🚢తొలి స్వదేశీ హైడ్రోజన్ వాటర్ టాక్సీ వారణాసిలో జలప్రవేశం

 

స్వచ్ఛ ఇంధన వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. హైడ్రోజన్‌తో నడిచే తొలి స్వదేశీ పడవను 2025 డిసెంబర్ 11న గంగానది జలాలపై ఆవిష్కరించింది.

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నమో ఘాట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఓడరేవులు, నౌకాయానం, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ నౌకను ప్రారంభించారు. ఈ నౌకను భారతదేశంలోనే స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు.

 


 

⚙️ నౌక ముఖ్యమైన వివరాలు

  • 🚢 నౌక పొడవు: 24 మీటర్లు.

  • ❄️ సౌకర్యం: ఏసీ క్యాబిన్ ఉంటుంది.

  • 👥 ప్రయాణికుల సామర్థ్యం: సుమారు 50 మంది.

  • 🌱 కార్యక్రమం: ‘హరిత నౌక’ కార్యక్రమం కింద దేశీయంగా ఈ నౌకను నిర్మించారు.

  • 🔋 సాంకేతికత: ఎలక్ట్రో-మెకానికల్ పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటుంది.

  • 💧 ఉద్గారాలు: ఇంధనంగా హైడ్రోజన్‌ను ఉపయోగించడం వల్ల నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి. హానికరమైన కార్బన్ ఉద్గారాలు ఉండవు.

  • 🌍 ప్రత్యేకత: కాలుష్య ఉద్గారాలు దాదాపు శూన్యం కావడం ఈ నౌక ప్రత్యేకత.

🌿 హరిత నౌక కార్యక్రమం

హైడ్రోజన్ వంటి స్వచ్ఛమైన ఇంధనాలను ఉపయోగించడం ద్వారా జల రవాణాలో కాలుష్యాన్ని తగ్గించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. సంప్రదాయ శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి పర్యావరణహితమైన నౌకాయానాన్ని ప్రోత్సహించేందుకు ఈ తరహా నౌకలు ఉపయోగపడతాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...