బ్రిటిష్ పాలన ఫలితంగా మిగిలిన రంగాల కన్నా వ్యవసాయ రంగం బాగా నష్టపోయింది.
బ్రిటిష్ వారి కొత్త భూమిశిస్తు విధానాలు, వాణిజ్య పంటల ప్రాధాన్యత, అధిక
వడ్డీ రేట్లు రైతులను మరిన్ని సమస్యల్లోకి నెట్టి తిరుగుబాట్లను అనివార్యం
చేశాయి.
నీలిమందు విప్లవం (1859-60)
- ఈ విప్లవానికి మరో పేరు – ఇండిగో తిరుగుబాటు.
- ఎక్కడ జరిగింది – గోవిందాపూర్ గ్రామం (పశ్చిమబెంగాల్), నదియా ఝాసోర్, బీహార్‌లోని దర్భాంగ.
- నాయకులు: విష్ణుచరణ్ బిశ్వాస్, దిగంబర బిశ్వాస్.
- బెంగాల్‌లో నీలిమందు పంటల సాగును ప్రవేశ పెట్టింది – లూయిస్ బోనాద్ (1777).
- ఉద్యమానికి మద్దతు తెలిపిన పత్రిక – హిందూ పేట్రియాట్ (సంపాదకుడు హరిశ్చంద్ర ముఖోపాధ్యాయ)
- దీస బంధుమిత్ర తన నీల్‌దర్పణ్ నాటకంలో రైతులపై వ్యాపారులు సాగిస్తున్న దౌర్జన్యాల గురించి వివరించాడు.
- బెంగాల్ భూస్వాముల నుంచి భూములు కౌలుకు తీసుకున్న యూరోపియన్లు ఆ భూముల్ నీలిమందు పంటను పండించాలని రైతులు నిర్బంధించారు
- నీలి మందు పంటవల్ల ప్రతిఫలం సరిగా లభించకపోయినా దాన్నే పండిచాల్సి రావడం రైతులు అసంతృప్తికి దారితీసి తిరుగుబాటుకు కారణమైంది.
తిన్‌కథియా
- ఈ పద్ధతి ప్రకారం రైతు తన భూమిలోని 1/3వ వంతు భూమిలో నీలిమందు పంటనే పండించాలి. దాన్ని ఆంగ్లేయులు నిర్ణయించిన ధరకే అమ్మాలి.
- ఫలితంగా జరిగిన తిరుగుబాటుకు విష్ణుచరణ్ బిశ్వాస్, దిగంబర్ బిశ్వాస్ నాయకత్వం వహించారు.
- మొదటిసారిగా కలత్తాలోని మేధావి వర్గం తిరుగుబాటును సమర్థించింది. జమిందార్లు, క్రైస్తవ మిషనరీలు కూడా తిరుగుబాటుకు సహకరించాయి.
- ప్రభుత్వం తిరుగుబాటును అణచివేసినా రైతుల పట్ల సంయమనంతో వ్యవహరించింది.
- నీలిమందు రైతాంగాన్ని విమర్శిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది – రాజారాం మోహన్ రాయ్
- దేశ చరిత్రలో నీలిమందు రైతాంగ ఉద్యమానికి మణిరత్నం లాంటి స్థానం ఉన్నది.
పాబ్నా తిరుగుబాటు (1872-76)
- తూర్పు బెంగాల్‌లో జమిందార్లు ఉన్నట్టుండి శిస్తు పెంచడంతో రైతులు సాయుధ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
- బ్రిటిష్ సైన్యం తిరుగుబాటును అణచివేసింది.
- 1859లో జారీ చేసిన చట్టం 10ని రద్దు చేసి కౌలుదారుల హక్కులను రక్షించే చట్టం 8ని పునరుద్ధరించారు.
.
.
దక్కన్ తిరుగుబాటు (1879)
- దక్కన్ రైతాంగ పోరాటం ప్రారంభమైన గ్రామం – సుఫా
- ఈ ఉద్యమం పుణే, అహ్మద్‌నగర్ జిల్లాలకు పూర్తిగా వ్యాప్తి చెందింది.
- దక్కన్‌లోని రైత్వారీ విధానం వల్ల రైతులు నగదు రూపంలో శిస్తు చెల్లించాల్సి వచ్చింది.
- పంటలు పాడైనా శిస్తులో మార్పు లేకపోవడం.
- ఫలితంగా వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు చేసి రైతులు భూమిని కోల్పోయారు.
- 1865 తర్వాత పత్తి ధరలు బాగా పడిపోవడంతో రైతులు బాగా నష్టపోయారు.
- ఈ తిరుగుబాటుకు మేధావుల మద్దతు లభించినట్లు తెలిపిన మరాఠీ పత్రిక – ‘దైవాన్ చక్షు’
- బ్రిటిష్ రెవెన్యూ విధానాన్ని, సివిల్ కోర్టు పని విధానాలను చాలా లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి – సర్.జి.వింగెట్
- దక్కన్ రైతాంగ పోరాట ఫలితంగా వచ్చిన చట్టం: దక్కన్ వ్యవసాయదారుల సహాయ చట్టం 1879
- ఈ చట్టం ప్రకారం : అప్పులు తీర్చని రైతులను అరెస్టు చేయరాదు, రైతుల నుంచి వడ్డీ వ్యాపారులకు భూమి మార్పిడి చేయరాదు.
బెంగాల్ కౌలు దారుల చట్టం-1885
- 12 ఏండ్లు ఒకే గ్రామంలో ఉండి భూమిని కౌలుకు చేస్తే రైతుకు ఆ భూమి మీద ఆక్యుపెన్సీ హక్కులను కల్పిస్తూ ఈ చట్టం చేశారు. దీని ద్వారా రైతు ఆ భూమిని మరొకరికి బదిలీ చేయడానికి గానీ, కౌలుకివ్వడానికి గానీ అవకాశం లేదు.
పంజాబ్ భూమి అన్యాక్రాంత చట్టం-1902
- వడ్డీ వ్యాపారుల జులుం పెరిగి భూములు వడ్డీ వ్యాపారులు స్వాధీనం చేసుకున్నారు.
- దీంతో ప్రభుత్వం 1902లో ఈ చట్టం చేసి వారి యొక్క ఆగడాలను అరికట్టింది.
చంపారన్ సత్యాగ్రహం 1917
ప్రాంతం: చంపారన్ (బీహార్)
- ఉద్యమ నాయకుడు : మహాత్మాగాంధీ (భారతదేశంలో గాంధీ చేపట్టిన మొట్టమొదటి సత్యాగ్రహం)
- చంపారన్ ప్రాంతం బ్రిటిష్ వలస పాలన కిందికి వచ్చిన సంవత్సరం – 1765.
- యూరోపియన్ నీలిమందు తోటల యజమానులు రైతుల భూముల్లో 1/3వ వంతు నీలిమందు తప్పకుండా పండించాలని నిర్ణయించారు. దీన్ని తీన్‌కథియా విధానం అంటారు.
- తీన్‌కథియా నుంచి మినహాయింపు కోరే రైతులు షరహ్‌బేషి (శిస్తు పెంపు) లేదా తవాన్ (నష్టపరిహారం) చెల్లించవలసి వచ్చింది.
- రాజేంద్రప్రసాద్, జె. బి. కృపలానీ, ఎ.యన్. సినా, మజ్రుల్‌హక్, మహాదేవదేశాయ్‌లు గాంధీకి సహకరించారు.
- గాంధీని సభ్యుడుగా నియమిస్తూ ప్రభుత్వం విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది.
- ఆ తరువాత థీన్‌కథియా రద్దయింది.
ఖేడా సత్యాగ్రహం – 1918
- 1918లో ఖేదా జిల్లా (గుజరాత్)లో వర్షాభావం వల్ల పంటలు పండలేదు.
- దీంతో రైతులు శిస్తు మినహాయింపు కోరారు.
- గాంధీ, పటేల్‌లు ఈ సత్యాగ్రహానికి నాయకత్వం వహించారు.
- ప్రభుత్వం శిస్తు వసూలును తాత్కాలికంగా నిలిపివేసింది.
మోప్లా తిరుగుబాటు – 1921
- జరిగిన ప్రదేశం – మలబారు (కేరళ)
- మలబార్ తీరంలోని ముస్లిం రైతులనే మోప్లాలు అంటారు.
- మోప్లాల యొక్క హిందూ భూస్వాములను జెన్మీలు అంటారు.
- జెన్మీలు కౌలు పెంచి మోప్లాలను భూముల నుంచి వెళ్లగొట్టారు.
- ఆర్థిక సమస్యకు మత విభేదాలు తోదయ్యాయి.
- 1921లో ఆయుధాలున్నాయనే కారణంతో బ్రిటిష్ పోలీసులు తిరురంగడిలోని మసీదులపై దాడి చేయడంతో తిరుగుబాటు ప్రారంభమైంది.
- కున్ అహ్మద్ హాడీ, కలతింగల్ మాహాద్, ఆలీ ముసలియార్‌లు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.
- 1921 నవంబర్ 20న 66 మంది మోప్లాలను రైలు వ్యాగన్‌లో బంధించబడంతో ఊపిరాడక మరణించారు.
- కొన్ని చోట్ల మోప్లాలు రిపబ్లిక్‌లు స్టాపించగలిగినా తిరుగుబాటు అణచి వేయబడింది.
- ఇది బ్రిటిష్ వ్యతిరేక, జమీందారీ వ్యతిరేక, హిందూ వ్యతిరేక తిరుగుబాటు.
బార్డోలి సత్యాగ్రహం -1928
- గుజరాత్లోని బార్డోలీ జిల్లాలో ప్రభుత్వం భూమిశిస్తును 22 శాతం పెంచింది.
- వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో No Revenue Campaign జరిగింది.
- దీనికి బ్రిటిష్ వారు నియమించిన కమిటీ – బ్రూమ్ ఫీల్డ్ కమిటీ
- ఈ సత్యాగ్రహం తరువాత పటేల్‌కు గాంధీజీ సర్దార్ అనే బిరుదునిచ్చారు.
వర్లీ తిరుగుబాటు (1945-46)
- మహారాష్ట్ర కోస్తా జిల్లా థానేలో వర్లీలు నివసిస్తారు.
- ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించినది – సి.పి.ఐ. కిసాన్ సభ ఆదివాసి
- తిరుగుబాటుకు కారణం : భూస్వాముల వడ్డీ వ్యాపారుల దోపిడీ
- 1946లో జనవరిలో వర్లీగీ మహాసభ జరిగింది.
.
.
తెబాగ ఛాయ్ ఉద్యమం (1946-47)
- ప్రదేశం: బెంగాల్
- కేంద్ర స్థానం: ఠాకూర్ గేమ్
- నాయకత్వం వహించినది: చారు మజుందార్, రాజన్ సింగ్, సుషీల్‌సేన్, రాంలాల్ సింగ్
- చారుమజుందార్ పంచాఘర్ ప్రాంతంలో ఉద్యమాన్ని నడిపాడు.
- నిర్వహించింది – బెంగాల్ కిసాన్ సభ
- కారణం: వడ్డీ వ్యాపారుల దోపిడి, 2/3 వంతు పంట భూస్వాములకు చెందడం.
- బ్రిటిష్ వారు భారతదేశం విడిచి వెళ్ళకముందు జరిగిన పోరాటాలలో గిరిజనులు పాల్గొన్న అతిపెద్ద రైతాంగ పోరాటం – తెలగ ఉద్యమం
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం (1946-51)
- హైదరాబాద్ రాష్ట్రంలోని నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమం.
- నాయకత్వం: కమ్యూనిస్టు నాయకులు
- కారణం : జాగీర్‌దార్లు, దేశముఖ్‌ల దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తూ ఈ ఉద్యమం సాగింది.
- ఫలితం : వెట్టికి గురి అవుతున్న గిరిజనులు విముక్తి పొందారు. కౌలుదార్లు, భూమిలేని కూలీలు ఏకమయ్యారు.
- నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం దేశ స్వాతంత్రోద్యమం కూడా ఈ ఉద్యమంలో భాగమే.
అటవీ సత్యాగ్రహం (1931)
- ప్రాంతం: దక్షిణ భారతదేశం
- నాయకత్వం: ఎస్.వి.రామానాయుడు, ఎన్.జి.రంగా.
- కారణం : జమీందార్ల అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహం జరిగింది.
20వ శతాబ్దం లో రైతు చైతన్యం
- 1923లో గుంటూరు జిల్లాలో రైతు కూలీ సంఘాన్ని ఎన్.జి.రంగా స్థాపించాడు. అది క్రమంగా కృష్ణా, గోదావరి జిల్లాలకు విస్తరించింది.
- 1926-27లో బెంగాల్, బీహార్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లో కిసాన్ సభలు వెలిశాయి.
- 1928లో ఎన్.జి.రంగా, బి.వి. రత్నంలు ఆంధ్ర రైతులు ప్రొవెన్షియల్ సమాఖ్య స్థాపించారు. అధ్యక్షుడు – బి.వి. రత్నం
- 1935లో దక్షిణ భారత రైతుకూలీ సమాఖ్య ఏర్పడింది. ముఖ్య కార్యదర్శి – ఎన్.జి.రంగా ఉపకార్యదర్శి – ఇ.యం.యన్ నంబూద్రిప్రసాద్.
- 1936లో లక్నోలో జరిగిన ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ సమావేశంలో అభిల భారత కిసాన్ సభ ఆవిర్భవించింది.
- దీని తొలి సమావేశానికి బీహార్ రైతు నాయకుడు స్వామి సహజానంద అధ్యక్షత వహించాడు.
- 1936 నుంచి సెప్టెంబర్ 1వ తేదీని అఖిల భారత రైతు దినంగా ప్రతి సంవత్సరం నిర్వహించారు.
- 1936 సభ జమిందారీ రద్దును, వెట్టిచాకిరి నిర్మూలనను డిమాండ్ చేసింది. రుణాల మాఫీని కోరింది
- 1937-46 మధ్యలో రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి.
పంజాబ్ నవజవాన్ భారత్ సభ
- దీన్ని 1926లో భగత్‌సింగ్, యశ్‌పాల్, చబిల్‌దాస్ స్థాపించారు.
- పంజాబ్ రైతు ఉద్యమ కాలంలో బంగా దయాల్ రచించిన పగిడి సంబాల్ ఓ జట్టా అనే పాట అత్యంత ఆదరణ పొందింది.
- హరీష్ చంద్రముఖర్జి, హిందూ పేట్రియాట్ అనే పత్రిక ద్వారా రైతుల సమస్యలను తెలియజేశారు.
- దీనబందు మిత్ర నీల్ దర్పణ్ నాటకంను రచించి బ్రిటిష్ వారి యొక్క అణిచివేత విధానాలను, రైతుల సమస్యలను తెలియజేశాడు.
No comments:
Post a Comment