రక్త వర్గాలు, రక్త ప్రసరణ వ్యవస్థ - మాదిరి ప్రశ్నలు 1


1. మానవుని రక్త వర్గాలను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) విలియం హార్వే
బి) కార్ల్‌ లాండ్‌ స్టీనర్‌
సి) విలియం కాఫ్‌
డి) మాల్ఫీజీ

2. మానవుని రక్తంలో ప్రతిజనకాలు ఎక్కడ ఉంటాయి?
ఎ) ప్లాస్మా
బి) ఎర్ర రక్తకణాలు
సి) తెల్ల రక్తకణాలు
డి) రక్త ఫలకికలు

3. మానవుని రక్తంలో ప్రతి రక్షకాలు ఎక్కడ ఉంటాయి?
ఎ) ప్లాస్మా
బి) ఎర్ర రక్తకణాలు
సి) తెల్ల రక్తకణాలు
డి) రక్త ఫలకికలు

4. ఏ రక్త వర్గంలో ప్రతిజనకాలు ఉండవు?
ఎ) ఎ
బి) బి
సి) ఎబి
డి) ఒ

5. ఏ రక్త వర్గంలో ప్రతి రక్షకాలు ఉండవు?
ఎ) ఎ
బి) బి
సి) ఎబి
డి) ఒ

6. ఏ రక్త వర్గంలో ప్రతి రక్షకాలు ‘ఎ’, ‘బి’ ఉంటాయి?
ఎ) ఎబి గ్రూపు
బి) ఒ గ్రూపు
సి) ఎ గ్రూపు
డి) బి గ్రూపు

7. ఏ రక్త వర్గంలో ప్రతిజనకాలు ‘ఎ’, ‘బి’ ఉంటాయి?
ఎ) బి గ్రూపు
బి) ఎ గ్రూపు
సి) ఎబి గ్రూపు
డి) ఒ గ్రూపు 

8. ‘విశ్వదాత’ అని ఏ రక్త వర్గాన్ని అంటారు?
ఎ) ఒ పాజిటివ్‌
బి) ఒ నెగెటివ్‌
సి) ఎబి పాజిటివ్‌
డి) ఎబి నెగెటివ్‌

9. ‘విశ్వగ్రహీత’ అని ఏ రక్త వర్గాన్ని అంటారు?
ఎ) ఎబి పాజిటివ్‌
బి) ఒ పాజిటివ్‌
సి) ఎబి నెగెటివ్‌
డి) ఒ నెగెటివ్‌

10. మానవుని రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) విలియం హార్వే
బి) కార్ల్‌ లాండ్‌ స్టీనర్‌
సి) విలియం కాఫ్‌
డి) మాల్ఫీజీ
11. ఒక వ్యక్తి రక్తంలో ప్రతిజనకం ‘ఎ’, ప్రతి రక్షకం ‘బి’ ఉన్నాయి. అయితే అతని రక్త వర్గం ఏది?
ఎ) ఎ గ్రూపు
బి) ఎబి గ్రూపు
సి) బి గ్రూపు
డి) ఒ గ్రూపు

12. ఏ సందర్భంలో ‘ఎరిత్రోబ్లాస్టిస్‌ ఫిటాలిస్‌’ జరుగుతుంది?
ఎ) భర్తలో ఆర్‌హెచ్‌ పాజిటివ్‌, భార్యలో ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ రక్తం ఉన్నపుడు
బి) భర్తలో ఆర్‌హెచ్‌ నెగెటివ్‌, భార్యలో ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ రక్తం ఉన్నపుడు
సి) భార్యా భర్తలిరువురిలో ఆర్‌హెచ్‌ నెగెటివ్‌ రక్తం ఉన్నపుడు
డి) భార్యా భర్తలిరువురిలో ఆర్‌హెచ్‌ పాజిటివ్‌ రక్తం ఉన్నపుడు

13. ‘ఎ’ రక్త వర్గం గల వ్యక్తి ఎవరి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు?
ఎ) ‘ఎ’ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
బి) ‘ఒ’ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
సి) ‘ఎబి’ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే
డి) ‘ఎ’/ ‘ఒ’ రక్తవర్గం గలవారి నుంచి మాత్రమే

14. ‘ఎబి’ రక్తవర్గం గల వ్యక్తి ఎవరి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు?
ఎ) ‘ఎ’ రక్తవర్గం వారి నుంచి
బి) ‘బి’ రక్తవర్గం వారి నుంచి
సి) ‘ఎబి’ రక్తవర్గం వారి నుంచి
డి) ‘ఎ’ / ‘బి’ / ‘ఎబి’ / ‘ఒ’ రక్తవర్గం వారి నుంచి

15. రవి, సీత, అబ్దుల్‌, నరేష్‌, శ్రీను అనే అయిదుగురు స్నేహితుల రక్తవర్గాలు కింది పట్టికలో ఉన్నాయి. పట్టికను గమనించి నరేష్‌ తన స్నేహితులలో ఎవరెవరికి రక్తాన్ని దానం చేయవచ్చు?
పేరు- రక్తవర్గం
రవి- బి
సీత- ఎబి
అబ్దుల్‌- ఎ
నరేష్‌- ఎబి
శ్రీను- ఒ
ఎ) రవి, అబ్దుల్‌
బి) రవి, అబ్దుల్‌, సీత
సి) సీత
డి) రవి, అబ్దుల్‌, సీత, శ్రీను

16. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి
1) ‘ఒ’ నెగెటివ్‌ రక్త వర్గం గలవారు ‘ఒ’ పాజిటివ్‌ రక్త వర్గం కలవారి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు
2) ‘బి’ పాజిటివ్‌ రక్త వర్గం గలవారు ‘బి’ నెగెటివ్‌ రక్త వర్గం గలవారి నుంచి రక్తాన్ని తీసుకోరాదు.
ఎ) 1
బి) 2
సి) 1, 2
డి) ఏదీ కాదు

17. వెంకట్‌, శ్రీకాంత్‌, ప్రసాద్‌, నరేష్‌ అనే నలుగురు స్నేహితులు. వెంకట్‌కు ఎ నెగెటివ్‌, శ్రీకాంత్‌కు బి పాజిటివ్‌, ప్రసాద్‌కు ఒ నెగెటివ్‌, నరేష్‌కు ఎబి పాజిటివ్‌ రక్త వర్గాలు ఉన్నట్లయితే వెంకట్‌ తన స్నేహితుల్లో ఎవరి నుంచి రక్తాన్ని తీసుకోవచ్చు?
ఎ) నరేష్‌
బి) ప్రసాద్‌
సి) నరేష్‌/ ప్రసాద్‌
డి) ఎవరినుంచీ తీసుకోకూడదు

18. ఆరోగ్యవంతుడైన మానవుని సిస్టోలిక్‌ రక్త పీడనం ఎంత?
ఎ) 120
బి) 80
సి) 180
డి) 40

19. ఆరోగ్యవంతుడైన మానవుని డయాస్టోలిక్‌ రక్త పీడనం ఎంత?
ఎ) 120
బి) 80
సి) 180
డి) 40

20. ఆరోగ్యవంతుడైన మానవుని నాడీ పీడనం ఎంత?
ఎ) 120
బి) 80
సి) 180
డి) 40

21. రక్తస్కంధనం జరిపే రక్త కణాలు?
ఎ) ఎరిత్రోసైట్లు
బి) ల్యూకోసైట్లు
సి) థ్రాంబోసైట్లు
డి) పైవన్నీ

22. వ్యాధికారక క్రిములను భక్షించే కణాలు ఏవి?
ఎ) ల్యూకోసైట్లు
బి) థ్రాంబోసైట్లు
సి) ఎరిత్రోసైట్లు
డి) పైవన్నీ

23. శ్వాస వాయువులను రవాణా చేసే రక్త కణాలు ఏవి?
ఎ) ల్యూకోసైట్లు
బి) థ్రాంబోసైట్లు
సి) ఎరిత్రోసైట్లు
డి) పైవన్నీ

24. కిందివాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి
1) పరిపక్వ క్షీరద ఎర్ర రక్తకణంలో కేంద్రకం ఉండదు 2) ఎర్ర రక్తకణాల జీవితకాలం 13 రోజులు
ఎ) 1
బి) 2
సి) 1, 2
డి) ఏదీ కాదు

25. మలేరియా పరాన్నజీవి ఏ రక్తకణాలపై దాడి చేస్తుంది?
ఎ) ఎర్ర రక్తకణాలు
బి) ల్యూకోసైట్లు
సి) థ్రాంబోసైట్లు
డి) ఏదీ కాదు

26. మానవునిలో ఉండే ల్యూకోసైట్లు, ఎరిత్రోసైట్ల మధ్య గల నిష్పత్తి?
ఎ) 1:5
బి) 1:50
సి) 1:500
డి) 1:5000

27. హెచ్‌ఐవి ఏ రక్త కణాలపై దాడి చేస్తుంది?
ఎ) ల్యూకోసైట్లు
బి) ఎరిత్రోసైట్లు
సి) థ్రాంబోసైట్లు
డి) పైవన్నీ

28. తెల్ల రక్త కణాలన్నింటిలో పెద్దది ఏది?
ఎ) న్యూట్రోఫిల్‌
బి) బెసోఫిల్‌
సి) మోనోసైట్‌
డి) లింఫోసైట్‌

29. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
1) శోషరసంలో తెల్ల రక్తకణాలు ఉండవు
2) ఎలర్జీ ఉన్న వ్యక్తి రక్తంలో ఇసినోఫిల్స్‌ సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి
ఎ) 1
బి) 2
సి) 1, 2
డి) ఏదీ కాదు
30. మొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా జరిపిన వైద్యుడు?
ఎ) వేణుగోపాల్‌
బి) బెర్నాల్డ్‌
సి) విలియం కాఫ్‌
డి) వెల్లోడి

31. ‘యాంజిలాలజి’ అంటే ఏమిటి?
ఎ) రక్తం గురించిన అధ్యయనం
బి) గుండె గురించిన అధ్యయనం
సి) రక్తనాళాల గురించిన అధ్యయనం
డి) శోషరస అధ్యయనం

32. హిమోగ్లోబిన్‌లో ఉండే లోహం?
ఎ) మెగ్నీషియం
బి) ఐరన్‌
సి) కాపర్‌
డి) జింక్‌

33. హీమోసయనిస్‌లో ఉండే లోహం?
ఎ) మెగ్నీషియం
బి) ఐరన్‌
సి) కాపర్‌
డి) జింక్‌

34. ‘వెరికోస్‌’ అనేది దేనికి సంబంధించిన వ్యాధి?
ఎ) ధమనులు
బి) సిరలు
సి) ఎర్ర రక్తకణాలు
డి) కాలేయం

35. కరోనరి ధమని ఏ అవయవానికి రక్తాన్ని తీసుకొనివెళుతుంది?
ఎ) గుండె
బి) మూత్రపిండం
సి) మెదడు
డి) కాలేయం

36. రక్తంలో ప్లాస్మా ఎంత శాతం ఉంటుంది?
ఎ) 10
బి) 55
సి) 40
డి) 20

37. ప్లాస్మాలో ఎంత శాతం నీరు ఉంటుంది?
ఎ) 8-10
బి) 90-92
సి) 50-60
డి) 25-30

38. తెల్ల రక్త కణాలన్నింటిలో అతి చిన్నది ఏది?
ఎ) న్యూట్రోఫిల్‌
బి) బెసోఫిల్‌
సి) మోనోసైట్‌
డి) లింఫోసైట్‌

39. ‘మానవ శరీరంలోని రక్త నిధి’ అని దేనిని పిలుస్తారు?
ఎ) గుండె
బి) కాలేయం
సి) ప్లీహం
డి) ఎముక

40. రక్తం అనేది ఒక?
ఎ) సంధాయక కణజాలం
బి) ఉపకళా కణజాలం
సి) కండర కణజాలం
డి) ప్రోటీన్‌

41. రక్త కణాల సంఖ్యను లెక్కించడానికి ఉపయోగించే పరికరం ఏది?
ఎ) స్పిగ్మోమానోమీటర్‌
బి) హీమోసైటోమీటర్‌
సి) హీమోగ్రామ్‌
డి) ఇసిజి (ఎలకో్ట్ర కార్డియో గ్రాఫ్‌)

42. మానవుని రక్తానికి ఎంత పిహెచ్‌ ఉంటుంది?
ఎ) 7.4
బి) 5.6
సి) 8.9
డి) 7.0

43. చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్లే రక్తనాళం ఏది?
ఎ) పుపుస సిర
బి) సిర
సి) ధమని
డి) పుపుస ధమని

44. ఆమ్లజని సహిత రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకు తీసుకెళ్లే రక్తనాళం ఏది?
ఎ) ధమని
బి) పుపుస ధమని
సి) సిర
డి) పుపుస సిర

45. కింది వాటిలో సహజ రక్త స్కంధన నిరోధకం ఏది?
ఎ) హిపారిన్‌
బి) సోడియం సిట్రేట్‌
సి) సోడియం ఆగ్జాలేట్‌
డి) పైవన్నీ

46. ఏ వ్యాధి వచ్చినవారిలో ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలో ఉంటాయి?
ఎ) థలసేమియా
బి) సికిల్‌సెల్‌ ఎనీమియా
సి) అల్జీమర్స్‌
డి) హిమోఫీలియా

47. ఏ వ్యాధి ఉన్నవారిలో రక్త స్కంధనం ఆలస్యం అవుతుంది?
ఎ) హీమోఫీలియ
బి) సికిల్‌సెల్‌ ఎనీమియా
సి) థలసేమియా
డి) అల్జీమర్స్‌

48. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
ఎ) జూన్‌ 14
బి) జూన్‌ 4
సి) జూలై 4
డి) జూలై 14

49. ప్రపంచ థలసేమియ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
ఎ) మే 8
బి) జూన్‌ 8
 సి) జూలై 8
డి) సెప్టెంబరు 8

50. భారతదేశంలో మొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా జరిపిన వైద్యుడు ఎవరు?
ఎ) బెర్నాల్డ్‌
బి) డా. చిదంబరం
సి) డా. వేణుగోపాల్‌
డి) విలియం కాఫ్‌

1) బి 2) బి 3) ఎ 4) డి 5) సి 6) బి 7) సి 8) బి 9) ఎ 10) ఎ

11) ఎ 12) ఎ 13) డి 14) డి 15) సి 16) డి 17) బి 18) ఎ 19) బి 20) డి

21) సి 22) ఎ 23) సి 24) ఎ 25) ఎ 26) సి 27) ఎ 28) సి 29) బి 30) బి

31) సి 32) బి 33) సి 34) బి 35) ఎ 36) బి 37) బి 38) డి 39) సి 40) ఎ

41) బి 42) ఎ 43) డి 44) డి 45) ఎ 46) బి 47) ఎ 48) ఎ 49) ఎ 50) సి




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...