2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా (International Year of the Woman Farmer – IYWF) ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
ఆహార భద్రతను అందించడంలో మహిళలు రైతులుగా, రైతు కూలీలుగా, ఆహార ప్రాసెసర్లుగా, ఉద్యోగులుగా, అమ్మలుగా, కుటుంబ సభ్యుల సంరక్షకులుగా బహుముఖ సేవలందిస్తున్నారు.
అందుకే ఐక్యరాజ్యసమితిలో భాగమైన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO)తో పాటు ఐక్యరాజ్యసమితి (UNO) అనుబంధ సంస్థలైన అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి (IFAD), ప్రపంచ ఆహార కార్యక్రమం (WFP) వంటి సంస్థలు మహిళా రైతులను బలోపేతం చేసే కార్యక్రమాలను సమన్వయం చేస్తాయి.
గడ్డి భూములు, సంచార పశుకాపరుల సంవత్సరంగా 2026
2026ను అంతర్జాతీయ గడ్డి భూములు, సంచార పశుకాపరుల సంవత్సరంగా కూడా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది.

No comments:
Post a Comment