టోక్యో ఒలింపిక్స్ - 48వ స్థానంలో భారత్...

         కరోనా సహా అన్ని అవరోధాలను అధిగమించి 2021, జూలై 23 ప్రారంభమైన విశ్వ క్రీడలు 2021, ఆగస్టు 8 ఘనంగా ముగిశాయి.


         టోక్యోలో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 గెలిచిన భారత్ ఒలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో (స్వర్ణాల సంఖ్య ఆధారంగా) భారత్ 48 స్థానంలో నిలిచింది. నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య ప్రకారమైతే భారత్కు 33 స్థానం దక్కింది. అయితే ఒలింపిక్స్లో స్వర్ణాల సంఖ్య ఆధారంగానే ర్యాంక్ను పరిగణనలోకి తీసుకుంటారు.

.

.

 

 

స్వర్ణం - 1

·        జావెలిన్త్రోలో నీరజ్చోప్రా

రజతం - 2

·   మహిళల వెయిట్లిఫ్టింగ్‌ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను

·        పురుషుల రెజ్లింగ్‌ 57 కేజీల విభాగంలో రవి దహియా

కాంస్యం

·        మహిళల బ్యాడ్మింటన్సింగిల్స్లో పీవీ సింధు

·        మహిళల బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్

·        పురుషుల రెజ్లింగ్‌ 65 కేజీల విభాగంలో బజరంగ్పూనియా

·        పురుషుల హాకీ జట్టు

 


పారిస్లో 2024 ఒలింపిక్స్...

        మూడేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఒలింపిక్స్ రానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2024 ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రపంచ ఫ్యాషన్ కేంద్రం పారిస్లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ జరగనుండటం విశేషం. గతంలో రెండుసార్లు నగరం ఒలింపిక్స్కు (1900, 1924) ఆతిథ్యం ఇచ్చింది.



No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...