ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసుల పాత్ర
‘ప్రజాస్వామ్యంలో ఏ పరిపాలన అయినా సమర్థవంతంగా సాగాలంటే, నిబంధనల్ని గుదిగుచ్చి పని పోకడల్ని నిర్దేశిస్తే సరిపోదు... వాటిని అమలుపరిచి, పర్యవేక్షించే వ్యక్తులూ సరైన వారై ఉండాలి’
- చక్రవర్తుల రాజగోపాలాచారి (రాజాజీ)
ఉపోద్ఘాతం:
భారతదేశ రాజ్యంగ ఆదర్శాల్లో అతిముఖ్యమైన గమ్యం సంక్షేమ రాజ్య (Welfare State) స్థాపన. సంక్షేమ ఫలాలని క్రింది స్థాయివరకూ తీసుకెళ్ళి శ్రేయో రాజ్య స్తాపన చేయడంలో మరియు వాస్తవమైన ప్రజాస్వామ్య స్థాపనలో సివిల్ సర్వీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రజలకీ ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే సివిల్ సర్వీసులు భారతదేశానికి ఎంతో క్రియాశీలకం.
భారతదేశంలో సివిల్ సర్వీసులు – సాపేక్ష పోలిక (Relative Comparision):
పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాల్లో జాతీయ సివిల్ సర్వీసుల ఏర్పాటుకంటే ముందే ప్రజలకు రాజకీయాధికారం లభించింది. అందువల్ల ఈ దేశాల్లో రాజకీయ వ్యవస్థ, ప్రజల జీవన విధానం మరియు సివిల్ సర్వీసుల మధ్య సమన్వయం నెలకొన్నది.
భారతదేశంలో మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. దేశ ప్రజలకు రాజకీయాధికారం లభించకముందే బ్రిటీష్ సామ్రాజ్య వలస పాలన, బలమైన ఉద్యోగస్వామ్యాన్ని తనకు ఉపయోగపడేటట్లు చేసుకున్నది. కానీ దానిని నియంత్రించడానికి పటిష్టమైన రాజకీయ యంత్రాగాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. భారతదేశంలో వ్యవస్థీకృత రాజకీయ వ్యవస్థ1885లో ఏర్పడింది. అయితే దానికంటే ముందే అంటే 1854లో సివిల్ సర్వీసు వ్యవస్థ అవతరించింది.
స్వాతంత్య్రానంతరం సమైక్య (Federal) భారతదేశంలో అఖిలభారత సర్వీసులకు ప్రాధాన్యత గణనీయంగా పెరిగిపోయింది. సామ్యవాద (Socialist) తరహా సమాజస్థాపన, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పి సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి, ప్రాంతీయ, ఆర్థిక అసమానతల తొలగింపు లక్ష్యంగా సివిల్ సర్వీసులు నిర్వహిస్తున్న పాత్రను ప్రపంచదేశాలు సైతం కొనియాడాయి.
.
.
ప్రజాస్వామ్య (Democracy) మనుగడ కొరకు సివిల్ సర్వీసులు
ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే, కేవలం రాజకీయ నిర్ణయాలు, శాసనాలు చేయడం మాత్రమే సరిపోవు. శాశ్విత కార్యనిర్వాహక వర్గంలో ఉన్న సివిల్ సర్వీసుల పాత్ర కూడా గణనీయంగా ఉంటుంది. విచక్షణ, ముందుచూపు, వ్రుత్తి నిబద్ధత కలిగిన అధికారులు ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రాధాన భూమికను పోషిస్తారు.
సివిల్ సర్వీసులు అధికారస్వామ్యంలో వెండి చట్రం లాంటివి. వివిధ అంచెల వ్యవస్థతో కూడి ఉద్యోగాస్వామ్యం ప్రజాస్వామ్య పరిరక్షణలో ముందు వరుసలో ఉంటుంది. ప్రతిభ ఆధారంగా ఎంపిక కాబడ్డ సివిల్ సర్వీసు అధికారులు నిబద్ధతతో నాణ్యమైన ప్రజాసేవలు అందించడానికి కృషి చేసేలా ఉండాలి.
భారత దేశంలో సివిల్ సర్వీసులను బ్రిటీష్ వ్యవస్థనుంచి స్వీకరించడం జరిగింది. ఆధునిక సివిల్ సర్వీసుల పితామహుడిగా సర్దార్ వల్లభాబాయ్ పటేల్ ని అభివర్ణిస్తారు. సివిల్ సర్వీసుల గురించి పటేల్ ప్రసంగిస్తూ – ప్రభుత్వంలో పని చేసే ఉన్నతాధికారులు అయిన కార్యదర్శులకు తమ ఆలోచనలను స్వేచ్చగా వెల్లడించాల్సిన అవసరం ఉందని, నిర్మొహమాటంగా రాజకీయ కార్యనిర్వాహక వర్గం ముందు అభిప్రాయలు వెలుబుచ్చాలని సూచించారు. లేని పక్షంలో వారిని బదిలీ చేస్తానని చెప్పారు. దీన్ని బట్టి సివిల్ సర్వీసుల పాత్ర ఎంత ఉన్నతమైనదో పటేల్ మాటల్లో గమనించవచ్చు.
రాజ్యంగా ఎంతటి ఉన్నతమైన విలువలతో కూడుకున్నది అయినప్పటికీ దాన్ని సవరించకుండానే కార్యనిర్వాహక వర్గం పనితీరులో మర్పుద్వారా రాజ్యంగా విలువలని, ప్రజాస్వామ్యాన్ని పెడదారి పట్టించడం సాధ్యమే అని, అందుకే రాజ్యాంగాన్ని అమలుపరిచేవారు అయిన కార్య నిర్వాహక వర్గం ఉన్నత మైన విలువలతో, ఆదర్శవంతంగా పని చేయాలని అంబేద్కర్ మహాశయుడు పేర్కొన్నారు.
..
సివిల్ సర్వీసుల లక్షణాలు:
మాక్స్ వెబర్ ప్రకారం సివిల్ సర్వీసులు కొన్ని లిఖితపూర్వక, బాధ్యతాయుత లక్షణాలు కలిగి ఉండాలి:
Ø అంచెల వ్యవస్థతో కూడిన ఉద్యోగిస్వామ్యం
Ø ఎన్నుకోబడ్డ వారు కాకుండా ఎంపిక కాబడ్డ వారు ఉండాలి
Ø నియమిత జీత భత్యాలు ద్రవ్యరూపంలో చెల్లించాలి
Ø ఖచ్చితంగానిర్ణయించబడిన అధికారాలు
Ø అవ్యక్తిగత సంబంధాలు కలిగి ఉండడం
సివిల్ సర్వీసుల్లో ఉండాల్సిన కనీస ఆచరణాత్మక గుణాలు:
సివిల్ సర్వీసుల్లో వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విలువలు, నైతిక ప్రవర్తన ఎంతో ముఖ్యం. అలంటి ఉన్నతమైన విలువలే ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదులు.
1
|
వ్యక్తిగత విలువలు
|
సమయ పాలన, నిబద్ధత, సహానుభూతి, జాతి నాయకుల ఆదర్శాలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల విశ్వాసం మొదలైన ఉన్నత గుణాలు ఉద్యోగస్వామ్యం ద్వారా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడడంలో దోహదం చేస్తాయి.
|
2
|
వ్రుత్తి ధర్మం
|
నిజాయితీ, చేసే పని పట్ల ప్రజలకు జవాబుదారీతనం, పారదర్శకత, రుజువర్తనం అధికారులకు ఎంతో అవసరం. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో ఇటువంటి వ్రుత్తిపరమైన విలువలే ముఖ్య పాత్ర పోషిస్తాయి.
|
3
|
ఉత్క్రుష్టత
|
విషయ పరిజ్ఞానం, చేసే పనిలో ఉత్క్రుష్టత (Excellance) ఎంతో ముఖ్యం.
|
4
|
సంస్థాపరమైన గమ్యం
|
ముందుగా పని చేసే సంస్థ/ శాఖ కు సంబంధించిన లక్ష్యాలు, ఆశయాలు ఆకళింపు చేసుకోవాలి. వాటికి అనుగుణంగా మెరుగైన సేవలను అందించడానికి కృషిచేయాలి. నిర్దేశించుకున్న లక్ష్యాలను సరైన సమయంలో సమర్థవంతంగా సాధించాలి.
|
5
|
స్పందించే గుణం
|
ప్రజల సమస్యల పట్ల అవహాహన, వాటి పట్ల స్పందించే గుణం ఎంతో ముఖ్యం.
ఒక కవి ఇలా అంటాడు –
“అగ్నిపర్వతం బద్దలు అయినా,
మెరుపు మెరిసి పిడుగులు పడినా
శబ్దం వస్తుంది...
అంటే మన గోడు వినడానికి దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ శబ్దం ద్వారా స్పందిస్తున్నాడు ....”
నిజమైన ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పట్ల సానుకూల దృక్పదం ఉండాలి. వారి సమస్యలు వినాలి. వారిని అర్థం చేసుకొని తగిన విధంగా స్పందించడం ప్రజాస్వామ్యంలో అధికారులకి ఉండాల్సిన ముఖ్య లక్షణం.
|
6
|
సహానుభూతి (Empathy)
|
ప్రజల సమస్యల పట్ల లీనం అయ్యి, వారి స్థానంలో ఉంది సమస్య తీవ్రతను బట్టి దాన్ని పరిష్కరించే మార్గం కనుగొనడంలో ఔన్నత్యం ఉంటుంది.
|
7
|
ఉపయోగిత
(Utility)
|
ప్రభుత్వం తరపున వివిధ పతకాలు, సేవలు, సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు ఎంతమందికి ఉపయోగపడతాయో, ఎంత సమర్థవంతంగా, నాణ్యమైన సేవలు అందిస్తామో చిత్తశుద్ది ఉండాలి. గరిష్ట ప్రజలకు గరిష్ట ప్రయోజనాలు అందేలా నిర్ణయాలు తీసుకోవడం, అమలు చేయాల్సిన అవ్స్సారం ఉన్నది.
|
8
|
కారుణ్యం
(Sympathy)
|
వృత్తిలో నిబద్ధతతో పాటు దీనుల పట్ల కరుణ, దయ కలిగి ఉండాలి. అధికారం ఉన్నది బడుగు బలహీన వర్గాలకు సేవలు అందించి అందరితో సమానంగా ఉండేలా చేయడానికే అన్న కనీస బాధ్యతను గుర్తెరగాలి.
|
9
|
సమగ్ర న్యాయం
|
అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా వివక్ష లేని విధంగా సమన్యాయాన్ని, సమగ్ర న్యాయాన్ని అందించాలి.
|
10
|
ప్రజల హక్కులు కాపాడడం
|
రాజ్యాంగం ప్రసాదించిన ప్రాధమిక హక్కులను కాపాడే బాధ్యత సివిల్ సర్వీసుల హస్తాల్లో ఉంటుంది. పౌరుల హక్కులకు భంగం కలిగించకుండా, వాటిని పరిరక్షిస్తూ అధికారాన్ని వినియోగించాలి.
|
11
|
ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండడం
|
రాజ్యాంగం ప్రసాదించిన విలువలకు కట్టుబడి నిజమైన ప్రజాస్వామ్యాన్ని స్తాపించడంలో కృషి చేయాలి. నిజమైన లబ్దిదారులకు ప్రభుత్వ సేవలు అందించడంలో విదానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ, సకాలంలో స్పందించడంలోనూ బద్దుడై ఉండాలి. ఉన్నత ఆశయాలతో ప్రజాస్వామ్య విలువలని కాపాడాలి.
|
12
|
చట్టబద్ధత & హేతుబద్దత
(Legality & Rationality)
|
తీసుకునే నిర్ణయాలు మనసా వాచా కర్మణా హేతుబద్ధంగా మరియు చట్టాలకు, రాజ్యాంగానికి లోబడి ఉండాలి. విధానాల రూపకల్పన నుండి కర్యాచన వరకూ ప్రజాస్వామ్య బద్ధంగా ఉండాలి.
|
13
|
సంస్థాపరమైన స్వయం ప్రతిపత్తి
|
పని చేస్తున్న సంస్థ/ శాఖ యొక్క స్వతంత్రత, స్వేచ్చను కాపాడేలా వ్యవహరించాలి. సంస్థ యొక్క సార్వభౌమత్వాన్ని ఇనుమడింపజేసేలా, స్వయం ప్రతిపత్తి పరిధులు దాటకుండా పనిచేయాలి.
|
ప్రజలకు , ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న సివిల్ సర్వీసులు రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, మానవ హక్కులను పరిరక్షిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అధికారాన్ని ఉపయోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వం పై ఆధారపడేలా కాకుండా స్వతంత్రంగా వ్యవహరించేలా సమజాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత అధికార వర్గాల్లో ఉంది. చట్టబద్ధమైన, వివేకవంతమైన నిర్ణయాలతో సమసమాజ స్థాపన దిశగా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్యంగా స్పెషలిస్టుల వాలే కాకుండా జనరలిస్టూలవలె అధికారులు వ్యవహరించాలి.
..
సివిల్ సర్వీసులు – సవాళ్లు:
1
|
అధికార స్వామ్యం vs. రాజకీయాలు
|
సివిల్ సర్వీసుల్లో రాజకీయ జోక్యాలు తగ్గించాల్సిన అవసరం ఉంది. కమిటెడ్ బ్యూరోక్రసీ ద్వారా కొందరు అధికారులు కూడా రాజకీయ దృక్పదంతో పనిచేయడం బాధాకరం. పటేల్ వంటి గొప్ప పాలకులు సైతం అధికారులను రాజకీయనుంచి దూరం చేయడానికి కృషి చేసారు. ప్రజా స్వామ్య పరిరక్షణ కోసం వారి ఆదర్శాలను అవలంబించి రాజకీయాలకూ మరియు ఉద్యోగాస్వామ్యానికి మధ్య లక్ష్మణ రేఖను గీయాలి.
|
2
|
నైతిక విలువలు - బాధ్యత
|
ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యం. అటువంటి ప్రజల సమస్యలను, ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి నైతిక విలువలు, బాధ్యత ఖచ్చితంగా అవసరం అవుతాయి. దీనికి సంబంధించి మెరుగైన ట్రైనింగ్ అమలుచేసి ఉద్యోగులలో పరివర్తన తీసుకురావాలి..
|
3
|
అధికార కేంద్రీకరణ
|
కేంద్రీకృత అధికారం వల్ల పని క్లిష్టంగా మారుతోంది. దీన్ని సలలీకరించి అధికారాన్ని అంచెలుగా వికేంద్రీకరించడం వల్ల సకాలంలో మెరుగైన సేవలను నాణ్యవంతంగా అందించడానికి వీలు అవుతుంది.
|
4
|
సమర్థవంతమైన అధికార వినియోగం లేకపోవడం
|
ఉద్యోగి స్వామ్యంలో తనకు సంక్రమించే అధికారాలు తెలుసుకోవాలి. తద్వారా తన పరిధిలో సమర్థవంతంగా అధికారాన్ని వినియోగించాలి.
|
5
|
అధిరారుల్లో అలసత్వం
|
కొందరు సివిల్ సర్వీసులను సేవ, బాధ్యత గా కాకుండా కెరీర్, హోదా కోసం ఎంచుకోవడం వంటి కారణాల వల్ల ఉద్యోగంలో శ్రద్ధని చూపడంలేదు. ఇప్పటికే అసమర్థ అధికారుల పట్ల కటినంగా వ్యవహరించి తొలగించాలి అనే సిపార్సు కూడా చేయడం విదితమే. అలసత్వం ప్రదర్శించే అధికారుల పట్ల కటిన వైఖరి అవలంభించాలి.
|
6
|
అవినీతి
|
అధికార దుర్వినియోగం, బందుప్రీతి, పక్షపాతం, క్రోనీ క్యాపిటలిసం, రెడ్ టేపిజం వంటివి పెచ్చుమీరుతున్న నేపధ్యంలో సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ మరింత సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. లోక్ పాల్, లోక్ యుక్తా లను బలోపేతం చేయాలి.
|
7
|
సృజనాత్మకత (Innovation) & గుర్తింపు లేకపోవడం
|
మూస ధోరణి నుంచి బయటకు రాలేకపోవడం. ‘టర్న్ ది ఫైల్ లర్న్ ది వర్క్’ అనే సంకృతి నుంచి బయటకు వచ్చి పాలనను సరళీకృతం చేయాలి. ప్రైవేటు రంగంలో లాగా సృజనాత్మకతకు పెద్ద పీత వేయాలి. తదనుగుణంగా సృజన కనబరచిన అధికారులకు గుర్తింపు ఇవ్వాలి.
|
8
|
ఉద్యోగాల భర్తీ & బదిలీలు
|
పేరుకుపోయిన ఖాళీలు అధికారులలో పని భారాన్ని పెంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. నిలకడ లేని బదిలీలు కుడా ఉద్యోగుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి.
|
9
|
సేవలు అందించడానికి సమయ నియమమం లేకపోవడం
|
సిటిజన్ చార్టర్ వచ్చినప్పటికీ సమయానుగుణంగా సేవలు అందించడంలో వివిధ సంస్థాగత కారణాల వాళ్ళ ప్రభుత్వ అధికారులు విపలం అవుతున్నారు. పాలనా వ్యవస్థలో లోపాలు గుర్తించి , సమయానుగునంగా సేవలు అందించడంలో కృషి చేయాల్సిన అవసరం ఉంది.
|
10
|
పార్శ్వ నియామకాలు (Lateral Entry)
|
కేబినేట్ స్తాయిలో కార్యదర్శులుగా ప్రైవేటు వ్యక్తులను నియమించడానికి ప్రభుత్వం పార్శ్వ నియామకాలు చేపడుతోంది. వివిధ రంగాల్లో సాంకేతిక నిపుణుల అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అయితే ఇప్పటికే, ఆర్థిక సంఘమం నీతి ఆయోగ్, ఆదార్ (UIDA) వంటి ఎన్నో రంగాల్లో పార్శ్వ నియామకాలు విజయవంతంగా జరిగాయి. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ,జర్మనీ వంటి విదేశాల్లో ఇప్పటికే ఇలాంటి నియామకాలు ఉన్నాయి.
కానీ ప్రతిభ, రిజర్వేషన్, వంటివి పక్కన పెట్టి ఈ విధమైన నియామకాలు చేయడం వల్ల పారదర్శకత లోపిస్తోందన్న వివాదం ఉన్నది.
|
11
|
సంస్థాపరమైన సమగ్ర అవగాహన లేకపోవడం
|
వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ఆ సంస్థ యొక్క లక్ష్యాలు, ఆశయాలు సమగ్రమైన అవగాహన పెంపొందించుకోవాలి. సంస్థ యొక్క సమ్మగ్రతను పెంపొందిస్తూ, లక్ష్యాలు సాధించే దిశగా పనిచేయాలి.
|
.
సివిల్ సర్వీసుల్లో ప్రక్షాళన అవసరమా?
మారుతున్న కాలానుగునంగా సివిల్ సర్వీసుల వ్యవస్తలో కూడా ఎన్నో మార్పులకు నాంది పలకాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రభుత్వం మొదటి మరియు రెండవ పాలనా సంస్కరణ కమీషన్ లను ఏర్పాటు చేసింది.
రెండవ పాలనా సంకరణా కమీషన్ రేకమెండేషన్లు:
1.
|
నియామకాలు
|
పారదర్శకత ఉండాలి, కొన్ని నియామకాల్లో ప్రక్షాళన అవసరం.
|
2.
|
ట్రైనింగ్
|
నైపున్యాభివృద్ధి, సమస్యల పట్ల అవగాహన, ఈ. పాలన
|
3.
|
ప్రమోషన్లు
|
సృజనాత్మకత, పనిని బట్టి ప్రమోషన్లు, ప్రోత్సాహకాలు
|
4.
|
పనితీరు
|
మెచ్చుకోలు, అవార్డులు, రివార్డుల ప్రధానం, గుర్తింపు
|
5.
|
ప్రవర్తన
|
క్రమశిక్షణ, జవాబుదారీతనం, పారదర్శకత, సత్ప్రవర్తన, నిజాయితీ, నిబద్ధత
|
6.
|
రాజకీయ జోక్యం
|
రాజకీయ జ్యోక్యం తొలగించాలి, బదిలీల్లో పారదర్శక, బదిలీ నిబంధనలు
|
7.
|
నైతిక విలువలు
|
సహానుభూతి, కరుణ, నైతికత, విలువలు ఉండాలి
|
సివిల్ సర్వీసుల్లో మార్పులు:
ü క్లిష్టతరమైన నియమ నిబంధనలు, చట్టాల్లో సరళీకరణ రావాలి.
ü సివిల్ సర్వెంట్ల నియామక ప్రక్రియలను పారదర్శకంగా జరపాలి. నియామక ప్రక్రియల్లో లొసుగులను సవరించి వ్యాపం, రైల్వే వంటి స్కాంలు నిరోధించాలి.
ü సివిల్ సర్వెంట్ల ప్రవర్తనా నియమావళిలో, నైతికత, మూర్తిత్వంలో మార్పు తేవాలి.
ü కొత్త పరిపాలనా పద్ధతులు, సాంకేతికత తోడ్పాటుతో నిర్వహాణ పద్ధతులను కాలానుగునంగా అందిపుచ్చుకొవాలి.
ü పని సంస్కృతి మరియు సృజనాత్మకతను పెంపొందించాలి. ప్రోత్సాహకాలు ప్రకటించాలి.
ü అధికార వికేంద్రీకరణ జరిపి పనిని సులభతరం చేయాలి. రాజ్యాంగం 73, 74 సవరణల ద్వారా సంక్రమించిన అధికారాలను వికేంద్రీకరించాలి.
ü పరిపాలనా వ్యవస్థలో అంచెల వ్యవస్తను కాలనుగుణంగా ప్రక్షాళన చేయాలి.
ü అవినీతి నిర్మూలనా చర్యలు చేపట్టి, పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించాలి.
ü శాస్త్ర సాంకేతికతను ప్రభుత్వంలో సమర్థవంతంగా వినియోగించాలి. ఉదా: ఈ. ఆఫీస్, బయోమెట్రిక్, ...
ü ఒత్తిడి లేని వాతావరణం కల్పించి సమర్థవంతంగా బాధ్యతను నిర్వహించేలా తోడ్పాటు అందించాలి.
ముగింపు:
మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రభుత్వ పాలనలో నూతన యాజమాన్య పద్ధతులు, సేవోత్తం మోడల్ వంటివే కాక ఆధునిక సాంకేతిక పద్ధతులు అవలంభిస్తూ అదేసమయంలో మానవ హక్కులను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని మారిత పటిష్ట పరచడంలో సివిల్ సర్వీసులు మరింత ఔన్నత్యాన్ని సంతరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం తరపున వారధిగా ఉన్నామంటూ ప్రజల్లో విశ్వసనీయత, భరోసా నింపగలిగితే చాలు, సివిల్ సర్వీసులు ప్రజాస్వామ్యంలో పరిమళాలు నింపగలవు.
.
.
No comments:
Post a Comment