జాతీయాదాయానికి ఆర్థిక విశ్లేషణలో చాలా ప్రాముఖ్యత
ఉంది. ఆర్థికవ్యవస్థలో జరిగే అన్ని కార్యకలాపాలకు జాతీయ ఆదాయం ఒక అద్దం వంటిది. వివిధ
రంగాల స్థితిగతులను జాతీయాదాయ లెక్కల ద్వారా తెలుసుకోవచ్చు. జాతీయ ఆదాయం ద్వారా ఆర్థికవ్యవస్థ
పోకడ ఎట్లా ఉందో తెలుసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జాతీయాదాయం పెరుగుతూ ఉంటే ఆర్థికాభివృద్ధి
జరుగుతున్నట్లు పేర్కొనవచ్చు. జాతీయాదాయం గణించడం ద్వారా అభివృద్ధి ధోరణులు ఏవిధంగా
ఉన్నాయో తెలుసుకోవచ్చు. వివిధ రంగాల నుంచి ఎంతెంత ఆదాయం జాతీయాదాయానికి సమకూరుతుందో
తెలుసుకొని, తక్కువ అభివృద్ధిలో ఉన్న రంగాలను ప్రోత్సహించవచ్చు. అంతేగాక ప్రజల మధ్య
ఆదాయ వ్యత్యాసాలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకొని, ఆదాయపు అసమానతలు తగ్గించడానికి తగిన
విధానాలను అమలుపరచవచ్చు. వివిధ దేశాల జాతీయ ఆదాయాలను తులనాత్మకంగా పోల్చటం ద్వారా ఏఏ
దేశాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయో ఏఏ దేశాల వెనుకబడి ఉన్నాయో తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
స్వాతంత్య్రానికి పూర్వం అనేకమంది ప్రముఖులు జాతీయాదాయానికి సంబంధించి అంచనాలు తయారుచేశారు. వారు వ్యక్తిగతంగా కృషి చేయడంవల్ల ఎక్కువ ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించలేకపోయారు. మనదేశంలో జాతీయాదాయాన్ని మొదటిసారిగా గణించిన ఖ్యాతి దాదాభాయి నౌరోజీకే దక్కుతుంది. దాదాభాయి నౌరోజీ 1868లో జాతీయాదాయ అంచనాలను తయారుచేశారు. అనంతర కాలంలో షిండే షిర్రాసి, జోషి, వికెఆర్‌వి.రావు వంటివారు జాతీయాదాయ అంచనాలను తయారుచేశారు. అయితే వారి అంచనాలు ఒకే కాలానికి సంబంధించినవి అయినా వేర్వేరుగా ఉన్నాయి. ఈ అంచనాలు శాస్త్రీయ పద్ధతిలో జరగకపోవడం వల్ల వైరుధ్యాలతో ఉన్నాయి.
శాస్త్రీయమైన జాతీయాదాయపు అంచనాల ఆవశ్యకతను గుర్తించి, భారత ప్రభుత్వం జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని నియమించింది. ఈ సంఘం జాతీయ ఉత్పత్తి, జాతీయాదాయం మదింపు పద్ధతులను మేళవించి, జాతీయాదాయపు అంచనాలు తయారుచేస్తోంది.
దేశంలోని శ్రమ మూలధనం, ప్రాకృతిక వనరుల సహాయంతో సంవత్సరకాలంలో ఉత్పత్తిచేసే నికరవస్తుసేవల మొత్తాన్ని జాతీయాదాయం అంటారు.
జాతీయాదాయంలోని ముఖ్యభాగాలు
1. వినియోగం (సి) : ఒక సంవత్సరం కాలంలో దేశ ప్రజలందరూ వస్తుసేవలపై చేసే ఖర్చును వినియోగంగా పేర్కొంటారు. జాతీయాదాయంలో ఎక్కువభాగం వస్తుసేవలే ఉంటాయి.
2. పెట్టుబడి (ఐ) : మూలధన వస్తువులపై సంస్థలు లేదా కుటుంబాలు చేసిన మొత్తం వ్యయాన్ని ఇది సూచిస్తుంది.
3. ప్రభుత్వ వ్యయం (జి) : కేంద్ర, రాష్ట్ర, స్థానికసంస్థలు వివిధ రకాల వస్తుసేవలపై చేసిన ఖర్చును అనగా రోడ్లు, పాఠశాలలు, వైద్య సౌకర్యాలు, జాతీయ రక్షణ, అవస్థాపన సౌకర్యాలు, విద్యుచ్ఛక్తి వంటివాటిపై చేసిన ఖర్చును ఇది సూచిస్తుంది.
4. నికర దేశీయ పెట్టుబడి : దేశంలో ఉత్పత్తి అయిన కొన్ని వస్తువులు విదేశాలకు ఎగుమతి అయితే, కొన్ని అవసరమైన వస్తువులు దిగుమతి అవుతాయి. ఎగుమతుల విలువ నుంచి దిగుమతుల విలువను మినహాయించగా వచ్చేదే నికర దేశీయ పెట్టుబడి.
జాతీయాదాయంలో కాలానుగుణంగా అనేకరకాల భావనలను ఆర్థికవేత్తలు వివరించారు.
1. స్థూల జాతీయోత్పత్తి (జిఎన్‌పి)
సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి చేయబడిన అన్ని అంత్య వస్తుసేవల విలువయే స్థూల జాతీయోత్పత్తి. అనగా ఈ భావనలో అంత్య వస్తువులు మాత్రమే ఇమిడి ఉన్నాయని గ్రహించాలి. మధ్యస్థ వస్తువుల విలువను ఇందులో పరిగణించరు. ఈ భావనలో జాతీయాదాయాన్ని ఎవరు ఉత్పత్తి చేశారు అన్న అంశమే ప్రధానమైనది. ఎక్కడ ఉత్పత్తి అయ్యింది అన్నది ప్రధానం కాదు. అనగా దేశ పౌరుల ద్వారా దేశంలోనూ, విదేశాలలోనూ ఉత్పత్తి అయిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
(జిఎన్‌పి) స్థూల జాతీయోత్పత్తి = దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తువుల సేవల మార్కెట్ విలువ + విదేశాలలో దేశీయులచే ఉత్పత్తి చేయబడిన ఆదాయం - దేశంలో విదేశీయులచే ఉత్పత్తి చేయబడిన ఆదాయం
ఎ. మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి
దేశంలో తయారైన అన్నిరకాల వస్తుసేవల మార్కెట్ ధరలలో ద్రవ్య రూపవిలువ. దీనిలో వినియోగవస్తువుల విలువ మూలధన వస్తువుల విలువ (ఐ). ప్రభుత్వ రంగంలో తయారైన వస్తువుల విలువ (జి), విదేశాల నుంచి నికర రాబడులు (ఎక్స్-ఎం), విదేశాల నుంచి నికర ఆదాయ బదిలీలు (ఆర్-పి)లు ఉంటాయి.
మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి = సి+ఐ+జి+(ఎక్స్-ఎం)+(ఆర్-పి) (జిఎన్‌పి ఏ ఎంపి)
బి. ఉత్పత్తి కారకాలదృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి
ఏదైనా వస్తువు ధరలో ఉత్పత్తి ఖర్చు, అమ్మకపు పన్నుకూడా ఇమిడి ఉంటాయి. అందువల్ల మార్కెట్ ధర, వస్తువు యొక్క అసలు ధరను తెలుపదు. కాబట్టి వస్తువు యొక్క అసలు ధరను తెలుసుకోవడానికి పన్నులను మినహాయించాలి.
సబ్సిడీల వల్ల కూడా వస్తువు యొక్క అసలు ధర మారుతుంది. ప్రభుత్వం ఉత్పత్తిదారులను ప్రోత్సహించడానికి ఉత్పత్తి కారకాలను మార్కెట్ ధరకన్నా తక్కువ ధరకు అందజేస్తుంది. అందువల్ల అసలు ధరను కనుగొనుటకు వస్తుసేవల మార్కెట్ ధరకు సబ్సిడీని (ఎస్) కలపాలి.
ఉత్పత్తి కారకముల దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి
జిఎన్‌పి ఏ ఎఫ్‌సి = సి+ఐ+జి+(ఎక్స్-ఎం)+(ఆర్-పి)-ఐటి+ఎస్
2. స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)
స్థూల దేశీయోత్పత్తిలో విదేశాల నుంచి లభించే ఆదాయాన్ని పరిగణించరు. దేశ సరిహద్దులకు లోబడి ఒక సంవత్సర కాలంలో దేశం ఎంత ఆదాయం సంపాదించిందో దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయాలను తీసివేస్తారు.
స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) = దేశంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల మార్కెట్ విలువ + దేశంలోపల విదేశీయులచే ఉత్పత్తి చేయబడిన ఆదాయం - విదేశాల నుంచి పొందిన దేశీయుల ఆదాయం.
ఎ. మార్కెట్ ధరలలో స్థూలదేశీయోత్పత్తి = సి+ఐ+జి+(ఎక్స్-ఎం) (జిడిపిఏ ఎంపి)
బి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి = జిడిపి ఏ ఎఫ్‌సి = సి+ఐ+జి+(ఎక్స్-ఎం)- ఐటి+ఎస్
3. నికర జాతీయోత్పత్తి (ఎన్‌ఎన్‌పి)
ఉత్పత్తిదారులు వస్తువులు, ఉత్పత్తి చేసే క్రమంలో మూలధన పరికరాలను, యంత్రాలను వినియోగిస్తారు. దీనివల్ల మూలధన సామాగ్రి తరుగుదలను పొంది, మూలధన ఆస్థుల విలువ తగ్గిపోతుంది. కాబట్టి ఒక సంవత్సర కాలంలో ఏర్పడిన తరుగుదలను గణించి, స్థూల జాతీయోత్పత్తి (జిఎన్‌పి) నుంచి మినహాయించగా వచ్చేదే నికర జాతీయోత్పత్తి (ఎన్‌ఎన్‌పి)
ఎ. మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి (ఎన్‌ఎన్‌పి ఏ ఎంపి)
మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి నుంచి తరుగుదలను మినహాయించగా వచ్చేది.
ఎన్‌ఎన్‌పి ఏ ఎంపి = జిఎన్‌పి ఏ ఎంపి - తరుగుదల (డి)
బి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి (ఎన్‌ఎన్‌పి ఏ ఎఫ్‌సి)
మార్కెట్ ధరల ప్రకారం నికర జాతీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులను మినహాయించి, సబ్సిడీలను కలుపగా వచ్చేది.
ఎన్‌ఎన్‌పి ఏ ఎఫ్‌సి = ఎన్‌ఎన్‌పి ఏ ఎంపి - ఐటి+ఎస్
4. నికర దేశీయోత్పత్తి (ఎన్‌డిపి)
స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చేది.
ఎ. మార్కెట్ ధరలలో నికర దేశీయ ఉత్పత్తి (ఎన్‌డిపి ఏ ఎంపి)
మార్కెట్ ధరల ప్రకారం స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి తరుగుదలను తీసివేయగా వచ్చేది.
ఎన్‌డిపి ఏ ఎంపి = జిడిపి ఏ ఎంపి - డి
బి. ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర దేశీయోత్పత్తి (ఎన్‌డిపి ఏ ఎఫ్‌సి)
మార్కెట్ ధరల ప్రకారం నికర దేశీయోత్పత్తి నుంచి పరోక్షపన్నులను మినహాయించి సబ్సిడీలను కలుపుకోగా వచ్చేది.
ఎన్‌డిపి ఏ ఎఫ్‌సి = ఎన్‌డిపి ఏ ఎంపి - ఐటి + ఎస్
5. వ్యష్టి ఆదాయం (పర్సనల్ ఇన్‌కమ్)
ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు, సంస్థలకు లభించిన ఆదాయం నుంచి కార్పొరేషన్ పన్నులు, సంక్షేమ విరాళాలు పంచిపెట్టని లాభాలు మినహాయించి, బదిలీ చెల్లింపులను కలుపుకొనగా వచ్చేదే వ్యష్టి ఆదాయం. పెన్షన్‌లు, నిరుద్యోగభృతి ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ మొదలైన వాటిని బదిలీ చెల్లింపులు అంటారు.
వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం - (కార్పొరేట్ పన్నులు, సాంఘిక సంక్షేమ విరాళాలు, పంచిపెట్టని కార్పొరేట్ లాభాలు) + బదిలీ చెల్లింపులు
6. వ్యయార్హ ఆదాయం (డిస్పోజబుల్ ఇన్‌కమ్)
వ్యక్తులకు వచ్చిన ఆదాయంలో కొంతభాగం ఆదాయం పన్నులుగా, ఆస్థి పన్నులుగా ప్రభుత్వానికి చెల్లిస్తారు. ఈ విధమైన వ్యష్ఠి పన్నులు పోగా మిగిలిన దానిని వ్యయార్హ ఆదాయం అంటారు.
వ్యయార్హ ఆదాయం = వ్యష్టి ఆదాయం - వ్యష్టి పన్నులు = వినియోగ వ్యయం + మదుపు
7. తలసరి ఆదాయం
జాతీయాదాయాన్ని ఆదేశ జనాభాతో భాగించగా వచ్చేదే తలసరి ఆదాయం. దీనిని అభివృద్ధికి సూచికగా పరిగణిస్తారు.
తలసరి ఆదాయం = జాతీయాదాయం/ దేశ మొత్తం జనాభా ్య

No comments:
Post a Comment