65వ జాతీయ చలన చిత్ర అవార్డులు


జాతీయ స్థాయిలో సినిమా రంగానికిచ్చే జాతీయ చలన చిత్ర అవార్డులను ఏప్రిల్ 13న ప్రకటించారు.
ఈ అవార్డుల్లో బాహుబలి-2, ఘాజీ చిత్రాలు టాప్ అవార్డులను దక్కించుకున్నాయి. ఇటీవల మరణించిన నటి శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు రాగా, అస్సామీ చిత్రం విలేజ్ రాక్‌స్టార్స్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ మేరకు న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల జ్యూరీ కమిటీ అధ్యక్షుడు, బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ 65వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించారు.
2017లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డులను ప్రకటించారు.

అవార్డులు - విజేతలు
ఉత్తమ చిత్రం
విలేజ్ రాక్‌స్టార్స్ (అస్సామీ)
జాతీయ ఉత్తమ నటి
శ్రీదేవీ (మామ్)
జాతీయ ఉత్తమ నటుడు
రిద్ధీసేన్(నగర కీర్తన్-బెంగాలీ)
ఉత్తమ దర్శకుడు
జయరాజ్ (భయానకమ్)
ఉత్తమ పోరాట సన్నివేశ చిత్రం
బాహుబలి2
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ అవార్డు
బాహుబలి2
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం
బాహుబలి2
ఉత్తమ నృత్య దర్శకుడు
గణేష్ ఆచార్య (టాయిలెట్ ఏక్ ప్రేమ్‌కథ)
ఉత్తమ సంగీత దర్శకుడు
ఎఆర్ రెహ్మాన్ (కాట్రు వెలియదై)
ఉత్తమ నేపథ్య సంగీతం
ఎఆర్ రెహ్మాన్ (మామ్)
ఉత్తమ గాయకుడు
జె. ఏసుదాసు
ఉత్తమ గాయని
షా షా తిరుపతి (కాట్రు వెలియదైలోని వాన్ వరువన్)
ఉత్తమ సహాయనటుడు
ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
ఉత్తమ సహాయనటి
దివ్యాదత్ (ఇరాదా)
ఉత్తమ బాలనటి
బనితా దాస్(విలేజ్ రాక్ స్టార్స్)
ఉత్తమ షార్ట్‌ఫిల్మ్(ఫిక్షన్)
మయ్యత్ (మరాఠీ)
బెస్ట్ నాన్ ఫీచర్ ఫిల్మ్
వాటర్ బేబీ
బెస్ట్ ఫిల్మ్స్ ఆన్ సోషల్ ఇష్యూస్
అయామ్ బొనే, వెల్ డన్
బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే
భయానకం(మలయాళం)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్
టేకాఫ్ (మలయాళం)
హిందీ ఉత్తమ చిత్రం
న్యూటన్
ఉత్తమ తెలుగు చిత్రం
ఘాజీ
ఉత్తమ తమిళ చిత్రం
టు లెట్
ఉత్తమ మరాఠీ చిత్రం
కచ్చా నింబూ
ఉత్తమ కన్నడ చిత్రం
హెబ్బెట్టు రామక్క
ఉత్తమ బెంగాలీ చిత్రం
మయురాక్షి
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్
వినోద్ ఖన్నా
నర్గీస్ దత్ అవార్డు (జాతీయ సమైక్యతా చిత్రం)
దప్పా(మరాఠీ)

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...