హరిత టపాసులు (green crackers) అంటే ??

 ✌ జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ హరిత టపాసుల ఫార్ములాను తయారు చేసింది.
✌ చూడ్డానికి ఇవి మామూలు టపాసులలానే ఉంటాయి. అలానే పేలుతాయి. కానీ, వీటి నుంచి పొగ, శబ్దం తక్కువగా వెలువడతాయి.
✌ సాధారణ టపాసులు ఎక్కువ నైట్రోజెన్, సల్ఫర్ వాయువులను విడుదల చేస్తాయి. వాటితో పోలిస్తే హరిత టపాసులు 40-50శాతం తక్కువ వాయువులను విడుదల చేస్తాయి.
 
✌  హరిత టపాసుల తయారీ కోసం ప్రత్యేకమైన పదార్థాలను వినియోగిస్తారు. టపాసుల్లో చాలా రకాలుంటాయి.


1. నీరు విడుదల చేసే టపాసులు: ఇవి పేలితే నీటి బుడగలు విడుదలవుతాయి. వీటిని సేఫ్ వాటర్ రిలీజర్లు అని పిలుస్తారు.
2. తక్కువ సల్ఫర్, నైట్రోజెన్ విడుదల చేసే టపాసులు: కాలుష్యాన్ని తగ్గించే ఆక్సిడైజింగ్ పదార్థాలు వీటిలో ఉంటాయి.
3. అల్యుమినియం వినియోగం తక్కువ: హరిత టపాసుల తయారీకి 50-60శాతం తక్కువ అల్యుమినియం వినియోగిస్తారు. వీటిని SAFAL (సేఫ్ మినిమల్ అల్యుమినియం క్రాకర్స్) అని పిలుస్తారు.
4. ఆరోమా టపాసులు: ఇవి పేలితే శబ్దంతో పాటు సువాసనలు కూడా వస్తాయి.

 .

.

✌ కానీ, దేశం లోని అన్ని  మార్కెట్లో హరిత టపాసులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. ప్రభుత్వం  వీటికి అనుమతిస్తుంది. అందుకే అవి విస్తరించడానికి ఇంకాస్త సమయం పడుతుంది.
✌ ప్రపంచంలో మరే దేశంలోనూ హరిత టపాసుల్ని వినియోగించరు✌  ఆలోచన భారత్లోనే పుట్టిందని, ఇవి వినియోగంలోకి వస్తే ప్రపంచంలో కొత్త మార్పునకు భారత్ శ్రీకారం చుడుతుందని జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధనా సంస్థ చీఫ్ సైంటిస్ట్  చెప్పారు.
 

 

 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...