కార్గిల్ విజయ్ దివస్ !!! జులై 26 !!!


      కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం విజయానికి గుర్తుగా జరుపుకొనే 'విజయ దివస్'. శత్రు దేశాన్ని గడగడలాడించిన యుద్దం. కదన రంగంలో ఇండియన్ ఆర్మీ వీరోచిత పోరాటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘటన. కార్గిల్ లోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు పాక్ చేసిన కుట్రలను తిప్పికొట్టారు మన జవాన్లు. ఆ ఘటనలో 527 మంది మన జవాన్లు అమరులయ్యారు. జులై 26..1999. ప్రతీ ఒక్క భారతీయుడు మరిచిపోలేని రోజు. యావత్ దేశం మొత్తం ‘జయహో భారత్’ అంటూ నినదించిన రోజు. ఇండియన్ ఆర్మీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన రోజు. దాయాది దేశం పాకిస్తాన్ దురాక్రమణను తిప్పికొట్టి.. మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు మన జవాన్లు.

        1998-1999 శీతాకాలంలో పాకిస్తాని సాయుధ దళాల కొంతమంది పాకిస్తాన్ దళాలకు మరియు పారామిలిటరీ దళాలకు రహస్యంగా శిక్షణ ఇచ్చి, వాళ్లని ముజాహిదీన్ ముసుగులో, నియంత్రణ రేఖ వైపు (LOC) పంపడం జరిగింది. కొంతమంది ముజాహిదీన్ లు భారత్ భూభాగంలోకి చేరారు. చొరబాటు కోడ్ "ఆపరేషన్ బాదర్" అని పెట్టబడింది.
 
        1999 మే నెలలో పాకిస్థాన్ గుట్టుచప్పుడు కాకుండా వచ్చి సరిహద్దులలో కీలక ప్రాంతాలను ఆక్రమించింది. ఆ ప్రాంతాన్ని కార్గిల్ అంటారు. మనదేశం60 రోజుల పాటు యుద్ధం చేసి విజయం సాధించింది. ‘ఆపరేషన్ విజయ్’ పేరున 2 లక్షల మంది భారత సైనికులు యుద్ధం చేసి కార్గిల్ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1999 జూలై 26న యుద్ధం ముగిసింది. ఆ రోజును కార్గిల్ ‘విజయ్ దివస్’ గా దేశమంతట జరుపుతారు. ఈ దినోత్సవం కార్గిల్- ద్రాస్ సెక్టారు లోను, దేశ రాజదానిలో ఇండియా గేటు వద్ద అమర్ జవాన్ జ్యోతి వద్ద అమర జవాన్లకు శ్రద్దాంజలి ఘటిస్తారు. మన సైనిక పాటవానికి, యుద్ద వ్యూహానికి చెరగని గుర్తు ‘కార్గిల్ విజయ్ దివస్’.



కార్గిల్ యుద్ధం ముఖ్యాంశాలు

  • 26 మే 1999: పాక్ దురాక్రమణ దారులను తరిమికొట్టేందుకు దాదాపు రెండు లక్షల మంది సైనికులతో ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభమైంది
  • 14 జూలై 1999: ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆపరేషన్ విజయ్ విజయవంతమైందని ప్రకటించారు
  • 26 జూలై 1999: దురాక్రమణదారులను పూర్తిగా తరిమికొట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు మరణించారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...