బెంగాల్ విభజనకు సంబంధించి ముఖ్యమైన సంఘటనలు
అధికారిక ప్రకటన | 1905 జూలై 20 |
బెంగాల్ విభజన అమలు | 1905 అక్టోబర్ 16 (శోకదినం) |
విభజన వ్యతిరేకోద్యమ ప్రారంభం | 1905 ఆగస్టు 7 |
బెంగాల్‌ను విభజించిన వైశ్రాయ్ | లార్డ్ కర్జన్ |
ఆనాటి భారత రాజ్య కార్యదర్శి | జాన్ బ్రోడిక్ (1903-05) |
విభజన రద్దు | 1911 డిసెంబర్ 1 |
రద్దు నాటి వైశ్రాయ్ | లార్డ్ హోర్డింజ్ |
భారత రాజ్య కార్యదర్శి | ఎర్ల్ ఆఫ్ క్రూ |
- 1905లో బెంగాల్‌ను విభజించిన వైశ్రాయ్ – లార్డ్ కర్ణన్
- బెంగాల్‌ను విభజించే టైమ్‌కు మొత్తం బెంగాల్ జనాభా – 8 కోట్లు. ఇందులో పశ్చిమ బెంగాల్ జనాభా 5 కోట్లు, తూర్పు బెంగాల్ జనాభా 3 కోట్లు.
- బెంగాల్ విభజన గురించి పేర్కొన్న పత్రిక – సంజీవని (1905 జూలై 6)
- బెంగాల్, బీహార్, ఒరిస్సా, ఛోటా నాగపూర్ ప్రాంతాలు బెంగాల్‌లో కలిసి ఓ రాష్ట్రంగా ఉండేది.
- బెంగాల్ లో ఉధృతమౌతున్న జాతీయ ఉద్యమాన్ని, హిందూ, ముస్లింల ఐక్యతను దెబ్బతీయడానికి బెంగాల్‌ను విభజించారు.
- లార్డ్ కర్జన్ డివైడ్ అండ్ రూల్ విధానాన్ని ప్రవేశపెట్టి పరిపాలనా సౌలభ్యం కారణంతో బెంగాల్‌ను విభజించారు.
- భాషా పరంగా వేరైన బీహార్, ఒరిస్సాలను వేరు చేయకుండా వాటిని పశ్చిమ బెంగాల్‌లో ఉంచి బెంగాలీ ముసింలు అధికంగా ఉండే తూర్పు ప్రాంతాన్ని అస్సాంలో కలపడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
.
.
విభజనకు ప్రధాన కారణం
- బెంగాల్‌ను విభజించి బెంగాల్ స్వాతంత్ర పోరాటాలను నిర్మూలించడం.
- బెంగాలీ జాతీయవాదాన్ని అణచడం.
- బెంగాల్ ప్రజలను విడదీసి వారి సంస్కృతిని విచ్ఛిన్నం చేయడం.
- బెంగాల్ విభజన వార్తలను మొదట ప్రచురించిన పత్రిక – సంజీవని (1905 జూలై 6)
- సంజీవని పత్రిక బహిష్కరణ (బాయ్ కాట్) అనే పదాన్ని మొదటగా వాడింది.
- సంజీవని పత్రిక స్థాపకుడు – కృష్ణకుమార్ మిత్రా
- బెంగాల్ విభజన ఉద్యమంనకు మద్దతు తెలిపిన పత్రిక – అమృత బజార్
- అమృత బజార్ పత్రిక స్థాపకుడు – శిశిర్ కుమార్ ఘోష్
- బెంగాల్‌ను తూర్పు, పశ్చిమ బెంగాల్‌గా విభజించారు.
- తూర్పు బెంగాల్ రాజధాని: ఢాకా (ఉప రాజధాని – చిట్టగాంగ్)
- పశ్చిమ బెంగాల్ రాజధాని : కలకత్తా
- పై రెండు రాష్ట్రాలలోను ముస్లింల జనాభా ఎక్కువై బెంగాలీలు మైనార్టీలయ్యారు. ఫలితంగా ఇన్నాళ్లూ రాజకీయాల్లో బెంగాలీలకున్న ఆధిపత్యం ఇకపై వుండదు.
- తూర్పు బెంగాల్‌ను ముస్లింలకు అప్పగించేందుకే బెంగాల్ విభజించాని చెప్పింది – లార్డ్ కర్జన్
- బెంగాల్ విజభనను బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది – 1905 జులై 20
- బెంగాల్ విభజన వ్యతిరేఖ ఉద్యమం ప్రారంభం – 1905 ఆగష్టు 7
- 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజనను లార్డ్ కర్జన్ అధికారికంగా ప్రకటించాడు.
- బెంగాల్ ప్రజలు అక్టోబర్ 16ను బ్లాక్ డే/జాతీయ దుఃఖ దినం (శోక దినం)గా జరపుకున్నారు.
- లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన ప్రకటనకు వ్యతిరేకంగా బెంగాల్ ఉవ్వెత్తున లేచిన ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించింది – సురేంద్రనాథ్ బెనర్జీ
- బెంగాల్ విభజన దినం బ్రిటీషు సామ్రాజ్య విభజన దినంగా ప్రకటించినది – గాంధీజీ
- బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ, జాతి ఐక్యతను చాటుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ పిలుపు మేరకు బెంగాల్ ప్రజలు రక్షాబందన్‌ను పాటించారు.
- బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ, జాతి ఐక్యతను సూచిస్తూ గీతంను రచించినది – రవీంద్రనాథ్ ఠాగూర్
- ఈ గీతం పేరు – అమర్ సోనార్ బంగ్లా. తర్వాత ఈ గీతం బంగ్లాదేశ్ జాతీయ గీతం అయింది.
- 1905 అక్టోబర్ 16 బెంగాల్ విభజన (శోకదినం) రోజున కలకత్తాలో పెద్ద ఎత్తున సభను నిర్వహించి ప్రసంగించినది – సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనందమోహన్ బోస్
- ఇనుప ఊపిరితిత్తులు, కంచు కంఠం కల మహావక్త, వక్తకి ఆయన పేరు పర్యాయపదం అని సురేంద్రనాథ్ బెనర్జీని గురించి వ్యాఖ్యానించినది – చిలకమర్తి లక్ష్మీనరసింహం.
- బెంగాల్ విభజన రద్దయిన సంవత్సరం – 1911 డిసెంబర్ 11
- విభజన రద్దు టైమ్‌లో భారత వైశ్రాయ్ – లార్డ్ హార్డింగ్
- 5వ జార్జ్ రాజు 1911లో బెంగాల్ విభజన రద్దును, రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తూ ప్రకటించారు.
- రాజధాని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చింది- 1912లో
- 5వ జార్జ్ చక్రవర్తి భారత్ రాక సందర్భంగా ముంబాయిలో గేట్ వే ఆఫ్ ఇండియా నిర్మించారు.
.
.
బెంగాల్ విభజన ఉద్యమంలో పత్రికల పాత్ర
సంజీవని
- బెంగాల్ విభజనను తొలిసారి ప్రస్తావించిన పత్రిక (1905 జూలై 6)
- ఈ పత్రిక ప్రారంభ స్థాపకుడు – కృష్ణకుమార్ మిత్ర
- బహిష్కరణ (బాయ్ కాట్) పదాన్ని సూచించింది – కృష్ణకుమార్ మిత్ర
- ఈ పదాన్ని సూచించిన మరొక వ్యక్తి – బోలానాథ్ చంద్ర
అమృతబజార్
- బెంగాల్ విభజనను అధికారికంగా ప్రకటించిన పత్రిక
- దీని సంపాదకుడు శిశిర కుమార్ ఘోష్
బెంగాల్ విభజన ప్రముఖుల వాఖ్యలు
- లార్డ్ కర్జన్‌ను ఔరంగజేబుతో పోల్చింది – గోపాలకృష్ణ గోఖలే
- బెంగాల్ విభజనతో ఆందోళన చేసిన ఉద్యమకారులకు తన సానుభూతిని ప్రకటించిన ఆంగ్లేయుడు
– సర్ హెన్రీ కాటన్ - బెంగాల్ విభజన రోజును బ్రిటిష్ సామ్రాజ్య విభజన రోజుగా ప్రకటించినది – గాంధీ
- విభజన ఒక పాశవిక చర్య – సరసలీల (దాకా నవాబు)
- బానే షెల్ – సురేంద్రనాథ్ బెనర్జీ
- బెంగాల్ విభజన ఒక మోసం – ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్
ఢిల్లీ – లాహోర్ కుట్ర
- 1912 డిసెంబర్ 23న రాజధాని మార్పు సందర్భంగా జరిగిన సంబరాల్లో వైస్రాయ్ లార్డ్ హార్డింజ్‌పై జరిగిన హత్యాయత్నం ఢిల్లీ – లాహోర్ కుట్రగా చరిత్ర కెక్కింది.
- ఈ కుట్రతో సంబంధం ఉన్నవారు – రాస్ బిహారీ బోస్, సచిన్ సన్యాల్.
No comments:
Post a Comment