కేంద్ర బ‌డ్జెట్ 2022-23 సారాంశం

          ఇండియా ఆర్థిక వృద్ధి ప్ర‌స్తుత సంవ‌త్స‌రంలో 9.2 శాతంగా ఉంది. ఇది పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌లోకెల్లా ఇది గ‌రిష్ఠ‌స్థాయిలో ఉంది.

         కోవిడ్ మ‌హ‌మ్మారి ప్ర‌తికూల ప‌రిస్థితుల‌నుంచి ఆర్ధిక వ్య‌వ‌స్థ కోలుకుని  పుంజుకోవ‌డం మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లానికి నిద‌ర్శ‌నం. ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్ధిక , కార్పొరేట్ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌లా సీత‌రామన్ ఈరోజు కేంద్ర బ‌డ్జెట్‌ను పార్ల‌మెంటుకు స‌మ‌ర్పిస్తూ అన్నారు.

Budget-at-a-Glance-English.jpg

 

        ఇండియా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌ను జ‌రుపుకుంటోంది. దేశం అమృత కాలంలోకి ప్ర‌వేశించింది. ఇండియా వంద సంవ‌త్స‌రాల పండుగకు మ‌రో 25 సంవ‌త్స‌రాలు ఉంది. ప్ర‌ధాన‌మంత్రి స్వాతంత్ర్యదినోత్స‌వ ప్ర‌సంగంలో ప్ర‌స్తావించిన దార్శ‌నిక‌త ల‌క్ష్య సాధ‌న‌కు ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. అవి.


      సూక్ష్మ ఆర్దిక స్థాయి కి చేదోడుగా సూక్ష్మ ఆర్ధిక వ్య‌వ‌స్త స్థాయిలో ప్ర‌గ‌తిపై దృష్టిపెడుతూ అన్ని రంగాల సంక్షేమానికి కృషిచేయ‌డం జ‌రుగుతుంది.
డిజిట‌ల్ ఆర్ధిక వ్య‌వస్థ‌ను , ఫిన్ టెక్‌, టెక్నాల‌జీ ఆధారిత అభివృద్ధి, ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌, ప‌ర్యావ‌ర‌ణ చ‌ర్య‌లకు ప్రోత్సాహం.

         2014 నుంచి ప్ర‌భుత్వం పౌరుల సాధికార‌త‌కు ప్ర‌త్యేకించి పేద‌లు, ఇత‌ర అణ‌గారిన వ‌ర్గాల వారి సాదికార‌త‌పై దృష్టిపెట్టి ప‌నిచేస్తోంది. వారికి గృహ‌వ‌స‌తి,విద్యుత్ స‌దుపాయం, వంట‌గ్యాస్, మంచినీటి స‌దుపాయం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంది. ఆర్ధిక స‌మ్మిళిత‌త్వం, ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ , పేద‌లు అన్ని అవ‌కాశాల‌ను సొంతం చేసుకునే సామ‌ర్ధ్యం క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఇందుకు సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతూ వ‌చ్చింది.
         ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను సాధించేందుకు 14 రంగాలలో ఉత్పాదకత అనుసంధానిత ప్రోత్సాహకానికి అద్భుతమైన స్పందన లభించింది. దీనితో 60 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం తోపాటు, రాబోయే 5 సంవత్సరాలలో రూ. 30 లక్షల కోట్ల అదనపు ఉత్పత్తిని సాధించవచ్చని ఆర్థిక మంత్రి తెలిపారు.  పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ కు సంబంధించి నూత‌న విధానం  అమలు అంశంపై ఆమె మాట్లాడుతూ, ఎయిర్ ఇండియా యాజమాన్యం  వ్యూహాత్మక బదిలీ పూర్తయిందని,  ఎన్‌ఐఎన్‌ఎల్ (నీలాంచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) కోసం వ్యూహాత్మక భాగస్వామిని ఎంపిక చేశామని చెప్పారు. త్వ‌ర‌లోనే ఎల్‌.ఐ.సి ప‌బ్లిక్ ఇష్యూ  త్వ‌ర‌లోనే రావ‌చ్చ‌ని , 2022-23లో మ‌రి కొన్ని  కూడా ప్రాసెస్‌లో ఉన్నాయ‌ని మంత్రి అన్నారు.

 

Quote Covers_M1.jpg

 

        బ‌డ్జెట్ ప్ర‌గ‌తిని కొన‌సాగించేందుకు మ‌రింత ఊతం ఇచ్చేదిగా ఉంద‌ని నొక్కిచెప్పారు. ఇది 1) అమృత్ కాల్‌కు బ్లూ ప్రింట్ రూపొందిస్తుంద‌ని, అది భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కుఅనుగుణ‌మైన‌, అన్ని వ‌ర్గాల‌కు ఉప‌యోగ‌ప‌డే, ప్ర‌త్యేకంగా యువ‌త‌ , రైతులు, మ‌హిళ‌లు, షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగ‌ల వారికి ప్ర‌త్య‌క్షంగా ప్ర‌యోజ‌నం క‌లిగించేదిగా ఉంద‌న్నారు. (2) ఆధునిక మైలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు పెద్ద ఎత్తున ప‌బ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్‌, ఇండియాను శ‌త వ‌సంతాల‌కు సిద్దం చేయ‌డం, పిఎం గ‌తి శ‌క్తి మార్గ ద‌ర్శ‌నంలో మ‌ల్టీ మోడ‌ల్ విధానాన్ని మిళితం చేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు.
         పి.ఎం. గ‌తిశ‌క్ంతి, స‌మ్మిళిత అభివృద్ధి ఉత్పాద‌క‌త , పెట్టుబ‌డి వృద్ది, స‌న్ రైజ్ అవ‌కాశాలు, ఇంధ‌న ప‌రివ‌ర్త‌న‌, వాతావ‌ర‌ణ మార్పుల కార్యాచ‌ర‌ణ‌, ఇన్వెస్ట్‌మెంట్‌ల‌కు ఫైనాన్సింగ్ కు ప్రాధాన్య‌త‌నిస్తోంద‌న్నారు.

పి.ఎం. గ‌తిశ‌క్తి :
        పి.ఎం. గ‌తిశ‌క్తి మాస్ట‌ర్‌ప్లాన్ ఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ వేస్ ను 2022-23లో రూప‌క‌ల్ప‌న చేయ‌డం జ‌రుగుతుంది. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు, స‌ర‌కు ర‌వాణా స‌త్వ‌రం జ‌రిగేందుకు ఇది ఉప‌క‌రిస్తుంది. నేష‌న‌ల్ హైవేస్ నెట్‌వ‌ర్క్‌ను 2022-23 ఆర్థిక సంవ‌త్స‌రంలో 25,000 కిలోమీట‌ర్ల‌కు విస్త‌రించ‌డం జ‌రుగుతుంది.  ప్ర‌భుత్వ వ‌న‌రుల‌కు తోడు, వినూత్న ఫైనాన్సింగ్ ప‌ద్ధ‌తుల ద్వారా 20,000 కోట్ల రూపాయ‌ల‌ను స‌మీక‌రించ‌డం జ‌రుగుతుంది.
         నాలుగు ప్రాంతాల‌లో 2022-23 లో మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు పిపిపి ప‌ద్ధ‌తిలో  కాంట్రాక్టు ఇవ్వ‌డం జ‌రుగుతుంది.

 

2 . PM Gatishakti.jpg

 

         రైల్వేల‌కు సంబంధించి, ప్ర‌స్తావిస్తూ ఆర్థిక‌మంత్రి, ఒక స్టేష‌న్‌- ఒక ఉత్ప‌త్తి అంశాన్ని ప్రాచుర్యంలోకి తేవ‌డం జ‌రుగుతుంది. స్థానిక వ్యాపారాలు, స‌ర‌ఫ‌రా చెయిన్ల‌కు ఇది స‌హాయ‌ప‌డుతుంది. దీనికి తోడు ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగంగా క‌వ‌చ్ ప‌థ‌కం కిందికి 2000 కిలోమీట‌ర్ల‌నెట్ వ‌ర్క్‌ను తీసుకురావ‌డం జ‌రుగుతుంది. దీని ద్వారా దేశీయంగా ప్రపంచ శ్రేణి సాంకేతిక‌త‌తో భ‌ద్ర‌త‌, సామ‌ర్ధ్య పెంపున‌కు 2022-23లో చ‌ర్య‌లు తీసుకుంటారు. మెరుగైన సామ‌ర్ధ్యం , ప్ర‌యాణికుల‌కు సుఖ‌వంత‌మైన ప్ర‌యాణ అనుభూతి క‌లిపించేందుకు మెరుగైన ఇంధ‌న సామ‌ర్ధ్యానికి 400 కొత్త వందే భార‌త్ రైళ్ల‌ను త‌యారుచేసి అభివృద్ధి చేయ‌నున్న‌ట్టు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. మ‌ల్టీ మోడ‌ల్ లాజిస్టిక్ స‌దుపాయాల కోసం 100 పి.ఎం. గ‌తి శ‌క్తి కార్గో టెర్మిన‌ళ్లను రాగ‌ల మూడు సంవ‌త్స‌రాల‌లో   ఏర్పాటుచేయ‌డం జ‌రుగుతోంది.


 వ్య‌వ‌సాయ‌రంగం:

        ఇక వ్య‌వ‌సాయ రంగానికి వ‌స్తే, ర‌సాయ‌నాల ర‌హిత స‌హ‌జ ప‌ద్ధ‌తుల‌లో సాగును దేశ‌వ్యాప్తంగా ప్రోత్స‌హిస్తామ‌ని , ప్ర‌త్యేకించి తొలి ద‌శ‌లో గంగాన‌దికి చెందిన 5 కిలోమీట‌ర్ల వెడ‌ల్పు కారిడార్‌లోని పంట పొలాల‌లో దీనిని అమ‌లుపై దృష్టిపెడ‌తామ‌న్నారు. పంట అంచ‌నా, భూ రికార్డుల‌ డిజిటైజేష‌న్‌, పురుగుమందుల పిచికారీ, పోష‌కాలు వెద‌జ‌ల్లేందుకు కిసాన్ డ్రోన్ల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుందన్నారు.
         నూనెగింజ‌ల దిగుమ‌తిపై ఆధార‌ప‌డ‌డం త‌గ్గించేందుకు దేశీయంగా నూనె గింజ‌ల ఉత్పత్తి పెంచేందుకు హేతుబ‌ద్ధ‌మైన , స‌మ‌గ్ర విధానాన్ని అమ‌లుచేస్తామ‌న్నారు.


 

Agriculture and food processing.jpg

 

         2023 సంవ‌త్స‌రాన్ని అంత‌ర్జాతీయ చిరుధాన్యాల సంవ‌త్స‌రంగా ప్ర‌క‌టించినందున‌, దేశీయంగా వీటి వినియోగం పెంపు, చిరుధాన్యాల ఉత్ప‌త్తులకు దేశీయంగా, అంత‌ర్జాతీయంగా బ్రాండింగ్, పంట కోత అనంత‌రం ఉత్ప‌త్తికి విలువ జోడింపుకు ప్ర‌భుత్వం పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.


నీటిపారుద‌ల ప్రాజెక్టులుః
         కెన్- బెత్వా లింక్ ప్రాజెక్టును 44,605 కోట్ల రూపాయ‌ల వ్య‌యంతో చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌ని కేంద్ర ఆర్థిక‌మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. ఈ ప్రాజెక్టు 9.08 ల‌క్ష‌ల హెక్టార్ల పంట పొలాల‌కు నీటి స‌దుపాయం , 62 ల‌క్ష‌ల మందిప్ర‌జ‌ల‌కు మంచినీటి స‌దుపాయం, 103 మెగా వాట్ల జ‌ల‌విద్యుత్ ఉత్ప్తి, 27 మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్ప‌త్తికి వీలు క‌ల్పిస్తుంది.

 

         ఈ ప్రాజెక్టుకు 2021-22 స‌వ‌రించిన అంచ‌నాల ప్ర‌కారం రూ 4,300 కోట్లు, 2022-23 సంవ‌త్స‌రంలో 1,400 కోట్ల రూపాయ‌లు కేటాయించడం జ‌రిగింది. దీనికితోడు ద‌మ‌న్ గంగ‌- పింజాల్‌, పార్‌-తాపి న‌ర్మ‌ద‌, గోదావ‌రి-కృష్ణ‌, కృష్ణ -పెన్నార్‌, పెన్న‌-కావేరి న‌దుల అనుసంధానం ఖ‌రారుచేయ‌డం జ‌రిగింది. ఈ విష‌య‌మై ప్ర‌యోజ‌నం పొంతున్న రాష్ట్రాలు, కేంద్రానికిమ‌ధ్య ఏకాభిప్రాయం కుద‌ర‌గానే దీని అమ‌లుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం జరుగుతుంది.

 

ఎం.ఎస్‌.ఎం.ఇల‌కు మ‌ద్ద‌తుః

         ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ పథ‌కం ( ఇసిఎల్ జిఎస్‌) 130 ల‌క్ష‌ల‌కు పైగా ఎం.ఎస్‌.ఎం.ఇల‌కు అవ‌స‌ర‌మైన అద‌న‌పు రుణ స‌దుపాయాన్నిక‌ల్పించింది. ఇది కోవిడ్ మ‌హమ్మారి కార‌ణంగా త‌లెత్తిన ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునేందుకు ఎం.ఎస్.ఎం.ఇల‌కు  ఉప‌యోగ‌ప‌డింది. ఇసిఎల్ జిఎస్‌ను  2023 మార్చి వ‌ర‌కు పొడిగించ‌డం జ‌రుగుతుంద‌న్నారు.
క్రెడిట్ గ్యారంటీ ట్ర‌స్ట్ ఫ‌ర్ మైక్రో, స్మాల్ ఎంట‌ర్ ప్రైజెస్ (సిజిటిఎంఎస్ ఇ) ప‌థ‌కాన్ని  త‌గిన విధంగా నిధులు చేర్చ‌డం ద్వారా పున‌రుద్ధ‌రిస్తారు. ఇది సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ఎంట‌ర్ ప్రైజ్‌ల‌కు అద‌నంగా 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల రుణం అందుబాటు లోకితెచ్చేందుకు, ఉపాధి అవ‌కాశాల‌ను పెంపొందించేందుకు వీలు క‌ల్పిస్తుంది. ఎం.ఎస్.ఎం.జి  ప‌నితీరును పెంచే ఆర్‌.ఎ.ఎం.పి ప‌థ‌కాన్ని రాగ‌ల 5 సంవ‌త్స‌రాల లో 6 ,0000 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డితో తీసుకురావ‌డం జ‌రుగుతుంద‌ని, దీనితో ఎం.ఎస్‌.ఎం.ఇ రంగం మ‌రింత స‌మ‌ర్ధంగా, పోటీ త‌త్వంతో ప‌నిచేయ‌డానికి వీలుక‌లుగుతుంద‌న్నారు.
        ఉద‌యం, ఈ -శ్ర‌మ్, ఎన్ సిఎస్‌, ఎఎస్ఇఇఎం పోర్ట‌ల్‌లను అనుసంధానంచేసి వాటి ప‌రిథిని విస్తృతం చేస్తారు.

 

7. Accelerating Growth of MSME.jpg

 

నైపుణ్య శిక్ష‌ణ‌:
         నైపుణ్య శిక్ష‌ణ‌, నాణ్య‌మైన విద్య గురించి ప్ర‌స్తావిస్తూ ఆర్థిక‌మంత్రి, డ్రోన్ శ‌క్తి ద్వారా వివిధ‌ అప్లికేష‌న్లు చేప‌ట్ట‌డానికి స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హిస్తామ‌న్నారు. అన్ని రాష్ట్రాల‌లో  ఎంపిక చేసిన ఐటిఐ ల‌లో   నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన కోర్సుల‌ను ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.  వృత్తి విద్యా కోర్సుల‌లో, కీల‌క‌మైన ఆలోచ‌నా నైపుణ్యాల‌ను పెంపొందింప చేసేందుకు , సృజ‌నాత్మ‌క‌త‌కు 750 వ‌ర్చువ‌ల్ ప్ర‌యోగ శాల‌ల‌ను సైన్సు, మాథ‌మాటిక్స్ ల‌లోను అలాగే 75 నైపుణ్య ఈ లాబ్‌ల‌ను 2022-23 సంవ‌త్స‌రంలో ఏర్పాటు చేస్తారు.
         ప్ర‌స్తుత కోవిడ్ ప‌రిస్థితుల‌లో పాఠ‌శాల‌లు ఎక్కువ కాలం మూత‌ప‌డ‌డంతో పిల్లలు ప్ర‌త్యేకించి గ్రామీణ ప్రాంతాల‌లోనివారు, షెడ్యూలుకులాలు, షెడ్యూలు త‌ర‌గ‌తులు వారు, బ‌ల‌హీన వ‌ర్గాల‌కుచెందిన వారు దాదాపు రెండు సంవ‌త్స‌రాలు త‌ర‌గ‌తి గ‌ది బోధ‌న‌కు దూర‌మ‌య్యారు. వీరిలో చాలా మంది ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే పిల్ల‌లు. వీరికి అనుబంధంగా బోధ‌న అంద‌జేసేందుకు ఒక త‌ర‌గ‌తి, ఒక టివి చాన‌ల్ కార్య‌క్ర‌మ‌మైన పిఎం ఈ విద్య‌ను 12 నుంచి 200 ఛాన‌ళ్ల‌కు విస్త‌రిస్తారు. ఇది రాష్ట్రాలు ప్రాంతీయ భాష‌ల‌లో 1నుంచి 12 త‌ర‌గ‌తుల వ‌ర‌కు అనుబంధ విద్య‌ను అందించ‌డానికి  ఉప‌క‌రిస్తుంది.

         దేశ‌వ్యాప్తంగా  ప్ర‌పంచ‌శ్రేణి  సార్వ‌త్రిక విద్య‌ను ఇంటి గుమ్మం ముందుకు చేర్చేదిశ‌గా డిజిట‌ల్ విశ్వ‌విద్యాల‌యాన్ని ఏర్పాటు చేస్తారు. దీనిని వివిధ భార‌తీయ భాష‌ల‌లో ఐసిటి ఫార్మెట్‌ల‌లో అందుబాటులోకి తీసుకువ‌స్తారు.  దీనిని నెట్ వ‌ర్క్ హ‌బ్ స్పోక్ న‌మూనాలో తీసుకువ‌స్తారు. దేశంలో అత్యుత్త‌మ విశ్వ‌శిద్యాల‌యాలు ఈ నెట్ వ‌ర్క్ తో అనుసంధాన‌మ‌వుతాయి.

          ఆయుష్మాన్ భార‌త్ డిజిట‌ల్ మిష‌న్ కింద నేష‌న‌ల్ డిజిట‌ల్ హెల్త్ ఎకో సిస్ట‌మ్ కు సంబంధించి ఓపెన్ ప్లాట్‌ఫారంను తీసుకువ‌స్తారు. ఇందులో ఆరోగ్య స‌దుపాయాల క‌ల్పించేవారి డిజిట‌ల్ రిజిస్ట్రీస్‌, ప్ర‌త్యేక ఆరోగ్య గుర్తింపు, క‌న్సెంట్ ఫ్రేమ్ విర్క్‌, సార్వ‌త్రిక ఆరోగ్య స‌దుపాయాలు అందుబాటులోకితేవడం ఉంటాయి.

 

4. Education.jpg

 

డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్లు:
       75 సంవ‌త్స‌రాల  స్వాతంత్ర్య ఉత్స‌వాల సంద‌ర్భంగా  ప్ర‌భుత్వం 75 డిజిట‌ల్ బ్యాంకింగ్ యూనిట్ల‌ను (డిబియు)ల‌ను 75 జిల్లాల‌లో షెడ్యూలు వాణిజ్య బ్యాంకుల ద్వారా ఏర్పాటుచేయ‌నుంది. ఇది డిజిట‌ల్ బ్యాంకింగ్‌కార్య‌క‌లాపాల‌ను దేశంలోని వివిధ మారుమూల ప్రాంతాల‌కు సైతం అందుబాటులోకి తీసుకురానుంది.
ఎల‌క్ట్రానిక్ చిప్ సౌక‌ర్యంతో ఈ పాస్ పోర్టును జారీచేయ‌నున్నారు. 2022-23 సంవ‌త్స‌రంలో దీనిని తీసుకురానున్నారు. దీన‌వ‌ల్ల విదేశీ ప్ర‌యాణాలు సుల‌భ‌త‌ర‌మౌతాయి.


5 జి టెక్నాల‌జీ. :
        టెలిక‌మ్యూనికేష‌న్ రంగాన్ని గురించి ప్ర‌స్తావిస్తూ నిర్మ‌లా సీతారామ‌న్, ప్ర‌త్యేకించి 5 జి సాంకేతిక ప‌రిజ్ఞానం గురించి ప్ర‌స్తావించారు. ఇది ప్ర‌గ‌తి, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తుంద‌న్నారు. 2022లో త‌గిన స్పెక్ట్ర‌మ్వేలం నిర్వ‌హిస్తామ‌ని, ఇది 5జి మొబైల్ స‌ర్వీసులు 2022-23లో ప్రైవేట్ టెలికం ప్రొవైడ‌ర్లు  అందుబాటులోకి తీసుకురావ‌డానికి వీలు క‌లుగుతుంద‌న్నారు. 

ర‌క్ష‌ణ రంగం :
         ర‌క్ష‌ణ రంగం గురించి ప్ర‌స్తావిస్తూ, ప్ర‌భుత్వం దిగుమ‌తుల‌ను త‌గ్గించి ఆత్మ‌నిర్భ‌ర్‌భార‌త్ కింద సాయుధ బ‌ల‌గాల‌కు అవ‌స‌ర‌మైన ప‌రిక‌రాల‌ను అందుబాటులోకి తేనున్న‌ద‌న్నారు. కేపిటల్ ప్రోక్యూర్మెంట్ బ‌డ్జెట్ లో 68 శాతాన్ని దేశీయ ప‌రిశ్ర‌మ‌కు 2022-23 సంవ‌త్స‌రంలో  కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. 2021-22 సంవ‌త్స‌రం దానిక‌న్న 58 శాతం పెంచారు. ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న‌, అభివృద్ధిని ప‌రిఃశ్ర‌మ‌లు, స్టార్ట‌ప్ లు విద్యా సంస్థ‌ల‌కు రక్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి బ‌డ్జెట్ లో 25 శాతాన్ని కేటాయించ‌నున్నారు.

దేశీయంగా 280 గిగావాట్ల స్థాపిత సౌర విద్యుత్ సామ‌ర్థ్యాన్ని 2030 నాటికి చేరుకునేందుకు వీలు క‌ల్పిస్తూ అద‌నంగా 19,500 కోట్ల రూపాయ‌ల‌ను ఉన్న‌త స్థాయి సామ‌ర్థ్యం గ‌ల మాడ్యూల్స్త త‌యారీకి ఉత్పాద‌క‌త‌తో కూడిన ప్రోత్సాహ‌కం ఇవ్వ‌నున్నారు. పాలి సిలికాన్ నుంచి సోలార్ పివి మాడ్యూల్స్ వ‌ర‌కు పూర్తి స్థాయి స‌మీకృత త‌యారీ యూనిట్ల‌కు ప్రాధాన్య‌త ఇస్తారు.

 

   దేశంలో 2022-23లోనూ ప్రభుత్వ పెట్టుబడులు అగ్రస్థానంలో కొనసాగాలని, అలాగే డిమాండు, ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం ఉండాలని ఆర్థికశాఖ మంత్రి అన్నారు. అందుకే కేంద్ర బడ్జెట్‌లో మూలధన వ్యయం కేటాయింపులను మరోసారి గణనీయ స్థాయిలో 35.4

శాతం పెంచి రూ.5.54 లక్షల కోట్ల నుంచి ప్రస్తుత 2022-23 సంవత్సరంలో రూ.7.50 లక్షల

కోట్లకు భారీగా హెచ్చించినట్లు వెల్లడించారు. మునుపటి 2019-20 కాలంతో పోలిస్తే

ఈ వ్యయం 2.2 రెట్లకన్నా అధికంగా పెరిగింది. మొత్తంమీద 2022-23 జీడీపీలో ఈ వ్యయం విలువ 2.9 శాతంగా ఉంటుందని అంచనా. రాష్ట్రాలకు పూర్తి ఆర్థిక సహాయం ద్వారా మూలధన ఆస్తుల సృష్టికి కేటాయింపులుసహా కేంద్ర ప్రభుత్వ “ఆచరణాత్మక

మూలధన వ్యయం” అంచనా 2022-23లో రూ.10.68 లక్షల కోట్లు కాగా, ఇది జీడీపీలో 4.1

శాతంగా ఉంటుందని మంత్రి వివరించారు.

   ఇక 2022-23లో ప్రభుత్వం సమీకరించే మార్కెట్‌ రుణాల మొత్తంలో ‘సావరిన్‌ గ్రీన్‌ బాండ్స్‌’ జారీ ఒక భాగంగా ఉంటుంది. దీనికింద హరిత మౌలిక సదుపాయాల కోసం వనరుల సేకరణకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ బాండ్ల జారీద్వారా లభ్యమయ్యే నిధులను ప్రభుత్వరంగ ప్రాజెక్టులకు వినియోగిస్తారు. ఇది ఆర్థిక వ్యవస్థలో కర్బన ఉద్గారాల తీవ్రత తగ్గించేందుకు దోహదం చేస్తుంది. దేశంలో కరెన్సీ నిర్వహణ మరింత సమర్థంగా, చౌకగా సాగడం కోసం 2022-23 నుంచి ‘బ్లాక్‌చెయిన్‌ తదితర సాంకేతిక పరిజ్ఞానాల ఆధారంగా రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ద్వారా ‘డిజిటల్‌ రూపాయి’ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

   హకారాత్మక సమాఖ్య తత్వం వాస్తవ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ‘మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ఆర్థిక సహాయ పథకం’ కేటాయింపులను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు బడ్జెట్‌ అంచనాల్లో రూ.10,000 కోట్లుగా పేర్కొన్న నేపథ్యంలో ప్రస్తుత సంవత్సరానికి సవరించిన అంచనాల్లో రూ.15,000 కోట్లకు పెంచింది. అంతేకాకుండా 2022-23కుగాను ఆర్థిక వ్యవస్థలో సమగ్ర పెట్టుబడుల ఉత్ప్రేరణం దిశగా రాష్ట్రాలకు సాయపడేందుకు కేటాయింపులను రూ.1 లక్ష కోట్లుగా పేర్కొంది. రాష్ట్రాలకు అనుమతించిన సాధారణ రుణ సమీకరణ మొత్తానికి ఈ యాభయ్యేళ్ల పరిమితిగల వడ్డీరహిత రుణాలు అదనంగా లభిస్తాయి. ఈ కేటాయింపులను ‘పీఎం-గతిశక్తి’ సంబంధిత ఇతర ఉత్పాదక మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలు వినియోగించాల్సి ఉంటుంది. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా 2022-23లో రాష్ట్రాల ‘జీఎస్‌డీపీ’లో ద్రవ్యలోటును 4 శాతం వరకూ అనుమతిస్తామని శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. అయితే, ఇందులో 0.5 శాతాన్ని విద్యుత్‌ రంగ సంస్కరణలతో ముడిపెడుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన షరతులు 2021-22లోనే రాష్ట్రాలకు తెలియజేయబడ్డాయి.

   చివరగా తన బడ్జెట్‌ ప్రసంగంలోని ‘ఎ’ భాగాన్ని ముగిస్తూ- బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటును 6.8 శాతంగా పేర్కొన్నప్పటికీ ప్రస్తుత ఏడాదిలో సవరించబడిన ద్రవ్యలోటు జీడీపీలో 6.9 శాతంగా ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్థికశాఖ మంత్రి చెప్పారు. కాగా, 2022-23లో ద్రవ్యలోటును జీడీపీలో 6.4 శాతంగా అంచనా వేయగా, దీన్ని 2025-26కల్లా 4.5 శాతం కన్నా దిగువకు చేర్చేదిశగా గత సంవత్సరం ఆమె ప్రకటించిన విస్తృత ఆర్థిక ఏకీకరణ మార్గానికి అది అనుగుణంగా ఉండటం గమనార్హం. ద్రవ్యలోటు స్థాయిని 2022-23కుగాను నిర్దేశిస్తున్న సందర్భంగా ప్రభుత్వ పెట్టుబడుల ద్వారా వృద్ధికి ఊతమిస్తూ ఆర్థిక వ్యవస్థ  మరింత బలంగా, సుస్థిరంగా రూపొందాలని ఆమె పిలుపునిచ్చారు.

   నిలకడైన, అంచనాలను అందుకోగల రీతిలో ప్రకటించిన పన్ను విధానం కొనసాగింపును 2022-23 కేంద్ర బడ్జెట్‌ స్పష్టం చేసింది. అదే సమయంలో విశ్వసనీయ పన్ను వ్యవస్థను ఏర్పరచడంలో భాగంగా ఈ దార్శనికతను ముందుకు తీసుకెళ్లే మరిన్ని సంస్కరణలు తేవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ పన్నులు, సుంకాల సంబంధిత ప్రతిపాదనలను శ్రీమతి నిర్మలా సీతారామన్‌ వివరిస్తూ- పన్ను వ్యవస్థ మరింత సరళం కాగలదని.. పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా కట్టుబడి, వివాదాలు తగ్గుముఖం పట్టేవిధంగా ఉంటుందని ప్రకటించారు.

   ప్రత్యక్ష పన్ను విషయానికొస్తే- ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తప్పులు దిద్దుకుని రెండేళ్లలోగా నవీకృత రిటర్నులు దాఖలు చేసేందుకు బడ్జెట్‌ అనుమతిస్తుంది. ఇక వైకల్యం ఉన్నవారికి పన్ను నుంచి ఉపశమనం కల్పిస్తుంది. సహకార సంస్థలకు ప్రత్యామ్నాయ కనీస పన్ను శాతాన్ని, అదనపు సుంకాన్ని మరోవైపు అంకుర సంస్థలకు ప్రోత్సాహంలో భాగంగా అర్హతగల సంస్థల స్థాపన గడువును మరో ఏడాది పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల ‘ఎన్‌పీఎస్‌’ ఖాతాకు యాజమాన్య వాటా చందాపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ రంగ సంస్థలకు పన్ను రాయితీ విధానం కింద ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించింది. వర్చువల్‌ ఆస్తుల బదిలీద్వారా లభించే ఆదాయంపై 30 శాతం పన్ను విధిస్తామని పేర్కొంది. అప్పీళ్లు పునరావృతం కాకుండా చూసేదిశగా వివాద నిర్వహణ మెరుగుకు బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   రోక్ష పన్నుల అంశంలో- ప్రత్యేక ఆర్థిక మండలా(సెజ్‌)ల్లో కస్టమ్స్‌ పరిపాలన మొత్తం సమాచార సాంకేతికత (ఐటీ) చోదితంగానే ఉంటుందని కేంద్ర బడ్జెట్‌ ప్రకటించింది. మూలధన వస్తువులు, ప్రాజెక్టు దిగుమతులలో రాయితీల శాతాన్ని క్రమంగా తొలగించి, పరిమిత రీతిలో 7.5 శాతం సుంకం వర్తింపజేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా కస్టమ్స్‌ మినహాయింపులు, సుంకాల సరళీకరణను సమీక్షించాల్సిన ఆవశ్యకతను బడ్జెట్‌ గుర్తుచేసింది. ఈ మేరకు 350 వరకూ మినహాయింపులను దశలవారీగా రద్దుచేయాలని ప్రతిపాదించింది. దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీకి సౌలభ్యం కల్పిస్తూ కస్టమ్స్‌ సుంకాల శాతాలను దశలవారీగా క్రమబద్ధం చేయాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. వ్యవసాయ రంగానికి సంబంధించి దేశీయంగా తయారయ్యే పరికరాలు, సాధనాలపై మినహాయింపుల హేతుబద్ధీకరణ చేపట్టబడుతుంది. తుక్కు ఉక్కుపై కస్టమ్స్‌ సుంకం మినహాయింపు పొడిగించనుండగా, అసమ్మిళిత ఇంధనంపై అదనపు వ్యత్యాస ఎక్సైజ్‌ సుంకం విధించబడుతుంది.

   దనపు పన్ను చెల్లించడానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులు నవీకరించిన రిటర్ను దాఖలుకు వీలుగా కొత్త నిబంధనను బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఈ మేరకు సంబంధిత పన్ను మదింపు సంవత్సరం చివరినుంచి రెండేళ్లలోగా నవీకరించిన రిటర్న్‌ దాఖలు చేయవచ్చు. ఈ ప్రతిపాదనతో పన్ను చెల్లింపుదారులలో తిరిగి విశ్వాసం నెలకొంటుందని శ్రీమతి సీతారామన్‌ అన్నారు. దీనివల్ల వాస్తవ రిటర్ను దాఖలు సమయంలో పేర్కొనబడని ఆదాయాన్ని స్వచ్ఛందంగా ప్రకటించే వీలుంటుందని చెప్పారు. పన్ను చట్టాలకు స్వచ్ఛంద కట్టుబాటు దిశగా కొత్త నిబంధన ఒక నిర్ణయాత్మక ముందడుగని పేర్కొన్నారు.

   దేశంలోని సహకార సంఘాలు, కంపెనీల మధ్య సమానస్థాయి దిశగా సహకార సంఘాలకూ కనీస ప్రత్యామ్నాయ పన్నును 15 శాతానికి తగ్గించాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. అంతేకాకుండా మొత్తం ఆదాయం రూ.1 కోటినుంచి రూ.10 కోట్లకు మించిన సహకార సంఘాలపై ప్రస్తుతం విధిస్తున్న అదనపు సుంకాన్ని 12 శాతం నుంచి 7 శాతానికి తగ్గించే ప్రతిపాదనను ఆర్థికశాఖ మంత్రి ప్రకటించారు. ఇక దివ్యాంగుల తరఫున వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు బీమా పథకంలో చేరవచ్చునని బడ్జెట్‌ ప్రతిపాదించింది. ప్రస్తుత చట్టం ప్రకారం చందాదారులు.. అంటే- తల్లిదండ్రులు లేదా సంరక్షకులు మరణించినపుడు మాత్రమే  దివ్యాంగులకు ఏకమొత్తంగా లేదా వార్షిక చెల్లింపులు సమయంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇకపై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు జీవించి ఉండగానే… అంటే- వారికి 60 ఏళ్లు పూర్తికాగానే దివ్యాంగులకు ఏకమొత్తంగా లేదా వార్షికంగా సొమ్ము అందించేందుకు బడ్జెట్‌ అనుమతించింది.

   ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగి జీతంలో 14 శాతాన్ని మొదటి అంచె (టియర్‌-1) జాతీయ పెన్షన్‌ పథకం (ఎన్‌పీఎస్‌) చందాకింద చెల్లిస్తుంది. ఉద్యోగి ఆదాయం లెక్కింపు సందర్భంగా ఈ మొత్తాన్ని మినహాయింపుగా పరిగణిస్తారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యాజమాన్య చందాలో 10 శాతానికి మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల మధ్య సమానస్థాయి వర్తించేలా ఈ మినహాయింపు పరిమితిని ప్రస్తుత 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   దేశంలో స్థాపన ప్రకటన నాటినుంచి పదేళ్లలోగా అంటే- 31.03.2022కు ముందు ఏర్పాటయ్యే అర్హతగల అంకుర సంస్థలకు వరుసగా మూడేళ్లపాటు పన్ను ప్రోత్సాహకం లభిస్తుంది. అయితే, కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో పన్ను ప్రోత్సాహకం పొందడం కోసం స్థాపన వ్యవధిని మరో ఏడాదిపాటు… అంటే- 31.03.2023దాకా పొడిగించాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   కొన్ని దేశీయ కంపెనీలకు అంతర్జాతీయంగా వ్యాపార పోటీతత్వ వాతావరణం కల్పన దిశగా పన్ను రాయితీ విధానం ప్రవేశపెట్టబడింది. దీనికింద కొత్తగా ఏర్పాటైన దేశీయ తయారీరంగ సంస్థలకు 15 శాతం పన్నును అమలు చేస్తుంది. ఇందులో భాగంగా సెక్షన్‌ ‘115బిఏబీ’ కింద తయారీ లేదా ఉత్పాదన ప్రారంభానికి చివరి తేదీని ఏడాదిపాటు… అంటే-2024 మార్చి 31దాకా పొడిగించాలని కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదించింది.

   వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులపై పన్నుకు సంబంధించి- ఏదైనా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తి బదిలీ ద్వారా లభించే ఆదాయంపై 30 శాతం పన్ను విధింపునకు బడ్జెట్‌ వీలు కల్పిస్తోంది. అటువంటి ఆదాయాన్ని లెక్కించేటపుడు కొనుగోలు/సముపార్జన వ్యయం మినహా ఎలాంటి ఇతర వ్యయాలు లేదా భత్యాలకు మినహాయింపు అనుమతించబడదు. అంతేకాకుండా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల బదిలీవల్ల ఏదైనా నష్టం సంభవిస్తే ఇతరత్రా ఆదాయాల తగ్గింపునకు సదరు నష్టం అనుమతించబడదు. ఇలాంటి లావాదేవీల వివరాలు రాబట్టడం కోసం వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తి బదిలీకి సంబంధించిన చెల్లింపులపై ‘టీడీఎస్‌’ను సదరు ఆస్తి నగదుపూర్వక విలువ పరిమితిపై 1 శాతంగా విధించాలని నిబంధన రూపొందించబడింది. అలాగే వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తిని బహుమతిగా పొందిన వ్యక్తిపై పన్ను విధించాలని కూడా ప్రతిపాదించబడింది.

   వివాదాల సమగ్ర పరిష్కార విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ- ఒక మదింపుదారు విషయంలో అధికారపరిధిగల హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో ఏదైనా కేసు సంబంధిత అంశం విచారణలో ఉన్నపుడు ఆయా న్యాయస్థానాల్లో అది పూర్తిగా పరిష్కారం అయ్యేదాకా సదరు మదింపుదారుపై పన్నుశాఖ అప్పీలు దాఖలు వాయిదాకు బడ్జెట్‌ వీలు కల్పించింది. అలాగే ఆఫ్‌షోర్ డెరివేటివ్ ఇన్‌స్ట్రుమెంట్స్ లేదా ఆఫ్‌షోర్ బ్యాంకింగ్ యూనిట్ జారీ చేసిన కౌంటర్ డెరివేటివ్‌ల ద్వారా ప్రవాస భారతీయులకు వచ్చే ఆదాయం, రాయల్టీ ద్వారా వచ్చే ఆదాయం,  ఓడ లీజుపై వచ్చే వడ్డీ, ఐఎఫ్‌ఎస్‌సీ ద్వారా పోర్ట్‌ ఫోలియో మేనేజ్‌మెంట్ సేవల ద్వారా లభించే ఆదాయం నిర్దిష్ట షరతులకు లోబడి పన్ను నుంచి మినహాయించబడుతుందని బడ్జెట్‌ ప్రతిపాదించింది. ఆదాయం లేదా లాభంపై విధించే అదనపు సుంకం లేదా సెస్సును వ్యాపార వ్యయంగా అనుమతించే వీల్లేదని బడ్జెట్‌ స్పష్టం చేసింది.

   న్ను ఎగవేతకు ప్రయత్నించేవారిలో నిర్దిష్టత, చట్టమంటే భయం పెంచే దిశగా ఆర్థికశాఖ మంత్రి ఒక ప్రతిపాదన తెచ్చారు. ఈ మేరకు తనిఖీ లేదా సర్వే కార్యకలాపాల్లో భాగంగా అటువంటి వ్యక్తులకు సంబంధించి వెల్లడించని ఆదాయం వెలుగుచూసినపుడు వారికి ఇతరత్రా సంభవించిన ఏదైనా నష్టాన్ని అందులోనుంచి మినహాయించే వీలుండదని స్పష్టం చేశారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల పరిధిలో కస్టమ్స్‌ పరిపాలన సంస్కరణలు చేపట్టనున్నట్లు బడ్జెట్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఇకపై ఈ కార్యకలాపాలు పూర్తిగా ‘ఐటీ’ చోదితంగానే సాగుతాయని, ముప్పు ఆధారిత తనిఖీలకు మాత్రమే పరిమితమై మరింత సౌలభ్యంపై దృష్టి సారిస్తూ జాతీయ కస్టమ్స్‌ పోర్టల్‌ పనిచేస్తుందని పేర్కొంది. ఈ సంస్కరణ 2022 సెప్టెంబరు 30 నుంచి అమలులోకి రానుందని ప్రకటించింది.

   మూలధన వస్తువులు, ప్రాజెక్టు దిగుమతులలో రాయితీల శాతాన్ని క్రమంగా తొలగించి, పరిమిత రీతిలో 7.5 శాతం సుంకం వర్తింపజేయాలని బడ్జెట్‌ ప్రతిపాదించింది. అయితే, దేశంలో తయారీ లేని అత్యాధునిక యంత్రాలకు సంబంధించి కొన్ని మినహాయింపులు కొనసాగుతాయి. మూలధన వస్తు తయారీకి దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించడంలో భాగంగా  ప్రత్యేక మూసలు, బాల్‌ స్క్రూలు, లీనియర్‌ మోషన్‌ గైడ్‌ వంటి ఉత్పాదక వనరులపై కొన్ని మినహాయింపులు ప్రవేశపెట్టబడతాయి. మొత్తంమీద 350కిపైగా మినహాయింపు పద్దులు రద్దుచేయబడతాయి. దేశీయ తయారీ సామర్థ్యం తగినంతగా గల వ్యవసాయ ఉత్పాదన, రసాయనాలు, దుస్తులు, వైద్య పరికరాలు, ఔషధాలు, మందులు ఈ జాబితాలో ఉన్నాయి. అదేవిధంగా వివిధ రాయితీ శాతాలకు సంబంధించి పలు నోటిఫికేషన్ల ద్వారా ప్రకటించే బదులుగా ఇకపై కస్టమ్స్‌ సుంకాల షెడ్యూలులోనే అన్నీ చేర్చబడతాయి.

   లక్ట్రానిక్స్‌ రంగంలో ధరించే, వినికిడి పరికరాలు, ఎలక్ట్రానిక్‌ స్మార్ట్‌ మీటర్ల దేశీయ తయారీకి సౌలభ్యం దిశగా గ్రేడ్లవారీ పన్ను వ్యవస్థ ఏర్పాటు కోసం కస్టమ్స్‌ సుంకం శాతాల క్రమబద్ధీకరణ చేపట్టబడుతుంది. మొబైల్‌ ఫోన్‌ చార్జర్ల ట్రాన్స్‌ ఫార్మర్‌ విడిభాగాలు, మొబైల్‌ కెమెరా మాడ్యూల్‌ లెన్స్‌, కొన్ని ఇతర వస్తువులపై సుంకంలో రాయితీలు ఇవ్వబడతాయి.

   వజ్రాలు, ఆభరణాల రంగానికి ఊపునిచ్చేందుకు కట్‌-పాలిష్డ్‌ వజ్రాలు, రాళ్లపై కస్టమ్స్‌ డ్యూటీ 5 శాతానికి తగ్గించబడింది. ఇ-కామర్స్‌ ద్వారా ఆభరణాల ఎగుమతికి వీలు కల్పిస్తూ సరళీకరించిన నియంత్రణ వ్యవస్థ ఈ ఏడాది జూన్‌ నుంచి అమలులోకి వస్తుంది. తక్కువ విలువైన అనుకరణ ఆభరణాల దిగుమతికి ప్రోత్సాహకాల రద్దు దిశగా సదరు ఆభరణాల దిగుమతిపై కస్టమ్స్‌ సుంకాన్ని కిలోకు కనీసం రూ.400 వంతున విధించాలని నిర్దేశించబడింది. ఇక మిథనాల్‌, ఎసిటిక్‌ యాసిడ్‌, పెట్రోలియం శుద్ధికి వినియోగించే భారీ ముడిపదార్థాలు వంటి కొన్ని వస్తువులపై కస్టమ్స్‌ సుంకం తగ్గించబడింది. అయితే, దేశీయ తయారీ సామర్థ్యం తగినంతగాగల సోడియమ్‌ సైనైడ్‌పై సుంకం పెంచబడింది.

   గొడుగులపై సుంకం 20 శాతానికి పెంచడంతోపాటు వాటి విడిభాగాలపై పన్ను మినహాయింపు ఉపసంహరించబడింది. దేశీయంగా తయారయ్యే వ్యవసాయ పరికరాలు, సాధనాలపై మినహాయింపు హేతుబద్ధీకరించబడింది. తుక్కు ఉక్కుపై నిరుడు అనుమతించిన కస్టమ్స్‌ సుంకం మినహాయింపు మరో ఏడాదిపాటు పొడిగించబడింది. అయితే, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌, కోటెడ్‌ ఫ్లాట్‌ స్టీల్‌ ఉత్పత్తులు, అల్లాయ్‌ స్టీల్‌ కడ్డీలు, హైస్పీడ్‌ స్టీల్‌ వంటివాటిపై నిల్వ నిరోధక సుంకం, ‘సీవీడీ’ విధింపు రద్దుచేయబడింది. అలాగే ఎగుమతులకు ప్రోత్సాహకంగా కొన్ని రాయితీలు కల్పించబడ్డాయి. ఈ మేరకు హస్తకళలు, వస్త్రాలు, చర్మదుస్తులు, చర్మ పాదరక్షల ఎగుమతిదారులకు అవసరమైన అలంకరణ, ట్రిమ్మింగ్, ఫేజెనర్లు, బటన్లు, జిప్పర్, లైనింగ్ మెటీరియల్, నిర్దిష్ట చర్మం, ఫర్నిచర్ ఫిట్టింగ్‌లు, ప్యాకేజింగ్ బాక్సులు వంటివాటిపై మినహాయింపులు ఇవ్వబడతాయి. ఇక రొయ్యల ఎగుమతిని ప్రోత్సహించే దిశగా రొయ్యల సాగుకు అవసరమైన కొన్ని ఉత్పాదకాలపై సుంకం తగ్గించబడుతోంది.

   సమ్మిళిత ఇంధనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ దిశగా కృషిని ప్రోత్సహించడం లక్ష్యంగా 2022 అక్టోబరు 1వ తేదీనుంచి అసమ్మిళిత ఇంధనంపై లీటరుకు రూ.2 వంతున అదనపు వ్యత్యాస ఎక్సైజ్ సుంకం విధించబడుతుంది.

2022-23 కేంద్ర బడ్జెటు లో ముఖ్యాంశాలు

          సూక్ష్మ ఆర్థిక స్థాయి లో అన్ని వర్గాల వారి సంక్షేమం పట్ల శ్రద్ధ ను తీసుకోవడం తో పాటు గా స్థూల ఆర్థిక స్థాయి లో వృద్ధి కి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టాలి అన్నది కేంద్ర బడ్జెటు యొక్క సంకల్పం గా ఉన్నది. ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న పార్లమెంటు లో 2022-23 కేంద్ర బడ్జెటు ను ప్రవేశపెట్టారు.



బడ్జెటు లో ముఖ్యమైన అంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

ఒకటో భాగం

  • భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 9.2 శాతం గా నమోదు కావచ్చని అంచనా వేయడమైంది. ఆ వృద్ధి అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థల లోకీ అధికం.

· 14 రంగాల లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం గా 60 లక్షల కొత్త ఉద్యోగాల ను కల్పించడం జరుగుతుంది.

· పిఎల్ఐ పథకం లో 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తి కి ఆస్కారం ఉంది.

· అమృత కాలం.. అంటే భారతదేశం @100 కు దారితీసే 25 సంవత్సరాల అవధి లో.. ప్రవేశిస్తున్న వేళ బడ్జెటు నాలుగు ప్రాధమ్యాల ప్రాతిపదిక న వృద్ధి కి దన్ను కల్పించనుంది. ఆ నాలుగు ప్రాధాన్యాలు ఏవేవంటే అవి :

Ø పిఎమ్ గతిశక్తి

Ø సమ్మిళిత అభివృద్ధి

Ø ఉత్పాదకత లో పెరుగుదల మరియు పెట్టుబడి, సన్ రైజ్ ఆపర్చునిటీస్, శక్తి రంగం లో మార్పు మరియు జలవాయు సంబంధి కార్యాచరణ లకు తోడు గా

Ø పెట్టుబడి కి ఆర్థిక సహాయం అనేవే.

పిఎమ్ గతిశక్తి

· పిఎమ్ గతిశక్తి కి అండదండలు అందించేటటువంటి ఏడు అంశాల లో రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మాస్ ట్రాన్స్ పోర్ట్, జల మార్గాలు, ఇంకా లాజిస్టిక్స్ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన.

పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను

· ఆర్థిక పరివర్తన తాలూకు ఏడు అంశాలు, అంతరాయానికి తావు ఉండనటువంటి సంధానానికి తోడు గా లాజిస్టిక్స్ సంబంధి సామర్ధ్యం అనేవి పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను పరిధి లో ఉంటాయి.

· జాతీయ మౌలిక సదుపాయాల సంబంధి పైప్ లైను లో ఈ ఏడు అంశాల తో ముడిపడినటువంటి ప్రాజెక్టుల ను పిఎమ్ గతిశక్తి ఫ్రేమ్ వర్క్ తో జోడించడం జరుగుతుంది.

రహదారి రవాణా

· జాతీయ రాజమార్గాల నెట్ వర్క్ ను 2022-23 లో 25,000 కిలో మీటర్ల మేరకు విస్తరించడం జరుగుతుంది.

· నేశనల్ హైవేస్ నెట్ వర్క్ విస్తరణ కు గాను 20,000 కోట్ల రూపాయల ను సమీకరించడం జరుగుతుంది.

మల్టీమాడల్ లాజిస్టిక్స్ పార్కులు

· 2022-23 లో నాలుగు ప్రదేశాల లో మల్టీ మాడల్ లాజిస్టిక్స్ పార్కుల ను ఏర్పాటు చేయడం కోసం పిపిపి పద్ధతి లో కాంట్రాక్టుల ను ఇవ్వనున్నారు.

రైలు మార్గాలు

· స్థానిక వ్యాపారాలకు మరియు సప్లయ్ చైన్ లకు తోడ్పడటం కోసం ‘ఒక స్టేశన్, ఒక ఉత్పత్తి’ ని అమలు చేయాలని సంకల్పించడం జరిగింది.

· 2022-23 లో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, ఇంకా సామర్ధ్యం పెంపుదల సంబంధిత కవచం లో భాగం గా రైల్ వే నెట్ వర్క్ కు 2000 కిలో మీటర్ లను కలపడం జరుగుతుంది.

· రాబోయే మూడు సంవత్సరాల లో 400 ఉత్కృష్ట వందే భారత్ రైళ్ళ ను నిర్మించడం జరుగుతుంది.

· వచ్చే మూడు సంవత్సరాల లో మల్టీ మాడల్ లాజిస్టిక్స్ ను దృష్టి లో పెట్టుకొని 100 పిఎమ్ గతిశక్తి కార్గో టర్మినల్ లను అభివృద్ధి పరచడం జరుగుతుంది.

పర్వతమాల

· నేశనల్ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ‘‘పర్వతమాల’’ ను పిపిపి పద్ధతి లో అమలు పరచడం జరుగుతుంది.

· 2022-23 లో 60 కిలోమీటర్ ల పొడవైన 8 రోప్ వే ప్రాజెక్టుల కు గాను కాంట్రాక్టుల ను ఇవ్వడం జరుగుతుంది.

సమ్మిళిత అభివృద్ధి

వ్యవసాయం

· గోధుమల కొనుగోలు కు, ధాన్యం కొనుగోలు కు 1.63 కోట్ల మంది రైతుల కు 2.37 లక్షల కోట్ల రూపాయల ను నేరు గా చెల్లించడం జరుగుతుంది.

· దేశవ్యాప్తం గా రసాయనాల కు తావు ఉండనటువంటి ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ దిశ లో ఆరంభ దశ లో గంగా నది ని ఆనుకొని ఉన్నటువంటి 5 కిలో మీటర్ ల విస్తీర్ణం వరకు ఉండే కారిడార్ లోని రైతుల కు చెందిన భూముల పట్ల ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతుంది.

· వ్యవసాయం మరియు రూరల్ ఎంటర్ ప్రైజ్ లతో ముడిపడిన స్టార్ట్-అప్స్ కు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించినటువంటి మిశ్రమ మూలధన నిధి కి మార్గాన్ని నాబార్డ్ సుగమం చేయనుంది.

· పంటల విలువ నిర్ధారణ, భూమి రికార్డు ల డిజిటలీకరణ, క్రిమిసంహారకాల ను వెదజల్లడం కోసం, ఇంకా పోషక పదార్థాల ను వెదజల్లడం కోసం ‘కిసాన్ డ్రోన్’ లను రంగం లోకి దించుతారు.

కేన్-బేత్ వా ప్రాజెక్టు

· కేన్-బేత్ వా లింక్ ప్రాజెక్టు అమలు కోసం 1400 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని సంకల్పించడమైంది.

కేన్-బేత్ వా లింక్ ప్రాజెక్టు ద్వారా రైతుల కు చెందిన భూముల లో 9.08 లక్షల హెక్టేర్ ల భూములకు సేద్య సంబంధి ప్రయోజనాలు లభించనున్నాయి.

ఎమ్ఎస్ఎమ్ఇ

· ఉద్యమ్ పోర్టల్ ను, ఇ-శ్రమ్ పోర్టల్ ను, ఎన్ సిఎస్ పోర్టల్ ను, ఇంకా ఎఎస్ఇఇఎమ్ పోర్టల్ ను ఒకదానితో మరొకటి ని జోడించడం జరుగుతుంది.

· 130 లక్షల ఎమ్ఎస్ఎమ్ఇ లకు అదనపు రుణాన్ని ఇమర్ జెంసీ క్రెడిట్ లింక్ డ్ గ్యారంటీ స్కీమ్ (ఇసిఎల్ జిఎస్) పరిధి లో ఇవ్వడం జరుగుతుంది.

· ఇసిఎల్ జిఎస్ ను 2023వ సంవత్సరం మార్చి నెల వరకు పొడిగించడం జరుగుతుంది.

· ఇసిఎల్ జిఎస్ లో భాగం గా గ్యారంటీ కవర్ ను 50,000 కోట్ల రూపాయల మేరకు పెంచివేసి మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు గా చేసేయడం జరుగుతుంది.

· సూక్ష్మ మరియు లఘు వ్యాపార సంస్థ ల క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (సిజిటిఎమ్ఎస్ఇ) లో భాగం గా 2 లక్షల కోట్ల రూపాయల అదనపు పరపతి ని ఇవ్వడం జరుగుతుంది.

· రేజింగ్ ఎండ్ ఏక్సెలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఇ పర్ ఫార్మెన్స్ (ఆర్ఎఎమ్ పి) కార్యక్రమాన్ని 6000 కోట్ల రూపాయల వ్యయం తో మొదలు పెట్టడం జరుగుతుంది.

నైపుణ్యాభివృద్ధి

· ఆన్ లైన్ మాధ్యమం ద్వారా పౌరుల లో నైపుణ్యాల ను పెంపొందింప చేయడం కోసం డిజిటల్ ఇకో సిస్టమ్ ఫార్ స్కిలింగ్ ఎండ్ లైవ్ లీ హుడ్ (డిఇఎస్ హెచ్-స్టాక్ ఇ-పోర్టల్) ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.

· ‘డ్రోన్ శక్తి’ కి మార్గాన్ని సుగమం చేయడం కోసం మరియు ‘డ్రోన్-ఏజ్-ఎ-సర్వీస్’ (డిఆర్ ఎఎఎస్) కోసం స్టార్ట్-అప్స్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది

విద్య

· పిఎమ్ ఇ-విద్య కు చెందిన ‘ఒక తరగతి ఒక టివి ఛానల్’ కార్యక్రమాన్ని 200 టివి చానల్స్ లో ప్రసారం చేయడం జరుగుతుంది.

· కీలకమైన ఆలోచనల తాలూకు నైపుణ్యానికి, సిమ్యులేటెడ్ లర్నింగ్ లకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం వర్చువల్ లేబ్స్ ను మరియు నైపుణ్య సంబంధి ఇ-లేబ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

· డిజిటల్ ఉపాధ్యాయుల మాధ్యమం ద్వారా విద్య బోధన కై అధిక నాణ్యత కలిగినటువంటి ఇ-కంటెంట్ ను అభివృద్ధి పరచడం జరుగుతుంది.

· వ్యక్తిగత పద్ధతి న విద్యార్జన కై ప్రపంచ స్థాయి విద్య ను అందించడం కోసం డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఆరోగ్యం

· జాతీయ డిజిటల్ హెల్థ్ ఇకోసిస్టమ్ కోసం ఒక ఓపెన్ ప్లాట్ ఫార్మ్ ను ఆరంభించడం జరుగుతుంది.

· నాణ్యత తో కూడినటువంటి మానసిక ఆరోగ్య సంబంధి సలహా సంప్రదింపుల తో పాటు గా సంరక్షణ సంబంధి సేవల ను అందించడం కోసం ‘నేశనల్ టెలీ మెంటల్ హెల్థ్ ప్రోగ్రాము’ ను ప్రారంభించడం జరుగుతుంది.

· 23 టెలీ మెంటల్ హెల్థ్ సెంటర్స్ తో కూడినటువంటి ఒక నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నోడల్ సెంటర్ గా నిమ్ హాన్స్ (ఎన్ఐఎమ్ హెచ్ఎఎన్ఎస్) వ్యవహరిస్తుంది. దీనికి అవసరమైన సాంకేతిక విజ్ఞాన సంబంధి సహకారాన్ని బెంగళూరు లోని ఇంటర్ నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ-బెంగళూరు (ఐఐఐటిబి) అందిస్తుంది.

సక్షమ్ ఆంగన్ వాడీ

· మిశన్ శక్తి, మిశన్ వాత్సల్య, సక్షమ్ ఆంగన్ వాడీ, ఇంకా పోషణ్ 2.0 మాధ్యమాల ద్వారా మహిళల కు మరియు బాలల కు ఏకీకృత లాభాల ను అందించడం జరుగుతంది.

· రెండు లక్షల ఆంగన్ వాడీల స్థాయి ని సక్షమ్ ఆంగన్ వాడీ ల స్థాయి కి పెంచడం జరుగుతుంది.

 

హర్ ఘర్, నల్ సే జల్

· ‘హర్ ఘర్, నల్ సే జల్’ (ఇంటింటి కి నల్లా నీరు)లో భాగం గా 2022-23 సంవత్సరం లో 3.8 కోట్ల కుటుంబాల ను చేర్చడం కోసం 60,000 కోట్ల రూపాయల ను కేటాయించడం జరిగింది.

అందరి కోసం గృహ నిర్మాణం

· ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా 2022-23 లో 80 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం 48,000 కోట్ల రూపాయల ను కేటాయించడమైంది.

ఈశాన్య ప్రాంతాల కోసం ప్రధాన మంత్రి అభివృద్ధి కార్యక్రమం (పిఎమ్-డిఇవిఐఎన్ఇ)

· దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన మరియు సామాజిక అభివృద్ధి పథకాల అమలు కు ఒక కొత్త పథకాన్ని పిఎమ్-డిఇవిఐఎన్ఇ పేరుతో ప్రవేశపెట్టడమైంది.

· ఈ పథకం లో భాగం గా యువజనుల ను మరియు మహిళల ను జీవనోపాధి కార్యక్రమాల కు సన్నద్ధం చేయడం కోసం ఆరంభ దశ లో 1500 కోట్ల రూపాయల కేటాయింపు.

వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాము

· అక్కడక్కడ నివసించే జన సంఖ్య, పరిమిత సంధానం మరియు పరిమిత మౌలిక సదుపాయాల తో కూడినటువంటి సరిహద్దు ప్రాంత గ్రామాల ను అభివృద్ధి పరచడం కోసం ఈ ‘వైబ్రంట్ విలేజెస్’ ప్రోగ్రాము ను సంకల్పించడమైంది.

బ్యాంకింగ్

· వంద శాతం 1.5 లక్ష ల తపాలా కార్యాలయాల ను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సిబిఎస్) లో చేర్చడం జరుగుతుంది.

· షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకు లు 75 జిల్లాల లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ (డిబియు స్)ను ఏర్పాటు చేస్తాయి

 

ఇ-పాస్ పోర్ట్

· ఇంబెడెడ్ చిప్ ఎండ్ ఫ్యూచరిస్టిక్స్ టెక్నాలజీ తో కూడిన ఇ-పాస్ పోర్ట్ ల జారీ ని ఆరంభించడం జరుగుతుంది.

పట్టణ ప్రణాళిక

· బిల్డింగ్ బైలాస్ ల, టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ (టిపిఎస్) మరియు ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్ మెంట్ (టిఒడి) ల ఆధునికీకరణ ను అమలు పరచడం జరుగుతుంది.

· పట్టణ ప్రాంతాల లో పెద్ద ఎత్తు న చార్జింగ్ స్టేశన్ లను నెలకొల్పడం కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలిసీ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది.

భూమి రికార్డుల నిర్వహణ

· భూమి రికార్డుల ను ఐటి మద్దతు తో నిర్వహించడం కోసం యూనీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేశన్ నంబరు ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.

ఏక్సెలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్

· కంపెనీల ను వేగం గా మూసివేయడం కోసం సెంటర్ ఫార్ ప్రోసెసింగ్ ఏక్సెలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ ( సి-పిఎసిఇ) ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

ఎవిజిసి ప్రమోశన్ టాస్క్ ఫోర్స్

· ఈ రంగం యొక్క సామర్ధ్యాన్ని తెలుసుకోవడం కోసం ఒక ఏనిమేశన్, విజువల్ ఇఫెక్ట్ స్, గేమింగ్ ఎండ్ కామిక్ (ఎవిజిసి) ప్రోత్సాహక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

టెలికం రంగం

· ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం పథకం లో భాగం గా 5జి కోసం ఒక పటిష్టమైన ఇకోసిస్టమ్ ను నెలకొల్పడానికి గాను డిజైన్ ప్రధానమైనటువంటి తయారీ కి సంబంధించిన ఒక పథకాన్ని తీసుకు రావడం జరుగుతుంది.

ఎగుమతుల కు ప్రోత్సాహం

· ‘ఎంటర్ ప్రైజ్ ఇంకా సర్వీస్ హబ్ ల అభివృద్ధి’ లో రాష్ట్రాల ను భాస్వాములను చేయడాని కి వీలు గా ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాని కి బదులు గా ఒక కొత్త విధానాన్ని తీసుకు రావడం జరుగుతుంది.

రక్షణ రంగం లో స్వయం సమృద్ధి:

· 2022-23 లో దేశీయ పరిశ్రమ కోసం మూలధన సేకరణ ను బడ్జెటు లో 68 శాతం గా నిర్ధారించడమైంది. 2021-22 లో కేటాయించిన 58 శాతం తో పోల్చి చూసినప్పుడు ఇది అధికం గా ఉంది.

· 25 శాతం రక్షణ పరిశోధన సంబంధి బడ్జెటు తో సహా పరిశ్రమ, స్టార్ట్-అప్స్ మరియు విద్యల కోసం ఉద్దేశించి రక్షణ సంబంధిత పరిశోధన ను, అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) ని తెరవడం జరుగుతుంది.

· పరీక్ష లు జరపడం మరియు ధ్రువపత్రం సంబంధి అవసరాల ను పూర్తి చేయడం కోసం స్వతంత్ర నోడల్ అంబ్రెలా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

సన్ రైజ్ ఆపర్చునిటీస్

· కృత్రిమ మేధస్సు (ఎఐ), జియో-స్పేశల్ సిస్టమ్స్, ఇంకా డ్రోన్ లు, సెమీ కండక్టర్ మరియు తత్సంబంధిత ఇకో-సిస్టమ్, అంతరిక్ష సంబంధి ఆర్థిక వ్యవస్థ, జీనోమిక్స్ మరియు ఫార్మాస్యుటికల్స్, హరిత శక్తి, ఇంకా స్వచ్ఛమైన మొబిలిటీ సిస్టమ్స్ ల వంటి సన్ రైజ్ ఆపర్చునిటీస్ లో పరిశోధన కు మరియు అభివృద్ధి కి ప్రభుత్వ తోడ్పాటు ను అందజేయడం జరుగుతుంది.

ఎనర్జీ ట్రాన్సిశన్ ఎండ్ క్లయిమేట్ యాక్షన్:

· 2030 వ సంవత్సరానికల్లా 280 గీగా వాట్ స్థాపిత సౌర విద్యుత్తు లక్ష్యాన్ని సాధించడం కోసం ఉన్నత సామర్ధ్యం కలిగి ఉండే సోలర్ మాడ్యూల్స్ ను తయారు చేయడం కోసం ఉత్పత్తి తో ముడిపెట్టినటువంటి ప్రోత్సాహకం రూపం లో 19,500 కోట్ల రూపాయల ను అదనం గా కేటాయించడమైంది.

· ఉష్ణ ఆధారిత విద్యుత్తు ప్లాంటుల లో అయిదు శాతం నుంచి ఏడు శాతం బయోమాస్ పెలెట్స్ ను మండించడం జరుగుతుంది.

· ఏటా 38 ఎమ్ఎమ్ టి స్థాయి లో కార్బన్ డైఆక్సైడ్ ను ఆదా చేయాలనేది లక్ష్యం గా ఉంది;

· దీనివల్ల రైతుల కు అదనపు ఆదాయం తో పాటు గా స్థానికుల కు ఉపాధి లభించేందుకు అవకాశం ఉంది;

· అంతేకాకుండా, పొలాల్లో గడ్డి దుబ్బులను కాల్చడాన్ని అడ్డుకోవడం లో సైతం తోడ్పాటు లభిస్తుంది.

· కోల్ గ్యాసిఫికేశన్ కు మరియు పరిశ్రమ కోసం బొగ్గు ను రసాయానాల రూపంలోకి మార్పు చెందింప చేసేందుకు గాను నాలుగు పైలట్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

· అగ్రో-ఫారెస్టరీ ని చేపట్టేటటువంటి షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల కు చెందిన రైతుల కు ఆర్థిక పరమైన సహాయాన్ని అందించడం జరుగుతుంది.

పబ్లిక్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్:

· 2022-23 లో ప్రైవేటు పెట్టుబడి కి మరియు డిమాండు కు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు గాను పబ్లిక్ ఇన్వెస్ట్ మెంటును కొనసాగించడం జరుగుతుంది.

· 2022-23 సంవత్సరం లో మూలధన సంబంధి వ్యయం కోసం చేసే ఖర్చును అమాంతం 35.4 శాతం మేరకు పెంచి వేసి 7.50 లక్షల కోట్ల రూపాయల కు చేర్చడమైంది. ఇది ప్రస్తుతం సంవత్సరం లో 5.54 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది.

· 2022-23 లో చేసే వ్యయం జిడిపి లో 2.9 శాతం గా ఉంటుంది.

· 2022-23 లో కేంద్ర ప్రభుత్వం యొక్క మూలధన వ్యయం దాదాపు గా 10.68 లక్షల కోట్ల రూపాయలు గా ఉండవచ్చని అంచనా వేయడమైంది. ఇది జిడిపి లో ఇంచుమించు 4.1 శాతం మేరకు లెక్క కు వస్తుంది.

జిఐఎఫ్ టి-ఐఎఫ్ఎస్ సి

· జిఐఎఫ్ టి సిటీ లో ప్రపంచ శ్రేణి విదేశీ విశ్వ విద్యాలయాల ను మరియు ప్రపంచ శ్రేణి సంస్థల ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ని ఇవ్వడం జరుగుతుంది.

· అంతర్జాతీయ ధర్మశాస్త్ర రంగం పరిధి లో వివాదాల ను సకాలం లో పరిష్కరించడం కోసం ఒక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

వనరుల సమీకరణ

· డేటా సెంటర్స్ కు మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కు మౌలిక సదుపాయాల సంబంధిత హోదా ను ఇవ్వడం జరుగుతుంది.

· వెంచర్ కేపిటల్ ఎండ్ ప్రైవేట్ ఎక్విటీ లు గడచిన సంవత్సరం లో 5.5 లక్షల కోట్ల రూపాయల కు మించిన పెట్టుబడిని పెట్టాయి. అంతేకాక అన్నిటి కంటే పెద్దదైన ఒక స్టార్ట్-అప్ మరియు గ్రోత్ ఇకో-సిస్టమ్ కు మార్గాన్ని కూడా సుగమం చేసింది. ఈ విధమైన పెట్టుబడి ని మరింత గా పెంచేందుకు చొరవల ను తీసుకోవడం జరుగుతున్నది.

· సన్ రైజ్ సెక్టర్ కోసం బ్లెండెడ్ ఫండ్స్ ను ప్రోత్సహించడం జరుగుంది.

· గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధుల ను సమీకరించడం కోసం సావరిన్ గ్రీన్ బాండ్ లను జారీ చేయడం జరుగుతుంది.

డిజిటల్ రూపీ

· భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) ద్వారా డిజిటల్ రూపాయి ని 2022-23 లో మొదలు పెట్టడమైంది.

రాష్ట్రాల కు మరింత గా ఫిస్కల్ స్పేస్ ను కల్పించడం

· ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాల కు ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన పథకం’ కోసం చేసే వ్యయాన్ని మరింత పెంచడం జరిగింది:

Ø ఈ విధమైన వ్యయం బడ్జెటు అంచనాల లో 10,000 కోట్ల రూపాయలు గా ఉండింది. దీనిని ప్రస్తుత సంవత్సరం కోసం సవరించిన అంచనాల లో 15,000 కోట్ల రూపాయలు చేసేయడమైంది.

· ఆర్థిక వ్యవస్థ లో సమగ్రమైన ప్రోత్సాహకాన్ని ఇవ్వడం కోసం రాష్ట్రాల కు సాయపడటానికి గాను 2022-23 సంవత్సరం లో ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు కేటాయించడమైంది. అంతేకాక యాభై సంవత్సరాల వడ్డీ ఉండనటువంటి రుణాల ను ఇవ్వడం జరుగుతుంది. ఇవి సాధారణ రుణాలకు అదనం గా ఉంటాయి.

  • 2022-23 లో రాష్ట్రాల కు జిఎస్ డిపి లో 4 శాతం మేరకు ద్రవ్య లోటు కు అనుమతించడం జరుగుతుంది. దీనిలో 0.5 శాతం విద్యుత్తు రంగ సంస్కరణల కు గాను ఉపయోగించ డం జరుగుతుంది.

ఫిస్కల్ మేనేజ్ మెంట్

· బడ్జెటు అంచనా లు 2021-22: 34.83 లక్షల కోట్ల రూపాయలు

· సవరించిన అంచనాలు 2021-22: 37.70 లక్షల కోట్ల రూపాయలు

· 2022-23 వ సంవత్సరం లో మొత్తం వ్యయం 39.45 లక్షల కోట్ల రూపాయలుగా ఉండవచ్చని అంచనా వేయడమైంది.

· 2022-23 వ సంవత్సరం లో అప్పులు కాకుండా మొత్తం వసూళ్ళు: 22.84 లక్షల కోట్ల రూపాయలు గా ఉండవచ్చు

· ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ద్రవ్య లోటు: జిడిపి లో 6.9 శాతం (బడ్జెటు అంచనాల లో పేర్కొన్న 6.8 శాతం తో పోల్చినప్పుడు)

· 2022-23 వ సంవత్సరం లో ద్రవ్య లోటు జిడిపి లో 6.4 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేయడమైంది.

పార్ట్-బి

ప్రత్యక్ష పన్నులు

సుస్థిరమైన,  అంచనా వేయదగిన పన్ను వ్యవస్థ:

· విశ్వసనీయమైన పన్ను వ్యవస్థ ఏర్పాటుకు సంకల్పం.

· పన్ను వ్యవస్థను మరింత సరళీకరించి, వివాదాలను తగ్గించడం.

కొత్తగా ‘అప్డేటెడ్ రిటర్ను’ పద్ధతిని ప్రవేశపెట్టడం

· అదనపు పన్ను చెల్లింపుపై సవరించిన (అప్డేటెడ్) రిటర్ను విధానం.

· మొదట్లో ప్రస్తావించని ఆదాయం వివరాలను పన్ను చెల్లింపుదార్లు ప్రకటించేందుకు,  వివరాల సవరణకు ఇది అవకాశం కల్పిస్తుంది.

· సంబంధిత పన్ను మధింపు సంవత్సరం ముగిసినప్పటి నుంచి రెండేళ్లలోగా ఈ సవరణలను దాఖలు చేయవచ్చు. 

సహకార సంఘాలు

· సహకార సంఘాలు చెల్లించే కనీస ప్రత్యామ్నాయ పన్ను రేటు 18.5శాతంనుంచి 15శాతానికి తగ్గింపు.

· సహకార సంఘాలకు, కంపెనీలకు మధ్య సమదృష్టితో వ్యవహరించే సంకల్పం.

· మొత్తం ఆదాయం రూ. కోటినుంచి రూ. 10కోట్ల వరకూ ఉండే సహకార సంఘాలపై సర్చార్జీ 12శాతంనుంచి 7శాతానికి తగ్గింపు.

వికలాంగులకు పన్నులో ఉపశమనం

· తల్లిదండ్రులు/సంరక్షలపై జీవితకాలం ఆధాపడి ఉండే విభిన్న సామర్థ్యాలు కలిగిన వారికి బీమా సొమ్మునుంచి వార్షికంగా సొమ్ము చెల్లించడం., ఒకే మొత్తంగా చెల్లింపు జరపడం. అంటే,..తల్లిదండ్రులు/సంరక్షులకు 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటినుంచి చెల్లింపు అమలు జరుపుతారు.

జాతీయ పెన్షన్ పథకం (ఎన్.పి.ఎస్.) వాటా చెల్లింపులో సమానత్వం

· రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్.పి.ఎస్. ఖాతాకు చెల్లించే యాజమాన్యపు వాటాపై పన్ను కోత పరిమితిని 10శాతంనుంచి 14శాతానికి పెంచారు.

· కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనూ పరిగణించడం.

· సామాజిక భద్రతా ప్రయోజనాలను పెంచడంలో ఇది దోహదపడుతుంది.

స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు

· ప్రోత్సాహక పథకాల ప్రయోజనాలకు అర్హత కలిగిన స్టార్టప్ కంపెనీలు వినియోగించుకోవడానికి ఇన్.కార్పొరేషన్ వ్యవధిని ఏడాదిపాటు, అంటే 2023 మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు.

  • ఇన్.కార్పొరేషన్ వ్యవధి ఇదివరకు 2022 మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉండేది.

 

రాయితీ పన్ను వ్యవస్థ పరిధిలో ప్రోత్సాహకాలు

· ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 115 బి.ఎ.బి. కింద వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిని ప్రారంభించేందుకు నిర్దేశించిన ఆఖరు తేదీని ఏడాదిపాటు పొడిగించారు. అంటే, 2023 మార్చి 31నుంచి 2024వ సంవత్సరం మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు.

 

వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపునకు పథకం

· వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపునకు ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. · ఎలాంటి వర్చువల్ డిజిటల్ ఆస్తినైనా బదిలీ చేసినపుడు లభించే ఆదాయంపై  పన్ను రేటును 30 శాతంగా నిర్ణయించారు.

· స్వాధీనం చేసుకునే వ్యయం మినహాయించి అలాంటి ఆదాయాన్ని లెక్కించినపుడు జరిగే ఖర్చుపై, లేదా అలవెన్సుపై ఎలాంటి పన్ను కోతా ఉండబోదు.

· వర్చువల్ ఆస్తి బదిలీలో నష్టం సంభవించిన పక్షంలో దాన్ని ఎలాంటి ఇతర ఆదాయంతో సర్దుబాటు చేయడానికి వీలుకాదు.

· బదిలీ లావాదేవీ వివరాలు తెలుసుకునేందుకు,..వర్చువల్ డిజిటల్ ఆస్తి బదిలీకి సంబంధించి జరిపిన చెల్లింపుపై 1శాతం చొప్పున టి.డి.ఎస్. విధించవలసి ఉంటుంది. 

· కానుక రూపంలో జరిపిన వర్చువల్ డిజిటల్ ఆస్తిపై కూడా పన్ను విధించవలసి ఉంటుంది.

వివాదాల పరిష్కార నిర్వహణ

· ఏదైనా వివాదం తలెత్తిన కేసు,.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులోనో పెండింగ్.లో ఉన్న కేసును పోలి ఉన్న పక్షంలో సంబంధిత శాఖ అప్పీలును దాఖలు చేసే ప్రక్రియను వాయిదా వేయవచ్చు. కోర్టులో వివాదం పరిష్కారమయ్యేంత వరకూ అప్పీలు దాఖలును వాయిదా వేయవచ్చు.

· పన్ను చెల్లింపు దార్లకు, ప్రభుత్వ శాఖకు మధ్య పదే పదే తలెత్తే వివాదాలను, తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.

ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐ.ఎఫ్.ఎస్.సి.)కు పన్ను రాయితీలు

· కొన్ని షరతులకు లోబడి ఈ దిగువన పేర్కొన్న ఆదాయాలపై పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Ø ప్రవాస భారతీయుడు ఆఫ్ షోర్ డెరివేటివ్ సదుపాయాల ద్వారా సెక్యూరిటీల్లో పెట్టుబడితో సాధించిన ఆదాయం.

Ø విదేశీ బ్యాంకింగ్ యూనిట్ ఓవర్ ది కౌంటర్ ద్వారా జారీ చేసిన డెరివేటివ్ సదుపాయాలతో వచ్చిన ఆదాయం.

Ø ఏదైనా నౌక లీజుకు ఇచ్చిన సందర్భంలో రాయల్టీ, వడ్డీపై అందివచ్చే ఆదాయం.

Ø ఐ.ఎఫ్.ఎస్.సి.లోని పోర్ట్ ఫోలియో నిర్వహణా సేవలనుంచి అందిన ఆదాయం.

సర్చార్జీ హేతుబద్ధీకరణ

  • ఏదైనా కాంట్రాక్ట్ అమలుకోసంఏర్పడిన వ్యక్తుల కూటమి లేదా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ( ఎ.ఒ.పి.ల)పై విధించే సర్చార్జీని 15శాతం పరిమితం చేశారు.

· విడి కంపెనీలు, ఎ.ఒ.పి.ల మధ్య. సర్చార్జీలో అసమానతలను తగ్గించేందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.

· ఎలాంటి ఆస్తుల బదిలీ ద్వారా అయినా లభేంచే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై సర్చార్జీని కూడా 15శాతానికి పరిమితం చేశారు.

· స్టార్టప్ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ చర్యలన్నీ తీసుకున్నారు.

ఆరోగ్య, విద్యా సుంకం

· ఆదాయంపై విధించే ఏదైనా సర్చార్జీని లేదా సుంకాన్ని వాణిజ్య వ్యయంగా పరిగణించేందుకు అనుమతించరు.

పన్ను ఎగవేత నిరోధకం

· ఏవైనా సోదాలు, సర్వేలు జరిపిన సందర్భంగా పసిగట్టిన రహస్య ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి నష్టంతోనూ సర్దుబాటుకు అనుమతించరు.

మూలంనుంచి పన్ను కోత (టి.డి.ఎస్.) నిబంధనలు

· వాణిజ్య ప్రోత్సాహక వ్యూహంలో భాగంగా వివిధ ఏజెంట్లకు బదిలీ అయిన ప్రయోజనాలపై విధింపు.

· పెన్షన్.గా అందించే ప్రయోజనాలపై పన్ను కోత విధింపు. ఒక ఆర్థిక సంవత్సరంలో అందే సదరు ప్రయోజనాల సగటు విలువ రూ. 20,000 మించిన పక్షంలో టి.డి.ఎస్. విధింపు.

పరోక్ష పన్నులు

వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) గణనీయమైన ప్రగతి

· వైరస్ మహమ్మారి సవాళ్లు ఎదురైనా జి.ఎస్.టి. ఆదాయం మాత్రం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.– జి.ఎస్.టి. ప్రగతి నేపథ్యంలో పన్ను చెల్లింపు దార్లు అభినందనీయులయ్యారు.

ప్రత్యేక ఆర్థిక మండలాలు (ఎస్.ఇ.జెడ్.లు)

· ఎస్.ఇ.జెడ్.ల సుంకాల పరిపాలనా నిర్వహణ వ్యవస్థ పూర్తిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారితం కాబోతోంది. కస్టమ్స్ నేషనల్ పోర్టల్ వ్యవస్థను అమలుచేసే పనులు 2022 సెప్టెంబరు 30లోగా మొదలవుతాయి.

కస్టమ్స్ సంస్కరణలు, సుంకం రేట్ల మార్పులు

· కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మనుషుల భౌతిక ప్రమేయం లేని కస్టమ్స్ సుంకాల వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కస్టమ్స్ వ్యవస్థ ఎంతో నైపుణ్యంతో పనిచేసింది. మరెంతో క్రియాశీలతను ప్రదర్శించింది.

ప్రాజెక్టు దిగుమతులు, ఉత్పాదక యాంత్రిక ఉపకరణాలు

· ఉత్పాదక యాంత్రిక ఉపకరణాలు, ప్రాజెక్టు దిగుమతులపై అమలుచేసే రాయితీ రేట్ల వ్యవస్థను క్రమానుగతంగా తొలగించడం; స్వదేశీ రంగానికి సానుకూలంగా, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా ఒక స్వల్పంగా 7.5శాతం పన్నును వర్తింపజేయడం.

· అయితే, దేశంలో తయారు కాని కొన్ని అధునాతన యాంత్రిక ఉపకరణాలపై అమలులో ఉన్న కొన్ని మినహాయింపులు మాత్రం కొనసాగుతాయి.

· ఉత్పాదక యాంత్రిక ఉపకరణాల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా స్పెషలైజ్డ్ కాస్టింగ్స్, బాల్ స్క్రూ, లీనియర్ మోషన్ గైడ్ వంటి ఉపకరణాలపై కొన్ని పన్ను మినహాయింపులను ప్రవేశపెట్టారు.

కస్టమ్స్ సుంకాల మినహాయింపులు, పన్ను సరళీకరణలపై సమీక్ష

· మినహాయింపు పరిధిలో ఉన్న 350కిపైగా అంశాలను క్రమంగా తొలగించివేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. కొన్ని వ్యవసాయ ఉత్పాదనలు, రసాయనాలు, వస్త్రాలు,.. స్వదేశీ ఉత్పాదనా సామర్థ్యం కలిగిన వైద్య పరికరాలు, ఔషధాలు, మందులు వంటి వాటిపై మినహాయింపులను తొలగించాలని సంకల్పించారు.

· రసాయనాలు, జవుళి ఉత్పాదనలు, లోహాలు వంటి రంగాలకు సంబంధించిన సుంకాల రేట్లను, పన్ను వ్యవస్థను సరళీకరించి, తద్వారా వివాదాలను తగ్గించనున్నారు;  భారతదేశంలో తయారవుతున్న, లేదా తయారయ్యేందుకు అవకాశం ఉన్న వస్తువులపై మినహాయింపులను తొలగించాలని, ఉత్పాదనలకు అవసరమైన ముడి సరకులపై సుంకాల్లో రాయితీలు ఇన్వాలని ప్రతిపాదించారు. – ‘మేక్ ఇన్ ఇండియా’,  ‘ఆత్మనిర్భర భారత్’ స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకోనున్నారు.

 

వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రతిపాదనలు

ఎలక్ట్రానిక్స్

  • మనం ధరించే ఎలక్ట్రానిక్ వస్తువులు, వినికిడి పరికరాలు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్లు వంటివి స్వదేశీయంగా తయారయ్యేలా తగిన వాతావరణం కల్పించేందుకు గ్రేడెడ్ పద్ధతిలో కస్టమ్స్ సుంకం రేట్లను క్రమానుగతం చేయబోతున్నారు.

 

· మొబైల్ ఫోన్ చార్జర్ ట్రాన్స్.ఫార్మర్ల  విడిభాగాలు, మొబైల్ కెమెరా లెన్స్, మాడ్యూల్ కెమెరా లెన్స్ తదితర వస్తువులకు సుంకంలో రాయితీ కల్పించనున్నారు. – హై గ్రోత్ ఎలక్ట్రానిక్ వస్తువులను స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకోనున్నారు.

రత్నాలు, ఆభరణాలు

· కోతకోసిన, మెరుగుపెట్టిన వజ్రాలు, విలువై రాళ్లపై కస్టమ్స్ సుంకాన్ని 5శాతానికి తగ్గించారు;  సింప్లీ సాన్ వజ్రాలపై కస్టమ్స్ సుంకం తీసివేశారు. – దేశంలో విలువైన రాళ్ల, వజ్రాల ఆభరణాల రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

  • ఇందుకు సంబంధించి సరళీకరించిన నియంత్రణా వ్యవస్థను ఈ ఏడాది జూన్ నెలలోగా అమలు చేస్తారు – ఈ కామర్స్ వేదికగా ఆభరణాల ఎగుమతికి సానుకూలంగా ఈ చర్యలు చేపట్టారు

 

· ఇమిటేషన్ ఆభరణాల దిగుమతిపై కిలోగ్రాముకు కనీసం రూ. 400 చొప్పున కస్టమ్స్ సుంకాన్ని చెల్లింవలసి ఉంటుంది. అంతగా విలువలేని ఇమిటేషన్ ఆభరణాల దిగుమతికి ప్రోత్సాహం తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

రసాయనాలు

· మెథనాల్, అసిటిక్ ఆమ్లం, పెట్రోలియం శుద్ధిలో వాడే ఫీడ్ స్టాక్స్ వంటి కీలక రసాయనాలపై కస్టమ్స్ సుంకాన్ని తగిస్తున్నారు; స్వదేశీ తయారీ సామర్థ్యం ఉన్న సోడియం సైనైడ్.పై సుంకాన్ని పెంచుతున్నారు.- స్వదేశీ విలువల జోడింపు ప్రక్రియను పెంచేందుకు ఈ చర్య దోహదపడతుంది. 

సూక్మ చిన్న మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు)

· దిగుమతి చేసుకునే గొడుగులపై కస్టమ్స్ సుంకాన్ని 20శాతానికి పెంచనున్నారు. గొడుగుల తయారీలో వాడే విడిభాగాలపై మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నారు.

· భారతదేశంలో తయారయ్యే వ్యవసాయ రంగ పరికరాలు, ఉపకరణాలపై మినహాయింపులను హేతుబద్ధం చేయబోతున్నారు.

· ఉక్కు రద్దీ సామగ్రి దిగుమతికి గత ఏడాది అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపును మరో ఏడాదిపాటు పొడిగించారు. ఎం.ఎస్.ఎం.ఇ. ద్వితీయ శ్రేణి ఉత్పత్తి దారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

· స్టీల్, కోటింగ్ ఫ్లాట్ ఉత్పాదనలు, అల్లోయ్ స్టీల్, హైస్పీడ్ స్టీల్.పై విధించిన యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ సుంకాన్ని (సి.వి.డి.ని) రద్దు చేయబోతున్నారు. లోహాల ధరలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నారు.  

ఎగుమతులు

  • ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా అలంకరణ ప్రక్రియ, ట్రిమ్మింగ్, గుండీలు, జిప్పర్లు, లైనింగ్ వస్త్ర సామగ్రి, ప్రత్యేకమైన తోలు, ఫర్నిచర్ ఫిట్టింగ్స్, ప్యాకేజీ బాక్సులు వంటి వాటిపై మినహాయింపులు ఇవ్వబోతున్నారు.

 

  • రొయ్యల సాగుకు అవసరమైన కొన్ని ఉపకరణాలపై సుంకాన్ని తగ్గిస్తున్నారు. రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకుంటున్నారు.

 

ఇంధన మిశ్రమ ప్రక్రియను ప్రోత్సహించేందుకు చర్యలు

· మిశ్రమం చేయని ఇంధనంపై అదనంగా లీటర్.కు రూ. 2 చొప్పున ఎక్సయిజ్ సుంకం విధిస్తారు. 2022 అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఈ సుంకం విధింపు అమలులోకి వస్తుంది. ఇంధన మిశ్రమ ప్రక్రియను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారు.

Related Posts Plugin for WordPress, Blogger...