స్వదేశీ ఉద్యమం ||| వందేమాత‌ర ఉద్య‌మం ||| Swadeshi Movement ||| Vandemataram Movement |||

  • ఈ ఉద్యమంలో విదేశీ వస్తువులను బహిష్కరించి స్వదేశీ వస్తువులనే వాడాలని నిర్ణయం తీసుకోవడం వల్ల దీనికి స్వదేశీ ఉద్యమ‌మ‌ని పేరొచ్చింది.
  • మరో పేరు – వందేమాతర ఉద్యమం (Hail Mother land)
  • అతివాద నాయకులు భారతదేశంలో చేపట్టిన మొదటి ఉద్యమం – వందేమాతర ఉద్యమం
  • 1905లో బెంగాల్ విభజన కారణంగా వందేమాతర ఉద్యమం ప్రారంభమైనది.
  • ఈ ఉద్యమానికి వందేమాతర ఉద్యమం అని పేరు పెట్టింది – అశ్వనీ కుమార్ దత్తా
  • వందేమాతర ఉద్యమం బెంగాల్‌లో ఉద్భవించుటకు ప్రధాన కారణం – బెంగాల్ విభజన
  • ఈ ఉద్యమంలో ప్రజలు వందేమాతరం గీతంను పాడ‌టం వలన, ఒకరినొకరు పలకరించుకోవ‌డానికి
  • వందేమాతరం పదాన్ని వాడ‌టం వలన వందేమాతర ఉద్యమం అని పేరొచ్చింది.
  • వందేమాతర గీతంను బంకించంద్ర చటర్జీ తన ఆనందమర్ (1882) నవలలో రచించాడు. ఈ నవల సన్యాసుల తిరుగుబాటుకు సంబంధించినది.
  • ఈ ఉద్యమాన్ని భారతదేశమంతటా విస్తరింపజేయడంలో కీలకపాత్ర వహించినది – తిలక్

వందేమాతర ఉద్యమ నాయకులు

  • బాలగంగాధ‌ర్ తిల‌క్ – బొంబై
  • లాలా లజపతిరాయ్: పంజాబ్
  • చిదంబరం పిళ్ళై – మద్రాస్
  • బిపిన్ చంద్రపాల్ – ఆంధ్ర‌
  • అజిత్ సింగ్ – పంజాబ్‌
  • అశ్వ‌నీకుమార్ ద‌త్త – బార‌సోల్‌
  • సయ్యద్ హైదరాజా – ఢిల్లీ

.

.

వందేమాతర ఉద్యమానికి గల రెండు పార్వ్శాలు

    • విదేశీ వ‌స్తు బ‌హిష్క‌ర‌ణ‌
    • స్వ‌దేశీ వ‌స్తు ప్రోత్సాహం
  • 1906 ఫిబ్రవరి 27న కలకత్తాలో College Square దగ్గర విదేశీ వస్త్ర దహనం జరిగింది.
  • 1906లో బెంగాలీ స్టార్ట్ చేసిన‌ నూలు మిల్లు – వంగ లక్ష్మీ కాటన్ మిల్లు
  • వందేమాతర ఉద్యమాలను అణచడానికి ప్రభుత్వం 1905లోనే లార్డ్ మింటోను వైశ్రాయ్‌గా నియమించింది.
  • ఫలితంగా 1908 జూలై 13లో తిలక్‌ను అరెస్టు చేసి 6 ఏండ్ల జైలు శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపారు.
  • ఈ ఉద్యమ కాలంలో లాలా లజపతిరాయ్ దేశ బహిష్కరణకు గుర‌య్యారు.
  • క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్న వారు – బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్

వందేమాతర ఉద్యమం అంతం

  • 1911లో బ్రిటిష్ చక్రవర్తి జార్జి మరియు అతని భార్య మేరీ భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జనరల్ 2వ హార్డింజ్ ఢిల్లీ దర్బార్ నిర్వహించాడు.
  • ఈ ఢిల్లీ దర్బారులో 5వ జార్జి స్వయంగా ఈ క్రింది ప్రకటనను చేశాడు. 1. రాజ‌ధాని క‌ల‌క‌త్తా నుంచి ఢిల్లీకి మార్పు, 2. బెంగాల్ విభజన రద్దు
  • బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లు జార్జి-5 అధికారికంగా ప్రకటించడంతో వందేమాతర ఉద్యమం ముగిసింది. (1911 డిసెంబర్ 12)
  • 1911 డిసెంబర్ 12న బెంగాల్ విభజనను వైశ్రాయ్ లార్డ్ హార్డింజ్ రద్దు చేయడంతో వందేమాతర ఉ ద్యమం ముగిసింది.

ఇతర ముఖ్యాంశాలు

  • వందేమాతర ఉద్యమం వ్యాప్తి చేయుటకు తోడ్పడిన పత్రికలు – బెంగాలీ, యుగంధ‌ర్‌, అమృత‌బ‌జార్‌, వందేమాత‌రం, న‌వ‌భార‌త్‌
  • వందేమాతర ఉద్యమ సందర్భంగా ఆంధ్రలో స్థాపించబడిన కొత్త‌ పత్రికలు – ఆంధ్ర‌కేస‌రి, దేశాభిమాని, స్వ‌రాజ్య
  • వందేమాతర ఉద్యమంలో అగ్రస్థానం వహించిన జిల్లా – బారసోల్
  • వందేమాతర ఉద్యమాన్ని ప్రధానంగా నిర్వహించింది – అతివాదులు
  • భరతమాత సమాజంను స్థాపించింది – అజిత్ సింగ్
  • అజిత్ సింగ్ (లాల్ అనుచరుడు) స్థాపించిన పత్రిక – పీష్వా
  • వందేమాతర ఉద్యమం సందర్భంగా, ‘ఆర్య సమాజం నాతల్లి, వైదిక ధర్మం నా తండ్రి’ అని పలికినది – లాలాలజపతిరాయ్
  • ‘వేదాలు, వేదాంతాలు కూడా స్వరాజ్యం గురించి చెప్తాయి’ – బిపిన్ చంద్రపాల్
  • స్వాతంత్ర్యం జాతి ధర్మం, నా హక్కు దానిని కాపాడటం ప్రజల భాధ్యత. ఈ బాధ్యత నిర్వహణలో అవసరమైతే హింసను కూడా ప్రయోగించవచ్చు. అని చెప్పినది – అరవింద ఘోష్
  • 1907లో అరవింద్ ఘోష్ వందేమాతరం పత్రికలో “డర్టిన్ ఆఫ్ పాసివ్ రెసిస్టెన్స్” పేరుతో 7 ఆర్టికల్స్‌ను ప్రచురించాడు.
  • వందేమాతర ఉద్యమ కాలంలో బ్రిటీషు వారు ప్రవేశపెట్టిన సంస్కరణలు – మింటో మార్లే సంస్కరణలు (1909)
  • ఈ చట్టం (1909) ముస్లింలకు ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించింది.

.

.

వందేమాతర ఉద్యమం – సంస్థల స్థాపన

  • వందేమాతర ఉద్యమ సమయంలో స్వదేశీ సంస్థలు, విద్యాలయాలు, పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.
  • స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. విదేశీ వస్తు బహిష్కరణ జరిగింది.
  • బెంగాల్ జాతీయ కళాశాలను అరవింద‌ ఘోష్ ఏర్పాటు చేశారు.
  • వందేమాతర ఉద్యమ కాలంలో మద్రాస్ కేంద్రంగా ఏర్పడిన బ్యాంకు – ఇండియన్ బ్యాంక్ (1907)
  • భారతీయ యువకులు పారిశ్రామిక శిక్షణ కోసం జపాన్ వెళ్లారు.
  • అహ్మదాబాద్‌లో దేశీయ ఉత్పాదిత వస్తు సంరక్షణ సమితి ఏర్పడింది.
  • బారసోల్‌లో అశ్వనీ కుమార్ దత్ స్వదేశీ బోధన సమితి స్థాపించారు.
  • బెంగాల్ కెమికల్స్ ఫ్యాక్టరీని పి.సి.రాయ్ (ప్రపుల్ల చంద్రరాయ్) స్థాపించారు.
  • స్వదేశీ ఉద్యమకాలంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు కాశీం బజార్ వారి మునీంద్ర నంది ధన సహాయం చేశారు.
  • 1906లో జాతీయ శిక్షా పరిషత్ స్థాపించారు (1906లో జాతీయ విద్యా మండలి స్థాపించారు)
  • భారతీయ ఉద్యమకారులపై సానుభూతి ప్రకటించిన బ్రిటిష్ అధికారి – సర్ హెన్రీ కాటన్
  • ఆంధ్ర మహాసభను టంగుటూరి ప్రకాశం, కొండా వెంకటసుబ్బయ్య ప్రారంభించారు.
  • నైనిటాల్ ఇండస్ట్రియల్ కాన్ఫరెన్స్ మదన్మోహన్ మాలవ్య, చింతామణి ప్రారంభించారు.
  • ప్రచారణీ సభ ముంబాయిలో, నగరీ ప్రచారణీ సభ అలహాబాద్‌లో స్థాపించబడినవి.

మహ్మదీయుల పాత్ర

  • ఈ కాలంలో మహ్మదీయులు ప్రచురించిన సాహిత్యం – రెడ్ పాంప్లేట్‌, క్రిష‌క్‌బందు
  • ఈ ఉద్యమంలో మహ్మదీయులు పాల్గొనకుండా అప్పల్ ఖాన్, శివాజీ చారిత్రక ఉదంతాన్ని బ్రిటీష్ అధికారులు ప్రచారంలోకి తెచ్చారు.
  • సభలో ఒక వక్త మాల్వి అబ్దుల్ కరీంను ఉల్లేఖిస్తూ శివాజీ మసీదులను పవిత్ర స్థలాలుగా గౌరవించాడని, ఖురాన్ గ్రంథాన్ని పవిత్ర గ్రంథంగా భావించాడని, ముస్లింలకు కూడా శివాజీ గౌరవనీయుడే అని తెలిపాడు.
  • సయ్యద్ హైదర్ రాజా – ఢిల్లీ ఉద్య‌మ‌క‌ర్త‌
  • అబ్దుల్ రసూల్ – బారిసాల్ స‌ద‌స్సుకు అధ్య‌క్ష‌త వ‌హించాడు
  • లియాఖ‌త్ అలీఖాన్ – ట్యూటికోరిన్ కోర‌ల్ మిల్స్‌లో ఉద్య‌మించాడు.

కార్మికుల పాత్ర

  • దేశంలో మొదటి పెయింటర్స్ యూనియన్ – కలకత్తాలో (1905 అక్టోబర్ 21) ప్రారంభించబడింది.
  • రైల్వే వర్కర్స్ యూనియన్ అసన్‌సోల్‌, రాణీగంజ్ (1906)లో ఏర్పడింది.
  • ఇండియన్ మిల్స్ హాండ్స్ యూనియన్ అశ్వనీకుమార్ బెనర్జీ 1906 బెంగాల్‌లో ఏర్పాటుచేశారు.
  • మనీంద్ర నంది – పరిశ్రమలు నెలకొల్పే వారికి ధన సహాయం చేశారు.

బ్రిటీష్ ప్రభుత్వం స్వదేశీ ఉద్యమాన్ని అణచడానికి తెచ్చిన చట్టాలు

  1. Prevention of Seditions meeting Act -1907
  2. Explosive Substance Act – 1908
  3. Criminal Law amendment Act – 1908
  4. The News Paper Act 1908
  5. Indian Press Act – 1910

వ్యాఖ్యానాలు

  • స్వదేశీ ఉద్యమం కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వ్యాపించింది – జవహర్‌లాల్ నెహ్రూ
  • స్వదేశీ ఉద్యమం భారతీయులలో రాజకీయ చైతన్యం కలిగించి జాతీయ భావాన్ని ఉద్భతం – మహాత్మాగాంధీ

ఉద్యమం ప‌రిణామాలు

  • వందేమాతరం, యుగాంతర్, సంధ్య ఉపాధ్యాయ పత్రికలు నిషేధించబడినవి.
  • లాలా లజపతి రాయ్ దేశ బహిష్కరణకు (1907) గురిచేశారు.
  • అరవింద ఘోష్, బిపిన్ చంద్రపాల్ క్రియాశీల రాజకీయాలకు విరామం ఇచ్చారు.
  • 1909 మింటో-మార్లే సంస్కరణలు బ్రిటీష్ వారు ప్రవేశపెట్టారు. దీని ద్వారా ముస్లింల‌కు ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గాలు కేటాయించారు.
  • తూర్పు బెంగాల్ లో ఈ ఉద్యమాన్ని అణచినది – లెఫ్టినెంట్ ఫుల్లర్

 

 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...