లంబసింగి !!!!!దక్షిణ భారతదేశంలోని కాశ్మీర్!!!!!


  • ఆంధ్రప్రదేశ్ యొక్క ఊటీ
  • లంబసింగి దక్షిణ భారతదేశంలోని కాశ్మీర్
  • లంబసింగి లేదా లమాసింగి ఆంధ్ర ప్రదేశ్ లోని అరకు వ్యాలీలో ఉన్నది
  • 1025 మీ.  చిన్న  అందమైన కొండ గ్రామం మరియు దక్షిణ భారతదేశం లేదా ఆంధ్ర ప్రదేశ్ ఊటీ కాశ్మీర్ అని పిలుస్తారు.
  • ఉష్ణోగ్రత ఏడాది పొడవునా 10 డిగ్రీ C కంటే తక్కువగా ఉంటుంది, డిసెంబరు మరియు జనవరిలో -2 డిగ్రీ C కు పడిపోతుంది
  • శీతాకాలంలో ఓషస్సనల్ హిమపాతం ఉంది.
  • విశాఖపట్టణం నగరం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.
  • లంబసింగీని స్థానికంగా కొరారా బోయలు అని పిలుస్తారు, అనగా "బహిరంగంగా బయట నిలబడి ఉన్న వ్యక్తి ".
  • లంబసింగి గ్రామంలో దట్టమైన అడవి మరియు అందమైన కొండలు ఉన్నాయి.
  • ట్రెక్కింగ్, హైకింగ్ మరియు క్యాంపింగ్ కోసం పర్యాటకులు వస్తారు.
  • అందమైన కొండలు, పచ్చటి అడవులు, అందమైన లోయలు, కాఫీ, మిరియాలు మరియు ఆపిల్ల తోటలు సహజ సౌందర్యం మరియు చల్లని మరియు ప్రశాంతమైన పర్యావరణం యొక్క నివాసంగా లంబసీంగిని చేశాయి, ఇది పూర్తిగా ఆకర్షణీయమైన పర్యాటక గమ్యంగా ఉంది.
  • కొండపల్లి జలపాతం, బోరా గుహ, బ్లాక్ ఐ సుసాన్ గార్డెన్, అన్నవరం టెంపుల్, టైడా జంగల్ బెల్స్ పార్క్, కొండకరర్ బర్డ్ సంక్చురి మొదలైనవి పర్యాటకుల ఆకర్షణ.


వ్యాధులు-సోకే అవయవాలు


వ్యాధి.      ---     అవయవం

1.గాయిటర్ -  థైరాయిడ్ గ్రంధి

2.ఎగ్జిమా - చర్మం

3.పియోరియా - పళ్ళుచిగుళ్ళు

4.డయాబెటిస్ -  క్లోమం

5.కామెర్లు  -  కాలేయం

6.న్యూమోనియా -  ఊపిరితిత్తులు

7.మెనింజెటిస్ -  మెదడు

8.పార్కిన్ సన్  -  మెదడు

9.ఎన్సెఫలైటిస్  -  మెదడు

10.ట్రకోమా -  కళ్ళు

11.కాటరాక్ట్స్ -  కళ్ళు

12.ఆర్థరైటిస్ -   కీళ్ళు

13.గౌట్ -   కీళ్ళు

14.స్పాన్డిలైటిస్ -  ఎముకలు

15.టైఫాయిడ్ - ప్రేగులు,శరీర భాగం మొత్తం

16.ఎయిడ్స్  - శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది

17.డిఫ్తీరియా  - గొంతు*

18.పయేరియా -  చిగుళ్ళు

19.రూమాటిజం -  కీళ్ళు

వ్యవసాయ పరిశోథనా సంస్థలు



1. భారత వ్యవసాయ  పరిశోధనా సంస్థ --న్యూఢిల్లీ

2. జాతీయ వరి పరిశోధనా సంస్థ --కటక్ (ఒడిషా)

3. అంతర్జతీయ వరి పరిశోధనా సంస్థ --మనీలా (పీలీఫైన్శ్)

4. కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ --రాజమండ్రి (ఆంద్రప్రదేశ్)

5. కేంద్ర పత్తి పరిశోధన సంస్థ --నాగపూరు (మహరాష్ట్ర)

6. కేంద్ర సముద్ర చేపల పరిశోధన సంస్థ --కొచ్చిన్ (కేరళ)

7. మొక్కజోన్నాల పరిశోధన కేంద్రం  --న్యూఢిల్లీ

8. గోథమ పరిశోధన  కేంద్రం --కర్నాలు (హర్యానా)

9. జాతీయ పాడి పరిశోధన సంస్థ --కర్నల్ (హర్యానా)

10. జాతీయ వేరుశనగా పరిశోధన సంస్థ --జునాగాడ్ (గుజారత్)

11. భారత ఉద్యాన  పరిశోధన సంస్థ --బెంగళూరు

12. భారత్ చెరకు పరిశోధన సంస్థ --లక్నో

13. సేంట్రల్ రబ్బర్ క్రాఫ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ --తిరువనంతపురం

14. సేంట్రల్ కోకోనట్  రిసెర్చ్  ఇన్స్టిట్యూట్ --కాసర్ గఢ్ (కేరళ)

15. ఆలుగడ్డ పరిశోధన కేంద్రం --సీమ్లా(హిమాచల్ ప్రదేశ్)

16. పప్పు ధాన్యల పరిశోధన కేంద్రం -కాన్పూర్ (ఉత్తరప్రదేశ్)

17. సంకర జాతి ఉత్పత్తి కేంద్రం --కోయంబత్తూర్ (తమిళనాడు)

18. జనపనార పరిశోధన కేంద్రం -భరత్ పూర్ (పశ్చిమబెంగాల్)

19. తేయకు పరిశోధన కేంద్రం --జోర్హట్ (అస్సాం)

20. సొయబిన్ పరిశోధన కేంద్రం --ఇండోర్ (మధ్యప్రదేశ్)

21. పట్టు పరిశోధన కేంద్రం -మైసూర్(కర్నాటక)

22. తేనేటీగల పరిశోధన కేంద్రం -పూణే (మహరాష్ట్ర)

23. అంతర్జతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం --పటాన్ చెరువు

24. కాఫీ బోర్డు ప్రధాన కార్యాలయం -బెంగళూరు

25. తేయాకు బోర్డు ప్రధాన కార్యాలయం -కలకత్తా



ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పరిశోధనా సంస్థలు

1. ఉల్లి పరిశోధన కేంద్రం -ఎర్రగుంట్ల (కడప)

2. పత్తి పరిశోధన కేంద్రం --నంధ్యాల (కర్నూలు)

3. మిర్చి పరిశోధన కేంద్రం --లాం. (గుంటూరు)

4. అరటి పరిశోధన కేంద్రం --కొవ్వురు(పశ్చిమగోదావరి)

5. కొబ్బరి పరిశోధన కేంద్రం -అంబాజిపేట (తూర్పు గోదావరి)

6. వరి పరిశోధన కేంద్రం --మార్టెరు(పశ్చిమగోదావరి)

7. పసూపు పరిశోధన కేంద్రం - దుగ్గిరాల (గుంటూరు)

విపత్తు నిర్వహణ :: యోజన మ్యాగజిన్ జనవరి 2017





ఆధునిక భౌతిక శాస్త్రం --- మాదిరి ప్రశ్నలు 2


1. బెకరల్‌ కిరణం కానిది?
ఎ) బీటా బి) ఆల్ఫా
సి) కాస్మిక్‌ డి) గామా

2. రేడియోధార్మికతను కొలవడానికి ఉపయోగించే పెద్ద ప్రమాణం ఏది?
ఎ) రూథర్‌ఫర్డ్‌ బి) క్యూరీ
సి) బెకరల్‌ డి) హెన్రీ

3. రేడియోధార్మిక మూలకం ఉష్ణోగ్రత, పీడనాన్ని పెంచినప్పుడు దాని రేడియోధార్మికత?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు డి) రెండింతలు అవుతుంది

4. రేడియోధార్మిక వికిరణాలను కనుక్కోవడానికి ఉపయోగించే సాధనం?
ఎ) క్లౌడ్‌ చాంబర్‌
బి) గిగ్గర్‌ ముల్లర్‌ కౌంటర్‌
సి) సింటిలేషన్‌ కౌంటర్‌
డి) పైవన్నీ

5. కాంతివేగంతో ప్రయాణించే రేడియోధార్మిక కిరణం ఏది?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ

6. కాస్మిక్‌ కిరణాల అధ్యయనం కోసం 1985 ఏప్రిల్‌ 29న భారతదేశం ప్రయోగించిన ఉపగ్రహం పేరేమిటి?
ఎ) రోహిణి బి) అనురాధ
సి) అవతార్‌ డి) భాస్కర

7. కాస్మిక్‌ కిరణాల తీవ్రత అధికంగా ఉండే ప్రదేశం?
ఎ) భూమి ధవాలు బి) భూమధ్యరేఖ
సి) భూమి కేంద్రం వద్ద
డి) అన్ని పర్వతాల పైన

8. కాస్మిక్‌ కిరణాల అధ్యయనం చేసిన భారతీయ శాస్త్రవేత్త?
ఎ) హెచ్‌.జె. బాబా
బి) ప్రొఫెసర్‌ సతీష్‌ ధావన్‌
సి) సర్‌ సుబ్రహ్మణ్య చంద్రశేఖర్‌
డి) డాక్టర్‌ అబ్దుల్‌ కలాం

9. ఐసోటోపులను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్‌ బి) ఆస్టన్‌
సి) మేడమ్‌ క్యూరీ డి) రూథర్‌ఫర్డ్‌

10. కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడు?
ఎ) రూథర్‌ఫర్డ్‌ బి) ఫెర్మి
సి) విలియం బ్రాగ్‌ డి) మాక్స్‌ వెబర్‌

11. సహజ రేడియోధార్మికతను కనుగొన్నశాస్త్రవేత్త?
ఎ) హెన్రీ బెకరల్‌ బి) మేడమ్‌ క్యూరీ
సి) రూథర్‌ఫర్డ్‌ డి) ఐన్‌స్టీన్‌

12. సహజ రేడియోధార్మికత మూలకాల్లో స్థిర రూప మూలకం?
ఎ) యురేనియం బి) థోరియం
సి) సీసం డి) టంగ్‌స్టన్‌

13. సహజ రేడియోధార్మికత పరమాణువు ఏ భాగానికి సంబంధించింది?
ఎ) అంతర కర్పరం బి) బాహ్య కర్పరం
సి) ఆకారం డి) కేంద్రకం

14. రేడియో ధార్మిక మూలకాల్లో భారయుతమైన కణం?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ

15. హీలియం పరమాణువు కేంద్రకంతో పోలిన రేడియోధార్మికత కిరణం ఏది?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) ఏదీకాదు

16. కేంద్రక విచ్ఛిత్తిని కనుగొన్నవారు?
ఎ) ఐరీన్‌ క్యూరీ బి) రూథర్‌ఫర్డ్‌
సి) ఐన్‌స్టీన్‌ డి) ఆటోహాన్‌, ట్రాస్‌మాన్‌

17. మొదటి అణురియాక్టర్‌ను నిర్మించిన శాస్త్రవేత్త?
ఎ) ఐన్‌స్టీన్‌ బి) ఫెర్మి
సి) హెచ్‌.జె. బాబా డి) మాక్స్‌ ప్లాంక్‌

18. న్యూక్లియర్‌ రియాక్టర్‌లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు?
ఎ) భారజలం బి) గ్రాఫైట్‌ కడ్డీలు
సి) బెరీలియం డి) పైవన్నీ

19. న్యూక్లియర్‌ రియాక్టర్‌లో నియంత్రణకారిగా ఉపయోగించే కడ్డీలు?
ఎ) కాడ్మియం బి) బోరాన్‌
సి) స్టీల్‌ డి) పైవన్నీ

20. అణుబాంబును కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) ఎడ్వర్డ్‌ టెల్లర్‌ బి) ఓపెన్‌ హైమర్‌
సి) స్పెన్నర్‌ డి) రూథర్‌ఫర్డ్‌

21. మ్యు మెజాన్‌ల ద్రవ్యరాశిని ఎలక్ట్రాన్‌ ద్రవ్యరాశితో పోల్చినపుడు?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) సగం

22. కిందివాటిలో అర్ధజీవిత కాలం తక్కువగా ఉన్న కణం ఏది?
ఎ) రేడియం బి) యురేనియం
సి) ప్రొటెక్టేనియం డి) ఫ్లుటోనియం

23. కత్రిమ రేడియోధార్మికతను కనుగొన్నవారు?
ఎ) రూథర్‌ఫర్డ్‌
బి) మేడమ్‌ క్యూరీ
సి) ఫ్రెడ్రిక్‌ జోలాయిట్‌ క్యూరీ, ఐరీన్‌ క్యూరీ
డి) ఐన్‌స్టీన్‌

24. కిందివాటిలో కత్రిమ రేడియోధార్మిక మూలకం కానిది?
ఎ) యురేనియం బి) ఫ్లుటోనియం
సి) క్యూరియం డి) లారెన్షియం

25. పరమాణు కేంద్రకంలో పనిచేసే బలాలు?
ఎ) సంసంజన బి) అసంజన
సి) కూలుంబ్‌ డి) వికర్షణ

26.అణుశక్తిని ఎందులో ఉపయోగిస్తారు?
ఎ) విద్యుత్‌ ఉత్పాదన
బి) జలాంతర్గాములు నడపడం
సి) ఐసోటోప్‌లు ఉత్పత్తి చేయడం
డి) పైవన్నీ

27. భారతదేశం నిర్మించిన తొలి పరిశోధనా అణు రియాక్టర్‌ పేరేమిటి?
ఎ) అప్సర బి) సైరస్‌
సి) పూర్ణిమ డి) ధ్రువ

28. సూర్యుడు, నక్షత్రాల్లో జరిగే చర్య?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి బి) కేంద్రక సంలీనం
సి) ఉష్ణగ్రాహక డి) ఏదీకాదు

29. కేంద్రక సంలీనం సూత్రం ఆధారంగా నిర్మించిన బాంబు?
ఎ) అణుబాంబు బి) హైడ్రోజన్‌ బాంబు
సి) ఎ, బి డి) ఏదీకాదు

30. కిరణజన్య సంయోగక్రియను అధ్యయనం చేయడానికి ఉపయోగించే ఐసోటోప్‌?
ఎ) 6జ12 బి) ూ సి) × డి) 8ఉ18

31. ఎక్స్‌ - కిరణాల తరంగదైర్ఘ్యం సాధారణ కాంతి కిరణాల తరంగదైర్ఘ్యం కంటే?
ఎ) ఎక్కువ బి) తక్కువ
సి) సమానం డి) రెండు రెట్లు ఎక్కువ

32. కాంతి విద్యుత్‌ ఘటాన్ని దేని కోసం ఉపయోగిస్తారు?
ఎ) రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసం
బి) ధ్వని ప్రత్యుత్పాదనలో
సి) దొంగలను పట్టుకునే అలారంలో
డి) పైవన్నీ

33. 'ఎలక్ట్రాన్‌ కవల కణం'గా పిలిచే పాజిట్రాన్‌ను కనుగొన్నవారు?
ఎ) పౌలి బి) పోవెల్‌
సి) అండర్సన్‌ డి) ఒపియాలిని

34. పదార్థంలోని తేలిక, బరువైన ఐసోటోప్‌లను దేనితో వేరు చేస్తారు?
ఎ) ఫొటోగ్రాఫిక్‌ ఫిల్మ్‌
బి) గిగ్గర్‌ ముల్లర్‌ కౌంటర్‌
సి) కేథోడ్‌ నాళం
డి) ఐసోట్రాన్‌

35. విశ్వంలో అతి శక్తిమంతమైన కిరణాలు ఏవి?
ఎ) లేజర్‌ బి) ఎక్స్‌-కిరణాలు
సి) కాస్మిక్‌ డి) రేడియో తరంగాలు

36. విశ్వ కిరణాలను ప్రయోగాత్మకంగా కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) విక్టర్‌ హెస్‌ బి) ఐన్‌స్టీన్‌
సి) పౌలి డి) కాంప్టన్‌

37. ఎక్స్‌ - కిరణాల ప్రయోజనం ఏమిటి?
ఎ) స్ఫటిక నిర్మాణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు
బి) పెయింటింగ్‌ నాణ్యతను గుర్తించడానికి వాడతారు
సి) ప్రయాణికుల సామగ్రిని తనిఖీ చేయడంలో వినియోగిస్తారు
డి) పైవన్నీ

38. వైద్యరంగంలో ఏ రకమైన ఎక్స్‌ కిరణాలను వినియోగిస్తారు?
ఎ) మదు బి) కఠిన
సి) సాధారణ డి) పైవన్నీ

39. కఠిన కాస్మిక్‌ కిరణాలను ఏది వెదజల్లుతుంది?
ఎ) నోవా బి) సూపర్‌ నోవా
సి) సూర్యుడు డి) గ్రహాలు

40. కాస్మిక్‌ కిరణాల తరంగదైర్ఘ్యం?
ఎ) తక్కువ బి) ఎక్కువ
సి) మధ్యస్థం డి) పైవన్నీ

41. రేడియో థెరపీలో ఏ కిరణాలను వినియోగిస్తారు?
ఎ) లేజర్‌ బి) గామా తరంగాలు
సి) రేడియో తరంగాలు డి) పైవన్నీ

42. కాస్మిక్‌ కిరణాల్లో అధికంగా ఉండే ప్రాథమిక కణాలేవి?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు

43. ప్రతిదీప్తి ప్రభావాన్ని ప్రదర్శించేవి?
ఎ) ఎలక్ట్రాన్లు బి) ప్రోటాన్లు
సి) న్యూట్రాన్లు డి) పాజిట్రాన్లు

44.థర్మల్‌ న్యూట్రాన్లను దేనిలో వినియోగిస్తారు?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సంలీనం
సి) టెలివిజన్‌లో
డి) కేన్సర్‌ వ్యాధి నివారణలో

45. సి.టి. స్కానింగ్‌లో వేటిని వినియోగిస్తారు?
ఎ) కేథోడ్‌ కిరణాలు
బి) కాస్మిక్‌ కిరణాలు
సి) ఎక్స్‌-కిరణాలు
డి) రేడియో తరంగాలు

46. పదార్థంలో ఎక్కువ లోతుకు చొచ్చుకొనిపోయే కిరణాలు ఏవి?
ఎ) ఆల్ఫా బి) బీటా
సి) గామా డి) పైవన్నీ

47. ఒకే పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు ఉండి, వేర్వేరు పరమాణు సంఖ్యలు ఉన్న వివిధ మూలకాల పరమాణువులను ఏమంటారు?
ఎ) ఐసోటోపులు బి) ఐసోబార్‌లు
సి) ఐసోటోన్‌లు డి) ఐసోట్రాన్‌లు

48. కేన్సర్‌ వ్యాధి నివారణలో ఉపయోగించే కిరణాలు?
ఎ) ఆల్ఫా బి) గామా
సి) బీటా డి) కాస్మిక్‌

49. ఒక స్థిర మూలకాన్ని రేడియోధార్మిక మూలకంగా మార్చడాన్ని ఏమంటారు?
ఎ) సహజ రేడియోధార్మికత
బి) కత్రిమ రేడియో ధార్మికత
సి) మూలకాల కత్రిమ పరివర్తన
డి) పైవన్నీ

50. థైరాయిడ్‌ గ్రంథిని పరిశీలించడానికి ఉపయోగించే రేడియో ఐసోటోప్‌?
ఎ) చీa బి) ×తీ సి) × డి) జశీ

51.కేన్సర్‌ గడ్డలను కరిగించడానికి ఏ రేడియో ఐసోటోప్‌ను ఉపయోగిస్తారు?
ఎ) జ14 బి) జఉ60
సి) చీa డి) V

52. శరీరంలో రక్తం గడ్డకట్టిన ప్రాంతాలను గుర్తించడానికి ఏ రేడియో ఐసోటోపు ఉపయోగిస్తారు?
ఎ) చీa బి) జశీ
సి) × డి) 6జ14

53. శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగిం చే రేడియో ఐసోటోపు?
ఎ) 92ఖ238 బి) ూb
సి) ుష్ట్ర డి) 6జ14

54. భూమి వయసును అంచనా వేయడంలో ఉపయో గించే రేడియో ఐసోటోప్‌?
ఎ) × బి) చీa సి) ఖ డి) ుష్ట్ర

55. తణధాన్యాలు, ఉల్లిపాయలు, పప్పు లాంటి వాటిని ఎక్కువ కాలం నిల్వ చేయడానికి వేటిని ఉపయోగిస్తారు?
ఎ) ఆల్ఫా కిరణాలు బి) పాజిట్రాన్లు
సి) ఎక్స్‌- కిరణాలు డి) గామా కిరణాలు


సమాధానాలు
1.సి 2.బి 3.సి 4.డి 5.సి
6.బి 7.ఎ 8.ఎ 9.బి 10.ఎ
11.ఎ 12.సి 13.డి 14.ఎ 15.ఎ
16.డి 17.బి 18.డి 19.డి 20.బి
21.ఎ 22.సి 23.సి 24.ఎ 25.సి
26.డి 27.ఎ 28.బి 29.బి 30.డి
31.బి 32.డి 33.సి 34.డి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.బి 40.ఎ
41.డి 42.బి 43.డి 44.ఎ 45.సి
46.సి 47. బి 48.బి 49.బి 50.సి
51.బి 52.ఎ 53.డి 54.సి 55.డి

విపత్తు నిర్వహణ ప్రశ్నలు 4


భూకంపాలు


1. భూ ఉపరితలం ద్వారా వర్తులాకారంగా ప్రయాణించి అత్యధిక నష్టం కలిగించే తరంగాలు ఏవి
ఎ)P  బి)L  సి)P,L  డి)S

2. భూ అంతర్భాగంలో ఘన, ద్రవ, వాయు మాధ్యమాల్లో ప్రయాణించే తరంగాలు ఏవి?
ఎ)P బి)L సి)P,L డి)S

3. ముందుకు వెనుకకు ఊగుతూ ద్రవ మాధ్యమంలో మాత్రమే ప్రయాణించే తరంగాలు ఏవి?
ఎ)P బి)L సి)P,L డి)S

4. జమ్మూ కాశ్మీర్‌లో ఏ సంవత్సరంలో సంభవించిన భూకంపం వల్ల 75 వేల మంది మరణించారు?
ఎ) 2004 బి) 2006
సి) 2005 డి) 2003

5. భూ కంపాలు సంభవించడానికి కారణం ఏమిటి?
ఎ) అగ్ని పర్వత సంబంధ కారణాలు
బి) ఉపరితల కారణాలు
సి) విరూపకారక కారణాలు డి) పైవన్నీ

6. లాతూర్‌లో భూకంపం సంభవించిన సంవత్సరం?
ఎ) 1993 బి) 1994
సి) 1992 డి) 1990

7. 1988 ఆగస్టు 21న ఏ ప్రదేశంలో భూకంపం సంభ వించి దాదాపు 15 వేల మంది మతికికారణమైంది?
ఎ) ఉత్తర హిమాలయాలు
బి) బీహార్‌ నేపాల్‌ సరిహద్దు
సి) గుజరాత్‌ డి) పైవన్నీ

8. అగాధ భూకంపాలు ఉపరితలం నుంచి ఎంత లోతులో సంభ విస్తాయి?
ఎ) 30 కి.మీ బి) 150 కి.మీ
సి) 300 కి.మీ డి) 200 కి.మీ

9. 60 నుంచి 300 కి.మీ లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు?
ఎ) అగాధ భూకంపాలు
బి) మాధ్యమిక భూకంపాలు
సి) గాధ భూకంపాలు డి) ఏదీ కాదు

10. 60 కి.మీ లోతులో సంభవించే భూకంపాలేవి?
ఎ) అగాధ భూకంపాలు
బి) మాధ్యమిక భూకంపాలు
సి) గాధ భూకంపాలు డి) ఏదీ కాదు

11. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో సంభవించే తుఫానులు?
ఎ) టోర్నడో బి) టైఫూన్‌
సి) విల్లీవిల్లీ డి) సైక్లోన్‌

12. ICZMPఅంటే?
ఎ) International coastal zone management project
బి) Integrated coastal zone management project
సి) Intergovernamental cooperative zone management project
డి) International cyclone zonal management programme

13.NCRMP అంటే?
ఎ) National coastal Rehabilitation Management project
బి) National coastal reconstruction management programme
సి) National Cyclone Rehabilitation management Project
డి) National Cyclone Risk Mitigation Project

14. తుఫాను నివారణ లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏవి?
ఎ) భవన సముదాయాలు నిర్మించడం
బి) మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం
సి) అవగాహన కార్యక్రమాలు చేపట్టడం
డి) పైవన్నీ

15. NCRMPకు ఆర్థిక సహాయం అందిస్తున్న సంస్థ ఏది?
ఎ) ఐక్యరాజ్య సమితి
బి) అంతర్జాతీయ ద్రవ్య నిధి
సి) ప్రపంచబ్యాంక్‌
డి) ఆసియా అభివద్ధి బ్యాంక్‌

16. ప్రపంచంలో అత్యధికంగా 80 శాతం సునామీలు ఎక్కడ సంభవిస్తుంటాయి?
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) అట్లాంటిక్‌ ప్రాంతం
డి) పసిఫిక్‌ పరివేష్టిత ప్రాంతం

17. సునామీకి కారణాలు ఏమిటి?
ఎ) అగ్నిపర్వతాలు బి) భూకంపాలు
సి) భూపాతాలు డి) పైవన్నీ

18. సునామీ ధాటికి ఇటీవల అన్ని న్యూక్లియార్‌ రియాక్టర్‌ కార్యకలాపాలు నిలిపివేసిన దేశం?
ఎ) చైనా బి) ఇండోనేషియా
సి) జపాన్‌ డి) భారత్‌

19. 2004లో 14 దేశాల్లో వచ్చిన సునామీ వల్ల ఎంత మంది మరణించారు?
ఎ) 2 లక్షలు బి) 1 లక్ష
సి) 3 లక్షలు డి) ఏదీకాదు

20. 2004 డిసెంబర్‌ 26న సంభవించిన సునామీలో భారత్‌లో మరణించిన వారి సంఖ్య ఎంత?
ఎ) 20,000 బి)10,000
సి) 50,000 డి) 30,000

21. భూకంపాలు ఏ సమయంలో సంభవిస్తాయి?
ఎ) ఉదయం బి) మధ్యాహ్నం
సి) సాయంత్రం డి) పైవన్నీ

22. ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం?
ఎ) 7 బి) 12 సి) 8 డి) 4

23. అత్యధికంగా పసిఫిక్‌ పరివేష్టిత ప్రాంతంలో ఎంత శాతం భూకంపాలు సంభవిస్తున్నాయి?
ఎ) 80 బి) 68 సి) 50 డి) 58

24. గుజరాత్‌లోని భుజ్‌ సమీపంలో భూ కంపం సంభవించిన సంవత్సరం ?
ఎ) 2001 బి) 1999 సి) 2000 డి) 2002

25. కింది వాటిలో భూకంపానికి సంబంధించి సరైనది.
ఎ) భూ అంతర్భాగంలో సంభవిస్తుంది
బి) కంపన తరంగాలు ఏర్పడుతాయి
సి) కొద్ది కాలం మాత్రమే ఉంటుంది
డి) పైవన్నీ

26. భారత్‌లో అతి తక్కువ భూ కంప తీవ్రత కలిగిన ప్రాంతం?
ఎ) దక్షిణ భారతదేశం బి) గంగా మైదానం
సి) ఈశాన్య భారతదేశం
డి) పశ్చిమ హిమాలయాలు

27. భూకంపం సంభవించినపుడు కింది వాటిలో ఏది జరుగుతుంది?
ఎ) కట్టడాలు కూలుతాయి
బి) నేల కోతకు గురవుతుంది
సి) అడవులు నాశనమవుతాయి డి) పైవన్నీ

28. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలు మీద ఎంత ఉంటే సునామీలు సంభవిస్తాయి?
ఎ) 8.0 బి) 7.5 సి) 8.5 డి) 9.0

29. భూ అంతర్భాగంలో చాలా లోతులో కంపన తరంగాలు విడుదలయ్యే భాగాన్ని ఏమంటారు?
ఎ) నాభి బి) అధికేంద్రం
సి) ఐసోసీస్మల్‌ లైన్‌ డి) ఏదీకాదు

30. నాభికి ఎదురుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు?
ఎ) నాభి బి) అధికేంద్రం
సి) ఐసోసీస్మల్‌ లైన్‌ డి) ఏదీకాదు

31. 'Tsunami' అనే పదం ఏ భాష నుంచి వచ్చింది?
ఎ) చైనీస్‌ బి) ఫ్రెంచ్‌
సి) జపనీస్‌ డి) గ్రీస్‌

32. సునామీ అనే పదానికి అర్థం ఏమిటి?
ఎ) సముద్ర అల బి) రాకాసి అల
సి) పాటుపోటులు డి) ఏదీకాదు

33. సునామీ అనే పదాన్ని అంతర్జాతీయ శాస్త్రవేత్తల మహాసభ ఏ సంవత్సరంలో రూపొందించింది?
ఎ) 1964 బి) 1965 సి) 1961 డి)1963

34. సముద్రంలో సంభవించే భూకంప తీవ్రత ఎంత ఉంటే సునామీలు రావడానికి అవకాశం ఉంది?
ఎ) 4.5 బి) 6.5 సి) 8.5 డి) 7.5

35. సునామీల గరిష్ట వేగం గంటకు ఎంత?
ఎ) 200-2000 కి.మీ. బి) 500-700 కి.మీ.
సి) 500-1500 కి.మీ. డి)100-500 కి.మీ.

36. పశ్చిమ బెంగాల్‌లో బోలా తుఫాను సంభవించిన సంవత్సరం?
ఎ) 1976 బి) 1980
సి) 1975 డి) 1970

37. 2012లో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తుఫాను పేరేమిటి?
ఎ) నీలం బి) లైలా సి) నిషా డి) థానె

38. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ తుఫాను సంభవించి 10 వేల మంది మరణించారు?
ఎ) 1975 బి) 1996 సి) 1977 డి) 1970

39. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి న తుఫాను ఏది?
ఎ) నీలం బి) లైలా సి) నిషా డి) థానె

40. ఏ దేశంలో నర్గీస్‌ అనే తుఫాను సంభవించి దాదాపు లక్ష మందికి పైగా మరణించారు?
ఎ) బర్మా బి) బంగ్లాదేశ్‌
సి) ఫిలిప్పీన్స్‌ డి) థారులాండ్‌

41. తుఫాను ఏర్పడటానికి కారణాలు ఏమిటి?
ఎ) వాతావరణ అస్థిరత బి) అల్పపీడనం
సి) వేడి సముద్రాలు డి) పైవన్నీ

42. ఇప్పటి వరకు ప్రపంచంలో సంభవించిన తుఫానుల్లో సుదీర్ఘమైంది ఏది?
ఎ) యూఎస్‌ టోర్నడో బి) టైఫూన్‌ జాన్‌
సి) ఆస్ట్రేలియా విల్లీవిల్లీ డి) హరికేన్‌లు

43. ఆస్ట్రేలియాలో సంభవించే తుఫానులను ఏమంటారు?
ఎ) టోర్నడో బి) టైఫూన్‌
సి) విల్లీవిల్లీ డి) సైక్లోన్‌

44. ఏ సముద్రంలో సంభవించే తుఫానులకు సైక్లోన్‌ అని పేరు?
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) ఉత్తర పసిఫిక్‌ సముద్రం డి) ఏదీకాదు

45. హరికేన్‌లు ఎక్కడ సంభవిస్తాయి?
ఎ) హిందూ మహా సముద్రం
బి) మధ్యదరా సముద్రం
సి) ఉత్తర పసిఫిక్‌ సముద్రం
డి) ఉత్తర అట్లాంటిక్‌ సముద్రం

46. భూకంపక దలికల కాలాన్ని లెక్కించే సాధనం?
ఎ)Sysmograph  బి) Sysmogram
సి) Magnitude డి) ఏదీ కాదు

47.Sysmogram అంటే?
ఎ) భూకంప కదలికల కాలాన్ని లెక్కించే సాధనం
బి) భూకంప తీవ్రతను నమోదు చేసే రేఖా చిత్రం
సి) భూకంప పరిమాణాన్ని కొలిచే సాధనం
డి) ఏదీ కాదు

48. భూకంప పరిమాణాన్ని కొలవడానికి కింది వాటిలో ఉపయోగించనిది?
ఎ) రోసీ ఫారెల్‌ స్కేలు బి) మెర్కల్లీ స్కేలు
సి) రిక్టర్‌ స్కేలు డి) ఏదీకాదు

49. దేశంలో తరచుగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు?
ఎ) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, గుజరాత్‌
బి) హిమాలయాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్‌ పీఠభూమి
సి) ఉత్తరప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలు, దక్కన్‌ పీఠభూమి
డి) కోస్తా తీరం, బీహార్‌, దక్కన్‌ పీఠభూమి

50. ప్రపంచంలో సంభవిస్తున్న భూకంపాల్లో పసిఫిక్‌ పరివేష్టిత ప్రాంతంలో సంభవించే వాటి శాతం?
ఎ) 65.6 బి) 75.6
సి) 85.6 డి) 80.6

51. 2010లో ఏ దేశంలో సంభవించిన భూకంపం వల్ల 2 లక్షల కంటే ఎక్కువ మంది చనిపోయారు?
ఎ) ఘనా బి) ఉరుగ్వే సి) హైతీ డి) పెరూ

52. భారతదేశం మొత్తం తీర రేఖ పొడవు ఎంత?
ఎ) 8000 కి.మీ బి) 5100 కి.మీ
సి) 7000 కి.మీ డి) 7517 కి.మీ

53. దేశం మొత్తం భూభాగంలో ఎంత శాతం తుఫానుల బారిన పడుతుంది?
ఎ) 8 శాతం బి) 12 శాతం
సి) 4 శాతం డి) 10 శాతం

54. ఒరిస్సాలో సూపర్‌ సైక్లోన్‌ సంభవించిన సంవత్సరం?
ఎ) 2000 బి) 1976 సి) 1999 డి) 1998

55. దేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్నాయి?
ఎ) 12 బి) 10 సి) 9 డి) 11



సమాధానాలు
1.బి 2.ఎ 3.డి 4.సి 5.డి
6.ఎ 7.బి 8.సి 9.బి 10.సి
11.ఎ 12.బి 13.డి 14.డి 15.సి
16.డి 17.డి 18.సి 19.ఎ 20.బి
21.డి 22.సి 23.బి 24.ఎ 25.డి
26.ఎ 27.డి 28.బి 29.ఎ 30.బి
31.సి 32.బి 33.డి 34.బి 35.బి
36.డి 37.ఎ 38.సి 39.సి 40.ఎ
41.డి 42.బి 43.సి 44.ఎ 45.డి
46.ఎ 47.బి 48.డి 49.ఎ 50.బి
51.సి 52.డి 53.ఎ 54.సి 55.బి
 
Related Posts Plugin for WordPress, Blogger...