఈ సిద్ధాంతాన్ని మాంటెస్క్యూ ప్రతిపాదించాడు. ప్రభుత్వ అంగాలైన కార్యనిర్వాహక వర్గం, శాసననిర్మాణశాఖ, న్యాయశాఖల మధ్య సంబంధాన్ని ఈ సిద్ధాంతం వివరిస్తుంది.


7. నిరోధ సమతౌల్యాలు (చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌) : అమెరికా రాజ్యాంగం ఈ సిద్ధాంతంపై ఆధారపడింది. ప్రభుత్వ అంగాలు మూడు ఒకదానిని మరొకటి నిరోధించుకుంటూ సమతుల్యంతో పనిచేస్తాయి.


8. షాడో క్యాబినెట్‌ : బ్రిటన్‌ దేశంలో అమలులో ఉన్నది. బ్రిటన్‌లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కూడా ఒక ఛాయా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసి మంత్రిత్వ శాఖలను తన సభ్యులకు అప్పగిస్తుంది. ఆయా శాఖలలో వారు అనుభవం పొందుతారు.


9. హంగ్‌ పార్లమెంట్‌ : లోక్‌సభ సాధారణ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాని పరిస్థితిని హంగ్‌ పార్లమెంట్‌ అంటారు.


10. రీ కాల్‌ : స్విట్జర్లాండ్‌లో అమలులో ఉన్న ప్రత్యక్ష ప్రజాస్వామ్య పద్ధతులలో ఇది ఒకటి. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సక్రమంగా పనిచేయని పక్షంలో ప్రజలు వారిని వెనుకకు పిలుస్తారు.


11. న్యాయ సమీక్షాధికారం : కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణశాఖ రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే (అల్ట్రావైరెస్‌) అవి చెల్లవు (నల్‌ అండ్‌ వాయిడ్‌) అని న్యాయవ్యవస్థ ప్రకటించడం. 1803లో మాడిసన్‌ వార్సెస్‌ మార్బురీ కేసులో అమెరికన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్‌ మార్షల్‌ న్యాయసమీక్షాధికారాన్ని ప్రకటించాడు.


12. శ్వేతపత్రం : ప్రభుత్వం ఒక విషయానికి సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా, అధికారపూర్వకంగా ప్రకటించే పత్రాలు.


13. ఫోర్త్‌ ఎస్టేట్‌ : పత్రికా రంగాన్ని, మీడియాను ఫోర్త్‌ ఎస్టేట్‌గా వ్యవహరిస్తారు. బ్రిటిష్‌ పార్లమెంట్‌సభ్యుడు ఎడ్‌బర్గ్‌ మొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించాడు.


14. ఫిప్త్‌ ఎస్టేట్‌ : ఇటీవల కాలంలో 'సోషల్‌ మీడియాను' ఫిఫ్త్‌ ఎస్టేట్‌గా వ్యవహరిస్తున్నారు.


15. సుమోటో : న్యాయవ్యవస్థ తనంతట తానుగా, స్వయం ప్రేరితంగా, పిటిషన్‌ అవసరం లేకుండా ఒక అంశాన్ని విచారణకు స్వీకరించడం.


16. గెర్రిమాండరింగ్‌ : నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణను తమకు అనుకూలంగా అధికారంలో ఉన్న పార్టీ చేపట్టడాన్ని గెర్రిమాండరింగ్‌ అంటారు.


17. ఫిల్‌బస్టరింగ్‌ : శాసనభలు, చట్టసభలు సమావేశాలు సరిగా జరగకుండా ఉండటానికి సభ్యులు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చేయడం, అమెరికాలో ఫిల్‌బస్టరింగ్‌ అనే సెనేటర్‌ ఈ పద్ధతిని ఉపయోగించాడు. 


18. వాయిదా తీర్మానం (ఎడ్‌జర్న్‌మెంట్‌ మోషన్‌) : అత్యవసర ప్రజాసంబంధిత విషయంపై చర్చించడానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుంది. సభ్యుడు ఈ తీర్మానం ప్రవేశపెట్టదలిస్తే స్పీకర్‌కు ఆరోజు ఉదయం 10 గంటలులోగా లిఖితపూర్వక తీర్మానాన్ని అందజేయాలి. దీనికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం.


19. అడ్వకేట్‌ జనరల్‌ : రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారుడుని. 167వ నిబంధన ప్రకారం గవర్నర్‌చేత నియమిస్తారు.


20. అటార్నీ జనరల్‌ : భారత ప్రభుత్వ ప్రథమ న్యాయ సలహాదారుడు. 76వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ద్వారా నియమిస్తారు.


21. కొలీజియం : న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సులు చేయడానికి భారతదేశంలో కొలీజియం ఏర్పడింది. దీనిలో ప్రధాన న్యాయమూర్తి, నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులు ఉంటారు.


22. వార్షిక ఆర్థిక పట్టిక (యాన్యువల్‌ ఫైనార్షియల్‌ స్టేట్‌మెంట్‌) : భారతదేశంలో రాజ్యాంగంలో 112వ నిబంధన ప్రకారం బడ్జెట్‌ను వార్షిక ఆర్థిక పట్టిక అని పిలుస్తారు. 


23. ఉపకల్పనా బిల్లు (అప్రాప్రియేషన్‌ బిల్‌) : బడ్జెట్‌పై చర్చ సందర్భంలో వివిధ శాఖలన్నీ చేసిన గ్రాంట్ల కోసం డిమాండ్స్‌, అన్నింటికీ కలిపి ఉపకల్పనా బిల్లుగా ప్రతిపాదిస్తారు.


24. సంకీర్ణం (కొయాలియేషన్‌) : ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రానప్పుడు భిన్నమైన పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.


25. సమిష్టి బాధ్యత : పార్లమెంటరీ విధానంలో మంత్రిమండలి సమిష్టిగాను, వ్యక్తిగతంగానూ ప్రజలు ఎన్నుకున్న సభకు బాధ్యత వహించాలి.


26. సంఘటిత నిధి : భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలన్నింటినీ 266వ నిబంధన ప్రకారం ఏర్పడిన సంఘటిత నిధికి జమ కడతారు.


27. ఆగంతక నిధి : ఊహించని వ్యయాలను భరించడానికి రాష్ట్రపతి అధీనంలో 267వ నిబంధన ప్రకారం ఆగంతక నిధిని ఏర్పాటు చేశారు.


28. కోత తీర్మానం : పార్లమెంటరీ విధానంలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సభ్యులు బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరసన తెలపడానికి కోత తీర్మానాలు ప్రతిపాదించవచ్చు.


29. అత్యవసర పరిస్థితి : రాజ్యాంగంలో 352వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆంతరంగిక, బాహ్య అత్యవసర పరిస్థితిని విధించవచ్చు.


30. రాష్ట్రపతిపాలన : రాజ్యాంగంలో 356వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఇప్పటికి సుమారు 125 సార్లు విధించారు.


31. ఆర్థిక అత్యవసర పరిస్థితి : దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు రాష్ట్రపతి దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని 360వ నిబంధన ప్రకారం విధించవచ్చు. ఇప్పటివరకూ విధించలేదు.


32. ఆర్థిక బిల్లు : బడ్జెట్‌ ఆమోదించే చివరి దశలో ఆర్థికమంత్రి పన్నుల ప్రతిపాదనలన్నింటినీ కలిపి ఆర్థిక బిల్లుగా ప్రతిపాదిస్తాడు.


33. ఆర్థిక సంఘం : కేంద్ర, రాష్ట్రాల మధ్య వనరుల పంపిణీ కోసం రాష్ట్రపతి 280వ నిబంధన ప్రకారం ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు.


34. గిలిటెనింగ్‌ : బడ్జెట్‌పై చర్చ సందర్భంగా గ్రాంట్ల కోసం డిమాండ్‌ చర్చ జరుగుతున్నప్పుడు, కేటాయించిన సమయం అయిపోయిన తర్వాత, మిగిలిపోయిన డిమాండ్లనన్నింటినీ ఆమోదం పొందినట్లు స్పీకర్‌ ప్రకటించడాన్ని గిలిటెనింగ్‌ అంటారు.


35. హెబియస్‌ కార్పస్‌ : అక్రమంగా నిర్బంధించిన వ్యక్తిని న్యాయస్థానంలో హాజరుపరచమని సుప్రీంకోర్టు 32వ నిబంధన ప్రకారం, హైకోర్టు 226వ నిబంధన ప్రకారం జారీ చేసే రిట్‌.


36. అంతర్‌రాష్ట్ర మండలి : కేంద్ర-రాష్ట్ర వివాదాలు, అంతర్‌రాష్ట్ర వివాదాల పరిష్కారానికి 263వ నిబంధన ప్రకారం ఏర్పడినది.


37. ఆర్డినెన్స్‌ : పార్లమెంట్‌ సమావేశాలలో లేనప్పుడు అత్యవసర విషయాలపై రాష్ట్రపతి ద్వారా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేయిస్తుంది.


38. నిర్ణాయకపు ఓటు : ఒక బిల్లుపై అధికారపక్షానికి, ప్రతిపక్షానికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్‌ నిర్ణాయకపు ఓటును వినియోగించవచ్చు.


39. జీరో అవర్‌ : ప్రశ్నోత్తరాల సమయం తరువాత సభాకార్యక్రమాలు మొదలయ్యే ముందు కాలాన్ని జీరో అవర్‌ అంటారు. 1962 నుంచి భారత పార్లమెంట్‌లో ఈ పద్ధతి అమలులో ఉంది. ఈ సమయంలో ముందస్తు నోటీసు లేకుండా ఏ అంశంపైనైనా వివరణ కోరవచ్చు.


40. ఎడ్‌జర్న్‌సైన్‌డై (నిరవధిక వాయిదా) : లోక్‌సభ సమావేశాలు నిర్ణయించిన కాల వ్యవధిలో పూర్తి అయిన తరువాత స్పీకర్‌ సభను నివరధిక వాయిదా వేస్తాడు.


41. ప్రోరోగ్‌ : సభ సమావేశాలను ముగింపు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేయడాన్ని ప్రోరోగ్‌ అంటారు.


42. ఆపద్ధర్మ ప్రభుత్వం : అధికారంలో ఉన్న ప్రభుత్వం రాజీనామా చేసినప్పుడు ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకూ కొనసాగే ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వం అంటారు.


43. పృథకరించు సిద్ధాంతం (డాక్ట్రిన్‌ ఆఫ్‌ సెవెరబిలిటీ) : ఒక చట్టంలోని కొన్ని నిబంధనలు రాజ్యాంగానికి భంగకరమని న్యాయస్థానం ప్రకటించినప్పుడు, ఆ నిబంధనలను రాజ్యాంగ అనుకూల నిబంధనల నుంచి వేరు చేసి, భంగకర నిబంధనలు చెల్లవు, రాజ్యాంగ అనుకూల నిబంధనలు చెల్లుతాయి అని ప్రకటించడం.


44. గ్రహణ సిద్ధాంతం (డాక్ట్రిన్‌ ఆఫ్‌ ఎక్లిప్స్‌) : రాజ్యాంగం అమలులోకి రాకముందు అమలులో ఉన్న చట్టాలు, రాజ్యాంగం 'అమలులోకి వచ్చిన తరువాత రాజ్యాంగ విరుద్ధంగా భావిస్తే, ఆ చట్టాలు చెల్లుబాటు విషయంలో సుప్రీంకోర్టు ఈ సూత్రాన్ని వినియోగిస్తుంది.


45. సమన్యాయ పాలన (రూల్‌ ఆఫ్‌ లా) : ఈ సూత్రాన్ని బ్రిటన్‌ నుంచి గ్రహించారు. దీని ప్రకారం చట్టం ముందు పౌరులందరూ సమానులే.


46. ఉభయసభల సంయుక్త సమావేశం : రాజ్యాంగంలో 108వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అవసరమైనప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తాడు.


47. అవశిష్టాధికారాలు : కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలలో చేరని అధికారాలను అవశిష్టాధికారాలు అంటారు. భారతదేశంలో ఇవి కేంద్రానికి కలవు.


48. పిత్‌ అండ్‌ సబ్‌స్టెన్స్‌ (డాక్ట్రిన్‌ ఆఫ్‌ పిత్‌ అండ్‌ సబ్‌స్టెన్స్‌) : అధికార విభజన జరిగినప్పుడు ఒక జాబితాలో పొందుపరిచిన అంశం, మరొక జాబితాలో పొందుపరచిన అంశంతో కొంత మేరకు అతిక్రమం జరగవచ్చు. అలా జరిగినప్పటికీ ఆ చట్టాలను రద్దు చేయరు. దీనిని పిత్‌ అండ్‌ సబ్‌స్టెన్స్‌ అంటారు.


49. గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (జిఎస్‌టి) : భారత ప్రభుత్వం వస్తువులపై 'ఒక జాతి - ఒకే పన్ను' నినాదంతో గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ను 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టి 279-ఎ నిబంధనను రాజ్యాంగంలో చేర్చినది. దీని ప్రకారం పన్నుల వ్యవస్థను నిర్ణయించడానికి ఆర్థికమంత్రి ఆధ్వర్యంలో జిఎస్‌టి కౌన్సిల్‌ ఏర్పడింది.

భారత పార్లమెంట్ ఉమ్మడి సమావేశం

 

          భారత పార్లమెంట్ ద్విసభ్యమైనది. ఏదైనా బిల్లును ఆమోదించడానికి రెండు సభల సమ్మతి అవసరం. ఏదేమైనా, భారత రాజ్యాంగాన్ని రూపొందించినవారు రాజ్యసభ ఎగువ సభకు మరియు దిగువ సభకు అంటే లోక్సభకు మధ్య ప్రతిష్టంభన పరిస్థితులను ఊహించారు. అందువల్ల, భారత రాజ్యాంగం ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి ఉభయ సభల సంయుక్త సమావేశాలకు అవకాశం కల్పిస్తుంది. 

         పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి (ఆర్టికల్ 108) పిలుస్తారు మరియు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు లేదా ఆయన లేనప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్ లేదా ఆయన లేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. పై అధికారులు ఎవరైనా లేనట్లయితే, పార్లమెంటులోని ఏ ఇతర సభ్యుడు సభ యొక్క ఏకాభిప్రాయంతో అధ్యక్షత వహించవచ్చు.

రాజ్యాంగ నిబంధనలు : రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం, కింది పరిస్థితులలో పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని పిలుస్తారు.

ఒక బిల్లును ఒక సభ ఆమోదించిన తరువాత మరియు మరొక సభకు సమర్పించిన తరువాత

(ఎ) బిల్లును ఇతర సభ తిరస్కరించింది; లేదా (బి) బిల్లులో చేయాల్సిన సవరణలకు చివరకు విభేదించాయి; లేదా (సి) బిల్లును ఆమోదించకుండా ఇతర సభ ద్వారా బిల్లును స్వీకరించిన తేదీ నుండి ఆరునెలల కన్నా ఎక్కువ కాలం గడిచినా, రాష్ట్రపతి, ప్రజల సభ రద్దు కారణంగా బిల్లు ముగియకపోతే తప్ప

పై షరతులు సంతృప్తికరంగా ఉంటే, భారత రాష్ట్రపతి పార్లమెంటు ఉభయ సభల ఉమ్మడి సిట్టింగ్‌ను పిలవవచ్చు.

ఉమ్మడి సిట్టింగ్లకు మినహాయింపు : అన్ని బిల్లులను పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి సూచించలేము. రెండు మినహాయింపులు ఉన్నాయి:

1. డబ్బు బిల్లు : భారత రాజ్యాంగం ప్రకారం, డబ్బు బిల్లులకు లోక్సభ ఆమోదం మాత్రమే అవసరం. లోక్సభకు రాజ్యసభ సిఫార్సులు చేయవచ్చు, దానిని అంగీకరించాల్సిన అవసరం లేదు. రాజ్యసభ 14 రోజుల్లోపు డబ్బు బిల్లును ఆమోదించకపోయినా, పైన పేర్కొన్న కాలం ముగిసిన తరువాత పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించినట్లు భావిస్తారు. అందువల్ల, ఉమ్మడి సమావేశాన్ని పిలవవలసిన అవసరం డబ్బు బిల్లు విషయంలో ఎప్పుడూ తలెత్తదు.

2. రాజ్యాంగ సవరణ బిల్లు : భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగాన్ని పార్లమెంటు ఉభయ సభలు 2/3 మెజారిటీ (ప్రత్యేక మెజారిటీ) ద్వారా సవరించవచ్చు. ఉభయ సభల మధ్య విభేదాలు ఏర్పడితే, పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని పిలిచే నిబంధన లేదు.

ఇప్పటివరకు ఉమ్మడి సెషన్‌కు సూచించే బిల్లులు : భారత పార్లమెంటు ఉమ్మడి సమావేశానికి 4 బిల్లులు మాత్రమే పిలవబడ్డాయి, అంటే వరకట్న నిషేధ చట్టం- 1961, బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ చట్టం- 1977, పోటా- 2002, మహిళా ప్రాతినిధ్య బిల్లు -2008 (బిల్ పనిచేయనిది) ..

జాయింట్ సెషన్‌లో ఆమోదించిన బిల్లులు

  • వరకట్న నిషేధ బిల్లు, 1961
  • బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ (రిపీల్) బిల్లు, 1978
  • ఉగ్రవాద నిరోధక బిల్లు, 2002
  • మహిళా ప్రాతినిధ్యానికి బిల్లు -2008 (బిల్ పనిచేయనిది)

జాతీయ మహిళా కమిషన్‌ - నిర్మాణం - అధికారాలు - విధులు

 

జాతీయ మహిళా కమిషన్‌ - నిర్మాణం - అధికారాలు - విధులు

        జాతీయ మహిళా కమిషన్‌ జనవరి 31, 1992న ''జాతీయ మహిళా కమిషన్‌ చట్టం - 1990'' ప్రకారం ఏర్పడింది. ఇది శాసనబద్ధమైన సంస్థ,  రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు. రాజ్యాంగ పరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పర్యవేక్షించడం దీని ప్రధాన లక్ష్యం. భారత ప్రభుత్వానికి మహిళా సంక్షేమానికి చేయాల్సిన శాసనాలకు సంబంధించి సూచనలు ఇస్తుంది. జాతీయ మహిళా కమిషన్‌ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.

నిర్మాణం : జాతీయ మహిళా కమిషన్‌ బహుళ సభ్య సంఘం. ఇందులో ఒక ఛైర్‌పర్సన్‌, ఐదుగురు సభ్యులు, ఒక సభ్య కార్యదర్శి ఉంటారు. ఛైర్‌పర్సన్‌, సభ్యులకు మహిళా సమస్యలపై, న్యాయశాస్త్రంలోగాని, కార్మిక సామర్థ్య నిర్వహణలోగాని, మహిళా సాధికారికతపై గాని పూర్తిగా అవగాహన ఉండాలి. కమిషన్‌లో ఒకరు షెడ్యూల్డ్‌ కులాలకు, మరొకరు షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన వారు ఉండాలి. వీరందరినీ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ప్రస్తుత జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ .
పదవీకాలం : ఛైర్‌పర్సన్‌, సభ్యుల పదవీకాలం మూడు సంవత్సరాలు. వీరు పదవీకాలం కంటే ముందే రాజీనామా చేయదలిస్తే రాజీనామా పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికే ఇవ్వాలి. ఒకవేళ వీరు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు లేదా అసమర్థులుగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వీరిని తొలగిస్తుంది.
అధికారాలు - విధులు : జాతీయ మహిళా కమిషన్‌ చట్టం ఈ కమిషన్‌కు విస్తృతమైన అధికారాలు కల్పించింది. అవి...
ఎ. రాజ్యాంగపరంగా, చట్టపరంగా, ప్రభుత్వ పరంగా మహిళలకు కల్పించిన రక్షణల అమలును పరీక్షించి పర్యవేక్షించడం. 
బి. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా వారికి సంబంధించిన రాజ్యాంగ రక్షణలు సమర్థవంతంగా అమలయ్యే విధంగా సూచనలు, సలహాలు ఇవ్వడం.
సి. రాజ్యాంగపరంగా మహిళా సంక్షేమ సంబంధిత అంశాలను సమీక్షించి, చేయవలసిన సంవరణను సూచించడం.
డి. మహిళల హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు, మహిళల అభివృద్ధికి సంబంధించిన చట్టాలు అమలుకాని సందర్భంలో మహిళా సమస్యలు పరిష్కరించే ప్రయత్నంలో ఈ కమిషన్‌ తనంత తానుగా (సుమోటో) జోక్యం చేసుకుని కేసును స్వీకరించి పరిష్కరిస్తుంది.
ఇ. మహిళల సాంఘిక ఆర్థిక అభివృద్ధికి చేయాల్సిన ప్రణాళికలకు సంబంధించి సలహాలిస్తుంది.
ఎఫ్‌. పరివారిక్‌ మహిళా లోక్‌ అదాలత్‌ల ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయడం. వరకట్న నిషేధ చట్టం- 1961ను సమీక్షించి వివాహ, ఆస్తి తగాదాల కేసులను పరిష్కరించడం. సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించి మహిళా సమస్యల పట్ల సమాజంలో అవగాహన కల్పించడం.
జి. జైళ్లను లేదా ఇతర నిర్బంధ కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ నిర్బంధంలో ఉన్న వారికి కనీస సౌకర్యాలు కల్పన గురించి అధికారులకు అవసరమైన మార్గదర్శకాలను ఇస్తుంది.
జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్లు

  • 1. జయంతీ పట్నాయక్‌ - 1992 - 1995
  • 2. మోహినీగిరి - 1995 - 1998
  • 3. విభాపార్థసారథి - 1998 - 2002
  • 4. పూర్ణిమా అద్వానీ - 2002 - 2005
  • 5. గిరిజా వ్యాస్‌ - 2005 - 2011
  • 6. మమతా శర్మ - 2011 - 2014
  • 7. లలితా కుమార మంగళం - 2014 - 2017 
  • 8. ప్రస్తుతం ఆగష్టు 7,2018 నుండి   రేఖా శర్మ కొనసాగుతున్నారు .

పార్ల‌మెంట‌రీ క‌మిటీలు

 

  • రోజు రోజుకూ శాసనాల సంఖ్య పెరగడం, శాసనాల రూపకల్పనలో సాంకేతికత పెరగడం, ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ వ్యయ పరిమాణం లాంటి అంశాలన్నీ పార్లమెంటుకున్న విలువైన కాలంపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ఆధునిక కాలంలో శాసనాల రూపకల్పనలో ఈ కమిటీల పాత్ర కీలకమైంది.
  • పార్లమెంటు తరఫున నిపుణులు, సమర్థులైన కొంత మంది సభ్యులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా పరిపాలనపై నిరంతర నియంత్రణ కొనసాగిస్తారు.
  • భారత రాజ్యాంగంలో పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను ఏర్పరచలేదు. కానీ ఆర్టికల్ 88, 105లలో వీటి పరోక్ష ప్రస్తావన ఉంది.

వ్యాఖ్యానాలు

  • ‘ఆధునిక కాలంలో శాసన వ్యవస్థకు పార్లమెంటరీ కమిటీలు కళ్లు, చేతులు, చెవులుగా; కొన్నిసార్లు మెదడుగా కూడా పనిచేస్తున్నాయి’ – థామస్ రీడ్
  • ‘శాసనాల సామర్థ్యం, విలువలు పార్లమెంటరీ కమిటీల పనితీరుపై ఆధారపడి ఉంటాయి’. – మారిస్ జోన్స్
  • ‘ఆధునిక కాలంలో శాసన కమిటీలు మినీ శాసన వ్యవస్థలుగా అవతరించాయి’ – ఉడ్రో విల్సన్.

కమిటీల లక్షణాలు

  • పార్లమెంటరీ కమిటీలకు పుట్టినిల్లు బ్రిటన్.
  • మంత్రులు కమిటీల్లో సభ్యులుగా ఉండకూడదు.
  • కమిటీ తన నివేదికను స్పీకర్ లేదా ఛైర్మన్‌కు సమర్పిస్తుంది.
  • స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్‌లు ఏ కమిటీలో సభ్యులుగా ఉంటారో వారే ఆ కమిటీలకు ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తారు.
  • కమిటీ సమావేశాల నిర్వహణకు కావల్సిన కనీస సభ్యుల సంఖ్య (కోరం) 1/3వ వంతు.
  • సంయుక్త పార్లమెంటరీ కమిటీల ఛైర్మన్లను లోక్‌సభ స్పీకర్ నియమిస్తారు.
  • కమిటీల్లోని సభ్యుల పదవీకాలం ఒక సంవత్సరం.
  • సంయుక్త పార్లమెంటరీ కమిటీల్లోని సభ్యుల సంఖ్య లోక్‌సభ, రాజ్యసభల నుంచి 2 : 1 పద్ధతిలో ఉంటుంది.
  • 1997లో రాజ్యసభ నుంచి, 2004లో లోక్‌సభ నుంచి నైతిక విలువల కమిటీలు ఏర్పడి పని చేస్తున్నాయి.

కమిటీలు 2 రకాలు

  • స్థాయి కమిటీలు (Standing Committees)
  • తాత్కాలిక కమిటీలు (Adhoc Committees)

స్థాయి కమిటీలు

  • ఇవి ప్రతి సంవత్సరం లేదా సమయానుకూలంగా ఆయా సభల ద్వారా ఎన్నికై నిరంతరంగా పని చేస్తుంటాయి. ఈ కమిటీల్లో సభ్యులు మాత్రం మారుతూ ఉంటారు.

తాత్కాలిక కమిటీలు

  • అవసరాన్ని బట్టి ఆయా సందర్భాల్లో ఏర్పాటు చేస్తారు. ఆయా సభల తీర్మానాల ద్వారా వీటిని సభాధ్యక్షులు ఏర్పాటు చేస్తారు. ఇవి తమ నివేదికలను సమర్పించగానే రద్దు అవుతాయి.

కీలకమైన పార్లమెంటరీ కమిటీలు

ప్రభుత్వ ఖాతాల సంఘం (Public Accounts Committee)

  • ఇది పార్లమెంటరీ కమిటీల్లో ప్రాచీనమైంది.
  • దీన్ని 1919 మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం సిఫారసుల మేరకు 1921లో ఏర్పాటు చేశారు.
  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 22. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఈ కమిటీ ఛైర్మన్‌ను స్పీకర్ నియమిస్తారు. కమిటీ తన నివేదికను స్పీకర్‌కు సమర్పిస్తుంది.
  • 1967 నుంచి ఈ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపక్షాలకు చెందినవారిని నియమించడం ఒక సంప్రదాయంగా మారింది.

ప్రభుత్వ ఖాతాల సంఘం విధులు

  • కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను పరిశీలించడం.
  • పార్లమెంటు ఆమోదించిన ఉపకల్పన బిల్లును అనుసరించి ప్రభుత్వ వ్యయం ఉందో, లేదో పరిశీలించడం.
  • ఖాతాల్లో చూపిన వ్యయం చట్టబద్ధంగా ఉద్దేశించిన అంశాల కోసం ఖర్చుపెట్టారా లేదా అని పరిశీలించడం.
  • కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ప్రభుత్వ ఖాతాల సంఘంకు మిత్రుడిగా, మార్గదర్శిగా, తాత్వికుడిగాను పనిచేస్తుంది.
  • కాగ్ నివేదికను ప్రభుత్వ ఖాతాల సంఘం పరిశీలించి అవకతవకలుంటే బాధ్యులపై చర్యలకోసం సిఫారసు చేస్తుంది.
  • ప్రభుత్వ ఖాతాల సంఘంను ముఖ్యమైన ఆర్థిక కమిటీగా పేర్కొంటారు.

అంచనాల సంఘం (Estimates Committee)

  • జాన్ ముత్తాయ్ కమిటీ సిఫారసుల మేరకు 1950లో అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేశారు.
  • ఈ కమిటీలోని మొత్తం 30 మంది సభ్యులను లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిన ఎన్నుకుంటారు.
  • ఈ కమిటీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
  • ప్రభుత్వం వివిధ శాఖలకు చేసిన కేటాయింపుల్లో పొదుపు పాటించే పద్ధతులను సూచిస్తుంది.
  • దీన్ని నిరంతర పొదుపు కమిటీ అంటారు.
  • పొదుపును పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచించడం.
  • ప్రభుత్వ ఖాతాల సంఘం, అంచనాల సంఘాలను పార్లమెంటు కవలలుగా పేర్కొంటారు.

ప్రభుత్వరంగ సంస్థల సంఘం (Committee on Public Undertakings)

  • ప్రభుత్వరంగ సంస్థలపై పార్లమెంటులో లంకా సుందరం అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వం కృష్ణమీనన్ కమిటీని ఏర్పాటు చేసింది.
  • కృష్ణమీనన్ కమిటీ సిఫారసుల మేరకు 1964లో ‘ప్రభుత్వరంగ సంస్థల సంఘాన్ని’ ఏర్పాటు చేశారు.
  • 1974 వరకు ఈ కమిటీలో 15 మంది సభ్యులు ఉండేవారు.
  • 1974 నుంచి దీనిలోని సభ్యుల సంఖ్యను 22కు పెంచారు. వీరిలో లోక్‌సభ నుంచి 15, రాజ్యసభ నుంచి 7 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • మన దేశంలో ప్రభుత్వరంగ సంస్థలైన BHEL, BALCO, IOC, LIC లాంటివి సమర్థంగా పనిచేయడానికి అవసరమైన సూచనలు చేస్తుంది.
  • ప్రభుత్వరంగ సంస్థల నివేదికను, ఖాతాలను పరిశీలిస్తుంది.
  • ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించి ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’ (CAG) నివేదికను పరిశీలిస్తుంది.
  • ఇది కూడా కీలకమైన ఆర్థిక కమిటీ.

సాధారణ కమిటీలు

సభా వ్యవహారాల కమిటీ (Business Advisory Committee)

  • లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఈ కమిటీలు ఉంటాయి.
  • ఈ కమిటీలకు ఆయా సభాధ్యక్షులే అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.
  • లోక్‌సభ సభా వ్యవహారాల కమిటీలో 15, రాజ్యసభ సభావ్యవహారాల కమిటీలో 11 మంది సభ్యులుంటారు.
  • ఈ కమిటీల్లో సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను సభ్యులుగా ఎంపిక చేస్తారు.
  • సభా వ్యవహారాలను నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడానికి అవసరమైన సలహాలు, సూచనలను అందిస్తూ అందుకు అవసరమైన చర్యలను చేపడుతుంది. ఇది ఎజెండాను తయారు చేస్తుంది.

ప్రభుత్వ హామీల కమిటీ (Committee on Government Assurance)

  • లోక్‌సభ, రాజ్యసభలకు విడివిడిగా ప్రభుత్వ హామీల కమిటీలు ఏర్పాటవుతాయి.
  • లోక్‌సభ కమిటీలో 15, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులుంటారు.
  • ప్రశ్నోత్తరాల సమయంలో బిల్లుల, తీర్మానాల మీద చర్చలు జరిగేటప్పుడు మంత్రులు అనేక రకాల హామీలు ఇస్తుంటారు. ఈ హామీల అమలు లాంటి విషయాలను కమిటీ పరిశీలిస్తుంది.

ప్రైవేట్ అర్జీల బిల్లుల కమిటీ

  • ఇది లోక్‌సభకే ఉద్దేశించిన కమిటీ. ఈ కమిటీలోని సభ్యుల సంఖ్య 15. దీనికి డిప్యూటీ స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రైవేటు బిల్లులకు సంబంధించిన అంశాలను పరిశీలించి, తగిన సిఫారసులు చేయడం ఈ కమిటీ ప్రధాన విధి.

దత్త శాసనాల కమిటీ (Committee on Delegated Legislation)

  • దీన్నే నియోజిత శాసనాల కమిటీ అంటారు.
  • ఈ కమిటీ ఉభయ సభలకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు.
  • ఈ కమిటీని ‘పార్లమెంటు విధుల రక్షణ కర్త’గా జి.వి.మౌలాంకర్ పేర్కొన్నారు.
  • పార్లమెంటు కార్యనిర్వాహక వర్గానికి దత్తత చేసిన శాసనపరమైన అంశాలను, వాటి నిర్మాణంలో ఉన్న చట్టబద్దతను పరిశీలించడం, గతంలో రూపొందించిన చట్టాల సవరణకు సంబంధించిన ఉత్తర్వులను సభకు సమర్పించేందుకు తగిన అవకాశాలు ఉండేలా చూడటం ఈ కమిటీ ప్రధాన విధి.

సభాహక్కుల కమిటీ (Committee on Privilege of Members)

  • ఈ కమిటీలు లోక్‌సభ, రాజ్యసభలకు వేర్వేరుగా ఉంటాయి.
  • లోక్‌సభ కమిటీలో 15 మంది, రాజ్యసభ కమిటీలో 10 మంది సభ్యులు ఉంటారు.
  • ఈ కమిటీ పార్లమెంటు సభ్యుల హక్కులు, హోదాలను పరిరక్షిస్తుంది.
  • దీనికి అర్ధన్యాయ సంబంధమైన (Quasi Judicial) విధులు ఉంటాయి.

షెడ్యూల్డు కులాల, షెడ్యూల్డు తెగల కమిటీ

  • ఈ కమిటీలోని మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షిస్తుంది.
  • జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ల నివేదికలను పరిశీలిస్తుంది.

మహిళా సాధికారతా కమిటీ (Committee on Empowerment of Women)

  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 30. వీరిలో లోక్‌సభ నుంచి 20, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • మహిళలకు రాజ్యాంగం ద్వారా, చట్టబద్ధంగా ప్రభుత్వాలు కల్పించిన అవకాశాల అమలు తీరును పర్యవేక్షించి, తన నివేదికను రూపొందిస్తుంది.
  • మహిళల సమగ్ర ప్రగతి కోసం జాతీయ మహిళా కమిషన్ సమర్పించిన నివేదికలను పరిశీలించి, సిఫారసులు చేస్తుంది.
  • మహిళా సాధికారిత, సమానత్వం కోసం చేపట్టే కార్యకలాపాలను పరిశీలిస్తుంది.
  • ఈ కమిటీని 1997లో ఏర్పాటు చేశారు.

ఎథిక్స్ కమిటీ (Committee on Ethics)

  • ఎథిక్స్ కమిటీ రాజ్యసభలో 1997, లోక్‌సభలో 2004లో ఏర్పడింది.
  • సభలో సభ్యుల ప్రవర్తన, పనితీరు, సభా విలువలు లాంటి అంశాలపై సూచనలు ఇస్తుంది.

జీతభత్యాల కమిటీ

  • దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 15. వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • పార్లమెంటు సభ్యుల జీతభత్యాలకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందిస్తుంది.

లైబ్రరీ కమిటీ

  • ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 9. వీరిలో లోక్‌సభ నుంచి ఆరుగురు, రాజ్యసభ నుంచి ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తారు.
  • పార్లమెంటు సభ్యులకు లైబ్రరీ సదుపాయాల కల్పనపై సిఫారసు చేస్తుంది.

సాధారణ అవసరాల కమిటీ

  • దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15 మంది. స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
  • పార్లమెంటు సభ్యులకు సమావేశాల సందర్భంగా కల్పించాల్సిన వసతుల గురించి ఈ కమిటీ సిఫారసు చేస్తుంది.

లాభదాయక పదవుల కమిటీ (Committee on Office of Profit)

  • దీనిలోని మొత్తం సభ్యుల సంఖ్య 15, వీరిలో లోక్‌సభ నుంచి 10 మంది, రాజ్యసభ నుంచి 5 మంది ప్రాతినిధ్యం వహిస్తారు.
  • లాభదాయక పదవులు, సభ్యుల అనర్హతలు లాంటి అంశాలను పరిశీలిస్తుంది.

డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలు

  • లోక్‌సభ రూల్స్ కమిటీ చేసిన సిఫారసుల మేరకు 1993లో 17 డిపార్ట్‌మెంటల్ స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. 2004లో వీటి సంఖ్యను 24కు పెంచారు. ప్రతి కమిటీలోనూ 31 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 20 మంది లోక్‌సభ, మిగిలిన 11 మంది రాజ్యసభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు.
  • ఈ కమిటీల్లో మంత్రులు సభ్యులుగా ఉండకూడదు. ఈ కమిటీల సభ్యులను ఆయా సభాధ్యక్షులు నామినేట్ చేస్తారు. ఈ కమిటీల పదవీ కాలం ఒక సంవత్సరం.
  • 16 కమిటీలు లోక్‌సభ, 8 కమిటీలు రాజ్యసభ ఆధ్వర్యంలో పనిచేస్తాయి.

జాయింట్ పార్లమెంటరీ కమిటీలు (JPC)

  • సమకాలీన సమస్యలు, ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలను విచారించేందుకు పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన సంయుక్త కమిటీలను ఏర్పాటు చేస్తారు.
  • ఉభయసభల తీర్మానాల ద్వారా లేదా లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్‌ల పరస్పర అవగాహన ద్వారా జేపీసీలను ఏర్పాటు చేయవచ్చు.
  • సుమారు 15 నుంచి 30 మందిని సభ్యులుగా తీసుకోవచ్చు. అధికార పక్ష సభ్యుడికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం ఆనవాయితీగా ఉంది.

ఇప్పటి వరకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీలు

  • బోఫోర్స్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు 1987, ఆగస్టు 6న శంకరానంద్ (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ, తన నివేదికను 1998, ఏప్రిల్ 26న ఇచ్చింది. ఈ నివేదికను ప్రతిపక్షాలు తోసిపుచ్చాయి.
  • స్టాక్ మార్కెట్ కుంభకోణం (హర్షద్ మెహతా కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 1992, ఆగస్టు 6న రాంనివాస్ మిర్థా (కాంగ్రెస్) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 1993, డిసెంబరు 21న సమర్పించింది.
  • స్టాక్ మార్కెట్ కుంభకోణం (కేతన్ పరేఖ్ కుంభకోణం)పై అధ్యయనం చేసేందుకు 2001, ఏప్రిల్ 26న ప్రకాష్‌మణి త్రిపాఠీ (బీజేపీ) అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2002 డిసెంబరు 19న సమర్పించింది.
  • శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలపై అధ్యయనం చేసేందుకు శరద్ పవార్ (ఎన్‌సీపీ) అధ్యక్షతన 2003, ఆగస్టు 8న ఏర్పాటైన ఈ కమిటీ తన నివేదికను 2004, ఫిబ్రవరి 4న సమర్పించింది. శీతల పానీయాల్లో పురుగు మందుల అవశేషాలు ఉండటం నిజమేనని పేర్కొంది. దీని సిఫారసుల మేరకు ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఏర్పడింది.
  • 2G స్పెక్ట్రమ్ కుంభకోణంపై అధ్యయనం చేసేందుకు పి.సి. చాకో (కాంగ్రెస్) అధ్యక్షతన 2011, మార్చి 1న ఏర్పడిన ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య 30 మంది.



మన రాష్ట్రపతులు - ప్రత్యేకతలు

 

1. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ (1884 – 1963)

  • పదవీకాలం: 1950, జనవరి 26 నుంచి 1957 ; 1957, మే 13 నుంచి 1962
  • బాబూ రాజేంద్రప్రసాద్ బిహార్‌కు చెందినవారు.
  • మొదటిసారి కె.టి. షా, రెండోసారి ఎన్.ఎన్. దాస్‌పై గెలుపొంది రెండుసార్లు రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టు న్యాయసలహాను అత్యధికంగా మూడుసార్లు పొందారు.
  • 1962లో భారతరత్న పురస్కారం పొందారు.
  • హిందూ కోడ్ బిల్లు విషయానికి సంబంధించి కేంద్ర మంత్రిమండలితో విభేదించి, పునఃపరిశీలకోసం వెనక్కు పంపారు.
  • ఇండియా డివైడెడ్ అనే గ్రంథాన్ని రాశారు.
  • తొలి హిందీ పత్రికైన దేశ్‌ కు సంపాదకత్వం వహించారు.
  • హిందీని జాతీయ భాషగా రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
  • 1961లో మొదటిసారిగా ఆర్టికల్, 108 ప్రకారం వరకట్న నిషేధ బిల్లు విషయంపై పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
  • అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
  • కేంద్ర మంత్రిమండలి సలహాతో సంబంధం లేకుండా రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని ప్రతిపాదించారు.
  • రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • రెండోసారి జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో (99.4%) గెలుపొందారు.

2. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (1888 – 1975)

  • పదవీకాలం: 1962 మే, 13 నుంచి 1967, మే 12 వరకు
  • తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • సి.హెచ్. హరిరామ్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1954లో భారతరత్న పురస్కారం పొందారు.
  • అమెరికా ప్రభుత్వం ప్రసాదించే ‘టెంపుల్‌టన్’ అవార్డ్ పొందిన తొలి భారతీయుడు.
  • ఉపరాష్ట్రపతిగా వ్యవహరించి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • యునెస్కో ఛైర్మన్‌గా వ్యవహరించారు.
  • ఈయన జన్మదినం సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
  • విద్యావేత్తగా, దౌత్యవేత్తగా, తత్వవేత్తగా పేరొందారు.
  • విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • 8 దేశాల్లో ‘విజిటింగ్ ప్రొఫెసర్‌’గా పనిచేశారు.
  • ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘ప్రజా దర్బార్‌’ను ఏర్పాటు చేశారు.
  • “Hindu View Of Life”, “All Idealist View Of Life”అనే గ్రంథాలను రచించారు.
  • దక్షిణ భారతదేశం నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి.
  • రష్యా అధినేత స్టాలిన్‌ను ఇంటర్వ్యూ చేశారు.
  • 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా అప్పటి రక్షణమంత్రి వి.కె. కృష్ణమీనన్ మితిమీరిన వ్యాఖ్యల ఫలితంగా అతడిని కేంద్రమంత్రి మండలి నుంచి తొలగించే విధంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు.
  • ఉప రాష్ట్రపతి పదవిని రెండుసార్లు మాత్రమే చేపట్టాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • 1962లో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు.

3. డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1897 – 1969)

  • పదవీకాలం: 1967, 13 నుంచి 1969, మే 3
  • జాకీర్ హుస్సేన్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
  • కోకా సుబ్బారావుపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1963లో భారతరత్న పురస్కారం పొందారు.
  • మన దేశానికి తొలి ముస్లిం రాష్ట్రపతి.
  • ఉప రాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
  • అతి తక్కువ కాలం పనిచేసిన రాష్ట్రపతుల్లో మొదటివారు.
  • పదవిలో ఉండగా మరణించిన మొదటి రాష్ట్రపతి.
  • జాకీర్ హుస్సేన్ మరణానంతరం వి.వి. గిరి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించి, రాజీనామా చేయడంతో (1969, మే 4 నుంచి 1969, జులై 20) మనదేశంలో ఏకకాలంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులు ఖాళీ అయ్యాయి.
  • దీని ఫలితంగా అప్పటి సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా 1969, జులై 20 నుంచి 1969, ఆగస్టు 24 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.

4. వి.వి. గిరి (1884 – 1980)

  • పదవీకాలం: 1969, ఆగస్టు 24 నుంచి 1974, ఆగస్టు 24 వరకు
  • వి.వి. గిరి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు.
  • నీలం సంజీవరెడ్డిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • రాజకీయ పార్టీల ప్రతిపాదన లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎన్నికయ్యారు.
  • అతి తక్కువ (50.22%) మెజార్టీతో గెలుపొందారు.
  • రెండో లెక్కింపు అంటే సి.డి. దేశ్‌ముఖ్‌కు చెందిన 2వ ప్రాధాన్యత ఓట్ల బదిలీ ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి.
  • తన ఎన్నిక వివాదం గురించి సుప్రీంకోర్టు విచారణకు స్వయంగా హాజరైన రాష్ట్రపతి.
  • కేంద్ర మంత్రిమండలి పంపిన కార్మిక బిల్లును ఆమోదించకుండా పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • వాయిస్ ఆఫ్ కన్సెషన్ అనే గ్రంథాన్ని రాశారు.
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెరుగుతున్న అవినీతిపై బహిరంగంగా వ్యాఖ్యానించారు.
  • బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు బిల్లులపై ఆమోదముద్ర వేశారు.
  • 1975లో భారతరత్న పురస్కారం పొందారు.
  • ఉప రాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవి చేపట్టిన 3వ వ్యక్తి
  • ఉప రాష్ట్రపతి, తాత్కాలిక రాష్ట్రపతి, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • 1971లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన రెండో రాష్ట్రపతి

5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1905 – 1977)

  • పదవీకాలం: 1974, ఆగస్టు 24 నుంచి 1977, ఫిబ్రవరి 11
  • ఫక్రుద్దీన్ అసోం రాష్ట్రానికి చెందినవారు.
  • టి. చతుర్వేదిపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • దేశానికి రెండో ముస్లిం రాష్ట్రపతి, పదవిలో ఉండగా మరణించిన రెండో రాష్ట్రపతి.
  • ఒక పదవీకాలంలో అత్యధిక ఆర్డినెన్స్‌లను జారీ చేశారు.
  • 1975లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన 3వ రాష్ట్రపతి (ఆంతరంగిక కారణాలతో)
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టారు.
  • ఈయన పాలనాకాలంలోనే రాష్ట్రపతి పదవిని ‘రబ్బర్‌స్టాంప్‌’గా విమర్శకులు పేర్కొన్నారు.
  • ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణానంతరం మహారాష్ట్రకు చెందిన బి.డి. జెట్టి 1977, ఫిబ్రవరి 11 నుంచి 1977, జులై 25 మధ్య తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు.

6. నీలం సంజీవ రెడ్డి (1913 – 1996)

  • పదవీకాలం: 1977, జులై 25 నుంచి 1982, జులై 25
  • నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఏకగ్రీవంగా ఎన్నికైన మొదటి రాష్ట్రపతి
  • 63 ఏళ్ల అతిపిన్న వయసులో రాష్ట్రపతి అయ్యారు.
  • ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, లోక్‌సభకు స్పీకర్‌గా, రాష్ట్రపతిగా వ్యవహరించారు.
  • 1980లో 9 కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేశారు.
  • ఉపరాష్ట్రపతి కాకుండానే రాష్ట్రపతి అయ్యారు.
  • 1979లో చరణ్‌సింగ్ ప్రభుత్వం రాజీనామా అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు బాబూ జగ్జీవన్‌రామ్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా లోక్‌సభను రద్దుచేశారనే విమర్శ ఉంది.
  • లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
  • ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి.
  • రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించే విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాలనే ప్రతిపాదన చేశారు.

7. జ్ఞానీ జైల్‌సింగ్ (1916 – 1994)

  • పదవీకాలం: 1982, జులై 25 నుంచి 1987, జులై 25
  • ఇతడు పంజాబ్ రాష్ట్రానికి చెందినవారు.
  • హెచ్.ఆర్. ఖన్నాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • ముఖ్యమంత్రిగా (పంజాబ్) పనిచేసి, రాష్ట్రపతి అయిన రెండో వ్యక్తి.
  • మనదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి అయ్యారు.
  • బోఫోర్స్ వివాదంపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం నుంచి వివరణ కోరారు.
  • రాజీవ్ గాంధీ ప్రభుత్వం పంపిన పోస్టల్ బిల్లుపై “Pocket Veto”ను వినియోగించారు.
  • వెనుకబడిన తరగతుల నుంచి వచ్చిన రాష్ట్రపతి.
  • 1984లో అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంపై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ అనే సైనిక చర్య ఇతడి కాలంలోనే జరిగింది.
  • రాజీవ్ గాంధీ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధిస్తూ ప్రవేశపెట్టిన పరువునష్టం బిల్లుపై వివరణ కోరారు.
  • ఇందిరా గాంధీ హత్యానంతరం ఎలాంటి పార్లమెంటరీ సంప్రదాయం పాటించకుండానే రాజీవ్ గాంధీని ప్రధానిగా నియమించారనే విమర్శ ఉంది.
  • 1983లో న్యూదిల్లీలో 7వ NAM (Non – Aligned Movements) సదస్సు జరిగింది.

8. ఆర్. వెంకట్రామన్: (1910 – 2009)

  • పదవీకాలం: 1987, జులై 25 నుంచి 1992, జులై 25
  • ఆర్. వెంకట్రామన్ తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • జస్టిస్ వి. కృష్ణయ్యర్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • మై ప్రెసిడెన్షియల్ ఇయర్స్ అనే గ్రంథంలో రాష్ట్రపతి పదవిని ఎమర్జెన్సీ లాంప్‌గా అభివర్ణించారు.
  • అతిపెద్ద వయసులో (76 ఏళ్లు) రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • నెహ్రూ అంతర్జాతీయ శాంతి బహుమతి, ఇందిరా గాంధీ శాంతి బహుమతులను పొందారు.
  • కేంద్ర ఆర్థికమంత్రిగా, రక్షణశాఖా మంత్రిగా పనిచేశారు.
  • ఇతడి కాలంలో నలుగురు ప్రధానులు (రాజీవ్ గాంధీ, వి.పి. సింగ్, చంద్రశేఖర్, పి.వి. నరసింహారావు) పనిచేశారు.
  • పార్లమెంటు సభ్యుల జీతాల పెంపు బిల్లును పునఃపరిశీలనకోసం వెనక్కి పంపారు.
  • 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ శ్రేయస్సు దృష్ట్యా జాతీయ ప్రభుత్వ ఏర్పాటును ప్రతిపాదించారు.
  • మన దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాల ఏర్పాటు ఈయన కాలంలోనే ప్రారంభమైంది.
  • 1989లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాని సందర్భంలో ఏకైక పెద్దపార్టీ నాయకుడిని ప్రధానిగా ఆహ్వానించే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 4వ వ్యక్తి.

9. డాక్టర్ శంకర్‌దయాళ్ శర్మ (1918 – 1999)

  • పదవీకాలం: 1992, జులై 25 నుంచి 1997, జులై 25
  • ఈయన మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.
  • జి.జి. స్వాల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • ముఖ్యమంత్రిగా (మధ్యప్రదేశ్) పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి
  • విదేశీ రాయబారిగా వ్యవహరించి రాష్ట్రపతి పదవిని చేపట్టిన 2వ వ్యక్తి.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి
  • ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వ్యవహరించారు.
  • రాజ్యసభకు రాష్ట్రపతి ద్వారా నియామకం పొందే సభ్యుల విషయంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ సిఫారసును వెనక్కు పంపారు.
  • 1996లో 11వ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి సంపూర్ణ మెజార్టీరాని సందర్భంలో ఏకైక పెద్ద పార్టీ నాయకుడైన వాజ్‌పేయీని ప్రధానిగా నియమించారు.
  • దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును పునఃపరిశీలనకు పంపారు.
  • ‘రాజనీతిజ్ఞ రాష్ట్రపతి’గా పేరుపొందారు.
  • ఎన్నికల ప్రచార సమయాన్ని 21 రోజుల నుంచి 14 రోజులకు తగ్గిస్తూ కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • ఈయన కాలంలోనే 1992, డిసెంబరు 6న బాబ్రీ మసీదు విధ్వంసం జరిగింది.

10. కె.ఆర్. నారాయణన్ (1920-2007)

  • పదవీకాలం: 1997 జులై 25 నుంచి 2002, జులై 25
  • ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు.
  • టి.ఎన్. శేషన్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • తొలి దళిత రాష్ట్రపతి.
  • పార్లమెంటు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకున్న తొలి రాష్ట్రపతి.
  • వరల్డ్ స్టేట్స్‌మన్ అవార్డును పొందిన తొలి దక్షిణాసియా వాసి.
  • విదేశీ రాయబారిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 3వ వ్యక్తి.
  • ఉపరాష్ట్రపతిగా పనిచేసి, రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.
  • ఎమ్.ఎన్. వెంకటాచలయ్య అధ్యక్షతన వాజ్‌పేయీ ప్రభుత్వం రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ను ఏర్పాటు
  • చేయడాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు.
  • గుజరాత్, దేశంలోని అనేక ప్రాంతాల్లో మైనార్టీలపై జరుగుతున్న దాడుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
  • లోక్‌సభకు జరిగిన ఎన్నికల అనంతరం ఏ రాజకీయ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ రాని సందర్భంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు తెలిపేవారు తమ లేఖలను రాష్ట్రపతికి ముందుగా ఇవ్వాలనే సంప్రదాయాన్ని నెలకొల్పారు.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో కల్యాణ్‌సింగ్ ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దు చేయాలని ప్రధాని ఐ.కె.గుజ్రాల్ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని బిహార్‌లో రబ్రీదేవి ప్రభుత్వాన్ని ఆర్టికల్, 356 ప్రకారం రద్దుచేయాలని ప్రధాని వాజ్‌పేయీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ పంపిన తీర్మానాన్ని పునఃపరిశీలన కోసం వెనక్కు పంపారు.
  • అత్యధిక మెజార్టీతో (99.9%) గెలుపొందారు.

11. ఏపీజే అబ్దుల్ కలాం (1931 – 2015)

  • పదవీకాలం: 2002 జులై 25 నుంచి 2007 జులై 25
  • ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు.
  • లక్ష్మీసెహగల్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయ్యారు.
  • ప్రజల రాష్ట్రపతిగా, శాస్త్రజ్ఞ రాష్ట్రపతిగా పేరుపొందారు.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 5వ వ్యక్తి.
  • భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతుల్లో 5వ వ్యక్తి.
  • భారతీయ క్షిపణి శాస్త్రవేత్తగా పేరుపొందారు.
  • దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
  • 1998లో రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించిన అణ్వస్త్ర పరీక్షలకు సూత్రధారి.
  • వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే ప్రఖ్యాత గ్రంథాన్ని రాశారు.
  • సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతి.
  • 2002లో ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణలపై కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరారు.
  • 2006లో జోడు పదవుల (లాభదాయక పదవులు) విషయంపై బిల్లును కేంద్ర కేబినెట్ పునఃపరిశీలనకు వెనక్కి పంపారు.
  • డీఆర్‌డీవో డైరెక్టర్‌గా పనిచేశారు.
  • కలాం జన్మదినమైన అక్టోబరు 15న ‘స్టూడెంట్స్ డే’గా నిర్వహిస్తున్నారు.
  • PURA (Providing Urban Eminities in Rural Areas), హైపర్ ప్లాన్‌ల రూపకర్త.
  • కలాం 2015, జులై 27న మరణించారు.

12. ప్రతిభాపాటిల్ (1934)

  • పదవీకాలం: 2007 జులై 25 నుంచి 2012 జులై 25 వరకు
  • ప్రతిభాపాటిల్ మహారాష్ట్రకు చెందినవారు.
  • భైరాన్‌సింగ్ షెకావత్‌పై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • తొలి మహిళా రాష్ట్రపతి.
  • రాజస్థాన్‌కు తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు.
  • రాజ్యసభకు డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
  • సుఖోయ్ యుద్ధ విమానం, టీ – 90 యుద్ధట్యాంకులో ప్రయాణించారు.
  • గుజరాత్ కోకా (GUCOCA) చట్టాన్ని కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు తిరస్కరించారు.
  • ఎన్నికల కమిషనర్ నవీన్ చావ్లాను తొలగించాలని నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్.గోపాలస్వామి చేసిన సిఫారసులను కేంద్రం సలహా మేరకు తిరస్కరించారు.
  • బ్రిటిష్ రాణి (ఎలిజబెత్ మహారాణి) ఆహ్వాన పత్రం అందుకున్న తొలి దేశాధినేత.
  • విదేశీ పర్యటనల కోసం రూ.200 కోట్లు వెచ్చించారనే విమర్శ ఉంది.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 6వ వ్యక్తి.

13. ప్రణబ్ ముఖర్జీ (1935)

  • పదవీకాలం: 2012 జులై 25 నుంచి – 2017 జూలై 25 వరకు
  • ఈయన పశ్చిమ్ బంగాలోని బిర్బం జిల్లా ‘మిరాటి’ గ్రామంలో జన్మించారు.
  • పి.ఎ. సంగ్మాపై గెలుపొంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
  • 1982 – 1984 మధ్య ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు.
  • 1984లో యూరో మనీ మ్యాగజైన్ అత్యుత్తమ ఆర్థిక మంత్రిగా పేర్కొంది.
  • 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డును పొందారు.
  • 2008లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు.
  • 2011లో ‘బెస్ట్ అడ్మినిస్ట్రేటర్’ అవార్డును అందుకున్నారు.
  • ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టకుండానే రాష్ట్రపతి పదవిని చేపట్టిన 7వ వ్యక్తి.
  • 5 సార్లు రాజ్యసభకు, 2 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
  • ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండానే అత్యధిక కాలం లోక్‌సభకు నాయకుడిగా 2004 – 2012 మధ్య వ్యవహరించారు.
  • ఆర్డినెన్స్‌లు జారీ చేసే సంస్కృతిని బహిరంగంగా విమర్శించారు.
  • 1995, జనవరి 1న ఏర్పడిన డబ్ల్యూటీవోలో భారత్ చేరుతున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి హోదాలో భారత్ తరపున సంతకం చేశారు.
  • లోక్‌పాల్ బిల్లు, నిర్భయ బిల్లుపై సంతకాలు చేసి, వాటికి చట్టబద్ధతను కల్పించారు. ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు.

ప్రణబ్‌ముఖర్జీ రచించిన గ్రంథాలు

Advertisement

  • The Dramatic Decade
  • Midterm
  • Off the Track
  • కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర అనే గ్రంథానికి సంపాదకుడిగా వ్యవహరించారు.

14. రామ్‌నాథ్ కోవింద్

  • పదవీ కాలం – 2017 జూలై నుంచి..
  • స్వరాష్ర్టం ఉత్తరప్రదేశ్.
  • రాష్ర్టపతిగా ఎన్నికైన రెండో దళితుడు.
  • రాజ్యసభ సభ్యునిగా, బిహార్ గవర్నర్‌గా చేసి రాష్ర్టపతి అయ్యారు.
  • ఈయన 15వ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా ఎన్నికైన 14వ రాష్ర్టపతి.
  • ఉపరాష్ర్టపతి కాకుండా రాష్ర్టపతి అయిన 8వ వ్యక్తి.
  • ఈయన చేతిలో ఓడిపోయినవారు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్.

రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మహిళలు

  • సుమిత్రాదేవి (1962)
  • మహారాణి గురుచరణ్ కౌర్ (1969)
  • లక్ష్మీ సెహగల్ (2002)
  • ప్రతిభా పాటిల్ (2007)

తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించినవారు

  • వి.వి. గిరి
  • జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
  • బి.డి. జెట్టి

ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతి పదవిని చేపట్టినవారు

  • బాబూ రాజేంద్ర ప్రసాద్
  • ఫక్రుద్దీన్ అలీ అహ్మద్
  • నీలం సంజీవరెడ్డి
  • జ్ఞానీ జైల్‌సింగ్
  • అబ్దుల్ కలాం
  • ప్రతిభా పాటిల్
  • ప్రణబ్ ముఖర్జీ

ఉపరాష్ట్రపతి అయినప్పటికీ రాష్ట్రపతి కానివారు

  • జి.ఎస్ పాఠక్
  • బి.డి. జెట్టి
  • జస్టిస్ హిదయతుల్లా
  • కె. కృష్ణకాంత్
  • భైరాన్‌సింగ్ షెకావత్

ఉపరాష్ట్రపతిగా పనిచేసి రాష్ట్రపతి అయినవారు

  • సర్వేపల్లి రాధకృష్ణన్
  • జాకీర్ హుస్సేన్
  • వి.వి. గిరి
  • ఆర్. వెంకట్రామన్
  • శంకర్ దయాళ్‌శర్మ
  • కె.ఆర్. నారాయణన్

భారతరత్న పురస్కారం పొందిన రాష్ట్రపతులు

  • సర్వేపల్లి రాధాకృష్ణన్ (1954)
  • డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ (1962)
  • డాక్టర్ జాకీర్ హుస్సేన్ (1963)
  • వి.వి. గిరి (1975)
  • ఎ.పి.జె. అబ్దుల్ కలాం( 1997)
Related Posts Plugin for WordPress, Blogger...