ANDHRA PRADESH GRAMA/WARD SACHIVALAYAM RECRUITMENT - 2019


S.No
Name Of The Notifications
Download
1
CLICK HERE
2
CLICK HERE
3
CLICK HERE
4
CLICK HERE
5
CLICK HERE
6
CLICK HERE
7
CLICK HERE
8
CLICK HERE
9
CLICK HERE
10
CLICK HERE
11
CLICK HERE
12
CLICK HERE
13
CLICK HERE

.


.

.


.



ఆంధ్రప్రదేశ్ 2019-20 వ్యవసాయ బడ్జెట్

                   2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.28,866.23 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ శాసన సభలో ప్రవేశపెట్టారు. సోదరుడి ఆకస్మిక మరణం కారణంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు శాసనసభకు అసెంబ్లీకి రాలేకపోయారు. దీంతో ఆయన బదులు వ్యవసాయ బడ్జెట్‌ను బొత్స ప్రవేశపెట్టారు. రూ.28,866.23 కోట్ల వ్యవసాయ బడ్జెట్లో.. రెవిన్యూ వ్యయం రూ. 27,946.65 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం రూ. 919.58 కోట్లు. రైతు పెట్టుబడి సాయం కింద రూ.8750 కోట్లు కేటాయించారు. రైతు భరోసా కింద ఒక్కో రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 సాయం చేయనున్నారు. 
                   కౌలు రైతుల సంక్షేమం కోసం పట్టాదారుకు ఇబ్బంది లేకుండా 11 నెలలకు కౌలు పత్రం. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా కోసం రూ.1163 కోట్లు, వడ్డీ లేని రుణాల కోసం రూ.100 కోట్లు, వైఎస్సార్ రైతు బీమా కోసం రూ. 100 కోట్లు కేటాయించారు. . తుంపర, బిందు సేద్యం పథకాల కోసం రూ.1105.66 కోట్లు కేటాయించారు. పాడి రైతుకు లీటర్‌కు రూ.4 చొప్పున బోనస్ ఇస్తామన్నారు. కౌలు రైతులకు రూ.1200 కోట్లు, రైతులకు సహకార సంఘాల దీర్ఘాకాలిక రుణాల కింద రూ.1500 కోట్లు కేటాయించారు. 
.
.
·        ధరల స్థిరీకరణ నిధి: రూ. 3000 కోట్లు 
·        ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధి: రూ. 2000 కోట్లు 
·        జాతీయ ఆహార భద్రతా మిషన్: రూ. 141.26 కోట్లు 
·         వైఎస్ఆర్ రైతు బీమాకు రూ.100 కోట్లు 
·         ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1163 కోట్లు 
·        వ్యవసాయ యాంత్రీకరణకు రూ.460.05 కోట్లు 
·        రాష్ట్రీయ కృషి యోజన పథకం: రూ.341 కోట్లు 
·        విత్తన సరఫరా: రూ. 200 కోట్లు 
·        భూసార యాజమాన్యం పథకం: రూ. 30.43 కోట్లు 
·         సూక్ష్మధాతు లోపం సహాయం: రూ. 30.05 కోట్లు 
·        నేషనల్ మిషన్ ఫర్ సస్టేనబుల్ అగ్రికల్చర్: రూ. 233 కోట్లు 
·        జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91 కోట్లు 

·        వ్యవసాయ విభాగ అభివృద్ధి కోసం రెవిన్యూ వ్యయం: రూ.12280.14 కోట్లు 
.
.
·        గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రెవిన్యూ వ్యయం: రూ.355 కోట్లు 
·         నాబార్డ్ - ఆర్‌ఐ‌డిఎఫ్ పెట్టుబడి వ్యయం: రూ.60 కోట్లు 
·        ఉద్యాన శాఖ రెవిన్యూ వ్యయం: రూ. 1532 కోట్లు 
·        ఉద్యాన విశ్వవిద్యాలయాల అభివృద్ధి రెవిన్యూ వ్యయం: రూ.63.60 కోట్లు 
·        పట్టు పరిశ్రమ రెవిన్యూ వ్యయం రూ. 158.46 కోట్లు 
·        పశుసంవర్దక శాఖ రెవిన్యూ వ్యయం రూ.1077 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.163.06 కోట్లు 
·        శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.87 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.30 కోట్లు 
·         మత్స్యశాఖ రెవిన్యూ వ్యయం రూ.409.62 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ.141.24 
·        వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రెవిన్యూ వ్యయం రూ. 3012.34 కోట్లు, క్యాపిటల్ వ్యయం 200.10 కోట్లు 
·        సహకార రంగం రెవిన్యూ వ్యయం 174.64 కోట్లు, క్యాపిటల్ వ్యయం రూ. 60 కోట్లు 
·         రైతాంగానికి 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా: రూ.4525 కోట్లు. 

·         ఆక్వా రంగ రైతులకు 1.50 రూపాయల చొప్పున విద్యుత్ సరఫరా కోసం: రూ.475 కోట్లు 
.
.


ఆంధ్రప్రదేశ్ 2019-20 రాష్ట్ర బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ 2019-20 రాష్ట్ర బడ్జెట్

           ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,27,975కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను 12-07-2019 న ప్రవేశపెట్టారు. దేశంలో కులమతాలకు అతీతంగా పేదరిక నిర్మూలన జరగాలన్న జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్టు బుగ్గన చెప్పారు. గత బడ్జెట్ కంటే ఈసారి బడ్జెట్ 19శాతం పెరిగింది. రెవెన్యూ వ్యయం రూ.1,80,475 కోట్లు కాగా.. రెవెన్యూ లోటు అంచనా రూ. 1778కోట్లు అని బుగ్గన తెలిపారు. ద్రవ్య లోటు అంచనా రూ.35220కోట్లు అని తెలిపారు. జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 0.17శాతం, మూలధన వ్యయం రూ.32,294 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. అప్పుల చెల్లింపులకు కేటాయించిన మొత్తం రూ. 8994కోట్లుగా తెలియజేశారు.
.
.
·        విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత, రూ.32618కోట్లు
·        వైద్య రంగానికి రూ.11399కోట్లు
·        గ‌‌ృహ నిర్మాణాలకు రూ.3617కోట్లు
·        ధరల స్థిరీకరణ నిధికి రూ.3000కోట్లు
·        రైతు భరోసా పథకం కింద ఉచితంగా బోర్లు తవ్వించడానికి రూ.200కోట్లు
·        ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.475కోట్లు
·        రైతులకు విత్తనాల పంపిణీకి రూ.200కోట్లు
·        ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.475కోట్లు
·        రైతులకు విత్తనాల పంపిణీకి రూ.200కోట్లు
·        పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్దికి రూ.1500కోట్లు,పాఠశాల నిర్వహణ గ్రాంటుకు రూ.160కోట్లు
·        ప్రకృతి విపత్తుల నిర్వహణకు రూ.2000కోట్లు
·        ప్రణాళిక విభాగానికి రూ.1439కోట్లు
·        సంక్షేమ రంగానికి రూ.14,412కోట్లు
·        అమ్మ ఒడి పథకానికి రూ.6455కోట్లు
·        ఆశావర్కర్లకు రూ.455.85కోట్లు

·        పాఠశాలల్లో మధ్యాహ్నా భోజన పథకానికి రూ.1077కోట్లు

.
.

·        డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు రూ.1140కోట్లు
·        ఏపీఎస్ఆర్టీసీకి రూ.1000కోట్లు
·        గిరిజన అభివృద్దికి రూ.4988కోట్లు
·        దళితుల అభివృద్దికి రూ.15వేల కోట్లు
·        వెనుకబడిన వర్గాల(బీసీ)ల అభివృద్దికి రూ.1561కోట్లు
·        వైఎస్ఆర్ గృహ పథకానికి రూ.1500కోట్లు
·        పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.648కోట్లు
·        మత్స్యకారులకు సంక్షేమానికి రూ.410కోట్లు
·        పశుసంవర్ధకానికి రూ.1912 కోట్లు
·        వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ రూ.1740కోట్లు

·        కాపు సంక్షేమానికి రూ.2వేల కోట్లు
.
.

·        అగ్రి గోల్డ్ బాధితులకు రూ.1150కోట్లు
·        కార్పోరేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్దరించేందుకు చర్యలు.. అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ భాష బోధన
·        జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.4960కోట్లు
·        సీఎం కాల్ సెంటర్‌కు రూ.73కోట్లు
·        రాజధాని ప్రాంత సామాజిక భద్రతా నిధి రూ.65కోట్లు
·        అటవీ,సైన్స్&టెక్నాలజీ కోసం రూ.477కోట్లు
·        పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి రూ.100కోట్లు
·        నాయి బ్రాహ్మణులు,రజకుల సంక్షేమ అభివృద్దికి రూ.300కోట్లు
·        కార్మిక,ఉపాధి రంగానికి రూ.978కోట్లు
·        సొంత ఆటో కలిగిన డ్రైవర్లకు ప్రభుత్వం తరుపున ఆర్థిక సహాయం కింద రూ.400కోట్లు
·        న్యాయవాదుల సంక్షేమ ట్రస్టుకు రూ.100కోట్లు
·        సమాచార, ప్రజా సంబంధాలకు రూ.191కోట్లు
·        రాష్ట్రాభివృద్ది పథకాలకు రూ.92,050కోట్లు
·        తొలిసారి మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు
·        మతపరమైన సంస్థలకు వైఎస్ఆర్ గ్రాంట్ రూ.234కోట్లు
·        గ్రామ సచివాలయాలకు రూ.700కోట్లు,గ్రామ వాలంటీర్లకు రూ.720కోట్లు
·        మున్సిపల్ వార్డు సచివాలయాలకు రూ.180కోట్లు,మున్సిపల్ వార్డు వాలంటీర్లకు రూ.180కోట్లు
·        పౌరసరఫాల కార్పోరేషన్‌కు రూ.384 కోట్లు
·        అమరావతి రాజధాని నిర్మాణం కోసం రూ.500కోట్లు
·        కడప స్టీల్ ప్లాంట్ కోసం రూ.250కోట్లు
·        ఆశా వర్కర్లకు రూ.3వేల నుంచి రూ.10వేల వేతనం పెంపు
·        అంగన్‌వాడీ వర్కర్లకు రూ.10వేల నుంచి రూ.11వేలకు పెంపు
·        హోంగార్డుల వేతనాలు రూ.18వేల నుంచి రూ.21300కి పెంపు
·        స్మార్ట్ సిటీలకు రూ.150 కోట్లు

Related Posts Plugin for WordPress, Blogger...