వ్యక్తులు - నినాదాలు


  •  బెంగాల్ విభజన దినం బ్రిటిష్ సామ్రాజ్య పతన దినం :- మహాత్మా గాంధీ
  • బెంగాల్ విభజన తరువాత దేశంలో అసలైన చైతన్యం మొదలైంది :- మహాత్మా గాంధీ
  • గోబ్యాక్ టు వేదాస్ (వేదాలకు మరలండి) :- స్వామి దయానంద సరస్వతి
  • నాకు రక్తాన్ని ఇవ్వండి - మీకు నేను స్వాతంత్య్రం ఇస్తాను :- సుభాష్ చంద్రబోస్
  • ఢిల్లీ చలో :- సుభాష్ చంద్రబోస్
  • జైహింద్ :- సుభాష్ చంద్రబోస్
  • జై జవాన్, జై కిసాన్ :- లాల్‌ బహదూర్ శాస్త్రి
  • సత్యం, అహింస నాకు దేవుళ్లు :- మహాత్మా గాంధీ
  • డూ ఆర్ డై (చేయండి లేదా చావండి) :- మహాత్మా గాంధీ
  • సంస్కారం లేని చదువు వాసనలేని పువ్వులాంటిది :- మహాత్మా గాంధీ



 ది వేదాస్ కంటైన్ ఆల్ ది ట్రూత్ :- స్వామి దయానంద సరస్వతి
  • భారతదేశం, భారతీయుల కొరకే :- స్వామి దయానంద సరస్వతి
  • ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి :- లాలా లజపతిరాయ్
  • కాంగ్రెస్ ఉద్యమం ప్రజల చేత ప్రభావితమైంది కాదు, ప్రజలు ప్రణాళిక చేసిందీ కాదు :- లాలా లజపతిరాయ్
  • నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి :- సర్దార్ వల్లభాయ్ పటేల్
  • రోజ్‌గార్ బడావో :- మన్మోహన్‌సింగ్
  • జై విజ్ఞాన్ :- అటల్‌బిహారి వాజ్‌పేయి
  • భారతదేశానికి హిందువులు, ముస్లింలు రెండు కళ్లులాంటివారు :- సర్ సయ్యద్ అహ్మద్‌ఖాన్
  • రాజకీయ స్వేచ్ఛ అన్నది జాతికి ప్రాణ వాయువులాంటిది :- అరబిందో ఘోష్



 ప్రజలే ప్రభువులు :- లోక్‌సత్తా
  • ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు :- జవహర్‌లాల్ నెహ్రూ
  • ప్రతి కంటి నుంచి కారే కన్నీటిని తుడవడమే నా అంతిమ లక్ష్యం :- జవహర్‌లాల్ నెహ్రూ
  • చెడును సహిస్తే అది మొత్తం వ్యవస్థనే నాశనం చేస్తుంది :- జవహర్ లాల్ నెహ్రూ
  • ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం :- శ్రీశ్రీ
  • భారతదేశం నేర్చుకోవాల్సిన ఒకే ఒక్క పాఠం ఏమిటంటే ఎలా చావాలో, దాన్ని బోధించవలసిన ఏకైక పద్ధతి చావడం ద్వారానే :- ఎం.కె. ధింగ్రా
  • ఇంక్విలాబ్ జిందాబాద్ (విప్లవం వర్ధిల్లాలి) :- భగత్‌సింగ్
  • స్వరాజ్యం నా జన్మహక్కు, దాన్ని సాధించి తీరుతాను :- బాలగంగాధర తిలక్
  • దేవుడు అంటరానితనాన్ని సహిస్తే నేను ఆయన్ను దేవునిగా అంగీకరించను :- బాలగంగాధర తిలక్ 
  • పిచ్చాసుపత్రుల వెలుపల ఉండే పిచ్చివాళ్లు మాత్రమే స్వాతంత్య్రం గురించి ఆలోచిస్తారు, మాట్లాడతారు :- గోపాలకృష్ణ గోఖలే
 
 
 
 
  • ఆధునిక విద్య, విజ్ఞానాల్ని ఆర్జించకుండా మన జాతి పురోగమించటం సాధ్యం కాదు :- రాజారామ్మోహన్‌రాయ్
  • కళ కళ కోసం కాదు ప్రజల కోసం :- బళ్ళారి రాఘవ
  • గాంధీ మరణించవచ్చు కానీ గాంధీయిజం ఎప్పుడూ జీవించే ఉంటుంది :- భోగరాజు పట్టాభి సీతారామయ్య
  • బచావో, దేశ్ బనావో :- పి.వి.నరసింహారావు
  • వడగాల్పులు నా జీవితం అయితే వెన్నెల నా కవిత్వం :- గుర్రం జాషువా
  • ఒకే దేశం, ఒకే దేవుడు, ఒకే కులం, ఒకే ఆలోచన తేడా ఏమీ లేకుండా అనుమానమేమీ లేకుండా మేమందరం అన్నదమ్ములం :- వి.డి.సావర్కర్
  • నా తెలంగాణ కోటి రతనాల వీణ :- దాశరథి కృష్ణమాచార్యులు
  • బోదెను చేధిస్తే ఎండిన కొమ్మలు వాటంతటవే పడిపోతాయి :- బాజీరావు I
  • చిన్న లక్ష్యాలు నిర్దేశించుకోవడం నేరం, గొప్ప కలలు కనండి, వాటి సాకారానికై కృషిచేయండి :- ఎ.పి.జె. అబ్దుల్ కలాం
  • పాలిత దేశంలో కాకుండా స్వతంత్ర దేశంలో నన్ను దీర్ఘ నిద్ర పోనివ్వండి :- మోతీలాల్ నెహ్రూ
  • నాలో చివరి రక్తపు బొట్టు వరకు ప్రజల కోసం పోరాడతాను :- ఇందిరాగాంధీ  
 
 
 
  • అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో :- కందుకూరి వీరేశలింగం పంతులు
  • బ్రిటిష్ సామ్రాజ్య భావమే మాకు విరోధి, బ్రిటిష్ ప్రజలతో మాకు వైరం లేదు :- మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • ప్రత్యేక రక్షణలు కోరుతున్న ముస్లింలు ఎంత మూర్ఖులో వాటిని ఇస్తున్న హిందువులు అంతకంటే పెద్ద మూర్ఖులు :- మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • బికారీ హఠావో :- రాజీవ్ గాంధీ
  • వాణి నా రాణి :- పిల్లలమర్రి పినవీరభద్రుడు
  • బ్రిటిషర్ల ఫించను పొందుతున్న రాజుల, నవాబుల జాబితాలో బతకటం కంటే సైనికుడిగా మరణించటమే మేలు :- టిప్పుసుల్తాన్
  • సూర్యుడు కనపడలేదని కన్నీరు పెడుతూ ఉంటే చివరకు నక్షత్రాలు కూడా కనపడకుండా పోతాయి :- రవీంద్రనాథ్ ఠాగూర్
  • స్వాతంత్య్రం అనేది ఓ కనిపించని మహా అదృష్టం, అది లేనప్పుడు గాని దాని విలువ తెలియదు :- రవీంద్రనాధ్ ఠాగూర్
  • అందరిలోనూ సామాన్యున్ని అయినా చిరంజీవుణ్ణి :- సి.నారాయణరెడ్డి
 
 
 
 
  • కులం పునాదులపై ఒక జాతిని గాని ఒక నీతిని గాని నిర్మించలేము :- బి.ఆర్. అంబేడ్కర్
  • మహారాష్ట్రులనంతా ఒకచోట చేర్చు. మతం మరలా జీవించేటట్లు చూడు.
  • మనల్ని చూచి మన పూర్వులు స్వర్గం నుంచి నవ్వుతున్నారు :- గురు రామదాస్
  • మానవులందరూ నా బిడ్డలవంటివారు :- అశోకుడు
 
 
 
 
 
 
FOR PDF: CLICK HERE

భారతదేశం- జాతీయ చిహ్నాలు



ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన జెండా, జాతీయ గేయం, జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ పుష్పం వంటి ఇతర అనేక చిహ్నాలుంటాయి. అవి ఆ దేశ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు మరియు జీవవైవిధ్యాన్ని ప్రతిబింబించడంతో పాటు ఆ దేశ సంస్కృతిని, చరిత్రను తెలియజేస్తాయి. భారతదేశం కూడా చాలా జాతీయ చిహ్నాలు కలిగి ఉంది. వాటి గురించి తెలుసుకుందాం.
శీర్షిక
చిహ్నం
చిత్రం
వివరం
జాతీయ పతాకం
మూడు రంగుల జెండా
Flag of India.svg
భారత జాతీయ పతాకంలో మూడు రంగులు అడ్డంగా ఉంటాయి. పైన ముదురు కాషాయ రంగు, మధ్యలో తెలుపు, కింద ముదురు ఆకుపచ్చ సమాన నిష్పత్తిలో ఉంటాయి. జండా పొడవు వెడల్పుల నిష్పత్తి 3:2 గా ఉంటుంది. తెలుపు పట్టీ మధ్యలో నీలపు రంగులో చక్రం ఉంటుంది. సారనాథ్‌ లోని అశోకచక్రపు ప్రతిరూపమే ఈ చక్రం. ఈ చక్రం తెలుపు పట్టీ అంత వ్యాసంతో ఉండి, 24 ఆకులు కలిగి ఉంటుంది. ఈ జాతీయ పతాక నమూనాను రాజ్యాంగ సభ 1947 జూలై 22 న ఆమోదించి స్వీకరించింది.రూపొందించిన వారు శ్రీ పింగళి వెంకయ్య.
జాతీయగీతం
జనగణమన ( జనగణ మన అధినాయక జయహే.......")

దీన్ని రవీంద్ర నాద్ టాగూర్ రచించారు.
జాతీయగేయం
వందేమాతరం

దీనిని బంకించంద్ చటర్జీ రచించారు.
ప్రతిజ్ఞ



భారత జాతీయ చిహ్నం
మూడు సింహాల చిహ్నం
Emblem of India.svg
దీనిని సారనాద్ లోని అశోకుని స్థంబం నుండి గ్రహించారు.
జాతీయ జంతువు
పెద్దపులి
Panthera tigris tigris.jpg

జాతీయ పక్షి:
నెమలి
Peacock with outspread plumes.JPG

జాతీయ పుష్పం
కలువ పువ్వు
Nelumno nucifera open flower - botanic garden adelaide2.jpg

జాతీయ వృక్షం
మర్రిచెట్టు
Banyantree.jpg

జాతీయ ఫలం
మామిడి
Mangifera indica (Manguier 4).jpg

జాతీయ భాషలు
22

1.అస్సామీ, 2.బెంగాలి, 3.గుజరాతీ. 4.హింది., 5.కన్నడ., 6.కాశ్మీరి., 7.కొంకణి., 8. మళయాళం:, 9.మరాఠీ., 10. మణిపురి., 11. నేపాలి. 12. ఒరియా., 13. పంజాబి., 14. సంస్కృతం; 15. సింధి., 16., తమిళం:, 17. తెలుగు.., 18. ఉర్దూ19.మిథలి,20.సంథాలి,21.బోడో.,22.డోగ్రీ
జాతీయ కరెన్సీ గుర్తు
ఇండియన్ రూపీ
Indian Rupee symbol.svg
దేవనాగరి లిపిలోని (Ra) అక్షరం మరియు రోమన్ లిపిలోని R అక్షరాల మిళితం. జూలై 15 2010 న భారత ప్రభుత్వం ఈ గుర్తును అధికారికంగా స్వీకరించింది. దీనిని ఐ.ఐ.టి ముంబైకు చెందిన ఉదయకుమార్ రోపొందించారు.భారత ఆర్థిక శాఖ జరిపిన పొటినుంచి ఈ గుర్తును ఎన్నిక చేశారు.
జాతీయ క్రీడ
హాకీ
Indian-Hockey-Team-Berlin-1936.jpg
అనధికారిక
 
జాతీయగీతం: 
మన జాతీయ గీతం జనగణమణ. దీనినివిశ్వకవి, భారత తొలి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రచించారు. రవీంద్ర నాథ్ రచించిన పూర్తి గీతంలో 5 చరణాలున్నాయి. ఇందులోని తొలి చరణంలోని 5 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు. పూర్తి జాతీయ గీతాన్ని పాడటానికి 52 సెకన్ల సమయం పడుతుంది. 1885 కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జాతీయ గీతాన్ని ఆమోదించారు. తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కోల్‌కతా కాంగ్రెస్ సమావేశంలో ఆలపించారు. ఠాగూర్ తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారిగా 1912లో ప్రచురితం అయింది. ఠాగూర్ జనగణమణను మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా పేరుతో 1919లో ఆంగ్లంలోకి అనువదించారు. జాతీయ గీతం 1950 జనవరి 24 నుంచి అధికారికంగా వాడుకలోకి వచ్చింది

జాతీయ పతాకం: 
భారత జాతీయ పతాకాన్ని పింగళి వెంకయ్య రూపొందించారు. దీనిని 1947 జులై 22న రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. పొడవు, వెడల్పులు 3:2 నిష్పత్తిలో దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఈ జెండా మీద కాషాయ తెలుపు, ఆకుపచ్చ రంగులు వరుసగా సమానంగా ఉంటాయి. మధ్యలో ఉన్నతెలుపు రంగు మీద ముదురు నీలం రంగులో 24 ఆకులు గల అశోకచక్రం ఉంటుంది. సారనాథ్‌లో గల అశోక ధర్మస్తంభం మీద ఉండే ధర్మచక్రాన్ని అనుసరించి ఈ చక్రాన్ని రూపొందించారు.
జాతీయ పతాకాన్ని సూర్యోదయం తరువాతనే ఎగురవేయాలి. సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి. జాతీయ పతాకం లేదా దాని ఫొటోని చించడం, మురికిచేయడం చేయకూడదు. వ్యాపార ప్రకటనలకు వాడకూడదు. జెండాను వస్త్రాలుగా ధరించకూడదు.
జాతీయ జెండాను ఎలా పడితే అలా వాడకుండా ప్రభుత్వం 1950లో ప్రివెన్షన్ ఆఫ్ ఇంప్రోపర్ యూజ్ యాక్ట్, 1971లో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ హానర్ యాక్ట్‌లను చేసింది. ఇందులో జెండా ను ఎప్పుడు, ఎందుకు, ఎవరు, ఎలా వాడాలి అనే నిబంధనలు పొందుపరిచారు. అయితే 2002లో వచ్చిన న్యూ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం పౌరులందరూ అన్ని రోజులూ ఇళ్లు, కార్యాలయాలలో జెండా ఎగురవేయవచ్చు. ఆర్టికల్ 19 (1) (ఎ) ప్రకారం జాతీయ పతాకాన్ని ఎగురవేయడం భారత పౌరుల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పేర్కొంది.

జాతీయ చిహ్నం:
భారతదేశ జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్ (సింహ తలాటం). దీనిని 1950 జనవరి 26న సారనాథ్‌లోని అశోకుని ధర్మస్థూపం నుంచి స్వీకరించారు. ఈ చిహ్నంపై నాలుగు సింహాలు ఉంటాయి. అయితే మనకు మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే పీఠంపై ముండకోపనిషత్నుంచి స్వీకరించినవాక్యం ‘సత్యమేవ జయతే’ దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ఈ చక్రానికి ఎడమ వైపు గుర్రం, కుడి వైపు ఎద్దు ఉంటాయి. అలాగే పీఠం మరోవైపు ఏనుగు, సింహం కూడా ఉంటాయి.

జాతీయ గేయం: 
జాతీయ గేయం వందేమాతరంను బంకించంద్ర చటర్జీ బెంగాలీలో రాసిన ‘ఆనంద్‌మఠ్’ అనే నవల నుంచి గ్రహించారు. ఆనంద్‌మఠ్ నవల 1982లో ప్రచురింపబడింది. ఈ గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు. అరవింద ఘోష్ దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. వందేమాతరం గేయాన్ని జనవరి 24, 1950లో మన రాజ్యంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది.

జాతీయ ప్రతిజ్ఞ: 
'భారత దేశము నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు...'అనేమన ప్రతిజ్ఞను పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించారు. సుబ్బారావు విశాఖపట్నం ట్రెజరీ అధికారిగా ఉన్నపుడు 1962లో ఈ ప్రతిజ్ఞ తయారు చేశారు. దీనిని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాథం దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అప్పటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజుకు అందచేశారు. 1964లో బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహ్మద్ ఖరీం చాగ్లా అధ్యక్షతన జరిగిన కేంద్రీయ విద్యా సలహామండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞ స్వీకరించి ఇతర భాషల్లోకి అనువాదం చేయించారు. 1963లో విశాఖపట్నంలోని ఒక పాఠశాలలో తొలిసారిగా ప్రతిజ్ఞ చేయించగా 1965 జనవరి 26 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకొచ్చింది.

జాతీయ జంతువు:
జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్ (పెద్దపులి). ఇది కేవలం భారత ఉపఖండంలో మాత్రమే కనిపిస్తుంది. శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్ (లిన్నెయస్). దీనిని 1972లో జాతీయ జంతువుగా గుర్తించారు. 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది. 1973 నుంచి ప్రాజెక్టు టైగర్ అనే పులుల సంరక్షణ పథకాన్ని చేపట్టారు. పులి అనేది శక్తికి , దైర్యానికి ప్రతీక.

జాతీయ పక్షి:
భారత జాతీయ పక్షి నెమలి. దీని శాస్త్రీయ నామం పావో క్రిస్టేటన్. 1964లో భారత ప్రభుత్వం నెమలిని జాతీయ పక్షిగా గుర్తించింది. 1972నుంచి నెమలిని వేటాడటం నిషేధించారు.

జాతీయ పుష్పం:
జాతీయ పుష్పం తామర పువ్వు లేదా కమలం. దీని శాస్త్రీయ నామం నిలుంబో నూసిఫెరా గెర్టాన్. కమలం దైవత్వం, స్వచ్ఛత, జ్ఞానం, సంపదకూ ప్రతీక. ఇది జలాశయాలలో బురద, నాచుల మధ్య పెరుగుతుంది.

జాతీయ వృక్షం:
జాతీయ వృక్షం మర్రి చెట్టు. దీని శాస్త్రీయ నామం ఫైకస్ బెంగాలెన్సిస్. దీనికి భారత సాహిత్యం, వైద్య శాస్త్రంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది. దీని ప్రస్తావన పురాణాలు, ఇతిహాసాలలో కూడా ఉంది.
మహబూబ్ నగర్ జిల్లాలోని పిల్లలమర్రి చెట్టు 800 సంవత్సరాలనాటిది. 330 మీటర్ల మేర విస్తరించి ఉన్న కలకత్తా మర్రి 450 సంవత్సరాలనాటిది. అనంతపురం జిల్లా తిమ్మమ్మమర్రి 1989లో గిన్నీస్ బుక్ రికార్డుల్లో చేరింది. అలెగ్జాండర్ దండయాత్రకు వచ్చినపుడు ఏడు వేల సైన్యంతో ఒకే మర్రి చెట్టుకింద విడిది ఏర్పాటు చేసుకున్నాడు.

జాతీయ ఫలం: 
జాతీయ ఫలం మామిడి పండు. దీని శాస్త్రీయ నామం మ్యాంజిఫెరా ఇండికా. ఈ ఫలానికి భారతీయ సంస్కృతితో ఎనలేని సంబంధం ఉంది. మన దేశంలోనే వందకు పైగా రకాల మామిడిపళ్లు దొరుకుతాయి. మామిడిని ప్రపంచంలో అత్యధికంగా మన దేశమే సాగు చేస్తుంది. ఎ, సి, డి విటమిన్లు పుష్కలంగా ఉండే మామిడి పండు, కాయ, ఆకు కూడా భారతీయులకు ఎంతో ముఖ్యమైనవి. బీహార్‌లోని దర్భాంగాలో మొఘల్ చక్రవర్తి అక్బర్ లక్ష మామిడి చెట్లను నాటించాడు. ప్రస్తుతం ఆ తోటను లఖీబాగ్‌గా పిలుస్తున్నారు.

జాతీయ నది: 
జాతీయ నది గంగానది. దేశంలో అత్యంత పొడవైన గంగానదిని 2008 నవంబర్ 5న జాతీయ నదిగా ప్రకటించారు. హిమాలయాల వద్ద గంగోత్రిలో భగీరథి పేరుతో పుట్టి, గంగగా కాశీ మొదలైన ప్రదేశాలలో 2,525 కిలోమీటర్ల మేర ప్రవహించి, పద్మ పేరుతో బంగ్లాదేశ్‌కు వెళ్తుంది. ఈ నది హిందూవులకు ఎంతో పవిత్రమైనది. అలకనంద, యమున, సోన్, గోమతి, కోసి, గాఘ్రా నదులు ఇందులో కలుస్తాయి. గంగానదిని శుభ్ర పరచడానికి నమామి గంగే మిషన్‌ను 2016 జూలై 7న ప్రారంభించారు.

జాతీయ జలచరం(అక్వాటిక్ యానిమల్):
కేంద్ర ప్రభుత్వం డాల్ఫిన్ ను 2009 అక్టోబరులో జాతీయ జలచరంగా గుర్తించింది. దీని శాస్త్రీయ నామం ప్లాటినెష్టా గాంజెటికా. డాల్ఫిన్‌ను భారత వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972లోని షెడ్యూల్-1లో చేర్చారు. జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ జలచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972 ప్రకారం నేరం.

జాతీయ కరెన్సీ- రూపాయి
కరెన్సీ మీద దేవనాగరి లిపిలో ముద్రించిన 'ర' అనే అక్షరమే భారత జాతీయ కరెన్సీ చిహ్నం. దీనిని 2010, జులై 15న భారత ప్రభుత్వం గుర్తించింది.

జాతీయ పంచాంగం:
చైత్ర మాసంతో మొదలై ఫాల్గుణతో ముగిసే శక యుగం పంచాంగాన్ని మన ప్రభుత్వం 1957, మార్చి 22న జాతీయ పంచాంగంగా గుర్తించింది. అంతకు ముందు గ్రెగారియన్ కేలండర్ అమలులో ఉండేది. ఇందులో 365/366 రోజులు ఉంటాయి. ఇప్పుడు గ్రెగారియన్ కేలండర్‌తో పాటు దేశీయ కేలండర్‌ను కూడా భారత్ గెజెట్, ఆకాశవాణి, ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు.

జాతీయ భాష:
భారత ప్రభుత్వం1950లోఆర్టికల్ 343 ప్రకారం దేవనాగరి లిపిలోని హిందీని జాతీయ భాషగా ప్రకటించింది.

జాతీయ వారసత్వ జంతువు 
మన జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. దీనిని 2010లో ప్రకటించారు.






జాతీయ కాలమానం:
82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనుసరించి భారత జాతీయ కాలమానాన్ని నిర్ణయిస్తారు. గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందు ఉంటుంది.
Related Posts Plugin for WordPress, Blogger...