టోక్యో ఒలింపిక్స్ - 48వ స్థానంలో భారత్...

         కరోనా సహా అన్ని అవరోధాలను అధిగమించి 2021, జూలై 23 ప్రారంభమైన విశ్వ క్రీడలు 2021, ఆగస్టు 8 ఘనంగా ముగిశాయి.


         టోక్యోలో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 గెలిచిన భారత్ ఒలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో (స్వర్ణాల సంఖ్య ఆధారంగా) భారత్ 48 స్థానంలో నిలిచింది. నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య ప్రకారమైతే భారత్కు 33 స్థానం దక్కింది. అయితే ఒలింపిక్స్లో స్వర్ణాల సంఖ్య ఆధారంగానే ర్యాంక్ను పరిగణనలోకి తీసుకుంటారు.

.

.

 

 

స్వర్ణం - 1

·        జావెలిన్త్రోలో నీరజ్చోప్రా

రజతం - 2

·   మహిళల వెయిట్లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను

·        పురుషుల రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో రవి దహియా

కాంస్యం

·        మహిళల బ్యాడ్మింటన్సింగిల్స్లో పీవీ సింధు

·        మహిళల బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్

·        పురుషుల రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో బజరంగ్పూనియా

·        పురుషుల హాకీ జట్టు

 


పారిస్లో 2024 ఒలింపిక్స్...

        మూడేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఒలింపిక్స్ రానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2024 ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రపంచ ఫ్యాషన్ కేంద్రం పారిస్లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ జరగనుండటం విశేషం. గతంలో రెండుసార్లు నగరం ఒలింపిక్స్కు (1900, 1924) ఆతిథ్యం ఇచ్చింది.



105 రాజ్యాంగ సవరణ

 

 

           జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు లోక్సభ ఆగస్టు 10 ఆమోదం తెలిపింది

         127 రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు ఆగస్టు 18 రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 105 రాజ్యాంగ సవరణ జరిగింది. 105 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 338B మరియు 342A సవరించ బడ్డాయి.

.

.

         జాతీయ బీసీ కమిషన్విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 338బీ, 342, 366 (26సి) అధికరణలను చేర్చింది. మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021, ఏడాది మే 5 కీలకమైన తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని 342 చెబుతోందని, 102 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా తయారు చేసుకునే అవకాశం పోయింది. తీర్పును సమీక్షించాలన్న కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది. ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127 రాజ్యాంగ సవరణ చట్టం తీసుకువచ్చింది.

 

అసిటబులేరియా జ‌ల‌క‌న్య‌కే

 

              భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు కొత్త వృక్ష జాతి మొక్క‌ను కనుగొన్నారు. అండ‌మాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. 2019లో ఆ దీవుల‌కు వెళ్లిన వృక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ఆ మొక్క ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ మెరైన్ గ్రీన్ ఆల్గేకు జ‌ల‌క‌న్య (మెర‌మైడ్) అని పేరు పెట్టారు. తాము క‌నుగొన్న మొక్క కొత్త‌ది అని చెప్పేందుకు వాళ్ల‌కు రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. అయితే ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని క‌నుగొన‌డం గ‌త నాలుగు ద‌శాబ్ధాల్లో ఇదే మొద‌టిద‌న్నారు.

 .

.

             పంజాబ్ సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఆ మొక్క‌కు అసిటబులేరియా జ‌ల‌క‌న్య‌కే అన్న శాస్త్రీయ నామాన్ని పెట్టారు. జ‌ల‌క‌న్య అంటే స‌ముద్ర దేవ‌త‌. కొత్త‌గా గుర్తించిన మొక్క చాలా అద్భుతంగా ఉంద‌ని, చాలా సున్నిత‌మైన డిజైన్‌లో ఆ మొక్క ఉంద‌ని, ఛ‌త్రీల త‌ర‌హాలో ఆ జ‌ల‌క‌న్య క‌నిపిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ ఫెక్లీ బ‌స్త్ తెలిపారు. జ‌ల‌క‌న్య మొక్క ఒకేఒక్క భారీ క‌ణంతో త‌యారైన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

 

 

 

ప్రాథమిక హక్కులు - 1

Indian Polity Quiz

ప్రాథమిక హక్కులు - 1


  • Total number of questions : 10.
  • Each question carry 1 mark, no negative marks.
  • All the best :-).
  • Progress:


    Info:

    Answered

    Unanswered

    During the exam to go for previous and next questions click on And
    Error! You have not answered all of the questions!

    Question:

    {{quiz.activeQuestion+1 + ". " + quiz.dataService.quizQuestions[quiz.activeQuestion].text}}

    {{answer.answer}}

    Are you sure you want to submit your answers?


    Congratulations You Scored

    {{results.quizMetrics.numCorrect}} / {{results.dataService.quizQuestions.length}}

    Total number correct answers:-

    {{results.quizMetrics.numCorrect}}

    Total number of questions:-

    {{results.dataService.quizQuestions.length}}

    {{results.calculatePerc() | number:2}}%


    Questions:

    {{results.activeQuestion+1 +". "+results.dataService.quizQuestions[results.activeQuestion].text}}

    {{answer.answer}}

    Your Answer

    Correct Answer


    Note:-Click On And To check your answer and actual answer

    Results:



    Explanation

    1. అల్ప సంఖ్యాక వర్గాల కోసం చేర్చిన ప్రత్యేక హక్కు ఏది?
    (a) సమానత్వ హక్కు
    (b) పీడనాన్ని నిరోధించే హక్కు
    (c) మత స్వాతంత్య్ర హక్కు
    (d) విద్య, సాంస్కృతిక హక్కు
    Ans: (d)

    2. కిందివాటిలో సరికానిది ఏది?
    (a) అంటరానితనం నిషేధం: అధికరణ - 17
    (b) వెట్టిచాకిరి నిషేధం: అధికరణ - 23
    (c) బలవంతంగా మతమార్పిడి నిషేధం: అధికరణ -29
    (d) బాలకార్మికుల వ్యవస్థ నిషేధం: అధికరణ - 24
    Ans: (c)

    3. హెబియస్ కార్పస్ అనేది ఏ భాషా పదం?
    (a) లాటిన్
    (b) గ్రీకు
    (c) రోమన్
    (d) ఇంగ్లిష్
    Ans: (a)

    4. స్వాతంత్య్ర పోరాట సమయంలో భారతీయులకు సమాన హక్కులు కావాలని కోరిన మొదటి వ్యక్తి ఎవరు?
    (a) బాల గంగాధర తిలక్
    (b) రాజా రామ్మోహన్ రాయ్
    (c) మానవేంద్రనాథ్ రామ్
    (d) దాదాబాయ్ నౌరోజీ
    Ans: (a)

    5. 1931 కరాచీ కాంగ్రెస్ సమావేశంలో హక్కుల తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు?
    (a) జవహర్‌లాల్ నెహ్రూ
    (b) సర్దార్ వల్లభాయ్ పటేల్
    (c) రాజేంద్రప్రసాద్
    (d) జె.బి.కృపలాని
    Ans: (b)

    6. ప్రాథమిక హక్కులను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
    (a) రష్యా
    (b) అమెరికా
    (c) బ్రిటన్
    (d) జపాన్
    Ans: (b)

    7. ప్రాథమిక హక్కుల్లో ఏయే అధికరణల్లోని హక్కులు విదేశీయులకు కూడా వర్తిస్తాయి?
    (a) అధికరణ-14, 17, 19, 20
    (b) అధికరణ-14, 17, 21, 24
    (c) అధికరణ-17, 20, 22, 26
    (d) అధికరణ-20, 21, 31, 32
    Ans: (b)

    8. జాతీయ అత్యవసర కాలంలో రద్దు కాని అధికరణలు ఏవి?
    (a) 25, 26
    (b) 20, 21
    (c) 19, 20
    (d) 17, 18
    Ans: (b)

    9. అధికరణ-19లో ఏ స్వేచ్ఛను పేర్కొనలేదు?
    (a) పత్రికా స్వేచ్ఛ
    (b) భావ ప్రకటన స్వేచ్ఛ
    (c) స్థిర నివాసాన్ని ఏర్పరచుకునే స్వేచ్ఛ
    (d) ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ
    Ans: (d)

    10. కింది వాటిలో సాంప్రదాయిక హక్కు ఏది?
    (a) స్వేచ్ఛ స్వాతంత్య్ర హక్కు
    (b) మత స్వాతంత్య్ర హక్కు
    (c) పీడనాన్ని నిరోధించే హక్కు
    (d) విద్యా, సాంస్కృతిక హక్కు
    Ans: (a)



    Related Posts Plugin for WordPress, Blogger...