అసిటబులేరియా జ‌ల‌క‌న్య‌కే

 

              భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు కొత్త వృక్ష జాతి మొక్క‌ను కనుగొన్నారు. అండ‌మాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. 2019లో ఆ దీవుల‌కు వెళ్లిన వృక్ష శాస్త్ర‌వేత్త‌ల‌కు ఆ మొక్క ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ మెరైన్ గ్రీన్ ఆల్గేకు జ‌ల‌క‌న్య (మెర‌మైడ్) అని పేరు పెట్టారు. తాము క‌నుగొన్న మొక్క కొత్త‌ది అని చెప్పేందుకు వాళ్ల‌కు రెండేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. అయితే ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని క‌నుగొన‌డం గ‌త నాలుగు ద‌శాబ్ధాల్లో ఇదే మొద‌టిద‌న్నారు.

 .

.

             పంజాబ్ సెంట్ర‌ల్ వ‌ర్సిటీకి చెందిన శాస్త్ర‌వేత్త‌లు ఆ మొక్క‌కు అసిటబులేరియా జ‌ల‌క‌న్య‌కే అన్న శాస్త్రీయ నామాన్ని పెట్టారు. జ‌ల‌క‌న్య అంటే స‌ముద్ర దేవ‌త‌. కొత్త‌గా గుర్తించిన మొక్క చాలా అద్భుతంగా ఉంద‌ని, చాలా సున్నిత‌మైన డిజైన్‌లో ఆ మొక్క ఉంద‌ని, ఛ‌త్రీల త‌ర‌హాలో ఆ జ‌ల‌క‌న్య క‌నిపిస్తున్న‌ట్లు డాక్ట‌ర్ ఫెక్లీ బ‌స్త్ తెలిపారు. జ‌ల‌క‌న్య మొక్క ఒకేఒక్క భారీ క‌ణంతో త‌యారైన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు చెప్పారు.

 

 

 

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...