- భారత జాతీయ కాంగ్రెస్ అసలు పేరు – ఇండియన్ నేషనల్ యూనియన్
- ఇండియన్ నేషనల్ యూనియన్ పేరును సూచించింది – ఏవో హ్యూమ్
- ఇండియన్ నేషనల్ యూనియన్‌కు భారత జాతీయ కాంగ్రెస్ పేరును సూచించింది – దాదాబాయి నౌరోజీ
- భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రాసింది – పట్టాభి సీతారామయ్య
ఏవో హ్యూమ్
- పూర్తి పేరు – అలెన్ ఒక్టావియన్ హ్యూమ్
- బిరుదు – సిమ్లా రుషి
- ఇతను దివ్యజ్ఞాన సమాజంలో సభ్యుడు
- భారతీయ పేదరికంపై ఇతడు రూపొందించిన కరపత్రం – ఎన్ ఓల్డ్ మాన్ హోప్
- ఇతను ఎటావా జిల్లా పాలనాధికారి (సివిల్ సర్వెంట్)
- ఏవో హ్యూమ్ జీవిత చరిత్ర గ్రంథకర్త – విలియం వెడర్న్ బర్న్
భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం
- భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం బొంబాయిలో గోఖుల్ తాస్ తేజ్ పూర్ సంస్కృత కళాశాలలో 1885 డిసెంబర్ 28-31 మధ్య జరిగింది.
- అధ్యక్షుడు – ఉమేశ్ చంద్ర బెనర్జీ
- కార్యదర్శి – ఏవో హ్యూమ్
- హాజరైన సభ్యులు – 72 మంది
- ఖర్చయిన మొత్తం – రూ. 300
- నాటి వైశ్రాయ్ – లార్డ్ డఫ్రిన్
- ప్రారంభ గీతం – గాడ్ సేవ్ ద కింగ్
- ప్రవేశపెట్టిన తీర్మానాలు – 9
భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదట అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు
- 1885 – డబ్ల్యూసీ బెనర్జీ (తొలి భారతీయుడు)
- 1886 – నౌరోజీ (తొలి పార్శీ)
- 1887 – బద్రుద్దీన్ త్యాబ్జీ (తొలి ముస్లిం)
- 1888 – జార్జియూల్ (తొలి ఆంగ్లేయుడు)
- 1891 – పి. ఆనందాచార్యులు (తొలి ఆంధ్రుడు)
- 1917 – అనిబిసెంట్ (తొలి విదేశీ మహిళ)
- 1925 – సరోజినీ నాయుడు (తొలి భారతీయ మహిళ)
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు
- 1888 – అలాహాబాద్ – జార్జ్ యూల్
- 1889 – బొంబాయి – విలియం వెడ్డర్న్ బర్న్
- 1894 – మద్రాసు – అల్ఫ్రెడ్ వెబ్
- 1904 – బొంబాయి – సర్ హెన్రీ కాటన్
- 1910 – అలహాబాద్ – విలియం వెడ్డర్న్ బర్న్
.
.
2వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1886
- సమావేశ స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు – నౌరోజీ
- హాజరైన సభ్యులు – 436
- అత్యధిక సభ్యులు బెంగాల్ నుంచి వచ్చారు
సమావేశం ప్రత్యేకతలు
- ప్రతి ఏడాది కాంగ్రెస్ సమావేశాలు జరపాలని నిర్ణయించారు
- కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయాలని తీర్మానం చేశారు
- సరేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఇండియన్ అసోసియేషన్ కాంగ్రెస్‌లో విలీనమైంది.
దాదాబాయి నౌరోజీ
- తొలి కాంగ్రెస్ సమావేశానికి హాజరైన జాతీయ కాంగ్రెస్ అను పేరు సూచించాడు
- కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి పార్శీ
- బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడు
- వార్షిక సమావేశాలకు మూడు సార్లు అధ్యక్షత వహించాడు (1886, 1893, 1906)
3వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1887
- స్థలం – మద్రాసు
- అధ్యక్షుడు – బద్రుద్దీన్ త్యాబ్జీ (కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం)
సమావేశం ప్రత్యేకతలు
- కాంగ్రెస్ తన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి 34 మందితో కమిటీ ఏర్పాటు చేసింది.
- కాంగ్రెస్ ఒక రాజకీయ సంస్థగా రూపుదిద్దుకుంది.
- సైన్యంలో ఉన్నత పదవులను ఇండియన్లకు కూడా కల్పించాలని తీర్మానం చేశారు.
4వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1888
- స్థలం – అలహాబాద్
- అధ్యక్షుడు – సర్ జార్జి యూల్ (కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి విదేశీ క్రిస్టియన్)
సమావేశం ప్రత్యేకతలు
- లాలా లజపతిరాయ్ ప్రసంగించిన తొలి సమావేశం
- నాటి గవర్నర్ జనరల్ – లార్డ్ డౌన్స్
5వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1889
- స్థలం – బొంబాయి
- అధ్యక్షుడు – వెడ్డర్ బర్న్ (ఇతను ఏవో హ్యూమ్ జీవిత చరిత్రను రాశాడు)
సర్ విలియం వెడ్డర్ బర్న్
- కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన రెండో ఆంగ్లేయుడు
- రెండవసారి 1910లో అలహాబాద్ 25వ వార్షిక సమావేశానికి కూడా అధ్యక్షత వహించాడు
- తిలక్ హాజరైన తొలి సమావేశం
6వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1890
- స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు – ఫిరోజ్ షా మెహతా (అన్ క్రౌన్డ్ కింగ్ ఆఫ్ బాంబేగా ప్రసిద్ధి)
సమావేశం ప్రత్యేకతలు
- ఈ సమావేశానికి ప్రభుత్వ ఉద్యోగులెవరూ హాజరవొద్దని నిషేధించింది.
- మొట్టమొదటి పట్టభద్రురాలు కాదంబినీ గంగూలీ హాజరయ్యారు.
- ఇండియా అనే జర్నల్ ప్రారంభమైంది.
7వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1891
- స్థలం – నాగ్‌పూర్
- అధ్యక్షుడు – పి. ఆనందాచార్యులు (దక్షిణాది రాష్ట్రాల నుంచి మహాసభకు ఎన్నికైన తొలి ఆంధ్రుడు)
12వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1896
- స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు – రహమతుల్లా యం. సయానీ (కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన రెండో ముస్లిం)
- ఈ సమావేశంలో తొలిసారి వందేమాతర గీతం పాడారు. పాడింది – ఠాగూర్
వందేమాతర గేయ రచయిత – బంకించంద్ర చటర్జీ
17వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1901
- స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు దిన్షా-ఇ-వాచా
- తరలిపోతున్న సంపదను రూపాయిల్లో లెక్కించిన తొలి భారతీయుడు
సమావేశం ప్రత్యేకతలు
- గాంధీజీ హాజరైన తొలి జాతీయ కాంగ్రెస్ సమావేశం
- గోపాలకృష్ణ గోఖలే సాయంతో గాంధీజీ దక్షిణ ఆఫ్రికా గురించి ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు
- గాంధీజీ సభా ప్రాంగణంను శుభ్రపరచడం ఈనాడు స్వచ్ఛ భారత్‌కు ఆ సంఘటన నాంది
సూరత్ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1907
- స్థలం – సూరత్
- అధ్యక్షుడు – రాస్ బీహారీ ఘోష్
- ఈ సమావేశంలోనే కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా విడిపోయింది
సూరత్ చీలిక
- బెంగాల్ విభజనను రద్దు చేయమని గోఖలే చేసిన వినతిని ప్రభుత్వం మన్నించలేదు
- బెంగాల్ విభజనపై తలెత్తని విభేదాల వల్ల కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది
- ఈ సమావేశానికి రాస్ బీహారీ ఘోష్ అధ్యక్షత వహించాడు
- 1916లో అనిబిసెంట్ కృషి వల్ల మళ్లీ మిత, అతివాదులు ఒక్కటయ్యారు
- 1908 మద్రాస్‌లో జరిగిన 23వ వార్షిక సమావేశానికి కూడా రాష్ బీహారీ ఘోష్ అధ్యక్షత వహించాడు
- ఈ సమావేశంలో కాంగ్రెస్ రాజ్యాంగం రూపొందించారు.
.
.
- ఏడాది – 1909
- సమావేశ స్థలం – లాహోర్
- అధ్యక్షుడు – మాలవ్య
మదన్ మోహన్ మాలవ్య
- భారత స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్‌కు 4 సార్లు అధ్యక్షత వహించిన ఏకైక వ్యక్తి
- 1934లో కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు
- ఈ సమావేశంలో మింటో మార్లే సంస్కరణలు వ్యతిరేకించారు
- మింటో మార్లే సంస్కరణల (1909)తో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయించారు.
26వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1911
- స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు – బిషన్ నారాయణ్ ధర్
- ఈ సమావేశంలోనే జనగణమన తొలిసారి పాడారు
27వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1912
- స్థలం – బంకీపూర్ (పశ్చిమ బెంగాల్)
- అధ్యక్షుడు – నరసిన్హా మథోల్కర్
- అతి తక్కువ కాలం జరిగిన సమావేశం
- ఒక్క ముస్లిం కూడా హాజరు కాని సమావేశం
- ఈ సమావేశంలోనే ఐఎన్‌సీ స్థాపకుడు ఏవో హ్యూమ్‌ను పితామహుడిగా కీర్తించారు
28వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1913
- స్థలం – కరాచీ
- అధ్యక్షుడు – నవాబ్ సయ్యద్ మహమ్మద్
- కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన మూడో ముస్లిం
- ఈ సమామేశానికి ముస్లింలు ఎక్కువగా వచ్చారు
31వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1916
- స్థలం – లక్నో
- అధ్యక్షుడు – ముజుందార్
- గాంధీ రెండోసారి హాజరైన సమావేశం (మొదటిది 1901 కలకత్తా సమావేశం)
అంబికా చరణ్ ముజుందార్
- ఇండియన్ నేషన్ ఎవల్యూషన్ గ్రంథాన్ని రచించాడు
- ఇందులో కాంగ్రెస్ ఆవిర్భావం, అభివృద్ధిపై సర్వే చేసి రాశాడు
- ఏ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఫరీద్‌పూర్‌గా ప్రసిద్ధి
- ఈ సమావేశంలోనే 1907 సూరత్ సమావేశంలో విడిపోయిన మిత, అతివావాదులు ఒక్కటయ్యారు
- ఏడాది – 1917
- స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు – అనిబిసెంట్
- కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ
- 1914లో కాంగ్రెస్‌లో చేరి 1917 సమావేశానికి అధ్యక్షురాలైంది
34వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1919
- స్థలం – అమృత్‌సర్
- అధ్యక్షుడు – మోతీలాల్ నెహ్రూ
- ఈ సమావేశమే తొలి గాంధీ కాంగ్రెస్ సమావేశంగా ప్రసిద్ధి
కలకత్తా కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం
- సంవత్సరం – 1920
- స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు – లాల్
- సహాయ నిరాకరణ ఉద్యమ ప్రణాళికను చర్చించి ఆమోదించడానికి కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాన్ని 1920
- సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన జరిగింది.
- ఈ ప్రత్యేక సమావేశంలోనే కాంగ్రెస్ రాజకీయాల్లో గాంధీ యుగం ప్రారంభమైంది
- ఈ సమావేశంలోనే గాంధీ తొలిసారి కాంగ్రెస్ రాజ్యాంగంలో మార్పులు చేసి కాంగ్రెస్ రూపురేఖలు మార్చాడు
- స్వేచ్ఛగా ఉండండి. ఇక ఎంతమాత్రం బానిసలుగా బతకొద్దు అని ఈ సమావేశంలోనే గాంధీ పిలుపునిచ్చాడు
- కలకత్తా కాంగ్రెస్ సమావేశం సహాయ నిరాకరణ తీర్మానాన్ని అత్యధిక మెజార్టీతో ఆమోదించింది.
- ఏడాది – 1920
- స్థలం – నాగ్‌పూర్
- అధ్యక్షుడు – సి. విజయ రాఘవాచారి (దక్షిణ భారతదేశ మహా మేధావి)
- కలకత్తా ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం ఆమోదించిన సహాయ నిరాకరణ తీర్మానాన్ని నాగ్‌పూర్ కాంగ్రెస్ వార్షిక సమావేశం బలపరిచింది.
- నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం తీర్మానాన్ని స్వయంగా ప్రతిపాదించింది – సీఆర్ దాస్
- ఈ సమావేశంలో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు.
.
.
37వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1922
- స్థలం – గయ (బీహార్)
- అధ్యక్షుడు – సీఆర్ దాస్
- జైలులో ఉండి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి – సీఆర్ దాస్
- ఈ సమావేశంలో కాంగ్రెస్ తీసుకున్న ముఖ్య నిర్ణయం – శాసన సభల బహిష్కరణ
- శాసనసభల బహిష్కరణ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సీఆర్ దాస్ రాజీనామా చేశాడు
38వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1923
- స్థలం – కాకినాడ (ఏపీలో జరిగిన తొలి కాంగ్రెస్ వార్షిక సమావేశం)
- అధ్యక్షుడు – మౌలానా మహమ్మద్ అలీ (కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన 5వ ముస్లిం)
39వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1924
- స్థలం – బెల్గాం (కర్ణాటక)
- అధ్యక్షుడు – గాంధీజీ (గాంధీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం)
40 కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1925
- స్థలం – కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)
- అధ్యక్షుడు – సరోజినీనాయుడు (కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ)
43వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1928
- స్థలం – కలకత్తా
- అధ్యక్షుడు – మోతీలాల్ నెహ్రూ
- ఈ సమావేశంలోనే నెహ్రూ నివేదికను చర్చించారు
- పూర్ణస్వరాజ్‌పై చర్చ జరిగింది
- యువజన కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది
- నెహ్రూ నివేదిక ఆధారంగా జాతీయ కాంగ్రెస్ గాంధీ నేతృత్వంలో 1929 డిసెంబర్ 31 నాటికి దేశానికి సంపూర్ణ స్వరాజ్యం కల్పించాలని బ్రిటిష్ వారికి అల్టిమేటం జారీ చేశారు.
- అంటరానితనంను నిషేధించాలని తీర్మానం చేశారు.
- ఏడాది – 1929
- స్థలం – లాహోర్
- అధ్యక్షుడు – నెహ్రూ
- ఈ సమావేశానికి లాలాలజపతిరాయ్ నగర్ సమావేశమని పేరు
- ఈ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత వహించాలని కోరిన రాష్ట్రాలు 10.
- ఈ సమావేశంలోనే..పూర్ణస్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది.
- త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా నెహ్రూ ఎగురవేశాడు
- ఏటా జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు.
45 కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1931
- స్థలం – కరాచీ
- అధ్యక్షుడు – పటేల్
- గాంధీ-ఇర్విన్‌ల మధ్య ఒప్పందం కుదిరిన సంవత్సరం (1931 మార్చి 5న)
- ఈ ఒప్పందాన్ని మార్చి 29న జరిగిన కాంగ్రెస్ సమావేశం ఆమోదించింది.
- 1931 మార్చి 23న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురూలను బ్రిటిష్ సర్కారు ఉరితీసింది. దీంతో భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీకి నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి.
- ఏడాది – 1933
- స్థలం – కలకత్తా
- ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన 3వ మహిళ, రెండో భారతీయ మహిళ నళినీ సేన్ గుప్తా
48వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1934
- స్థలం – బొంబాయి
- అధ్యక్షుడు – బాబూ రాజేంద్ర ప్రసాద్ (భారత మొదటి రాష్ట్రపతి)
- ఈ సమావేశంలోనే గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
49వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1936
- స్థలం – లక్నో
- అధ్యక్షుడు – నెహ్రూ
- ఈ సమావేశంలోనే నెహ్రూ సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు.
- 1937లో 50వ కాంగ్రెస్ వార్షిక సమావేశం కూడా నెహ్రూ అధ్యక్షత తొలిసారి ఫైజ్‌పూర్ (మహారాష్ట్ర) గ్రామంలో జరిగింది.
- ఏడాది – 1938
- స్థలం – హరిపుర
- అధ్యక్షుడు – సుభాష్ చంద్రబోస్
- గాంధీ మద్దతుతో బోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు
- ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఈ సమావేశంలో నిర్ణయించారు
- 1939 త్రిపుర కాంగ్రెస్ వార్షిక సమావేశంలో బోస్‌ను తప్పించాలని పట్టాభి సీతారామయ్యను గాంధీ నిలబెట్టారు. కానీ పట్టాభి ఓడిపోయాడు.
- తర్వాత బోస్ తన అధ్యక్ష పదివికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని (1939) స్థాపించాడు.
- బోస్ స్థానంలో రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
53వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1940
- స్థలం – రామ్‌ఘర్
- అధ్యక్షుడు – మౌలానా అబుల్ కలాం ఆజాద్
- 1941-45 వరకు వార్షిక సమావేశాలు జరగకపోవడంతో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1945 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు.
- ఎక్కువ కాలం కాంగ్రెస్‌కు అధ్యక్షుడిగా పని చేసింది ఆజాద్.
54వ సమావేశం
- ఏడాది – 1946
- స్థలం – మీరట్
- అధ్యక్షుడు – కృపలానీ (మజ్దూర్ కిసాన్ సంఘ్ వ్యవస్థాపకుడు)
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి కాంగ్రెస్‌కు కృపలానీ అధ్యక్షుడిగా ఉన్నారు.
55వ కాంగ్రెస్ సమావేశం
- ఏడాది – 1948
- స్థలం – జైపూర్
- అధ్యక్షుడు – పట్టాభి సీతారామయ్య
- స్వతంత్రం వచ్చాక జరిగిన తొలి సమావేశం
- కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన రెండో ఆంధ్రుడు పట్టాభి
- ఇతను కాంగ్రెస్ చరిత్రను రచించాడు
- ఇతను ప్రారంభించిన పత్రిక – జన్మభూమి (ఇంగ్లిష్)
No comments:
Post a Comment