ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (1)

1. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం హైదరాబాద్‌లోని గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన తేదీ నుంచి ఎన్ని సంవత్సరాలు నిర్వహిస్తుంది ?
ఎ. ఏడు సంవత్సరాలు
బి. రెండు సంవత్సరాలు
సి. మూడు సంవత్సరాలు
డి. ఐదు సంవత్సరాలు
2. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 ద్వారా ఏర్పాటు చేయబడిన అపెక్స్‌ కౌన్సిల్‌ పని ఏమిటి ?
ఎ. ఆస్తుల విభజనని పర్యవేక్షించడం
బి. రాజధాని నిర్మాణపు పనులను పర్యవేక్షించడం
సి. ఉద్యోగుల పంపిణీని పర్యవేక్షించడం
డి. నదీజలాల నిర్వహణ బోర్డులను పర్యవేక్షించడం
3. ఏ సంస్థ కేసులో ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014 ప్రకారం ఆస్తుల విభజన రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తిలో జరగాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది ?
ఎ. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌
బి. ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి
సి. ఏపీ జెన్‌కో
డి. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ
4. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్‌ పదిలోని ఆస్తుల విభజనపై ఏర్పాటు చేసిన కమిటీ ఈ పేరుతో పిలువబడుతుంది ?
ఎ. శ్రీకృష్ణకమిటీ
బి. కమలనాథన్‌ కమిటీ
సి. శ్రీరామకృష్ణ కమిటీ
డి. షీలాభీడే కమిటీ
5. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని ఐదో అధికరణాన్ని అనుసరించి, హైదరాబాద్‌ నగరం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఎన్ని సంవత్సరాల మేరకు ఉమ్మడి రాజధానిగా మెలుగుతుందో ఈ కిందివానిలో గుర్తించగలరు ?
ఎ. పది సంవత్సరాలు
బి. పది సంవత్సరాలు మించకుండా
సి. పది సంవత్సరాలు దాటి
డి. పైవేవీ కావు
6. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ 2014 చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఈ రోజుకి ఎన్ని సంస్థలు ఉన్నాయి ?
ఎ. 142
బి. 135
సి. 112
డి. 107
7. కృష్ణా-గోదావరి నదీ యాజమాన్య బోర్డును పర్యవేక్షించే అత్యున్నత కౌన్సిల్‌కు అధిపతి ఎవరో ఈ కిందివానిలో గుర్తించగలరు ?
ఎ. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ గవర్నరు
బి. భారత ప్రధానమంత్రి
సి. కేంద్ర జలవనరుల శాఖామంత్రి
డి. కేంద్ర జలసంఘ అధిపతి
8. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతము ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నోటిఫై చేసింది ?
ఎ. 271.23
బి. 217.23
సి. 271.32
డి. 217.32
9. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఏ నియమం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలకు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వగలుగుతుంది ?
ఎ. 43
బి. 44
సి. 45
డి. 46
10. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు యొక్క అభివృద్ధి మరియు నియంత్రణలను ఈ కింది విషయంలో చేపట్టింది ?
ఎ. నీటిపారుదల బి. విద్యుత్‌
సి. వరదల నియంత్రణ
డి. ఇవ్వబడిన సమాధానాలు అన్నీ సరైనవే
.

.
11. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, గోదావరి మరియు కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు అనుమతించే అధికారం కిందివారిలో ఎవరికి ఉంది ?
ఎ. భారత ప్రభుత్వ జలవనరుల మంత్రిత్వశాఖ
బి. ప్రదేశాన్నిబట్టి, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు
సి. నదీ జలాల నిర్వహణ బోర్డులు
డి. నదీ జలవనరులపై ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌
12. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్‌ ప్రకారం కింద తెలుపబడిన ప్రధాన ఓడరేవును కేంద్రప్రభుత్వం అభివృద్ధి చేయాలి ?
ఎ. రామాయపట్నం
బి. దుగ్గిరాజపట్నం
సి. మచిలీపట్నం
డి. భీమునిపట్నం
13. ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌, రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈ కింది వారు నిర్దేశించిన కాలపరిమితికి ఉంటారు ?
ఎ. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
బి. భారత గృహమంత్రి
సి. రాష్ట్రపతి
డి. ప్రధానమంత్రి
14. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఉమ్మడి రాజధాని కింద నోటిఫైడ్‌ ప్రాంతం ఉంటుంది ?
ఎ. జిహెచ్‌ఎంసి బి. హెచ్‌ఎండీఎ
సి. హైదరాబాద్‌ జిల్లా
డి. హైదరాబాద్‌ మరియు రంగారెడ్డి జిల్లా
15. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణ రాష్ట్రాల జనాభా నిష్పత్తి ఎంత ?
ఎ. 58.14 : 41.86
బి.58.22 : 41.78
సి. 58.31 : 41.69
డి. 58.32 : 41.68
16. 13వ ఆర్థిక సంఘం కేటాయించిన వనరులలో, రెండు రాష్ట్రాలకు ఏ రకంగా కేటాయింపు జరగాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో నిర్ణయించింది ?
ఎ. రెండు రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం
బి. 50 : 50 నిష్పత్తి ప్రకారం
సి. కేంద్రం నిర్ణయించిన ప్రకారం
డి. రెండు రాష్ట్రాల సమ్మతి ప్రకారం
17. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని రెండు రాష్ట్రాల మధ్య నగదు మరియు క్రెడిట్‌ నిల్వలు ఏవిధంగా పంపిణీ చేయబడతాయి ?
ఎ. భారతీయ రిజర్వుబ్యాంక్‌ తన పుస్తకాలలో నిల్వలను సర్దుబాటు చేస్తుంది.
బి. లెక్కకంటే అధిక నిల్వ ఉన్న రాష్ట్రం రెండో రాష్ట్రానికి చెక్కులు ఇవ్వాలి.
సి. ప్రతి రాష్ట్రం రెండో రాష్ట్రంపై డెబిట్‌ నోట్‌ జారీ చేస్తుంది.
డి. ప్రతి రాష్ట్రం రెండో రాష్ట్రానికి క్రెడిట్‌ నోట్‌ జారీ చేస్తుంది.
18. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్‌ 8(3) ప్రకారం గవర్నర్‌ తీసుకునే నిర్ణయాలను ?
ఎ. గవర్నర్‌ నిర్ణయమే తుది నిర్ణయం
బి. కేంద్రం సమీక్ష చేయవచ్చు
సి. తెలంగాణ కేబినెట్‌ వీటో చేయవచ్చు
డి. ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ వీటో చేయవచ్చు
19. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్‌ 8(4) ప్రకారం కేంద్ర ప్రభుత్వం గవర్నర్‌కు ఎంతమంది సలహాదారులను నియమిస్తుంది ?
ఎ. ఇద్దరు
బి. నలుగురు
సి. ఒక్కరు
డి. మూడు
20. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం గ్రేహౌండ్స్‌ మరియు అక్టోపస్‌ దళాలు రెండు రాష్ట్రాల మధ్య కింది విధంగా విభజించబడతాయి ?
ఎ. ఉద్యోగులు ఇచ్చిన ఐచ్చికాల ఆధారంగా
బి. కేంద్రం నిర్ణయించిన విధంగా
సి. విభజింపబడవు మరియు తెలంగాణలో ఉంటాయి
డి. విభజింపబడవు మరియు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాయి
.

.
సమాధానాలు : 1.సి, 2.డి, 3.బి, 4.డి, 5.బి, 6.ఎ, 7.సి, 8.బి, 9.ఎ, 10.ఎ,
11.డి, 12.బి, 13.సి, 14.ఎ, 15.డి, 16.ఎ, 17.ఎ, 18.ఎ, 19.ఎ, 20.ఎ
.

.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (1)

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం 2014 సమస్యలు - పర్యవసానాలు (2)



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...