సుకన్య సమృద్ధి యోజన పథకం

               భ్రూణ హత్యలను అరికట్టిసమాజంలో ఆడపిల్లలకు సమాన విద్యా, ఉద్యోగావకాశాలు కల్పించడం, ఆర్థిక సాధికారత చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకంను ప్రవేశపెట్టింది.
 
          ‘భేటీ బచావో భేటీ పడావో’ ఉద్యమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్ జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. దీనిని తొలి విడతగా దేశ వ్యాప్తంగా 100 జిల్లాలో ప్రారంభించారు. పథకం మూలధనం కింద కేంద్ర ప్రభుత్వంరూ. 100 కోట్లు కేటాయించింది. ప్రముఖ సినీ నటి మాధురి దీక్షిత్ ఈ పథకానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఖాతా నిర్వహణ - ప్రయోజనాలు
           సుకన్య సమృద్ధి యోజన పథకం కింద పదేళ్ల లోపు ఆడపిల్లల పేరిట తల్లిదండ్రులు ఖాతాను తెరవచ్చు. ఈ ఖాతాలో నెలకు రూ.1,000 నుంచి రూ.1,50,000 వరకు జమచేయవచ్చు. ఖాతా ప్రారంభించినప్పటి నుంచి 21 సంవత్సరాల వరకు నగదు వెనక్కి తీసుకునే వీలుండదు. అయితే అమ్మాయికి 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత వివాహం లేదా చదువుల కోసం జమ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

అర్హతలు - దరఖాస్తు విధానం
  • ప్రతి జిల్లాలోనిప్రధాన, ఉప తపాలా కార్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకుల్లో మొదటగా రూ.1000 డిపాజిట్ చేసి ఖాతాను తెరవచ్చు.
  • అప్పుడే పుట్టిన శిశువు మొదలుకొని పదేళ్ల వయసు ఉన్న ఆడపిల్లలు ఇందుకు అర్హులు.
  • ఒక బాలికకు ఒకే ఖాతా, కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరిట మాత్రమే (కవల పిల్లలకు మినహాయింపు ఉంటుంది) ఖాతాను తెరిచే అవకాశం ఉంది.
  • ఖాతాను తెరవడానికి బాలిక రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, జనన ధ్రువీకరణ పత్రం, తండ్రి లేదా సంరక్షకుడి చిరునామా, గుర్తింపు తెలియజేసే పత్రాలు సమర్పించాలి.
  • ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనిష్టంగా 14 ఏళ్లు, గరిష్ఠంగా 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు. అయితే 21 ఏళ్ల తర్వాతనే నగదును ఉపసంహరించుకోవాలి.
  • బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత చదువు కోసం అయితే (50 శాతం), వివాహం జరిగితే మొత్తం చెల్లిస్తారు. పూర్తి మొత్తం కావాలంటే బాలికకు 21 సంవత్సరాలు నిండాల్సిందే.

వడ్డీ చెల్లింపు
          పథకంలో భాగంగా ఖాతాలో జమ చేసిన మొత్తానికి పతి ఏటా చక్రవడ్డీ చెల్లిస్తారు. వడ్డీ రేట్లు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటాయి. ఈ ఖాతాలో జమ చేసిన డబ్బు, వడ్డీ, ఉపసంహరించుకున్న నగదుకు ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. ముఖ్యంగా ఈ ఖాతాను ప్రభుత్వ బాండ్లకు అనుసంధానం చేస్తారు. ఉదాహరణకు నెలకు రూ.వెయ్యి చొప్పున 14 ఏళ్లు చేస్తే 21 ఏళ్ల తర్వాత 6,31,621 వచ్చే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...