CBI నియామకం వివాదాలు

·   ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డిఎస్‌పిఇ) చట్టం 1946లోని సెక్షన్‌ 4 ప్రకారం ప్రభుత్వ ప్రమేయం లేకుండా అత్యున్నత అధికారాలను కలిగిన స్పెషల్‌ కమిటీ ద్వారానే సిబిఐ డైరెక్టర్‌ను నియమించాలి.
·    డి..స్‌.పి.. సవరించిన లోక్‌పాల్‌, లోకాయుక్త చట్టం 2013 ప్రకారం సిబిఐ డైరెక్టర్‌ నియామకంలో ప్రభుత్వ ప్రమేయం తగదు.
·   సిబిఐ డైరెక్టర్‌ నియామకానికి సంబంధించినంత వరకు హై పవర్‌ కమిటీ (ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టీస్)కి మాత్రమే అధికారాలు వున్నాయని వినీత్‌ నారాయణ్‌ కేసు, ఇంతవరకు ప్రభుత్వం అవలంబించిన విధానాలు స్పష్టపరుస్తున్నాయి. కానీ కేంద్రం, సెంట్రల్‌ విజిలెన్స్ కమీషన్‌ విధానాన్ని తోసి రాజనటం వల్ల అలోక్‌వర్మ సుప్రీం కోర్టుకు వెళ్ళాల్సివచ్చింది.
·   వినీత్‌ నారాయణ్‌ కేసులో సర్వోన్నత న్యాయపాలిక గీసిన లక్ష్మణ రేఖ - సీనియారిటీ, రుజువర్తన, అవినీతి అణచివేత విభాగంలో అనుభవంగల ఐపీఎస్‌ అధికారిని ఎంపిక చేయాలి.
·   అమెరికా భద్రతకు పెట్టని కోటలాంటి ఎఫ్‌బీఐ, సీఐఏలను ప్రత్యేక చట్ట నిబంధనల మేరకు నియంత్రిస్తున్నారు.
·   రష్యా, జర్మనీ, జపాన్‌ వంటి దేశాల్లోనూ నిఘా దర్యాప్తు నేరపరిశోధక సంస్థలు నిర్దిష్ట శాసనాలకు లోబడి పనిచేస్తుంటాయి.
·   అదే ఇక్కడ- కేదసను కేంద్రం పంజరంలో చిలుకగా సుప్రీంకోర్టే ఈసడించినా, పనిపోకడలు మారుతున్నదెక్కడ? కేదస సంచాలకుడి బదిలీ అయినా ఎంపిక సంఘం అనుమతితోనే సాగాలన్న 1997 నాటి సుప్రీం ఆదేశాల్ని కేంద్రం ఔదలదాల్చి ఉంటే, ఇటీవల న్యాయ వివాదానికి ఆస్కారం ఉండేదా? కేదస స్వయం ప్రతిపత్తితో రాజీపడకుండానే, కేంద్రానికి అది నివేదించాల్సిన విధి విధానాల్ని రూపొందించాలన్న మన్నికైన సూచనకు రెండు దశాబ్దాలుగా మన్నన దక్కనే లేదు.

·   వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచడానికి నిజమైన స్వయం ప్రతిపత్తితో రాజ్యాంగబద్ధంగా నియంత్రణ సంస్థల్ని నెలకొల్పి, ఆయా విభాగాల్లో నిష్ణాతులకు వాటిని అప్పగించాలన్న మేధావుల సూచనను పాటించాల్సిన అవసరం ఉంది.

.
.
రాజ్యాంగం సి.బి.ఐ వంటి సంస్థలని పెర్కొనకపోయినప్పటికీ దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఇటువంటి ఉన్నత దర్యాప్తు సంస్థల అవసరం ఎంతైనా ఉన్నది. ఇటువంటి ఉన్నత సంస్థలు ఎటువంటి స్వయం ప్రతిపత్తి లేకుండా ప్రభుత్వం చేతిలో కీలుమోమ్మగా మారుతున్నాయనే విమర్శ వున్నది.

ఇలా జరగడానికి కారణాలు:
·   రాజకీయ చిత్తశుద్ధి
·   స్వయం ప్రతిపత్తి లేకపోవం
·   సరైన నియామావళి, చట్టాలు లేకపోవడం
·   శాసన బద్ధత/ రాజ్యంగా హోదా లేకపోవడం
·   మారుతున్నా ప్రభుత్వాలకు అనుగుణంగా ఉన్నతాధికారుల నియామకం
·   జవాబుదారీతనం లోపించడం
ఏం చేయాలి?
·   స్వయం ప్రతిపత్తి కల్పించి ప్రభుత్వ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్తలు పనిచేసేలా చూడడం
·   రాజకీయ జోక్యం నివారించడం
·   నియామకాలకు సరైన మార్గదర్శకాలు రూపొందించడం
·   రాజ్యాంగం పట్ల, శాసనం పట్ల విధేయత కలిగిఉండడం
·   ప్రజలకు జవాబుదారీగా ఉండాలనే స్పృహతో వ్యవహరించడం
·   న్యాయస్థానాల తీర్పులు గౌరవించి ఆ ప్రకారం నడుచుకోవడం
·   కేసుల దర్యాప్తులో స్వతంత్రంగా వ్యవహరించేలా చూడడం
·   అవినీతి, బంధు ప్రీతీ లేకుండా ఉండడం వంటి కనీస విలువలకు కట్టుబడి ఉండడం

·   అంతిమంగా పౌరసేవలలో పారదర్శకంగా వ్యవహరించాలీ

.
.




No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...