1857 సిపాయిల తిరుగుబాటు - మాదిరి ప్రశ్నలు 1


1. 1857 సిపాయిల తిరుగుబాటును ‘భారత ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం’గా అభివర్ణించింది ఎవరు?
ఎ) వి.డి. సావర్కర్
బి) బాల్‌గంగాధర్ తిలక్
సి) మదన్‌లాల్ దింగ్రా
డి) మహాత్మా గాంధీ

2. 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏది?
ఎ) సాంఘిక వ్యవహారాల్లో బ్రిటిషర్ల జోక్యం
బి) భారతీయ సిపాయిలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం
సి) 1856లో ప్రవేశపెట్టిన ఎన్‌ఫీల్డ్ తుపాకుల్లో కొవ్వు పూసిన తూటాలు ఉపయోగించారనే వదంతి
డి) పైవన్నీ

3. ఎన్‌ఫీల్డ్ తుపాకీ ఉపయోగించడాన్ని నిరాకరించి, 1857 మార్చి 29న బారక్‌పూర్‌లో బ్రిటిష్ అధికారిని కాల్చి చంపి సిపాయిల తిరుగుబాటుకు బీజం వేసింది ఎవరు?
ఎ) రామ్ పాండే
బి) మంగళ్‌పాండే
సి) దేశ్‌పాండే
డి) తాంతియా తోపే

4. చరిత్రకారులు ‘1857 తిరుగుబాటు’ ఏ రోజు, ఏ ప్రాంతంలో ప్రారంభమైందని గుర్తించారు?
ఎ) మే 10; మీరట్
బి) జనవరి 29; బారక్‌పూర్
సి) జూన్ 10; ఢిల్లీ
డి) జూన్ 5; లక్నో

5. 1857 తిరుగుబాటుకు సంబంధించిన ప్రధాన ప్రాంతాలు, నాయకులను జతపరచండి.
జాబితా - 1
జాబితా - 2
1) ఢిల్లీ
a) భక్తి ఖాన్
2) లక్నో
b) బేగం హజ్రత్ మహల్
3) ఝాన్సీ
c) లక్ష్మీబాయి
4) ఫైజాబాద్
d) మౌల్వీ అహ్మదుల్లా
5) అర్రాహ్
e) కున్వర్ సింగ్
ఎ) 1-a, 2-b, 3-c, 4-d, 5-e
బి) 1-e, 2-d, 3-c, 4-b, 5-a
సి) 1-d, 2-a, 3-e, 4-b, 5-c
డి) 1-c, 2-b, 3-a, 4-e, 5-d

6. మొగల్ చివరి పాలకుడు 2వ బహదూర్ షా వారసులను హత్య చేసి, ఆ వంశాన్ని అంతం చేసిన బ్రిటిష్ సేనాని ఎవరు?
ఎ) విలియం టేలర్
బి) నికోల్‌సన్
సి) కెప్టెన్ హడ్సన్
డి) విండ్ హోమ్ 

7. లక్ష్మీబాయితో పోరాటం చేసిన బ్రిటిష్ జనరల్ ఎవరు?
ఎ) హావ్‌లాక్
బి) సర్ హ్యూరోజ్
సి) కాంప్‌బెల్
డి) నికోల్‌సన్

8. 1857 తిరుగుబాటు ప్రముఖ నాయకులు, వారి అసలు పేర్లకు సంబంధించి కింది వాటిలో సరైన జత ఏది?
ఎ) నానాసాహెబ్ - గోవింద దోండూపంత్
బి) తాంతియా తోపే - రామచంద్ర పాండురంగ్
సి) లక్ష్మీబాయి - మణికర్ణిక
డి) పైవన్నీ

9. కింది వారిలో నేపాల్ పారిపోయి, అక్కడే మరణించిన 1857 తిరుగుబాటు నాయకులు ఎవరు?
ఎ) నానాసాహెబ్
బి) బేగం హజ్రత్ మహల్
సి) ఎ, బి
డి) తాంతియా తోపే

10. బ్రిటిష్ సైన్యంలో భారతీయ సిపాయిల తిరుగుబాటు మొదట ఏ ప్రాంతంలో జరిగింది?
ఎ) లక్నో
బి) వెల్లూరు
సి) బారక్‌పూర్
డి) మీరట్

11. 1857 తిరుగుబాటు ప్రారంభానికి కొద్ది రోజుల ముందే.. ‘భారతీయ ఆకాశంలో చిన్న మబ్బు క్రమంగా పెరుగుతూ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిలించబోతుంది’అని పేర్కొన్న వ్యక్తి ఎవరు?
ఎ) లార్డ్ డల్హౌసీ
బి) వి.డి. సావర్కర్
సి) లార్డ్ కానింగ్
డి) దేవేంద్రనాథ్ ఠాగూర్ 

12. ‘1857లో జరిగింది సిపాయిల తిరుగుబాటు కాదు, అది జాతీయ పోరాటం’ అని అంగీకరించిన ఆంగ్లేయుడు ఎవరు?
ఎ) చార్లెస్ ఉడ్
బి) డిజ్రౌలి
సి) కానింగ్
డి) ఎలెన్‌బరో

13. కింది వాటిలో 1857 తిరుగుబాటు ముఖ్య కేంద్రం, బ్రిటిషర్లు మొదటగా పునరాక్రమించుకున్న ప్రాంతం ఏది?
ఎ) కాన్పూర్
బి) ఝాన్సీ
సి) ఢిల్లీ
డి) లక్నో 

14. 1858 ఏప్రిల్‌లో కింద పేర్కొన్న ఏ నాయకుడిని బంధించడంతో 1857 తిరుగుబాటు ముగిసిపోయినట్లుగా భావిస్తారు?
ఎ) తాంతియా తోపే
బి) మౌల్వీ అహ్మదుల్లా
సి) నానాసాహెబ్
డి) బేగం హజ్రత్ మహల్ 

15.కింద పేర్కొన్నవారిలో 1857 తిరుగుబాటు సమయంలో బ్రిటిషర్లకు విశ్వాసపాత్రుడిగా ఉన్న జమీందార్/ పాలకుడు ఎవరు?
ఎ) కాశ్మీర్ - గులాబ్ సింగ్
బి) హైదరాబాద్ - సాలార్జంగ్
సి) సింధియా - దినకర్ రాయ్
డి) పైన పేర్కొన్న వారందరూ

16.1857 తిరుగుబాటు ప్రధానంగా ఏ ప్రాంతంలో మత పెద్దలైన మౌల్వీలు, పండిట్‌ల ప్రభావానికి లోనైంది?
ఎ) బిహార్
బి) బెంగాల్
సి) ఉత్తరప్రదేశ్
డి) రాజస్థాన్



 
1. ఎ
2.సి
3.బి
4.ఎ
5.ఎ
6.సి
7.బి
8.డి
9.సి
10.బి
11.సి
12.బి
13.సి
14.ఎ
15.డి
16.ఎ


 



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...