* జమ్మూకశ్మీర్ రాష్ట్ర శాశ్వత నివాసి ఎవరు? అన్నది నిర్వచిస్తుంది.
* వారి స్థిరాస్తి హక్కుల్ని నిర్ధారిస్తుంది.
* కశ్మీరేతరులు రాష్ట్రంలో స్థిరాస్తులు కలిగి ఉండటాన్ని, ప్రభుత్వోద్యోగాలు పొందడాన్ని నిషేధిస్తుంది.

కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కట్టబెట్టే రాజ్యాంగంలోని ఆర్టికల్-35ఏపై వివాదం ఈనాటిది కాదు. దీని రద్దును చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టు తలుపు తట్టడం.. కొనసాగించాల్సిందేనంటూ మరికొందరు ఉద్యమబాట పట్టడంతో ఈ వివాదం ఇప్పుడు మరోసారి రాజుకుంది.
వ్యతిరేకుల వాదనేంటి?
* ఆర్టికల్ 370 కింద ఇప్పటికే ప్రత్యేక ప్రతిపత్తిని అనుభవిస్తున్న జమ్ముకశ్మీర్కు మళ్లీ ఆర్టికల్ 35ఏ రూపంలో ప్రత్యేకాధికారాలు ఇవ్వడం ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే.
* ఆర్టికల్ 35ఏ ఎన్నడూ పార్లమెంటు ముందుకు వెళ్లలేదు. దానిని చట్టవ్యతిరేకంగా రాజ్యాంగంలో చేర్చారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం... చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 35ఏ పూర్తిగా పురుషులకు అనుకూలంగా ఉంది. బయటి మహిళ ఎవరైనా కశ్మీర్ యువకుణ్ని పెళ్లిచేసుకుంటే అతని శాశ్వత నివాస హక్కుపోదు. అదే కశ్మీర్ మహిళ బయటి వ్యక్తిని పెళ్లిచేసుకుంటే ఆమె నివాస హక్కు పోతుంది. ఆస్తి పోతుంది కాబట్టి.. కశ్మీరీ మహిళ బయటి వ్యక్తి ఎవరినీ పెళ్లిచేకోకుండా ఈ నిబంధన అడ్డుపడుతుంది. ఇది సమానత్వ హక్కును ఉల్లంఘించడమే.
* రాష్ట్రంలో అనేక ఏళ్లుగా నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీల ప్రాథమిక హక్కుల్ని ఈ ఆర్టికల్ కాలరాస్తోంది. వీరు కులవృత్తులు కొనసాగించాలన్న నిబంధనతో శాశ్వాత నివాస పత్రాలు ఇచ్చారు. దీనివల్ల వారు మరే పనీ చేయడానికి అర్హత లేకుండా ఇప్పటికీ అదే వృత్తి కొనసాగిస్తున్నారు.
* యాజమాన్య హక్కు నిబంధన వల్ల బయటి పరిశ్రమలేవీ రాష్ట్రానికి రావడం లేదు. మంచి డాక్టర్లూ రావట్లేదు.

కశ్మీరీ శాశ్వత నివాసి అంటే..
* 1954 మే 14వ తేదీకన్నా ముందు/తేదీ నాటికి రాష్ట్రంలో జన్మించిన వ్యక్తి లేదా, పదేళ్లపాటు రాష్ట్రంలో నివసించిన వ్యక్తి కశ్మీర్ శాశ్వత నివాసి(జమ్మూకశ్మీర్ రాజ్యాంగం ప్రకారం..).
* ఆ వ్యక్తి రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండొచ్చు.

అనుకూలురు ఏమంటున్నారు?
* జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి లేకపోతే.. ఇతర రాష్ట్రాల వారు కశ్మీర్ను ముంచెత్తి.. ఇక్కడ ఆస్తులు, ఓటింగ్ హక్కులు సంపాదించుకుంటారు.
* దీనివల్ల ముస్లిం మెజారిటీ రాష్ట్రమైన కశ్మీర్ భౌగోళిక స్వరూపమే మారిపోతుంది.
* కశ్మీరీలకు ఉపాధి సహా అన్ని రకాల అవకాశాలూ దెబ్బతింటాయి.
* రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం, స్కాలర్షిప్లు, ఇతరత్రా సహాయాలు పొందొచ్చు.
* రాష్ట్రంలో దీర్ఘకాల నివాసితులకు రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్లను మంజూరుచేయొచ్చు.
* కశ్మీరీ మహిళ కశ్మీరేతరుణ్ని పెళ్లిచేసుకుంటే ఆమె ఈ రాష్ట్రంలో స్థిరాస్తుల్ని కలిగి ఉండటానికి వీల్లేదు. ఆమె పిల్లలకూ ఆ ఆస్తిపై హక్కు ఉండదు. పిల్లలకు శాశ్వత నివాస సర్టిఫికెట్ను ఇవ్వరు.
* కశ్మీరేతరుడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నిక కాకూడదు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వృత్తివిద్యా కళాశాలలో చేరకూడదు.
నేపథ్యం..
భారత యూనియన్లో కశ్మీర్ విలీనం- రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్లకే పరిమితం. నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ అబ్దుల్లా, ప్రధాని నెహ్రూ మధ్య 1952 జులైలో కుదిరిన ‘దిల్లీ ఒప్పందం’ ప్రకారం- కశ్మీరీలందరికీ భారత పౌరసత్వం ఇస్తారు. రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు కల్పించడం కోసం, స్థిర నివాసులు ఎవరో నిర్వచించడం కోసం చట్టాలు చేసే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉంటుంది. 1954 మే 14వ తేదీన రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ఉత్తర్వు ద్వారా- ఆర్టికల్ 35ఏను రాజ్యాంగంలో చేర్చారు. దీనిపై పార్లమెంటులో ఎలాంటి చర్చ జరగలేదు.

ఇతర రాష్ట్రాలకూ ఉన్నాయి..
దేశంలోని చాలావరకు గిరిజన, పర్వతప్రాంత వాసులకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఆర్టికల్ 371(ఏ) కింద నాగాలాండ్కు, ఆర్టికల్ 371(జీ) కింద మిజోరం రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు కల్పిస్తున్నారు. గిరిజనుల భూములపై హక్కులకు సంబంధించి తెలుగురాష్ట్రాల్లో ఉన్న 1/70 చట్టం కూడా ఇలాంటిదే.

No comments:
Post a Comment