ఏ ఆర్థిక వ్యవస్థ అయినా నిదాన, సత్వర వృద్ధిని సాధించాలంటే తప్పకుండా ఆర్థికాభివృద్ధిని చేరుకోవాల్సిందే. 'వృద్ధి'ని పరిగణించే సమయంలో ఒకే ఒక అంశాన్ని (ఆదాయం) పరిగణనలోకి తీసుకుంటారు. దీన్ని ఏకముఖ వ్యూహం అంటారు.
ఆర్థికాభివృద్ధిలో అనేక అంశాలు (బహుముఖ వ్యూహం) ఉంటాయి. కాబట్టి వృద్ధి కంటే ఆర్థికాభివృద్ధి సమస్యాత్మకమైంది.
వర్ధమాన దేశాలన్నీ ఆర్థికాభివృద్ధిలోనే ఉన్నాయి.
కిండ్లే బర్గర్ ప్రకారం వృద్ధిని
మనిషి శారీరక పెరుగుదలతో పోలిస్తే... ఆర్థికాభివృద్ధిని మనిషి శారీరక,
మానసిక అంశాలతో పోల్చవచ్చు. అనేకమంది ఆర్థికవేత్తలు వృద్ధి,
ఆర్థికాభివృద్ధికి మధ్య తేడా లేదని భావించారు. షుంపీటర్, ఉర్సుల హిక్స్
ప్రకారం రెండింటి మధ్య తేడా ఉంది. చమురు దేశాలు ఆర్థికాభివృద్ధిని
సాధించకుండానే వృద్ధిని చేరుకున్నాయి.
ఆర్థికవృద్ధి (Growth)
* దేశంలో వస్తుసేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల.
* ఇది పరిమాణాత్మక మార్పును తెలుపుతుంది.
ఉదా: దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల.
* దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదల.
* జాతీయోత్పత్తి పెరుగుదల వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా పెరగవచ్చు
కానీ, అసలైన వృద్ధి కాదు. జాతీయోత్పత్తి పెరుగుదల దీర్ఘకాలంగా కొనసాగాలి.
ఆర్థికాభివృద్ధి (Development)
* దేశంలో ఉత్పత్తి పెరుగుదలతోపాటు వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పు ఆర్థికాభివృద్ధి.
* ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి + ఉత్పాదక పెరుగుదల = ఆర్థికవృద్ధి + పేదవారికి అనుకూలంగా వనరుల పంపిణీ = వృద్ధి + సంక్షేమం
ఆర్థికాభివృద్ధి నిర్వచనాలు
1. గున్నార్ మిర్డాల్: మొత్తం సాంఘిక వ్యవస్థ ప్రగతి పథంలో ముందుకు సాగడమే ఆర్థికాభివృద్ధి.
2. జాన్ రాబిన్ సన్: దేశం ఆర్థికాభివృద్ధి దాటి వృద్ధిని చేరుకుంటే అది స్వర్ణయుగం.
3. గెరాల్డ్ మేయర్: దీర్ఘకాలంలో తలసరి ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థికాభివృద్ధి అంటారు.
4. హేగెన్: ఆర్థికాభివృద్ధి అంతులేకుండా నిత్యం జరిగే ప్రక్రియ.
5. కొలిన్ క్లార్క్: వ్యవసాయ రంగంలోని ప్రజలు పారిశ్రామిక, సేవల రంగానికి నిరంతరంగా తరలిపోవడం ఆర్థికాభివృద్ధి.
6. సి.ఇ. బ్లాక్: అనేక ఆధునికీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థికాభివృద్ధి.
7. ఆచార్య మైఖేల్, పి. తోడారో: ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ.
8. జె.ఇ. మేయర్, జె.ఇ. రాచ్: తలసరి జాతీయాదాయం దీర్ఘకాల పెరుగుదలే ఆర్థికాభివృద్ధి.
9. డడ్లీ శీర్స్: పేదరికాన్ని, అసమానతలను, నిరుద్యోగితను వాటి అధిక స్థాయిల నుంచి తగ్గిస్తే దాన్ని అభివృద్ధి కాలం అంటారు.
ఆర్థికాభివృద్ధిలో ఇమిడి ఉన్న అంశాలు
1. తలసరి వాస్తవిక జాతీయాదాయం పెరుగుదల.
2. ఆర్థిక వ్యవస్థలో ఆభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం.
3. పేదరికం, ఆర్థిక అసమానతలు తగ్గి ఉపాధి పెరగడం.
4. సంస్థాగత సాంకేతిక మార్పులు రావడం.
5. పైవన్నీ దీర్ఘకాలంలో కొనసాగడం.
ఉదా: లాటిన్ అమెరికాలోని లైబీరియాలో అరటిపండ్ల ఎగుమతి
ద్వారా, అరబ్ దేశాల్లో పెట్రోలియం ఎగుమతి ద్వారా జాతీయాదాయం, తలసరి ఆదాయం
పెరిగినప్పటికీ అవి స్వయంసమృద్ధి సాధించలేదు.
* రాబర్ట్ క్లేవర్ ''Growth without Development'' అనే గ్రంథంలో లైబీరియా
దేశంలో అభివృద్ధి లేకుండా వృద్ధి ఎలా జరుగుతుందో చెప్పారు. దీనివల్ల ఆ దేశ
ప్రతిఫలాలు కొద్దిమందికే అందుతున్నాయి. సామాన్య ప్రజానీకం పేదరికంలో
మగ్గుతున్నారు.
ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు
* ప్రారంభంలో ఈ పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించేవారు.
* హిక్స్, షుంపీటర్ ఈ పదాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని సూచించారు.
* వృద్ధి, అభివృద్ధి అనే పదాలు 1960లో ప్రాచుర్యంలోకి వచ్చాయి.
ఆర్థికవృద్ధి | ఆర్థికాభివృద్థి |
1. ఉత్పత్తి పెరుగుదలలో మార్పులు. | 1. ఉత్పత్తి పెరుగుదలతో పాటు సంస్థాగత, సాంకేతిక, అవస్థాపక, వ్యవస్థాపక మార్పులను సూచిస్తుంది. |
2. ఇది పరిమాణాత్మకమైంది. | 2. ఇది గుణాత్మకమైంది. |
3. దీన్ని కొలవచ్చు. | 3. దీన్ని కొలవలేం. |
4. ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు. | 4. ప్రభుత్వ ప్రమేయం అవసరం. |
5. ఇది దృగ్విషమైంది/ఏకమైంది. | 5. ఇది బహుముఖమైంది. |
6. ఇది సంకుచితమైంది/ఇది సూక్ష్మ (micro) స్వభావం ఉన్నది. | 6. విస్తృతమైంది/ఇది స్థూల (macro) స్వభావం ఉంది. |
7. ఇది అభివృద్ధి చెందిన దేశాలకు (OECD) వర్తిస్తుంది. | 7. అభివృద్ధి చెందుతున్న (వర్ధమాన) దేశాలకు వర్తిస్తుంది. |
8. సంస్థాగత మార్పులు లేకుండా పెరుగుదలను సూచిస్తుంది. | 8. సంస్థాగత, సాంకేతిక మార్పులను సూచిస్తుంది. |
9. కిండల్ బర్గర్ ప్రకారం వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పును తెలిపేది. | 9. శారీరక పెరుగుదలతోపాటు మానసిక పరిపక్వతను కూడా సూచించేది. |
10. ఇది స్వల్ప కాలానికి సంబంధించింది. | 10. ఇది దీర్ఘకాలానికి సంబంధించింది. |
11. పంపిణీని సూచించదు. | 11. పంపిణీని సూచిస్తుంది. |
12. ఆదాయం, సంపద లాంటి వాటి పంపిణీని తెలపదు. | 12. ఆదాయం, సంపద లాంటివాటి పంపిణీని ఆర్థికాభివృద్ధి తెలియజేస్తుంది. |
13. ప్రభుత్వ జోక్యం లేకుండా సహజంగా ఏర్పడే పెరుగుదలను ఆర్థికవృద్ధి అంటారు. | 13. ప్రభుత్వ విధానాల ద్వారా ఉద్దేశపూర్వకంగా వివిధ మార్పులు చేసి సాధించే దాన్నే ఆర్థికాభివృద్ధిగా వర్ణించవచ్చు. |
14. ఆర్థికవృద్ధిని ఆదాయం లేదా సంపదతో అంచనా వేస్తారు. | 14. ఆర్థికాభివృద్ధిని గుణాత్మక అంశాలైన నిరుద్యోగం, పేదరికం, మానవ వనరుల అభివృద్ధి, జీవన ప్రమాణం స్థాయి లాంటి వాటిలో వచ్చిన మార్పులు ఆధారంగా అంచనా వేస్తారు. |
15. ఆర్థికవృద్ధితో ఆర్థిక మార్పులను సాధించవచ్చు. కానీ సామాజిక మార్పులను సూచించదు. | 15. ఆర్థికాభివృద్ధితో ఆర్థిక మార్పులతో పాటు సామాజిక మార్పులు సాధించవచ్చు. |
అల్పాభివృద్ధి దేశాల లక్షణాలు (Characteristics of Under Development Countries)
1. మూలధనం కొరత: అల్పాభివృద్ధి /అభివృద్ధి
చెందుతున్న/ వెనుకబడిన దేశాల్లో తలసరి ఆదాయం తక్కువ కాబట్టి పొదుపు
సామర్థ్యం కూడా తగ్గుతుంది. ఫలితంగా మూలధనం కొరత ఏర్పడుతుంది.
షుంపీటర్: ఆర్థికాభివృద్ధికి అవసరమైన చొరవతో ముందుకు వచ్చే వ్యవస్థాపకుల కొరత వల్ల కూడా పెట్టుబడి తక్కువ స్థాయిలో ఉంటుంది.
* కొద్దిమంది ధనవంతులకు వడ్డీలు, భాటకం రూపంలో ఆదాయం వచ్చినప్పటికీ వారు
ఆడంబర వినియోగంపై ఖర్చు చేస్తారు. కానీ పొదుపు చేసి పెట్టుబడులు పెట్టరు.
* భారతదేశంలో తక్కువ (తలసరి) ఆదాయం, అధిక వినియోగ వ్యయం వల్ల పొదుపుస్థాయి తక్కువగా ఉంది.
* మనదేశంలో తలసరి మూలధన లభ్యత తక్కువగా ఉంది.
* మూలధన కల్పన రేటు కూడా తక్కువగా ఉంది.
* ఈ మధ్యలో కాలంలో మూలధన కల్పన రేటు పెరిగింది. ఇది కోరదగిన మంచి పరిణామంగా చెప్పవచ్చు.
* 1950 - 51లో GDPలో పొదుపు శాతం 8.6%గా ఉండేది.
* 2007 - 08లో GDPలో పొదుపు శాతం గరిష్ఠంగా 36.8%కు పెరిగింది.
* 2012 - 13లో GDPలో పొదుపు శాతం 31.8%కు చేరింది.
* స్థూల దేశీయ పొదుపునకు ప్రభుత్వ, కార్పొరేటు, గృహ రంగాల నుంచి పొదుపుల
వనరులు లభ్యమవుతున్నాయి. వీటిలో ఎక్కువ గృహ రంగం నుంచి లభిస్తోంది.
* 2013 - 14లో స్థూల దేశీయ పొదుపు 30.6% కాగా ఇందులో మొదటి స్థానం గృహ రంగానిది 18.2%గా ఉంది. 10.9% కార్పొరేట్ రంగానిది 2వ స్థానం.
* స్థిర మూలధన కల్పన పెట్టుబడి కూడా పెరుగుతూ వస్తోంది.
* 2013 - 14 నుంచి పెట్టుబడిలో అత్యధిక వాటా కార్పొరేట్ రంగానిదే (12.6%). తర్వాత స్థానం గృహ రంగానిది (10.7%).
1) సహజవనరులు - అల్పవినియోగం 1) కులతత్వం
2) మానవ వనరులు - నైపుణ్యం కొరత 2) మతతత్వం
3) మూలధనం కొరత 3) సాంఘిక ఆచార వ్యవహారాలు
4) పేదరిక విషవలయాలు 4) ఉమ్మడి కుటుంబ వ్యవస్థ
5) అల్ప సాంకేతిక పరిజ్ఞానం 5) సుస్థిర ప్రభుత్వాలు లేకపోవడం
6) మార్కెట్ అసంపూర్ణతలు
ఎ) శ్రమ విభజన లేకపోవడం
బి) ఉత్పత్తి కారకాల గమన శీలత లేకపోవడం
సి) ఏకస్వామ్య ధోరణులు
డి) ధరల దృఢత్వం ఉండటం
ఇ) మార్కెట్ సమాచారం అందుబాటులో లేకపోవడం
2. విదేశీ కారకాలు
1) గతంలో వలసవాదానికి గురై ఉండటం
2) ప్రాథమిక వస్తువులను ఎగుమతి చేయడం
3) అంతర్జాతీయ ప్రదర్శన ప్రభావం
ఆర్థికాభివృద్ధికి ఆధారాలు
విదేశీ వ్యాపారం
* సాధారణంగా అల్పాభివృద్ధి దేశాలు ముడిసరకులు, ప్రాథమిక వస్తువులను ఎగుమతి
చేసి, వినియోగ/ మూలధన వస్తువులను దిగుమతి చేసుకుంటాయి. దీనివల్ల దేశీయ
పరిశ్రమలు దెబ్బతింటాయి.
* మనదేశం ముడిసరకులు ఎగుమతి చేసే స్థాయి నుంచి ఇంజినీరింగ్ వస్తువులు ఎగుమతి చేసే స్థాయికి చేరింది.
* భారత ఆర్థిక వ్యవస్థలో అల్పాభివృద్ధి ఆర్థిక వ్యవస్థ లక్షణాలు
ఉన్నప్పటికీ, ప్రణాళికలు అమలుపరచి అభివృద్ధి దిశగా పయనించడం వల్ల
పరిమాణాత్మక, వ్యవస్థాపూర్వక మార్పులు వచ్చాయి. అందువల్ల మనదేశాన్ని
అభివృద్ధి చెందుతున్న దేశంగా పిలవొచ్చు.
ప్రపంచ దేశ ఆర్థిక వ్యవస్థలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు
1) అభివృద్ధి చెందిన దేశాలు
ఉదా: యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్
2) అభివృద్ధి చెందుతున్న దేశాలు
ఉదా: భారతదేశం, దక్షిణాఫ్రికా, బ్రెజిల్
3) తక్కువ అభివృద్ధి చెందిన దేశాలు
ఉదా: భూటాన్, నేపాల్, ఆఫ్ఘానిస్థాన్, సబ్-సహారా దేశాలు, సూడాన్, చాద్
ప్రపంచ బ్యాంకు వర్గీకరణ
* ప్రపంచ బ్యాంకు ప్రపంచ అభివృద్ధి నివేదిక (WDR)ను 2016, జులై 1న విడుదల చేసింది.
* తలసరి జీడీపీ ఆధారంగా వర్గీకరణ
* ప్రపంచ అభివృద్ధి నివేదిక సారాంశం - డిజిటల్ డివిడెంట్ (ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వృద్ధి, ఉద్యోగిత, సేవలు)
* ప్రపంచ బ్యాంకు ప్రస్తుత అధ్యక్షుడు - జిమ్ యాంగ్ కిమ్.
* ప్రపంచ బ్యాంకు GNI, PCIలను ఆధారంగా చేసుకుని ప్రపంచ దేశాలను వర్గీకరిస్తుంది.
* GNI తలసరి ఆదాయాన్ని గణించడానికి ప్రపంచ బ్యాంకు 'వరల్డ్ అట్లాస్ మెథడ్'ను ఉపయోగిస్తుంది.
1. ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు (Upper Income Countries)
* 12,476 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న దేశాలు
ఉదా: యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, ఓఈసీడీ దేశాలు, రష్యా, సింగపూర్, జపాన్
2. మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు (Middle Income Countries)
* 1,025 డాలర్ల నుంచి 12,475 డాలర్లు
ఎ) ఎగువ మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు
* 4,036 డాలర్ల నుంచి 12,475 డాలర్లు
ఉదా: మాల్దీవులు, చైనా, మెక్సికో, బ్రెజిల్
బి) దిగువ మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాలు
* 1,025 డాలర్ల నుంచి 4,035 డాలర్లు
ఉదా: భూటాన్, బంగ్లాదేశ్, భారతదేశం, పాకిస్థాన్, శ్రీలంక
3. తక్కువ ఆదాయం ఉన్న దేశాలు
* 1025 లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశాలు
ఉదా: ఆఫ్గానిస్థాన్, నేపాల్, సబ్ సహారా దేశాలు
* భారతదేశం ప్రపంచ జనాభాలో 17.6%, ప్రపంచ స్థూల జాతీయాదాయంలో 2.5% వాటాను
కలిగి ఉంది. చైనా ప్రపంచ జనాభాలో 19%, స్థూల జాతీయ ఆదాయంలో 12% వాటా కలిగి
ఉంది.
* వేగవంతంగా ఆర్థికాభివృద్ధి, పారిశ్రామికీకరణం చెందే దేశాలను ఎమర్జింగ్ మార్కెట్ అంటారు.
ఉదా: భారతదేశం, చైనా
ఐక్యరాజ్యసమితి వర్గీకరణ
1. మొదటి ప్రపంచ దేశాలు:
* పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లేదా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలను మొదటి ప్రపంచ దేశాలుగా పిలుస్తారు.
ఉదా: యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా
2. రెండో ప్రపంచ దేశాలు:
* సామ్యవాద లేదా కమ్యూనిస్టు దేశాలైన పూర్వ రష్యా, క్యూబా, చైనా దేశాలను రెండో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు.
3. మూడో ప్రపంచ దేశాలు:
* అభివృద్ధి చెందుతున్న, అలీన దేశాలు.
ఉదా: భారతదేశం, ఇండోనేషియా, ఈజిప్ట్
4. నాలుగో ప్రపంచ దేశాలు:
* అల్ప అభివృద్ధి చెందిన దేశాలు లేదా అభివృద్ధి చెందని దేశాలు.
ఉదా: నేపాల్, భూటాన్, సబ్-సహారా దేశాలు, సూడాన్, చాద్.
5. అయిదో ప్రపంచ దేశాలు:
* వివిధ దేశాల్లోని గిరిజన తెగల ప్రజలను అయిదో ప్రపంచం అంటారు.
వృద్ధిరేటు
* వార్షిక జాతీయ ఆదాయ వృద్ధిరేటు ఆధారంగా ఆర్థిక వృద్ధిని లెక్కిస్తారు.
వృద్ధి రేటును లెక్కించే పద్ధతి:
దీనిలో Qt = ప్రస్తుత సంవత్సరం ఉత్పత్తి (Current year)
Q(t - 1) = గత సంవత్సరం ఉత్పత్తి (previous year)
ఉదా: 2006లో జాతీయాదాయం 1150 కోట్లు, 2005లో జాతీయాదాయం 1100 కోట్లు భావిస్తే
వృద్ధి రేటు = 4.8%గా ఉంది.
No comments:
Post a Comment