కరోనా సహా అన్ని అవరోధాలను అధిగమించి 2021, జూలై 23న ప్రారంభమైన విశ్వ క్రీడలు 2021, ఆగస్టు 8న ఘనంగా ముగిశాయి.
టోక్యోలో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో 128 మంది క్రీడాకారులు బరిలోకి దిగారు. ఒక స్వర్ణం, రెండు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం 7 గెలిచిన భారత్ ఒలింపిక్స్ చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో (స్వర్ణాల సంఖ్య ఆధారంగా) భారత్ 48వ స్థానంలో నిలిచింది. నెగ్గిన మొత్తం పతకాల సంఖ్య ప్రకారమైతే భారత్కు 33వ స్థానం దక్కింది. అయితే ఒలింపిక్స్లో స్వర్ణాల సంఖ్య ఆధారంగానే ర్యాంక్ను పరిగణనలోకి తీసుకుంటారు.
.
.
స్వర్ణం - 1 |
· జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా |
రజతం - 2 |
· మహిళల వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను · పురుషుల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రవి దహియా |
కాంస్యం |
· మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పీవీ సింధు · మహిళల బాక్సింగ్ 69 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్ · పురుషుల రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా · పురుషుల హాకీ జట్టు |
పారిస్లో 2024 ఒలింపిక్స్...
మూడేళ్ల వ్యవధిలోనే మళ్లీ ఒలింపిక్స్ రానున్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో 2024 ఒలింపిక్స్ జరుగుతాయి. ప్రపంచ ఫ్యాషన్ కేంద్రం పారిస్లో వందేళ్ల తర్వాత ఒలింపిక్స్ జరగనుండటం విశేషం. గతంలో రెండుసార్లు ఈ నగరం ఒలింపిక్స్కు (1900, 1924) ఆతిథ్యం ఇచ్చింది.
జనాభాలో ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు లోక్సభ ఆగస్టు 10న ఆమోదం తెలిపింది.
127వ రాజ్యాంగ సవరణ బిల్లు –2021కు ఆగస్టు 18 రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 105 రాజ్యాంగ సవరణ జరిగింది. 105 రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్స్ 338B మరియు 342A సవరించ బడ్డాయి.
.
.
జాతీయ
బీసీ కమిషన్ విధివిధానాలను నిర్దేశిస్తూ 2018లో ప్రభుత్వం 102వ
రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా
338బీ, 342ఏ, 366 (26సి) అధికరణలను చేర్చింది.
మరాఠాలకు ప్రత్యేక రిజర్వేషన్లను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు 2021, ఏడాది మే 5న కీలకమైన
తీర్పు చెప్పింది. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాల (ఎస్ఈబీసీ) జాబితాలో
కొత్త కులాలను నోటిఫై చేసే అధికారం రాష్ట్రపతికి
మాత్రమే ఉంటుందని, మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంటుకు
మాత్రమే ఉందని 342ఏ చెబుతోందని, 102వ
రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలు
ఓబీసీ జాబితాలో కులాలను చేర్చే అధికారాన్ని కోల్పోయాయని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు
స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రాలకు సొంత ఓబీసీ జాబితా
తయారు చేసుకునే అవకాశం పోయింది. ఈ తీర్పును సమీక్షించాలన్న
కేంద్ర విజ్ఞప్తిని మేలో సుప్రీం తోసిపుచ్చింది.
ఓబీసీలను గుర్తించే తమ అధికారాలను హరించడంపై
పలు రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం 127వ రాజ్యాంగ సవరణ
చట్టం తీసుకువచ్చింది.
భారతీయ శాస్త్రవేత్తలు కొత్త వృక్ష జాతి మొక్కను కనుగొన్నారు. అండమాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. 2019లో ఆ దీవులకు వెళ్లిన వృక్ష శాస్త్రవేత్తలకు ఆ మొక్క దర్శనమిచ్చింది. ఆ మెరైన్ గ్రీన్ ఆల్గేకు జలకన్య (మెరమైడ్) అని పేరు పెట్టారు. తాము కనుగొన్న మొక్క కొత్తది అని చెప్పేందుకు వాళ్లకు రెండేళ్ల సమయం పట్టింది. అయితే ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని కనుగొనడం గత నాలుగు దశాబ్ధాల్లో ఇదే మొదటిదన్నారు.
.
.
పంజాబ్ సెంట్రల్ వర్సిటీకి చెందిన
శాస్త్రవేత్తలు ఆ మొక్కకు అసిటబులేరియా జలకన్యకే అన్న శాస్త్రీయ
నామాన్ని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత. కొత్తగా గుర్తించిన
మొక్క చాలా అద్భుతంగా ఉందని, చాలా సున్నితమైన డిజైన్‌లో ఆ మొక్క ఉందని,
ఛత్రీల తరహాలో ఆ జలకన్య కనిపిస్తున్నట్లు డాక్టర్ ఫెక్లీ బస్త్
తెలిపారు. జలకన్య మొక్క ఒకేఒక్క భారీ కణంతో తయారైనట్లు
శాస్త్రవేత్తలు చెప్పారు.
Answered
Unanswered
Congratulations You Scored | 0 / 10 |
Total number correct answers:- | 0 |
Total number of questions:- | 10 |
0.00% |
|
|
Your Answer
Correct Answer
Your Answer
Correct Answer
Your Answer
Correct Answer
Your Answer
Correct Answer