2022-23 కేంద్ర బడ్జెటు లో ముఖ్యాంశాలు

          సూక్ష్మ ఆర్థిక స్థాయి లో అన్ని వర్గాల వారి సంక్షేమం పట్ల శ్రద్ధ ను తీసుకోవడం తో పాటు గా స్థూల ఆర్థిక స్థాయి లో వృద్ధి కి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టాలి అన్నది కేంద్ర బడ్జెటు యొక్క సంకల్పం గా ఉన్నది. ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారమణ్ ఈ రోజు న పార్లమెంటు లో 2022-23 కేంద్ర బడ్జెటు ను ప్రవేశపెట్టారు.



బడ్జెటు లో ముఖ్యమైన అంశాలు ఈ కింది విధం గా ఉన్నాయి:

ఒకటో భాగం

  • భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటు 9.2 శాతం గా నమోదు కావచ్చని అంచనా వేయడమైంది. ఆ వృద్ధి అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థల లోకీ అధికం.

· 14 రంగాల లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం గా 60 లక్షల కొత్త ఉద్యోగాల ను కల్పించడం జరుగుతుంది.

· పిఎల్ఐ పథకం లో 30 లక్షల కోట్ల రూపాయల అదనపు ఉత్పత్తి కి ఆస్కారం ఉంది.

· అమృత కాలం.. అంటే భారతదేశం @100 కు దారితీసే 25 సంవత్సరాల అవధి లో.. ప్రవేశిస్తున్న వేళ బడ్జెటు నాలుగు ప్రాధమ్యాల ప్రాతిపదిక న వృద్ధి కి దన్ను కల్పించనుంది. ఆ నాలుగు ప్రాధాన్యాలు ఏవేవంటే అవి :

Ø పిఎమ్ గతిశక్తి

Ø సమ్మిళిత అభివృద్ధి

Ø ఉత్పాదకత లో పెరుగుదల మరియు పెట్టుబడి, సన్ రైజ్ ఆపర్చునిటీస్, శక్తి రంగం లో మార్పు మరియు జలవాయు సంబంధి కార్యాచరణ లకు తోడు గా

Ø పెట్టుబడి కి ఆర్థిక సహాయం అనేవే.

పిఎమ్ గతిశక్తి

· పిఎమ్ గతిశక్తి కి అండదండలు అందించేటటువంటి ఏడు అంశాల లో రహదారులు, రైలు మార్గాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, మాస్ ట్రాన్స్ పోర్ట్, జల మార్గాలు, ఇంకా లాజిస్టిక్స్ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన.

పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను

· ఆర్థిక పరివర్తన తాలూకు ఏడు అంశాలు, అంతరాయానికి తావు ఉండనటువంటి సంధానానికి తోడు గా లాజిస్టిక్స్ సంబంధి సామర్ధ్యం అనేవి పిఎమ్ గతిశక్తి నేశనల్ మాస్టర్ ప్లాను పరిధి లో ఉంటాయి.

· జాతీయ మౌలిక సదుపాయాల సంబంధి పైప్ లైను లో ఈ ఏడు అంశాల తో ముడిపడినటువంటి ప్రాజెక్టుల ను పిఎమ్ గతిశక్తి ఫ్రేమ్ వర్క్ తో జోడించడం జరుగుతుంది.

రహదారి రవాణా

· జాతీయ రాజమార్గాల నెట్ వర్క్ ను 2022-23 లో 25,000 కిలో మీటర్ల మేరకు విస్తరించడం జరుగుతుంది.

· నేశనల్ హైవేస్ నెట్ వర్క్ విస్తరణ కు గాను 20,000 కోట్ల రూపాయల ను సమీకరించడం జరుగుతుంది.

మల్టీమాడల్ లాజిస్టిక్స్ పార్కులు

· 2022-23 లో నాలుగు ప్రదేశాల లో మల్టీ మాడల్ లాజిస్టిక్స్ పార్కుల ను ఏర్పాటు చేయడం కోసం పిపిపి పద్ధతి లో కాంట్రాక్టుల ను ఇవ్వనున్నారు.

రైలు మార్గాలు

· స్థానిక వ్యాపారాలకు మరియు సప్లయ్ చైన్ లకు తోడ్పడటం కోసం ‘ఒక స్టేశన్, ఒక ఉత్పత్తి’ ని అమలు చేయాలని సంకల్పించడం జరిగింది.

· 2022-23 లో ప్రపంచ స్థాయి సాంకేతిక పరిజ్ఞానం, ఇంకా సామర్ధ్యం పెంపుదల సంబంధిత కవచం లో భాగం గా రైల్ వే నెట్ వర్క్ కు 2000 కిలో మీటర్ లను కలపడం జరుగుతుంది.

· రాబోయే మూడు సంవత్సరాల లో 400 ఉత్కృష్ట వందే భారత్ రైళ్ళ ను నిర్మించడం జరుగుతుంది.

· వచ్చే మూడు సంవత్సరాల లో మల్టీ మాడల్ లాజిస్టిక్స్ ను దృష్టి లో పెట్టుకొని 100 పిఎమ్ గతిశక్తి కార్గో టర్మినల్ లను అభివృద్ధి పరచడం జరుగుతుంది.

పర్వతమాల

· నేశనల్ రోప్ వేస్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ ‘‘పర్వతమాల’’ ను పిపిపి పద్ధతి లో అమలు పరచడం జరుగుతుంది.

· 2022-23 లో 60 కిలోమీటర్ ల పొడవైన 8 రోప్ వే ప్రాజెక్టుల కు గాను కాంట్రాక్టుల ను ఇవ్వడం జరుగుతుంది.

సమ్మిళిత అభివృద్ధి

వ్యవసాయం

· గోధుమల కొనుగోలు కు, ధాన్యం కొనుగోలు కు 1.63 కోట్ల మంది రైతుల కు 2.37 లక్షల కోట్ల రూపాయల ను నేరు గా చెల్లించడం జరుగుతుంది.

· దేశవ్యాప్తం గా రసాయనాల కు తావు ఉండనటువంటి ప్రాకృతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ దిశ లో ఆరంభ దశ లో గంగా నది ని ఆనుకొని ఉన్నటువంటి 5 కిలో మీటర్ ల విస్తీర్ణం వరకు ఉండే కారిడార్ లోని రైతుల కు చెందిన భూముల పట్ల ప్రత్యేక శ్రద్ధ ను తీసుకోవడం జరుగుతుంది.

· వ్యవసాయం మరియు రూరల్ ఎంటర్ ప్రైజ్ లతో ముడిపడిన స్టార్ట్-అప్స్ కు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఉద్దేశించినటువంటి మిశ్రమ మూలధన నిధి కి మార్గాన్ని నాబార్డ్ సుగమం చేయనుంది.

· పంటల విలువ నిర్ధారణ, భూమి రికార్డు ల డిజిటలీకరణ, క్రిమిసంహారకాల ను వెదజల్లడం కోసం, ఇంకా పోషక పదార్థాల ను వెదజల్లడం కోసం ‘కిసాన్ డ్రోన్’ లను రంగం లోకి దించుతారు.

కేన్-బేత్ వా ప్రాజెక్టు

· కేన్-బేత్ వా లింక్ ప్రాజెక్టు అమలు కోసం 1400 కోట్ల రూపాయలు వ్యయం చేయాలని సంకల్పించడమైంది.

కేన్-బేత్ వా లింక్ ప్రాజెక్టు ద్వారా రైతుల కు చెందిన భూముల లో 9.08 లక్షల హెక్టేర్ ల భూములకు సేద్య సంబంధి ప్రయోజనాలు లభించనున్నాయి.

ఎమ్ఎస్ఎమ్ఇ

· ఉద్యమ్ పోర్టల్ ను, ఇ-శ్రమ్ పోర్టల్ ను, ఎన్ సిఎస్ పోర్టల్ ను, ఇంకా ఎఎస్ఇఇఎమ్ పోర్టల్ ను ఒకదానితో మరొకటి ని జోడించడం జరుగుతుంది.

· 130 లక్షల ఎమ్ఎస్ఎమ్ఇ లకు అదనపు రుణాన్ని ఇమర్ జెంసీ క్రెడిట్ లింక్ డ్ గ్యారంటీ స్కీమ్ (ఇసిఎల్ జిఎస్) పరిధి లో ఇవ్వడం జరుగుతుంది.

· ఇసిఎల్ జిఎస్ ను 2023వ సంవత్సరం మార్చి నెల వరకు పొడిగించడం జరుగుతుంది.

· ఇసిఎల్ జిఎస్ లో భాగం గా గ్యారంటీ కవర్ ను 50,000 కోట్ల రూపాయల మేరకు పెంచివేసి మొత్తం 5 లక్షల కోట్ల రూపాయలు గా చేసేయడం జరుగుతుంది.

· సూక్ష్మ మరియు లఘు వ్యాపార సంస్థ ల క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ (సిజిటిఎమ్ఎస్ఇ) లో భాగం గా 2 లక్షల కోట్ల రూపాయల అదనపు పరపతి ని ఇవ్వడం జరుగుతుంది.

· రేజింగ్ ఎండ్ ఏక్సెలరేటింగ్ ఎమ్ఎస్ఎమ్ఇ పర్ ఫార్మెన్స్ (ఆర్ఎఎమ్ పి) కార్యక్రమాన్ని 6000 కోట్ల రూపాయల వ్యయం తో మొదలు పెట్టడం జరుగుతుంది.

నైపుణ్యాభివృద్ధి

· ఆన్ లైన్ మాధ్యమం ద్వారా పౌరుల లో నైపుణ్యాల ను పెంపొందింప చేయడం కోసం డిజిటల్ ఇకో సిస్టమ్ ఫార్ స్కిలింగ్ ఎండ్ లైవ్ లీ హుడ్ (డిఇఎస్ హెచ్-స్టాక్ ఇ-పోర్టల్) ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.

· ‘డ్రోన్ శక్తి’ కి మార్గాన్ని సుగమం చేయడం కోసం మరియు ‘డ్రోన్-ఏజ్-ఎ-సర్వీస్’ (డిఆర్ ఎఎఎస్) కోసం స్టార్ట్-అప్స్ కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతుంది

విద్య

· పిఎమ్ ఇ-విద్య కు చెందిన ‘ఒక తరగతి ఒక టివి ఛానల్’ కార్యక్రమాన్ని 200 టివి చానల్స్ లో ప్రసారం చేయడం జరుగుతుంది.

· కీలకమైన ఆలోచనల తాలూకు నైపుణ్యానికి, సిమ్యులేటెడ్ లర్నింగ్ లకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం వర్చువల్ లేబ్స్ ను మరియు నైపుణ్య సంబంధి ఇ-లేబ్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

· డిజిటల్ ఉపాధ్యాయుల మాధ్యమం ద్వారా విద్య బోధన కై అధిక నాణ్యత కలిగినటువంటి ఇ-కంటెంట్ ను అభివృద్ధి పరచడం జరుగుతుంది.

· వ్యక్తిగత పద్ధతి న విద్యార్జన కై ప్రపంచ స్థాయి విద్య ను అందించడం కోసం డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఆరోగ్యం

· జాతీయ డిజిటల్ హెల్థ్ ఇకోసిస్టమ్ కోసం ఒక ఓపెన్ ప్లాట్ ఫార్మ్ ను ఆరంభించడం జరుగుతుంది.

· నాణ్యత తో కూడినటువంటి మానసిక ఆరోగ్య సంబంధి సలహా సంప్రదింపుల తో పాటు గా సంరక్షణ సంబంధి సేవల ను అందించడం కోసం ‘నేశనల్ టెలీ మెంటల్ హెల్థ్ ప్రోగ్రాము’ ను ప్రారంభించడం జరుగుతుంది.

· 23 టెలీ మెంటల్ హెల్థ్ సెంటర్స్ తో కూడినటువంటి ఒక నెట్ వర్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని నోడల్ సెంటర్ గా నిమ్ హాన్స్ (ఎన్ఐఎమ్ హెచ్ఎఎన్ఎస్) వ్యవహరిస్తుంది. దీనికి అవసరమైన సాంకేతిక విజ్ఞాన సంబంధి సహకారాన్ని బెంగళూరు లోని ఇంటర్ నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ-బెంగళూరు (ఐఐఐటిబి) అందిస్తుంది.

సక్షమ్ ఆంగన్ వాడీ

· మిశన్ శక్తి, మిశన్ వాత్సల్య, సక్షమ్ ఆంగన్ వాడీ, ఇంకా పోషణ్ 2.0 మాధ్యమాల ద్వారా మహిళల కు మరియు బాలల కు ఏకీకృత లాభాల ను అందించడం జరుగుతంది.

· రెండు లక్షల ఆంగన్ వాడీల స్థాయి ని సక్షమ్ ఆంగన్ వాడీ ల స్థాయి కి పెంచడం జరుగుతుంది.

 

హర్ ఘర్, నల్ సే జల్

· ‘హర్ ఘర్, నల్ సే జల్’ (ఇంటింటి కి నల్లా నీరు)లో భాగం గా 2022-23 సంవత్సరం లో 3.8 కోట్ల కుటుంబాల ను చేర్చడం కోసం 60,000 కోట్ల రూపాయల ను కేటాయించడం జరిగింది.

అందరి కోసం గృహ నిర్మాణం

· ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా 2022-23 లో 80 లక్షల ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం 48,000 కోట్ల రూపాయల ను కేటాయించడమైంది.

ఈశాన్య ప్రాంతాల కోసం ప్రధాన మంత్రి అభివృద్ధి కార్యక్రమం (పిఎమ్-డిఇవిఐఎన్ఇ)

· దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో మౌలిక సదుపాయాల కల్పన మరియు సామాజిక అభివృద్ధి పథకాల అమలు కు ఒక కొత్త పథకాన్ని పిఎమ్-డిఇవిఐఎన్ఇ పేరుతో ప్రవేశపెట్టడమైంది.

· ఈ పథకం లో భాగం గా యువజనుల ను మరియు మహిళల ను జీవనోపాధి కార్యక్రమాల కు సన్నద్ధం చేయడం కోసం ఆరంభ దశ లో 1500 కోట్ల రూపాయల కేటాయింపు.

వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రాము

· అక్కడక్కడ నివసించే జన సంఖ్య, పరిమిత సంధానం మరియు పరిమిత మౌలిక సదుపాయాల తో కూడినటువంటి సరిహద్దు ప్రాంత గ్రామాల ను అభివృద్ధి పరచడం కోసం ఈ ‘వైబ్రంట్ విలేజెస్’ ప్రోగ్రాము ను సంకల్పించడమైంది.

బ్యాంకింగ్

· వంద శాతం 1.5 లక్ష ల తపాలా కార్యాలయాల ను కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సిబిఎస్) లో చేర్చడం జరుగుతుంది.

· షెడ్యూల్డు వాణిజ్య బ్యాంకు లు 75 జిల్లాల లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ (డిబియు స్)ను ఏర్పాటు చేస్తాయి

 

ఇ-పాస్ పోర్ట్

· ఇంబెడెడ్ చిప్ ఎండ్ ఫ్యూచరిస్టిక్స్ టెక్నాలజీ తో కూడిన ఇ-పాస్ పోర్ట్ ల జారీ ని ఆరంభించడం జరుగుతుంది.

పట్టణ ప్రణాళిక

· బిల్డింగ్ బైలాస్ ల, టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ (టిపిఎస్) మరియు ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్ మెంట్ (టిఒడి) ల ఆధునికీకరణ ను అమలు పరచడం జరుగుతుంది.

· పట్టణ ప్రాంతాల లో పెద్ద ఎత్తు న చార్జింగ్ స్టేశన్ లను నెలకొల్పడం కోసం బ్యాటరీ స్వాపింగ్ పాలిసీ ని ప్రవేశపెట్టడం జరుగుతుంది.

భూమి రికార్డుల నిర్వహణ

· భూమి రికార్డుల ను ఐటి మద్దతు తో నిర్వహించడం కోసం యూనీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేశన్ నంబరు ను ప్రవేశపెట్టడం జరుగుతుంది.

ఏక్సెలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్

· కంపెనీల ను వేగం గా మూసివేయడం కోసం సెంటర్ ఫార్ ప్రోసెసింగ్ ఏక్సెలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ ( సి-పిఎసిఇ) ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

 

ఎవిజిసి ప్రమోశన్ టాస్క్ ఫోర్స్

· ఈ రంగం యొక్క సామర్ధ్యాన్ని తెలుసుకోవడం కోసం ఒక ఏనిమేశన్, విజువల్ ఇఫెక్ట్ స్, గేమింగ్ ఎండ్ కామిక్ (ఎవిజిసి) ప్రోత్సాహక కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

టెలికం రంగం

· ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం పథకం లో భాగం గా 5జి కోసం ఒక పటిష్టమైన ఇకోసిస్టమ్ ను నెలకొల్పడానికి గాను డిజైన్ ప్రధానమైనటువంటి తయారీ కి సంబంధించిన ఒక పథకాన్ని తీసుకు రావడం జరుగుతుంది.

ఎగుమతుల కు ప్రోత్సాహం

· ‘ఎంటర్ ప్రైజ్ ఇంకా సర్వీస్ హబ్ ల అభివృద్ధి’ లో రాష్ట్రాల ను భాస్వాములను చేయడాని కి వీలు గా ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టాని కి బదులు గా ఒక కొత్త విధానాన్ని తీసుకు రావడం జరుగుతుంది.

రక్షణ రంగం లో స్వయం సమృద్ధి:

· 2022-23 లో దేశీయ పరిశ్రమ కోసం మూలధన సేకరణ ను బడ్జెటు లో 68 శాతం గా నిర్ధారించడమైంది. 2021-22 లో కేటాయించిన 58 శాతం తో పోల్చి చూసినప్పుడు ఇది అధికం గా ఉంది.

· 25 శాతం రక్షణ పరిశోధన సంబంధి బడ్జెటు తో సహా పరిశ్రమ, స్టార్ట్-అప్స్ మరియు విద్యల కోసం ఉద్దేశించి రక్షణ సంబంధిత పరిశోధన ను, అభివృద్ధి (ఆర్ ఎండ్ డి) ని తెరవడం జరుగుతుంది.

· పరీక్ష లు జరపడం మరియు ధ్రువపత్రం సంబంధి అవసరాల ను పూర్తి చేయడం కోసం స్వతంత్ర నోడల్ అంబ్రెలా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

సన్ రైజ్ ఆపర్చునిటీస్

· కృత్రిమ మేధస్సు (ఎఐ), జియో-స్పేశల్ సిస్టమ్స్, ఇంకా డ్రోన్ లు, సెమీ కండక్టర్ మరియు తత్సంబంధిత ఇకో-సిస్టమ్, అంతరిక్ష సంబంధి ఆర్థిక వ్యవస్థ, జీనోమిక్స్ మరియు ఫార్మాస్యుటికల్స్, హరిత శక్తి, ఇంకా స్వచ్ఛమైన మొబిలిటీ సిస్టమ్స్ ల వంటి సన్ రైజ్ ఆపర్చునిటీస్ లో పరిశోధన కు మరియు అభివృద్ధి కి ప్రభుత్వ తోడ్పాటు ను అందజేయడం జరుగుతుంది.

ఎనర్జీ ట్రాన్సిశన్ ఎండ్ క్లయిమేట్ యాక్షన్:

· 2030 వ సంవత్సరానికల్లా 280 గీగా వాట్ స్థాపిత సౌర విద్యుత్తు లక్ష్యాన్ని సాధించడం కోసం ఉన్నత సామర్ధ్యం కలిగి ఉండే సోలర్ మాడ్యూల్స్ ను తయారు చేయడం కోసం ఉత్పత్తి తో ముడిపెట్టినటువంటి ప్రోత్సాహకం రూపం లో 19,500 కోట్ల రూపాయల ను అదనం గా కేటాయించడమైంది.

· ఉష్ణ ఆధారిత విద్యుత్తు ప్లాంటుల లో అయిదు శాతం నుంచి ఏడు శాతం బయోమాస్ పెలెట్స్ ను మండించడం జరుగుతుంది.

· ఏటా 38 ఎమ్ఎమ్ టి స్థాయి లో కార్బన్ డైఆక్సైడ్ ను ఆదా చేయాలనేది లక్ష్యం గా ఉంది;

· దీనివల్ల రైతుల కు అదనపు ఆదాయం తో పాటు గా స్థానికుల కు ఉపాధి లభించేందుకు అవకాశం ఉంది;

· అంతేకాకుండా, పొలాల్లో గడ్డి దుబ్బులను కాల్చడాన్ని అడ్డుకోవడం లో సైతం తోడ్పాటు లభిస్తుంది.

· కోల్ గ్యాసిఫికేశన్ కు మరియు పరిశ్రమ కోసం బొగ్గు ను రసాయానాల రూపంలోకి మార్పు చెందింప చేసేందుకు గాను నాలుగు పైలట్ ప్రాజెక్టుల ను ఏర్పాటు చేయడం జరుగుతుంది.

· అగ్రో-ఫారెస్టరీ ని చేపట్టేటటువంటి షెడ్యూల్డు కులాలు మరియు షెడ్యూల్డు తెగల కు చెందిన రైతుల కు ఆర్థిక పరమైన సహాయాన్ని అందించడం జరుగుతుంది.

పబ్లిక్ కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్:

· 2022-23 లో ప్రైవేటు పెట్టుబడి కి మరియు డిమాండు కు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు గాను పబ్లిక్ ఇన్వెస్ట్ మెంటును కొనసాగించడం జరుగుతుంది.

· 2022-23 సంవత్సరం లో మూలధన సంబంధి వ్యయం కోసం చేసే ఖర్చును అమాంతం 35.4 శాతం మేరకు పెంచి వేసి 7.50 లక్షల కోట్ల రూపాయల కు చేర్చడమైంది. ఇది ప్రస్తుతం సంవత్సరం లో 5.54 లక్షల కోట్ల రూపాయలు గా ఉంది.

· 2022-23 లో చేసే వ్యయం జిడిపి లో 2.9 శాతం గా ఉంటుంది.

· 2022-23 లో కేంద్ర ప్రభుత్వం యొక్క మూలధన వ్యయం దాదాపు గా 10.68 లక్షల కోట్ల రూపాయలు గా ఉండవచ్చని అంచనా వేయడమైంది. ఇది జిడిపి లో ఇంచుమించు 4.1 శాతం మేరకు లెక్క కు వస్తుంది.

జిఐఎఫ్ టి-ఐఎఫ్ఎస్ సి

· జిఐఎఫ్ టి సిటీ లో ప్రపంచ శ్రేణి విదేశీ విశ్వ విద్యాలయాల ను మరియు ప్రపంచ శ్రేణి సంస్థల ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ని ఇవ్వడం జరుగుతుంది.

· అంతర్జాతీయ ధర్మశాస్త్ర రంగం పరిధి లో వివాదాల ను సకాలం లో పరిష్కరించడం కోసం ఒక అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది.

వనరుల సమీకరణ

· డేటా సెంటర్స్ కు మరియు ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కు మౌలిక సదుపాయాల సంబంధిత హోదా ను ఇవ్వడం జరుగుతుంది.

· వెంచర్ కేపిటల్ ఎండ్ ప్రైవేట్ ఎక్విటీ లు గడచిన సంవత్సరం లో 5.5 లక్షల కోట్ల రూపాయల కు మించిన పెట్టుబడిని పెట్టాయి. అంతేకాక అన్నిటి కంటే పెద్దదైన ఒక స్టార్ట్-అప్ మరియు గ్రోత్ ఇకో-సిస్టమ్ కు మార్గాన్ని కూడా సుగమం చేసింది. ఈ విధమైన పెట్టుబడి ని మరింత గా పెంచేందుకు చొరవల ను తీసుకోవడం జరుగుతున్నది.

· సన్ రైజ్ సెక్టర్ కోసం బ్లెండెడ్ ఫండ్స్ ను ప్రోత్సహించడం జరుగుంది.

· గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధుల ను సమీకరించడం కోసం సావరిన్ గ్రీన్ బాండ్ లను జారీ చేయడం జరుగుతుంది.

డిజిటల్ రూపీ

· భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్ బిఐ) ద్వారా డిజిటల్ రూపాయి ని 2022-23 లో మొదలు పెట్టడమైంది.

రాష్ట్రాల కు మరింత గా ఫిస్కల్ స్పేస్ ను కల్పించడం

· ‘మూలధన పెట్టుబడి కోసం రాష్ట్రాల కు ఆర్థిక సహాయం చేయడానికి ఉద్దేశించిన పథకం’ కోసం చేసే వ్యయాన్ని మరింత పెంచడం జరిగింది:

Ø ఈ విధమైన వ్యయం బడ్జెటు అంచనాల లో 10,000 కోట్ల రూపాయలు గా ఉండింది. దీనిని ప్రస్తుత సంవత్సరం కోసం సవరించిన అంచనాల లో 15,000 కోట్ల రూపాయలు చేసేయడమైంది.

· ఆర్థిక వ్యవస్థ లో సమగ్రమైన ప్రోత్సాహకాన్ని ఇవ్వడం కోసం రాష్ట్రాల కు సాయపడటానికి గాను 2022-23 సంవత్సరం లో ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు కేటాయించడమైంది. అంతేకాక యాభై సంవత్సరాల వడ్డీ ఉండనటువంటి రుణాల ను ఇవ్వడం జరుగుతుంది. ఇవి సాధారణ రుణాలకు అదనం గా ఉంటాయి.

  • 2022-23 లో రాష్ట్రాల కు జిఎస్ డిపి లో 4 శాతం మేరకు ద్రవ్య లోటు కు అనుమతించడం జరుగుతుంది. దీనిలో 0.5 శాతం విద్యుత్తు రంగ సంస్కరణల కు గాను ఉపయోగించ డం జరుగుతుంది.

ఫిస్కల్ మేనేజ్ మెంట్

· బడ్జెటు అంచనా లు 2021-22: 34.83 లక్షల కోట్ల రూపాయలు

· సవరించిన అంచనాలు 2021-22: 37.70 లక్షల కోట్ల రూపాయలు

· 2022-23 వ సంవత్సరం లో మొత్తం వ్యయం 39.45 లక్షల కోట్ల రూపాయలుగా ఉండవచ్చని అంచనా వేయడమైంది.

· 2022-23 వ సంవత్సరం లో అప్పులు కాకుండా మొత్తం వసూళ్ళు: 22.84 లక్షల కోట్ల రూపాయలు గా ఉండవచ్చు

· ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో ద్రవ్య లోటు: జిడిపి లో 6.9 శాతం (బడ్జెటు అంచనాల లో పేర్కొన్న 6.8 శాతం తో పోల్చినప్పుడు)

· 2022-23 వ సంవత్సరం లో ద్రవ్య లోటు జిడిపి లో 6.4 శాతం మేరకు ఉండవచ్చని అంచనా వేయడమైంది.

పార్ట్-బి

ప్రత్యక్ష పన్నులు

సుస్థిరమైన,  అంచనా వేయదగిన పన్ను వ్యవస్థ:

· విశ్వసనీయమైన పన్ను వ్యవస్థ ఏర్పాటుకు సంకల్పం.

· పన్ను వ్యవస్థను మరింత సరళీకరించి, వివాదాలను తగ్గించడం.

కొత్తగా ‘అప్డేటెడ్ రిటర్ను’ పద్ధతిని ప్రవేశపెట్టడం

· అదనపు పన్ను చెల్లింపుపై సవరించిన (అప్డేటెడ్) రిటర్ను విధానం.

· మొదట్లో ప్రస్తావించని ఆదాయం వివరాలను పన్ను చెల్లింపుదార్లు ప్రకటించేందుకు,  వివరాల సవరణకు ఇది అవకాశం కల్పిస్తుంది.

· సంబంధిత పన్ను మధింపు సంవత్సరం ముగిసినప్పటి నుంచి రెండేళ్లలోగా ఈ సవరణలను దాఖలు చేయవచ్చు. 

సహకార సంఘాలు

· సహకార సంఘాలు చెల్లించే కనీస ప్రత్యామ్నాయ పన్ను రేటు 18.5శాతంనుంచి 15శాతానికి తగ్గింపు.

· సహకార సంఘాలకు, కంపెనీలకు మధ్య సమదృష్టితో వ్యవహరించే సంకల్పం.

· మొత్తం ఆదాయం రూ. కోటినుంచి రూ. 10కోట్ల వరకూ ఉండే సహకార సంఘాలపై సర్చార్జీ 12శాతంనుంచి 7శాతానికి తగ్గింపు.

వికలాంగులకు పన్నులో ఉపశమనం

· తల్లిదండ్రులు/సంరక్షలపై జీవితకాలం ఆధాపడి ఉండే విభిన్న సామర్థ్యాలు కలిగిన వారికి బీమా సొమ్మునుంచి వార్షికంగా సొమ్ము చెల్లించడం., ఒకే మొత్తంగా చెల్లింపు జరపడం. అంటే,..తల్లిదండ్రులు/సంరక్షులకు 60 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటినుంచి చెల్లింపు అమలు జరుపుతారు.

జాతీయ పెన్షన్ పథకం (ఎన్.పి.ఎస్.) వాటా చెల్లింపులో సమానత్వం

· రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఎన్.పి.ఎస్. ఖాతాకు చెల్లించే యాజమాన్యపు వాటాపై పన్ను కోత పరిమితిని 10శాతంనుంచి 14శాతానికి పెంచారు.

· కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులనూ పరిగణించడం.

· సామాజిక భద్రతా ప్రయోజనాలను పెంచడంలో ఇది దోహదపడుతుంది.

స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహకాలు

· ప్రోత్సాహక పథకాల ప్రయోజనాలకు అర్హత కలిగిన స్టార్టప్ కంపెనీలు వినియోగించుకోవడానికి ఇన్.కార్పొరేషన్ వ్యవధిని ఏడాదిపాటు, అంటే 2023 మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు.

  • ఇన్.కార్పొరేషన్ వ్యవధి ఇదివరకు 2022 మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఉండేది.

 

రాయితీ పన్ను వ్యవస్థ పరిధిలో ప్రోత్సాహకాలు

· ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్ 115 బి.ఎ.బి. కింద వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిని ప్రారంభించేందుకు నిర్దేశించిన ఆఖరు తేదీని ఏడాదిపాటు పొడిగించారు. అంటే, 2023 మార్చి 31నుంచి 2024వ సంవత్సరం మార్చి నెలాఖరు వరకూ పొడిగించారు.

 

వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపునకు పథకం

· వర్చువల్ డిజిటల్ ఆస్తులపై పన్ను విధింపునకు ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టారు. · ఎలాంటి వర్చువల్ డిజిటల్ ఆస్తినైనా బదిలీ చేసినపుడు లభించే ఆదాయంపై  పన్ను రేటును 30 శాతంగా నిర్ణయించారు.

· స్వాధీనం చేసుకునే వ్యయం మినహాయించి అలాంటి ఆదాయాన్ని లెక్కించినపుడు జరిగే ఖర్చుపై, లేదా అలవెన్సుపై ఎలాంటి పన్ను కోతా ఉండబోదు.

· వర్చువల్ ఆస్తి బదిలీలో నష్టం సంభవించిన పక్షంలో దాన్ని ఎలాంటి ఇతర ఆదాయంతో సర్దుబాటు చేయడానికి వీలుకాదు.

· బదిలీ లావాదేవీ వివరాలు తెలుసుకునేందుకు,..వర్చువల్ డిజిటల్ ఆస్తి బదిలీకి సంబంధించి జరిపిన చెల్లింపుపై 1శాతం చొప్పున టి.డి.ఎస్. విధించవలసి ఉంటుంది. 

· కానుక రూపంలో జరిపిన వర్చువల్ డిజిటల్ ఆస్తిపై కూడా పన్ను విధించవలసి ఉంటుంది.

వివాదాల పరిష్కార నిర్వహణ

· ఏదైనా వివాదం తలెత్తిన కేసు,.. హైకోర్టు లేదా సుప్రీంకోర్టులోనో పెండింగ్.లో ఉన్న కేసును పోలి ఉన్న పక్షంలో సంబంధిత శాఖ అప్పీలును దాఖలు చేసే ప్రక్రియను వాయిదా వేయవచ్చు. కోర్టులో వివాదం పరిష్కారమయ్యేంత వరకూ అప్పీలు దాఖలును వాయిదా వేయవచ్చు.

· పన్ను చెల్లింపు దార్లకు, ప్రభుత్వ శాఖకు మధ్య పదే పదే తలెత్తే వివాదాలను, తగ్గించుకునేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది.

ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్ (ఐ.ఎఫ్.ఎస్.సి.)కు పన్ను రాయితీలు

· కొన్ని షరతులకు లోబడి ఈ దిగువన పేర్కొన్న ఆదాయాలపై పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

Ø ప్రవాస భారతీయుడు ఆఫ్ షోర్ డెరివేటివ్ సదుపాయాల ద్వారా సెక్యూరిటీల్లో పెట్టుబడితో సాధించిన ఆదాయం.

Ø విదేశీ బ్యాంకింగ్ యూనిట్ ఓవర్ ది కౌంటర్ ద్వారా జారీ చేసిన డెరివేటివ్ సదుపాయాలతో వచ్చిన ఆదాయం.

Ø ఏదైనా నౌక లీజుకు ఇచ్చిన సందర్భంలో రాయల్టీ, వడ్డీపై అందివచ్చే ఆదాయం.

Ø ఐ.ఎఫ్.ఎస్.సి.లోని పోర్ట్ ఫోలియో నిర్వహణా సేవలనుంచి అందిన ఆదాయం.

సర్చార్జీ హేతుబద్ధీకరణ

  • ఏదైనా కాంట్రాక్ట్ అమలుకోసంఏర్పడిన వ్యక్తుల కూటమి లేదా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ( ఎ.ఒ.పి.ల)పై విధించే సర్చార్జీని 15శాతం పరిమితం చేశారు.

· విడి కంపెనీలు, ఎ.ఒ.పి.ల మధ్య. సర్చార్జీలో అసమానతలను తగ్గించేందుకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు.

· ఎలాంటి ఆస్తుల బదిలీ ద్వారా అయినా లభేంచే దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై సర్చార్జీని కూడా 15శాతానికి పరిమితం చేశారు.

· స్టార్టప్ కంపెనీల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ఈ చర్యలన్నీ తీసుకున్నారు.

ఆరోగ్య, విద్యా సుంకం

· ఆదాయంపై విధించే ఏదైనా సర్చార్జీని లేదా సుంకాన్ని వాణిజ్య వ్యయంగా పరిగణించేందుకు అనుమతించరు.

పన్ను ఎగవేత నిరోధకం

· ఏవైనా సోదాలు, సర్వేలు జరిపిన సందర్భంగా పసిగట్టిన రహస్య ఆదాయానికి సంబంధించిన వ్యవహారంలో ఎలాంటి నష్టంతోనూ సర్దుబాటుకు అనుమతించరు.

మూలంనుంచి పన్ను కోత (టి.డి.ఎస్.) నిబంధనలు

· వాణిజ్య ప్రోత్సాహక వ్యూహంలో భాగంగా వివిధ ఏజెంట్లకు బదిలీ అయిన ప్రయోజనాలపై విధింపు.

· పెన్షన్.గా అందించే ప్రయోజనాలపై పన్ను కోత విధింపు. ఒక ఆర్థిక సంవత్సరంలో అందే సదరు ప్రయోజనాల సగటు విలువ రూ. 20,000 మించిన పక్షంలో టి.డి.ఎస్. విధింపు.

పరోక్ష పన్నులు

వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.) గణనీయమైన ప్రగతి

· వైరస్ మహమ్మారి సవాళ్లు ఎదురైనా జి.ఎస్.టి. ఆదాయం మాత్రం ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.– జి.ఎస్.టి. ప్రగతి నేపథ్యంలో పన్ను చెల్లింపు దార్లు అభినందనీయులయ్యారు.

ప్రత్యేక ఆర్థిక మండలాలు (ఎస్.ఇ.జెడ్.లు)

· ఎస్.ఇ.జెడ్.ల సుంకాల పరిపాలనా నిర్వహణ వ్యవస్థ పూర్తిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారితం కాబోతోంది. కస్టమ్స్ నేషనల్ పోర్టల్ వ్యవస్థను అమలుచేసే పనులు 2022 సెప్టెంబరు 30లోగా మొదలవుతాయి.

కస్టమ్స్ సంస్కరణలు, సుంకం రేట్ల మార్పులు

· కోవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మనుషుల భౌతిక ప్రమేయం లేని కస్టమ్స్ సుంకాల వ్యవస్థ పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కస్టమ్స్ వ్యవస్థ ఎంతో నైపుణ్యంతో పనిచేసింది. మరెంతో క్రియాశీలతను ప్రదర్శించింది.

ప్రాజెక్టు దిగుమతులు, ఉత్పాదక యాంత్రిక ఉపకరణాలు

· ఉత్పాదక యాంత్రిక ఉపకరణాలు, ప్రాజెక్టు దిగుమతులపై అమలుచేసే రాయితీ రేట్ల వ్యవస్థను క్రమానుగతంగా తొలగించడం; స్వదేశీ రంగానికి సానుకూలంగా, ‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాలకు అనుగుణంగా ఒక స్వల్పంగా 7.5శాతం పన్నును వర్తింపజేయడం.

· అయితే, దేశంలో తయారు కాని కొన్ని అధునాతన యాంత్రిక ఉపకరణాలపై అమలులో ఉన్న కొన్ని మినహాయింపులు మాత్రం కొనసాగుతాయి.

· ఉత్పాదక యాంత్రిక ఉపకరణాల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు వీలుగా స్పెషలైజ్డ్ కాస్టింగ్స్, బాల్ స్క్రూ, లీనియర్ మోషన్ గైడ్ వంటి ఉపకరణాలపై కొన్ని పన్ను మినహాయింపులను ప్రవేశపెట్టారు.

కస్టమ్స్ సుంకాల మినహాయింపులు, పన్ను సరళీకరణలపై సమీక్ష

· మినహాయింపు పరిధిలో ఉన్న 350కిపైగా అంశాలను క్రమంగా తొలగించివేయాలని బడ్జెట్లో ప్రతిపాదించారు. కొన్ని వ్యవసాయ ఉత్పాదనలు, రసాయనాలు, వస్త్రాలు,.. స్వదేశీ ఉత్పాదనా సామర్థ్యం కలిగిన వైద్య పరికరాలు, ఔషధాలు, మందులు వంటి వాటిపై మినహాయింపులను తొలగించాలని సంకల్పించారు.

· రసాయనాలు, జవుళి ఉత్పాదనలు, లోహాలు వంటి రంగాలకు సంబంధించిన సుంకాల రేట్లను, పన్ను వ్యవస్థను సరళీకరించి, తద్వారా వివాదాలను తగ్గించనున్నారు;  భారతదేశంలో తయారవుతున్న, లేదా తయారయ్యేందుకు అవకాశం ఉన్న వస్తువులపై మినహాయింపులను తొలగించాలని, ఉత్పాదనలకు అవసరమైన ముడి సరకులపై సుంకాల్లో రాయితీలు ఇన్వాలని ప్రతిపాదించారు. – ‘మేక్ ఇన్ ఇండియా’,  ‘ఆత్మనిర్భర భారత్’ స్ఫూర్తికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకోనున్నారు.

 

వివిధ రంగాలకు సంబంధించిన ప్రత్యేక ప్రతిపాదనలు

ఎలక్ట్రానిక్స్

  • మనం ధరించే ఎలక్ట్రానిక్ వస్తువులు, వినికిడి పరికరాలు, ఎలక్ట్రానిక్ స్మార్ట్ మీటర్లు వంటివి స్వదేశీయంగా తయారయ్యేలా తగిన వాతావరణం కల్పించేందుకు గ్రేడెడ్ పద్ధతిలో కస్టమ్స్ సుంకం రేట్లను క్రమానుగతం చేయబోతున్నారు.

 

· మొబైల్ ఫోన్ చార్జర్ ట్రాన్స్.ఫార్మర్ల  విడిభాగాలు, మొబైల్ కెమెరా లెన్స్, మాడ్యూల్ కెమెరా లెన్స్ తదితర వస్తువులకు సుంకంలో రాయితీ కల్పించనున్నారు. – హై గ్రోత్ ఎలక్ట్రానిక్ వస్తువులను స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకోనున్నారు.

రత్నాలు, ఆభరణాలు

· కోతకోసిన, మెరుగుపెట్టిన వజ్రాలు, విలువై రాళ్లపై కస్టమ్స్ సుంకాన్ని 5శాతానికి తగ్గించారు;  సింప్లీ సాన్ వజ్రాలపై కస్టమ్స్ సుంకం తీసివేశారు. – దేశంలో విలువైన రాళ్ల, వజ్రాల ఆభరణాల రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.

  • ఇందుకు సంబంధించి సరళీకరించిన నియంత్రణా వ్యవస్థను ఈ ఏడాది జూన్ నెలలోగా అమలు చేస్తారు – ఈ కామర్స్ వేదికగా ఆభరణాల ఎగుమతికి సానుకూలంగా ఈ చర్యలు చేపట్టారు

 

· ఇమిటేషన్ ఆభరణాల దిగుమతిపై కిలోగ్రాముకు కనీసం రూ. 400 చొప్పున కస్టమ్స్ సుంకాన్ని చెల్లింవలసి ఉంటుంది. అంతగా విలువలేని ఇమిటేషన్ ఆభరణాల దిగుమతికి ప్రోత్సాహం తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

రసాయనాలు

· మెథనాల్, అసిటిక్ ఆమ్లం, పెట్రోలియం శుద్ధిలో వాడే ఫీడ్ స్టాక్స్ వంటి కీలక రసాయనాలపై కస్టమ్స్ సుంకాన్ని తగిస్తున్నారు; స్వదేశీ తయారీ సామర్థ్యం ఉన్న సోడియం సైనైడ్.పై సుంకాన్ని పెంచుతున్నారు.- స్వదేశీ విలువల జోడింపు ప్రక్రియను పెంచేందుకు ఈ చర్య దోహదపడతుంది. 

సూక్మ చిన్న మధ్యతరహా సంస్థలు (ఎం.ఎస్.ఎం.ఇ.లు)

· దిగుమతి చేసుకునే గొడుగులపై కస్టమ్స్ సుంకాన్ని 20శాతానికి పెంచనున్నారు. గొడుగుల తయారీలో వాడే విడిభాగాలపై మినహాయింపులను ఉపసంహరించుకుంటున్నారు.

· భారతదేశంలో తయారయ్యే వ్యవసాయ రంగ పరికరాలు, ఉపకరణాలపై మినహాయింపులను హేతుబద్ధం చేయబోతున్నారు.

· ఉక్కు రద్దీ సామగ్రి దిగుమతికి గత ఏడాది అందించిన కస్టమ్స్ సుంకం మినహాయింపును మరో ఏడాదిపాటు పొడిగించారు. ఎం.ఎస్.ఎం.ఇ. ద్వితీయ శ్రేణి ఉత్పత్తి దారులకు ఉపశమనం కలిగించేందుకు ఈ చర్య తీసుకున్నారు.

· స్టీల్, కోటింగ్ ఫ్లాట్ ఉత్పాదనలు, అల్లోయ్ స్టీల్, హైస్పీడ్ స్టీల్.పై విధించిన యాంటీ డంపింగ్ డ్యూటీ, కౌంటర్ వెయిలింగ్ సుంకాన్ని (సి.వి.డి.ని) రద్దు చేయబోతున్నారు. లోహాల ధరలు ప్రస్తుతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజా ప్రయోజనాలు లక్ష్యంగా ఈ చర్య తీసుకుంటున్నారు.  

ఎగుమతులు

  • ఎగుమతులకు ప్రోత్సాహం కల్పించేందుకు వీలుగా అలంకరణ ప్రక్రియ, ట్రిమ్మింగ్, గుండీలు, జిప్పర్లు, లైనింగ్ వస్త్ర సామగ్రి, ప్రత్యేకమైన తోలు, ఫర్నిచర్ ఫిట్టింగ్స్, ప్యాకేజీ బాక్సులు వంటి వాటిపై మినహాయింపులు ఇవ్వబోతున్నారు.

 

  • రొయ్యల సాగుకు అవసరమైన కొన్ని ఉపకరణాలపై సుంకాన్ని తగ్గిస్తున్నారు. రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ చర్య తీసుకుంటున్నారు.

 

ఇంధన మిశ్రమ ప్రక్రియను ప్రోత్సహించేందుకు చర్యలు

· మిశ్రమం చేయని ఇంధనంపై అదనంగా లీటర్.కు రూ. 2 చొప్పున ఎక్సయిజ్ సుంకం విధిస్తారు. 2022 అక్టోబరు ఒకటవ తేదీనుంచి ఈ సుంకం విధింపు అమలులోకి వస్తుంది. ఇంధన మిశ్రమ ప్రక్రియను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ చర్య తీసుకున్నారు.

BUDGET 2022-23 KEY FEATURES

 

 BUDGET 2022-23 KEY FEATURES

 

 

BUDGET SPEECH 2022-23

 BUDGET SPEECH 2022-23

 

 

 

ఆర్థిక సర్వే 2021-22 ముఖ్యాంశాలు (Press Information Bureau)

          కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సర్వేను 31.01.2022 పార్లమెంటుకు సమర్పించారు. ఆర్ధ్ ఐ క సర్వే ముఖ్యాంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ఆర్థిక వ్యవస్థ స్థితి:

  • భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 7.3 శాతానికి తగ్గిన తర్వాత 2021-22లో (మొదటి ముందస్తు అంచనాల ప్రకారం) వాస్తవ పరంగా 9.2 శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేశారు.
  • జిడిపి 2022-23 లో వాస్తవ పరంగా 8-8.5 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. ·        
  • ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు మద్దతు అందించడానికి ఆర్థిక వ్యవస్థ మంచి స్థితిలో ఉన్న ప్రైవేట్ రంగ పెట్టుబడులను  అంది పుచ్చుకోవడానికి రాబోయే సంవత్సరం సిద్ధంగా ఉంది.
  • 2022-23 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు , ఆసియా అభివృద్ధి బ్యాంకు తాజా
  • అంచనాలు  8.7, 7.5 శాతాలు గా ఉన్నాయి.
  • ఐఎంఎఫ్ తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్, భారతదేశ వాస్తవ జిడిపి 2021-22 , 2022-23 లో 9 శాతం,  2023-2024 లో 7.1 శాతం వద్ద పెరుగుతుందని అంచనా వేసింది, ఇది భారత్ ను మొత్తం మూడు సంవత్సరాలపాటు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా చేస్తుంది.
  • వ్యవసాయం , దాని అనుబంధ రంగాలు 3.9 శాతం పెరుగుతాయని అంచనా; 2021-22 లో పరిశ్రమ 11.8 శాతం , సేవల రంగం 8.2 శాతం పెరగవచ్చు.
  • డిమాండ్ వైపు, 2021-22 లో వినియోగం 7.0 శాతం పెరుగుతుందని అంచనా, గ్రాస్ ఫిక్సిడ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జిఎఫ్ సిఎఫ్) 15 శాతం, ఎగుమతులు 16.5 శాతం , దిగుమతులు 2021-22 లో 29.4 శాతం పెరుగుతాయని అంచనా
  • 2022-23 సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ట స్థితి లో ఉన్నట్టు స్థూల ఆర్థిక స్థిరత్వ సూచికలు సూచిస్తున్నాయి.
  • అధిక విదేశీ మారక నిల్వలు, స్థిరమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పెరుగుతున్న ఎగుమతి ఆదాయాలు కలసి 2022-23 లో సంభావ్య ప్రపంచ లిక్విడిటీ ట్యాపరింగ్ కు వ్యతిరేకంగా తగినంత బఫర్ ను అందిస్తాయి. 
  • ఆరోగ్య ప్రభావం మరింత తీవ్రంగా ఉన్నప్పటికీ, "రెండవవేవ్ " ఆర్థిక ప్రభావం 2020-21 లో పూర్తి లాక్ డౌన్ దశలో కంటే  చాలా తక్కువగా ఉంది.
  • మహమ్మారి కి భారతదేశ ప్రత్యేక ప్రతిస్పందన లో సమాజంలోని నిస్సహాయ వర్గాలు ,వ్యాపార రంగంపై ప్రభావాన్ని తగ్గించడానికి భద్రతా వలలు ఉన్నాయి, నిరంతర దీర్ఘకాలిక విస్తరణ కోసం అభివృద్ధి, సరఫరా పరమైన సంస్కరణల పై మూలధన వ్యయం గణనీయంగా పెంచింది.
  • ప్రభుత్వ సరళమైన , బహుళ విధ ప్రతిస్పందన పాక్షికంగా ఫీడ్ బ్యాక్-లూప్ లను ఉపయోగించే "చురుకైన" ఫ్రేమ్ వర్క్, తీవ్రమైన అనిశ్చితి వాతావరణంలో ఎనభై హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లను (హెచ్ ఎఫ్ ఐలు) ఉపయోగించడం పై ఆధారపడి ఉంది. .

 

ఆర్థిక పరిణామాలు:

  • కేంద్ర ప్రభుత్వ (ఏప్రిల్ నుంచి నవంబర్, 2021) ఆదాయ రసీదులు 2021-22 బడ్జెట్ అంచనా (2020-21 తాత్కాలిక వాస్తవాల్లో) లలో 9.6 శాతం వృద్ధిని అంచనా వేయడంతో 67.2 శాతం (వై ఓ వై) పెరిగాయి.
  • స్థూల పన్ను ఆదాయం ఏప్రిల్ నుండి నవంబర్, 2021 వరకు వై ఓ వై పరంగా 50 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది.  2019-2020 పూర్వ మహమ్మారి స్థాయిలతో పోలిస్తే ఈ పని తీరు బలంగా ఉంది.  
  • ఏప్రిల్-నవంబర్ 2021 సమయంలో, కాపెక్స్ మౌలిక సదుపాయాల-ఇంటెన్సివ్ రంగాలపై దృష్టి సారించి 13.5 శాతం (వై ఓ వై) పెరిగింది.
  • స్థిరమైన ఆదాయ సేకరణ , లక్షిత వ్యయ విధానం ఏప్రిల్ నుండి నవంబర్, 2021 వరకు ఆర్థిక లోటును బిఈలో 46.2 శాతంగా అదుపు చేసింది.
  • కోవిడ్-19 కారణంగా పెరిగిన రుణాలతో, కేంద్ర ప్రభుత్వ రుణం 2019-20 లో జిడిపిలో 49.1 శాతం నుండి 2020-21 లో జిడిపిలో 59.3 శాతానికి పెరిగింది, కానీ ఆర్థిక వ్యవస్థ రికవరీతో తగ్గుదల బాట పడుతుందని భావిస్తున్నారు.

 

బాహ్య రంగాలు:

  • భారతదేశ వాణిజ్య ఎగుమతులు, దిగుమతులు బలంగా పుంజుకున్నాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ కు ముందు స్థాయిలను అధిగమించాయి.
  • పర్యాటక ఆదాయాలు తగ్గినప్పటికీ ,రసీదులు మరియు చెల్లింపులు రెండూ మహమ్మారి ముందునాటి స్థాయిలను దాటడంతో నికర సేవల్లో గణనీయమైన వేగం ఉంది.
  • విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, నికర బాహ్య వాణిజ్య రుణాల పునరుద్ధరణ, అధిక బ్యాంకింగ్ మూలధనం ,అదనపు ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు (ఎస్ డిఆర్) కేటాయింపు కారణంగా 2021-22 మొదటి అర్ధభాగంలో నికర మూలధన ప్రవాహాలు 65.6 బిలియన్ డాలర్ల వద్ద అధికంగా ఉన్నాయి.
  • భారతదేశ బాహ్య రుణం సెప్టెంబర్ 2021 చివరినాటికి 593.1 బిలియన్ డాలర్లకు పెరిగింది, ఇది ఒక సంవత్సరం క్రితం 556.8 బిలియన్ డాలర్లు ఉంది. ఇది అధిక వాణిజ్య రుణాలతో పాటు. ఐఎంఎఫ్ అదనపు ఎస్ డి ఆర్ కేటాయింపును ప్రతిబింబిస్తుంది,
  • విదేశీ మారక నిల్వలు 2021-22 మొదటి అర్ధభాగంలో 600 బిలియన్ అమెరికన్ డాలర్లను దాటాయి.  డిసెంబర్ 31, 2021 నాటికి 633.6 బిలియన్ డాలర్లను తాకాయి
  • 2021 నవంబర్ చివరి నాటికి, చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఫారెక్స్ నిల్వల హోల్డర్ గా భారతదేశం నిలిచింది.

 

ద్రవ్య నిర్వహణ -ఆర్థిక మధ్యవర్తిత్వం:

వ్యవస్థలో లిక్విడిటీ మిగులులో ఉంది

*రెపో రేటును 2021-22 లో 4 శాతం వద్ద కొనసాగించారు.

*  తదుపరి లిక్విడిటీని అందించడం కోసం జి-సెక్ అక్విజిషన్ ప్రోగ్రామ్ , స్పెషల్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్స్ వంటి వివిధ చర్యలను ఆర్ బి ఐ చేపట్టింది.

మహమ్మారి వల్ల ఆర్థిక నష్టం వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మెరుగైన స్థితి కి చేరింది:       

* వై ఓ వై బ్యాంక్ క్రెడిట్ వృద్ధి 2021-22 లో ఏప్రిల్ 2021 లో 5.3 శాతం నుండి 31 డిసెంబర్ 2021 నాటికి 9.2 శాతానికి క్రమంగా పుంజుకుంది.

*షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల (ఎస్ సిబిలు) స్థూల నిరర్థక అడ్వాన్సెస్ నిష్పత్తి 2017-18 చివరినాటికి 11.2 శాతం నుండి సెప్టెంబర్, 2021 చివరినాటికి 6.9 శాతానికి తగ్గింది.

*ఇదే కాలంలో నికర నిరర్థక అడ్వాన్సెస్ నిష్పత్తి 6 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది.

*ఎస్ సిబిల రిస్క్ వెయిటెడ్ అసెట్ నిష్పత్తి కి మూలధనం 2013-14 లో 13 శాతం నుండి సెప్టెంబర్ 2021 చివరినాటికి 16.54 శాతానికి పెరిగింది.

* ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం రిటర్న్ ఆన్ అసెట్స్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ సెప్టెంబర్ 2021 తో ముగిసే కాలానికి సానుకూలంగా కొనసాగింది.

క్యాపిటల్ మార్కెట్ లకు అసాధారణ సంవత్సరం:

*2021 ఏప్రిల్-నవంబర్ లో 75 ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) ఇష్యూల ద్వారా రూ.89,066 కోట్లు సేకరించారు.ఇది గత దశాబ్దంలో ఏ సంవత్సరం తో పోల్చినాచాలా ఎక్కువ.

*సెన్సెక్స్ ,నిఫ్టీ అక్టోబర్ 18, 2021 న 61,766, 18,477 వద్ద గరిష్టస్థాయికి చేరుకున్నాయి.

* ప్రధాన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఆర్థిక వ్యవస్థలలో, భారతీయ మార్కెట్లు ఏప్రిల్-డిసెంబర్ 2021 లో సహచరులను అధిగమించాయి.

 

ధరలు -ద్రవ్యోల్బణం:

2021-22 (ఏప్రిల్-డిసెంబర్) లో 6.6 శాతం ఉన్న సిపిఐ-కంబైన్డ్ ద్రవ్యోల్బణం 2021-22 ఇదే కాలం లో 5.2 శాతానికి చేరింది.

*ఆహార ద్రవ్యోల్బణం సడలించడం రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గడానికి దారితీసింది.

*ఆహార ద్రవ్యోల్బణం 2021-22 (ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు) లో సగటున 2.9 శాతం కనిష్టంగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో 9.1 శాతం ఉంది.

*సమర్థవంతమైన సరఫరా దిశ యాజమాన్యం సంవత్సరంలో చాలా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రణలో ఉంచింది.

*పప్పుధాన్యాలు ,వంటనూనెల ధరల పెరుగుదలను నియంత్రించడానికి సానుకూల చర్యలు తీసుకున్నారు.

*సెంట్రల్ ఎక్సైజ్ తగ్గింపు , చాలా రాష్ట్రాలు విలువ ఆధారిత పన్నులో కోతలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి సహాయపడ్డాయి.

టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారంగా టోకు ద్రవ్యోల్బణం 2021-22 (ఏప్రిల్ నుంచి డిసెంబర్) సమయంలో 12.5 శాతానికి పెరిగింది. ఇందుకు కారణాలు:

*గత సంవత్సరంలో తక్కువ బేస్,

*ఆర్థిక కార్యకలాపాల్లో వేగం

*ముడి చమురు ,ఇతర దిగుమతి ఇన్ పుట్  ల అంతర్జాతీయ ధరలు గణనీయంగా పెరగడం

*అధిక రవాణా ఖర్చులు

సిపిఐ-సి ,డబ్ల్యుపిఐ ద్రవ్యోల్బణం మధ్య వ్యత్యాసం:

*ఈ వ్యత్యాసం మే 2020 లో 9.6 శాతం తారాస్థాయి పాయింట్లకు చేరుకుంది.

*అయితే, ఈ ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్ 2021 లో టోకు ద్రవ్యోల్బణం కంటే 8.0 శాతం పాయింట్లు పడిపోవడంతో వ్యత్యాసం తిరోగమనం లో ఉంది.

ఈ భిన్నత్వాన్ని దిగువ పేర్కొన్న కారణాల ద్వారా వివరించవచ్చు:అవి

*బేస్ ఎఫెక్ట్ వల్ల తేడాలు,

*రెండు సూచీల పరిధి ,కవరేజీలో తేడా,

*ధర వసూళ్లు

*కవర్ చేసిన ఐటమ్ లు

*కమోడిటీ బరువుల్లో తేడా, ఇంకా 

* దిగుమతి చేసుకున్న ఇన్‌పుట్‌ల ద్వారా కాస్ట్-పుష్ ద్రవ్యోల్బణానికి డబ్ల్యుపిఐ మరింత సున్నితంగా ఉంటుంది.

*డబ్ల్యుపిఐలో బేస్ ప్రభావం క్రమంగా క్షీణించడంతో, సిపిఐ-సి ,డబ్ల్యుపిఐలో వ్యత్యాసం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.

 

స్థిరాభివృద్ధి మరియు జలవాయు పరివర్తన:

· నీతి ఆయోగ్ ఎస్ డిజి ఇండియా ఇండెక్స్ ఎండ్ డాశ్ బోర్డు లో భారతదేశం యొక్క మొత్తం మీద స్కోరు 2020-21వ సంత్సరం లో 66 కు మెరుగు పడింది. ఈ స్కోరు 2019-20వ సంత్సరం లో 60 గాను, 2018-19వ సంవత్సరం లో 57 గాను ఉంది.

· ఫ్రంట్ రనర్స్ రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య (65 నుంచి 99 స్కోరు చేసినవి) 2020-21వ సంవత్సరం లో 22 కు పెరిగింది. ఈ సంఖ్య 2019-20 వ సంవత్సరం లో 10 గా ఉంది.

· నార్థ్-ఈస్టర్న్ రీజియన్ డిస్ట్రిక్ట్ ఎస్ డిజి ఇండెక్స్ 2021-22 లో భారతదేశం యొక్క ఈశాన్య ప్రాంతాల లో 64 జిల్లాలు నీతి ఆయోగ్ ఫ్రంట్ రనర్స్ గాను, 39 జిల్లా లు పెర్ ఫార్మర్స్ గాను నమోదు అయ్యాయి.

· ప్రపంచం లో అతి పెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగిన పదో దేశం గా భారతదేశం ఉంది.

· 2010వ సంవత్సరం మొదలుకొని 2020వ సంవత్సరం మధ్య కాలం లో అటవీ ప్రాంతాన్ని పెంచుకోవడం లో భారతదేశం ప్రపంచవ్యాప్తం గా మూడో స్థానం లో నిలచింది.

· 2020వ సంవత్సరం లో భారతదేశం యొక్క మొత్తం భౌగోళిక విస్తీర్ణం లో 24 శాతం మేరకు అడవులు విస్తరించాయిఇది ప్రపంచం లోని మొత్తం వన ప్రాంతం లో శాతం గా లెక్క కు వచ్చింది.

· 2021వ సంవత్సరం ఆగస్టు లో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్ మెంట్ అమెండ్ మెంట్ రూల్స్, 2021 ని నోటిఫై చేయడమైంది. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్ ను 2022వ సంవత్సరం కల్లా దూరం చేయాలి అనేది దీని ఉద్దేశ్యం గా ఉంది.

· అంతేకాకుండాప్లాస్టిక్ ప్యాకేజింగ్ కు సంబంధించిన డ్రాఫ్ట్ రెగ్యులేశన్ ఆన్ ఎక్స్ టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబులిటీ ని నోటిఫై చేయడమైంది.

· గంగా నది ప్రాంతం మరియు ఆ నది ఉప నదుల వెంబడి నెలకొన్న గ్రాస్ లీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ (జిపిఐ స్) యొక్క కాంప్లయన్స్ స్టేటస్ 2017వ సంవత్సరం లో 39 శాతం గా ఉన్నది కాస్తా 2020వ సంవత్సరం లో 81శాతాని కి మెరుగైంది.

· తత్ఫలితం గా కాలుష్య పదార్థాల ప్రవాహాల లో తగ్గింపు అనేది 2017వ సంవత్సరం లో రోజు కు 349.13 మిలియన్ లీటర్ లు (ఎమ్ఎల్ డి) గా ఉండగా ఇది 2020 వ సంవత్సరం లో 280.20 ఎమ్ఎల్ డి కి పరిమితమైంది.

· ఉద్గారాల పరం గా మరింత క్షీణత దిశ గా 2030వ సంవత్సరాని కల్లా మహత్తర లక్ష్యాల ను సాధించనున్నట్లు 2021వ సంవత్సరం నవంబర్ లో గ్లాస్ గో లో జరిగిన 26వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (సిఒపి 26) లో ప్రధాన మంత్రి చేసిన జాతీయ ప్రకటన లో పేర్కొనడం జరిగింది.

· ఎల్ఐఎఫ్ఇ’ (లైఫ్ స్టైల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్) పేరు తో ఒక ఉద్యమాన్ని ప్రారంభించవలసిన అవసరం ఏర్పడింది. మతి లేనటువంటి మరియు విధ్వంస కారకమైనటువంటి వినియోగాని కి బదులు బుద్ధియుక్త మరియు ఉద్దేశ్య భరిత ఉపయోగం వైపునకు మళ్ళాలని దీని ద్వారా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.

 

వ్యవసాయం మరియు ఆహార నిర్వహణ

 

· గడచిన రెండు సంవత్సరాల లో వ్యవసాయ రంగం లో ఉత్సాహపూరిత వృద్ధి నమోదైంది. దేశం లో యొక్క గ్రాస్ వేల్యూ యాడెడ్ (జివిఎ) లో వ్యవసాయ రంగం గణనీయం గా 18.8 శాతం (2021-22) పెరుగుదల ను చూపించింది. ఇది 2020-21 లో 3.6 శాతం వృద్ధి ని నమోదు చేయగా 2021-22 లో 3.9 శాతం వృద్ధి ఉంది.

· పంటల వివిధీకరణ ను ప్రోత్సహించడం కోసం కనీస సమర్ధన ధర (మినిమం సపోర్ట్ ప్రైస్- ఎమ్ఎస్ పి) విధానాన్ని అమలు చేయడం జరుగుతోంది.

· పంటల ఉత్పత్తుల నుంచి అందిన నికర వసూళ్ళు తాజా సిట్యుయేశన్ అసిస్ మెంట్ సర్వే (ఎస్ఎఎస్) ప్రకారం 22.6 శాతం మేర పెరిగాయి.

· పశుపోషణపాడి రంగంచేపల పెంపకం సహా సంబంధి రంగాలు అధిక వృద్ధి ని చూపుతున్న రంగాలు గా నిలకడ గా రాణిస్తున్నాయి. అంతేకాకుండాఇవి వ్యవసాయ రంగం లో మొత్తం మీద వృద్ధి కి ప్రధాన చోదక శక్తులు గా ఉన్నాయి.

· పశు గణం రంగం 2019-20వ సంవత్సరం తో ముగుస్తున్న గడచిన అయిదేళ్ళ కాలం లో 8.15 శాతం సిఎజిఆర్ లెక్క న వృద్ధి చెందింది. ఈ రంగం వ్యావసాయిక కుటుంబాల సమూహాల కు నిలకడ తో కూడినటువంటి ఆదాయ మార్గం గా లెక్క కు వచ్చింది. వారు నెలసరి సగటు న సంపాదించే ఆదాయం లో దాదాపుగా 15 శాతం పశుగణం రంగం నుంచి అందింది.

· మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడంతక్కువ ఖర్చు లో రవాణాఇంకా సూక్ష్మ ఆహార వాణిజ్య సంస్థల వ్యవస్థీకరణ కు సమర్ధనల వంటి వేరు వేరు చర్యల ద్వారా ఫూడ్ ప్రోసెసింగ్ కు మార్గాన్ని ప్రభుత్వం సుగమం చేస్తున్నది.

· ప్రపంచం లోకెల్లా అతి భారీ ఆహార నిర్వహణ కార్యక్రమాల సరసన చేరిన ఒక కార్యక్రమాన్ని భారతదేశం ప్రస్తుతం నిర్వహిస్తున్నది.

· పిఎమ్ గరీబ్ కళ్యాణ్ యోజన (పిఎమ్ జికెవై) వంటి పథకాల ద్వారా ప్రభుత్వం ఆహార భద్రత సంబంధి నెట్ వర్క్ కవరేజి ని మరింత గా విస్తరింప చేసింది.

 

పరిశ్రమ మరియు మౌలిక సదుపాయాల కల్పన:

· పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపి) 2020 ఏప్రిల్-నవంబర్ లో (-)15.3 శాతం గా ఉన్నది కాస్తా, 2021 ఏప్రిల్ మొదలుకొని నవంబర్ మధ్య కాలానికి వచ్చే సరికి 17.4 శాతాని కి (వైఒవై)వృద్ధి చెందింది.

· ఇండియన్ రైల్ వే స్ కు పెట్టుబడి రూపేణా వ్యయం 2009-14వ సంవత్సర మధ్య కాలంలో వార్షిక ప్రాతిపదిక న సరాసరి 45,980 కోట్ల రూపాయలు గా ఉండగా 2020-21 లో 1,55,181 కోట్ల రూపాయల కు పెరిగింది. దీనిని మరింత గా పెంచి 2021-22 లో 2,15,058 కోట్ల రూపాయల కు చేర్చాలని సంకల్పించడమైంది. 2014వ సంవత్సరం స్థాయి తో పోలిస్తే ఇది అయిదు రెట్లు అధికం.

· ఒక రోజు లో రహదారి నిర్మాణం స్థాయి 2020-21వ సంవత్సరం లో గణనీయం గా 36.5 కి.మీ. కి పెరిగింది. 2019-20వ సంవత్సరం లో నమోదైన రోజు కు 28 కిమీ లతో పోల్చి చూసినప్పుడు దీనిలో పెరుగుదల 30.4 శాతం గా ఉంది.

· పెద్ద కంపెనీ ల నెట్ ప్రాఫిట్ టు సేల్ రేశియో అనేది 2021-22 ఆర్థిక సంవత్సరం లో జూలై-సెప్టెంబర్ త్రైమాసికం లో మునుపు ఎన్నడూ లేనంత అధికం గా 10.6 శాతాని కి చేరుకొంది. మహమ్మారి ప్రబలినప్పటి కీ ఈ నిష్పత్తి చోటు చేసుకొన్నట్లు ఆర్ బిఐ అధ్యయనం పేర్కొంది.

· ఉత్పత్తి కి ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకాన్ని ప్రవేశ పెట్టడం తో అటు భౌతికం గాఇటు డిజిటల్ మాధ్యమం పరం గా కూడాను మౌలిక సదుపాయాల కల్పన కు పెద్ద ఉత్తేజాన్ని అందించినట్లయింది. దీనికి తోడు రవాణా ఖర్చుల లో తగ్గింపుఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుల సైతం ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకొనే వేగాన్ని బలపరచనున్నాయి.

సేవలు:

· సేవల రంగం యొక్క జివిఎ 2021-22 ఆర్థిక సంవత్సరం లో జులై-సెప్టెంబర్ త్రైమాసికం లో మహమ్మారి కి పూర్వం ఉన్న స్థాయి ని మించి పోయిందిఏమైనా వ్యాపారంరవాణా తదితర కాంటాక్ట్ ఇంటెన్సివ్ సెక్టర్ ల యొక్క జివిఎ ఇప్పటికీ మహమ్మారి కి పూర్వం ఉన్నటువంటి స్థాయి కంటే తక్కువ గానే ఉంటోంది.

· సేవల రంగం మొత్తంమీద జివిఎ 2021-22వ సంవత్సరం లో 8.2 శాతం మేరకు వృద్ధి చెందవచ్చన్న అంచనా ఉంది.

· 2021 ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలం లో రైళ్ళ ద్వారా జరిగేటటువంటి సరకు రవాణా మహమ్మారి కన్నా క్రితం స్థాయి ని అధిగమించింది. మరో పక్క వాయు మార్గ సరకు రవాణాఇంకా ఓడరేవుల లో నౌకల రాక పోక లు దాదాపుగా మహమ్మారి కి పూర్వపు స్థాయి ల వద్ద కు చేరుకొన్నాయి. దేశీయ వాయు మార్గ రాక పోక లురైళ్ళ లో ప్రయాణికుల ప్రయాణం అనేవి క్రమం గా పెరుగుతూ ఉన్నాయి. ఈ పరిణామాలు ఫస్ట్ వేవ్ తో పోల్చి చూసినప్పుడు సెకండ్ వేవ్ తాలూకు ప్రభావం మరింత ఎక్కువ గా ఉందని సూచిస్తున్నది.

· 2021-22 ప్రథమార్థం లో సేవ ల రంగం 16.7 బిలియన్ యుఎస్ డాలర్ కు పైగా ఎఫ్ డిఐ ని అందుకొన్నది. ఈ మొత్తం భారతదేశం లోకి తరలి వచ్చిన మొత్తం ఎఫ్ డిఐ లో సుమారు గా 54 శాతాని కి సమానం గా ఉంది.

· ఐటి-బిపిఎమ్ సేవల సంబంధి ఆదాయం 2020-21వ సంవత్సరం లో 194 బిలియన్ యుఎస్ డాలర్ స్థాయి ని అందుకొందిఈ కాలం లో 1.38 లక్షల మంది ఉద్యోగులు కొత్త గా ఈ రంగాల లోకి ప్రవేశించారు.

· ప్రభుత్వం తీసుకు వచ్చిన ప్రధాన సంస్కరణల లో ఐటి-బిపిఒ రంగం లో టెలికం సంబంధి నియమావళి ని తొలగించడం తో పాటు అంతరిక్ష రంగం తలుపుల ను ప్రైవేటు సంస్థ ల కోసం తెరవడం వంటివి కూడా ఒక భాగం గా ఉన్నాయి

· సేవ ల రంగం ఎగుమతులు 2020-21 జనవరి-మార్చి త్రైమాసికం లో మహమ్మారి కి పూర్వం ఉన్న స్థాయి ని అధిగమించాయి. అవి 2021-22 వ సంవత్సరం ప్రథమార్థం లో 21.6 శాతం మేరకు వృద్ధి చెందాయి. సాఫ్ట్ వేర్ మరియు ఐటి సేవల సంబంధి ఎగుమతుల కు ప్రపంచ వ్యాప్తం గా డిమాండు ఉండటం ఈ పరిస్థితి కి దారి తీసింది.

· ప్రపంచం లో స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్ లో యుఎస్ మరియు చైనా ల తరువాత మూడో అతి పెద్ద దేశం గా భారతదేశం నిలచింది. కొత్త గా గుర్తింపు పొందిన స్టార్ట్-అప్స్ సంఖ్య 2016-17 లో 733 గా ఉన్నది కాస్తా 2021-22 వ సంవత్సరం లో 14,000 కు పైబడి వృద్ధి చెందాయి.

· 44 భారతదేశ స్టార్ట్-అప్స్ 2021వ సంవత్సరం లో యూనికార్న్ హోదా ను సాధించాయి. దీనితో యూనికార్న్ స్ మొత్తం సంఖ్య 83 కు చేరింది. ఈ యూనికార్స్ స్ లో చాలా వరకు సేవ ల రంగం లో పని చేస్తున్నాయి.

 

సోశల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మరియు ఉపాధి:

· 2022 వ సంవత్సరం జనవరి 16వ తేదీ నాటి కి 157.94 కోట్ల కోవిడ్-19 టీకా మందు డోజుల ను ప్రజలకు ఇప్పించడమైంది; దీనిలో 91.39 కోట్ల ఒకటో డోజుఅలాగే 66.05 కోట్ల రెండో డోజు లు ఉన్నాయి.

· ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ తో ఉపాధి సూచిక లు 2020-21 ఆఖరు త్రైమాసికం లో మహమ్మారి పూర్వ స్థాయిల ను తిరిగి అందుకొన్నాయి.

· పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పిఎఫ్ఎల్ఎస్) త్రైమాసికం వారీ సమాచారాన్ని బట్టి చూస్తే 2021 మార్చి నెల చివరి నాటికి మహమ్మారి వల్ల ప్రభావితం అయిన పట్టణ రంగం లో ఉపాధి కల్పన దాదాపు గా మహమ్మారి కి పూర్వ స్థాయి ని అందుకొన్నది.

· ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) సమాచారం ప్రకారం ఉద్యోగాల వ్యవస్థీకరణ కోవిడ్ సెకండ్ వేవ్ లో కూడా కొనసాగిందిఉద్యోగాల వ్యవస్థీకరణ పైన కోవిడ్ తాలూకు ప్రతికూల ప్రభావం కోవిడ్ ఫస్ట్ వేవ్ కంటే కూడా ఎంతో తక్కువ గా ఉండింది.

· ఆరోగ్యంవిద్యఇంకా ఇతర సామాజిక సేవల పై కేంద్రం మరియు రాష్ట్రాలు చేసిన వ్యయం జిడిపి లో నిష్పత్తి ప్రకారం చూసినట్లయితే 2014-15 లోని 6.2 శాతం స్థాయి నుంచి 2021-22 (బిఇ)లో 8.6 శాతాని కి పెరిగింది.

· నేశనల్ ఫ్యామిలీ హెల్థ్ సర్వే-లో పేర్కొన్న ప్రకారం:

Ø టోటల్ ఫర్టిలిటీ రేటు (టిఎఫ్ఆర్) 2015-16 లో 2.2 గా ఉండగా, 2019-21 లో కు దిగి వచ్చింది.

Ø శిశు మరణాల రేటు (ఐఎమ్ఆర్), అండర్ ఫైవ్ మోర్టలిటీ రేటు మరియు ఇన్స్ టిట్యూశనల్ బర్థ్ స్ అనేవి 2015-16 తో పోల్చినప్పుడు 2019-21 లో మెరుగయ్యాయి.

 

· జల్ జీవన్ మిశన్ (జెజెఎమ్) లో భాగం గా 83 జిల్లా లు హర్ ఘర్ జల్’ (‘ఇంటింటికీ నీరు’) జిల్లాలు గా మారాయి

· మహమ్మారి ప్రాబల్య కాలం లో గ్రామీణ ప్రాంతాల లో అసంఘటిత శ్రమికుల కు మిగులు నిలవల ను కల్పించడం కోసం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ఎన్ఆర్ఇజిఎస్) కు నిధుల కేటాయింపు ను పెంచడం జరిగింది.

ఆర్థిక సర్వే - 2021-22 సారాంశం (Press Information Bureau)

 

  •  2022-23లో 8.0శాతంనుంచి 8.5శాతం వృద్ధిని సాధించే దిశగా భారత్.
  • 2021-24లో అతివేగంగా ఎదిగే ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలిచిపోగలదని ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేస్తున్నాయి.  

  • వాస్తవిక లెక్కల్లో 2021-22లో 9.2శాతం మేర పెరగనున్న భారతీయ ఆర్థిక వ్యవస్థ.. ముందు సంవత్సరంలో 3.6శాతంగా నమోదైన వృద్ధితో పోల్చుకుంటే 2021-22లో వ్యవసాయ రంగం 3.9శాతం మేర వృద్ధిని సాధించే అవకాశం

  • 2020-21లో 7శాతం వృద్ధినుంచి 2021-22లో 11.8శాతం వృద్ధిని సాధించబోతున్న పారిశ్రామిక రంగం.
    గత ఏడాది 8.4శాతానికి పరిమితమైన సేవారంగం వృద్ధి, 2021-22లో 8.4శాతానికి ఎదిగే అవకాశం.

  • 2021 డిసెంబరు 31నాటికి అందుబాటులో ఉన్న విదేశీ మారక ద్రవ్యం 

  • నిల్వలు 634 బిలియన్ల అమెరికన్ డాలర్లు 13 నెలల్లో జరిగిన దిగుమతుల విలువకు ఇది సమానం.

  • 2021-22లో 15శాతం మేర భారీగా పెరగనున్న పెట్టుబడి
     

  • 2021 డిసెంబరులో వినియోగదారుల ధరల సూచీతో కూడిన ద్రవ్యోల్బణం 5.6శాతంగా నమోదు. భరించదగిన పరమితిలోనే ద్రవ్యోల్బణం


        2022-23వ ఆర్థిక సంవత్సరంలో భారతదేశం స్థూల స్వదేశీ ఉత్పాదన 8నుంచి 8.5శాతం వరకూ వృద్ధిని సాధించబోతోంది. 

        దేశంలో కొనసాగుతున్న విస్తృత స్థాయి వ్యాక్సినేషన్ ప్రక్రియ, సరఫరాల రంగంలో సంస్కరణల ద్వారా అందే ప్రయోజనాలు, నియంత్రణల సడలింపు, ఎగుమతుల్లో భారీ స్థాయి వృద్ధి, పెట్టుబడి వ్యయానికి అందుబాటులో ద్రవ్యనిధి..వంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో స్థూల స్వదేశీ ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి.

        కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021-22వ సంవత్సరపు ఆర్థిక సర్వే నివేదిక ఈ విషయాలు తెలిపింది. రాబోయే సంవత్సరంలో ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెరగనున్నాయని, ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు సానుకూల పరిచే పటిష్ట స్థితిలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. వైరస్ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ బలహీన పడటం ఇకపై జరగబోదని, సాధారణ వర్షపాతం ఉంటుందని, ప్రధాన కేంద్ర బ్యాంకుల ప్రపంచ స్థాయి లిక్విడిటీ సాధారణంగానే ఉంటుందని, చమురు ధర,.. బ్యారెలకు 70నుంచి 75 అమెరికన్ డాలర్ల మధ్యనే ఉంటుందని, ప్రపంచ సరఫరా వ్యవస్థ స్థిరంగా ఉండగలదని భావిస్తూ 2022-23వ సంవత్సరపు వృద్ధిపై ఈ అంచనాలను రూపొందించారు.

 

          2022-23వ సంవత్సరంలో స్థూల స్వదేశీ ఉత్పత్తి  8.7శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు, 7.5శాతం నమోదు కావచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి.) వేసిన ముందస్తు అంచనాల ప్రాతిపదికన భారతదేశం ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పోల్చవచ్చని సర్వే పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐ.ఎం.ఎఫ్.)నుంచి 2022 జనవరి 25న వెలువరించిన ప్రపంచ ఆర్థిక అంచనాల (డబ్ల్యు.ఇ.ఒ.) ప్రకారం భారతదేశం వాస్తవిక స్థూల స్వదేశీ ఉత్పత్తి 2021-22, 2022-23 సవంత్సరాల్లో 9శాతం మేర, 2023-24లో 7.1శాతం మేర పెరుగబోతోంది. ఈ మూడేళ్ల కాలంలోనూ అతి వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలవగలదని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.

 

          2020-21వ ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతంగా మాత్రమే వృద్ధిని నమోదు చేసుకున్న భారతీయ ఆర్థిక వ్యవస్థ వాస్తవిక లెక్కల ప్రకారం 2021-22లో 9.2శాతం మేర వృద్ధిని సాధించవచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. తొలి ముందస్తు అంచనాలను ప్రస్తావిస్తూ ఆర్థిక సర్వే ఈ వృద్ధిని లెక్కవేసింది. దేశంలో ఆర్థిక స్థితి బాగా కోలుకున్నదని, వైరస్ మహమ్మారి వ్యాప్తి ముందునాళ్ల స్థాయికి ఆర్థిక కార్యకలాపాలు చేరుకున్నాయని ఈ లెక్కలు చెబుతున్నాయి. అంటే,..2020-21వ సంవత్సరంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ ఆంక్షలు విధించినప్పటి పరిస్థితి కంటే మొదటి త్రైమాసికంలో  ఆర్థిక కార్యకలాపాలపై “సెకండ్ వేవ్” వైరస్ ప్రభావం చాలా తక్కువేనని, ఆరోగ్యంపై కోవిడ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపినప్పటికీ  మొత్తానికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని దాదాపు అన్ని సూచనలూ తెలియచజేస్తున్నాయి.   

 

        వివిధ రంగాల్లో ప్రగతిని గురించి కూడా ఆర్థిక సర్వే  వివరించింది. వ్యవసాయంపై, వ్యవసాయ అనుబంధ రంగాలపై కరోనా మహమ్మారి చూపిన ప్రభావం చాలా తక్కువేనని, 2021-22వ సంవత్సరంలో వ్యవసాయ రంగం 3.9శాతం మేర వృద్ధిని నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని, అంతకు ముందు సంవత్సరం వ్యవసాయ రంగం 3.6 శాతం మేర వృద్ధిని సాధించిందని ఆర్థిక సర్వే తెలిపింది. ఖరీఫ్, రబీ పంటకాల్లో నాట్లు పడిన విస్తీర్ణం, గోధుమ, వరి పంటల ఉత్పత్తి స్థిరంగా పెరుగుతూ వచ్చాయని పేర్కొంది. ప్రస్తుత సంవత్సరంలో ఖరీఫ్ కాలానికి ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 15.5 మిలియన్ టన్నులకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. దీనికి తోడుగా, సెంట్రల్ పూల్ కింద ఆహార ధాన్యాల సేకరణ ప్రక్రియకు సంబంధించి 2021-22లో పెరుగుదల ధోరణే కనిపించింది. అలాగే, కనీస మద్దతు ధరలు కూడా పెరిగాయి. ఇది జాతీయ ఆహార భద్రతకు, రైతుల ఆదాయాల వృద్ధికి దోహదపడింది. ప్రభుత్వ విధానాల తోడ్పాటు, సహాయ, సహకారాలతో వ్యవసాయ రంగం వృద్ధిని సాధించింది. కరోనా వైరస్ వ్యాప్తితో సవాళ్లు ఎదురైనప్పటికీ సకాలంలో విత్తనాలు, ఎరువుల సరఫరా జరగడం వ్యవసాయ వృద్ధికి దోహదపడింది. గత పదేళ్ల సగటుకు మించి, మంచి వర్షాలు కురవడం, జలాశయాల్లో నీటి నిల్వలు పెరగడంవల్ల కూడా ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి.

 

        ఇక, పారిశ్రామిక రంగం కూడా గణనీయమైన ప్రగతిని నమోదు చేసిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2020-21వ సంవత్సరంలో 7శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసిన పారిశ్రామిక రంగం ఆ తర్వాత తిరిగి కోలుకొని మరింత దూకుడు చూపించింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో 11.8శాతం మేర వృద్ధిని పారిశ్రామిక రంగం సాధించింది. తయారీ, నిర్మాణం, గనుల తవ్వకం వంటి రంగాలు కూడా ఇదే వృద్ధి ధోరణిని ప్రదర్శించాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షలు అమలవుతున్నా విద్యుచ్ఛక్తి, నీటి సరఫరా వంటి రంగాలు చక్కని ప్రగతిని నమోదు చేశాయి. కాగా స్థూల  విలువల జోడింపు (జి.వి.ఎ.)లో పారిశ్రామిక రంగం వాటా ఏకంగా 28.2శాతం మేర ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

 

          సేవారంగానికి చెందిన పలు విభాగాలు, ప్రత్యేకించి మనుషుల భౌతిక ప్రమేయం ఉన్న సేవలు,.. వైరస్ మహమ్మారి వ్యాప్తితో తీవ్రంగా దెబ్బతిన్నట్టు ఆర్థిక సర్వే తెలిపింది. గత ఏడాది 8.4శాతం స్థాయికి పరిమితమైన సేవారంగం,.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8.2శాతం మేర ప్రగతిని సాధించవచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. సేవలకు సంబంధించిన ఉప రంగాల పనితీరు మాత్రం పలురకాలుగా నమోదైంది. ఆర్థిక, స్థిరాస్తి రంగం, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగం విభాగాలల్లో కార్యకలాపాలు ఇప్పటికే కోవిడ్ ముందునాటి స్థితికి చేరుకున్నాయి. అయితే, ప్రయాణంరంగం, వాణిజ్యం, హోటళ్లు వంటి రంగాలు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోవలసి ఉంది. ఇక, పర్యాటక రంగంనుంచి ఆదాయం వేగంగా పడిపోయినప్పటికీ, సాఫ్ట్.వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) ఆధారిత సేవల రంగంలో భారీగా ప్రగతి నమోదైంది.

         ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం 2021-22వ సంవత్సరంలో వినియోగ రంగం మొత్తంగా 7శాతం వృద్ధిని నమోదు చేయబోతోంది. గత సంవత్సరంలాగే ఈ సారి కూడా ప్రభుత్వం తరపు వినియోగమే వృద్ధిలో ఎక్కువ పాత్ర పోషించింది. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రభుత్వం తరఫు వినియోగం కోవిడ్ ముందస్తు కాలంకంటే ఎక్కువగా 7.6శాతం స్థాయికి పెరగవచ్చని ఆర్థిక సర్వే అంచనాలు చెబుతున్నాయి. ప్రైవేటు రంగం తరఫు వినియోగం కూడా గణనీయంగా మెరుగుపడినట్టు అంచనా వేశారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తికంటే ముందస్తు స్థాయిలో 97శాతానికి ప్రైవేటు రంగం వినియోగం చేరుకున్నట్టు, వేగంగా వ్యాక్సినేషన్, ఆర్థిక కార్యకలాపాలు మామూలు స్థాయికి చేరుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ రంగం మరింత బలమైన స్థాయికి కోలుకోనున్నట్టు ఆర్థిక సర్వే అంచనా వేసింది.

         గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ (జి.ఎఫ్.సి.ఎఫ్.) లెక్కల ప్రకారం పెట్టుబడులు 2021-22వ సంవత్సరంలో 15శాతం మే వృద్ధిని సాధించనున్నాయని, త్వరలోనే కోవిడ్ మహమ్మారి ముందస్తుకాలం స్థాయికి వృద్ధి కోలుకుంటుందని  ఆర్థిక సర్వే పేర్కొంది. పెట్టుబడుల వ్యయం, మౌలిక సదుపాయాలపై ఖర్చు వంటి చర్యల ద్వారా వృద్ధి చక్రం గతిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడుల రంగం పాత్ర పెరుగుతోంది. దీనితో స్థూల స్వదేశీ ఉత్పత్తి (జి.డి.పి.)లో పెట్టుబడుల నిష్పత్తి స్థాయి, 2021-22వ సంవత్సరంలో 29.6శాతానికి పెరిగే సూచనలు ఉన్నట్టు ఆర్థిక సర్వే అంచనా వేసింది. గత ఏడేళ్లకాలంలో ఇదే అత్యధికం కాబోతున్నట్టు కూడా పేర్కొంది. ప్రైవేటు పెట్టుబడుల పునరుజ్జీవం ఇంకా ప్రారంభదశలో, ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, భారతదేశంలో పెట్టుబడుల్లో మరింత బలంగా ముందుకు దూసుకుపోనున్నట్టు పలు సూచనలు తెలియజేస్తున్నాయి. ప్రైవేటు రంగం పెట్టుబడులకు తగినంతగా మద్దుతు అందించేందుకు బలిష్టమైన, ప్రక్షాళన పొందిన బ్యాంకింగ్ రంగం ప్రస్తుతం సంసిద్ధంగా ఉంది.

         ఇక ఎగుమతులు, దిగుమతుల రంగం గురించి ఆర్థిక సర్వే ప్రస్తావిస్తూ,..2021-22వ సంవత్సరంలో ఇప్పటి వరకూ సరుకుల, సేవల ఎగుమతులు చాలా బలంగా కొనసాగుతూ ఉన్నట్టు పేర్కొంది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తితో సరఫరాకు సంబంధించి పలు రకాల అడ్డంకులు ఎదురైనప్పటికీ, 2021-22 సంవత్సరంలో వరుసగా 8 నెలలపాటు వాణిజ్య ఎగుమతులు 30 బిలియన్ అమెరికన్ డాలర్ల పైస్థాయిలోనే నమోదయ్యాయి. సేవల నికర ఎగుమతులు కూడా వేగంగా పెరిగాయి. వృత్తిపరమైన యాజమాన్య సేవలు, కన్సల్టింగ్ సేవలు, దృశ్య శ్రవణ, సంబంధిత సేవలు, సరకు రవాణా సేవలు, టెలికమ్యూనికేషన్లు, కంప్యూటర్-సమాచారం వంటి సేవల్లో ప్రగతి కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైంది. గిరాకీ ప్రాతిపదికన పరిశీలించినపుడు,.. ఇక భారతదేశం మొత్తం ఎగుమతులు 2021-22వ సంవత్సరంలో 16.5శాతం మేర వృద్ధిని సాధించవచ్చని భావిస్తున్నారు. కోవిడ్ వ్యాప్తి ముందస్తు కాలం స్థాయిని కూడా ఈ ఎగుమతులు అధిగమించవచ్చని అంచనావేస్తున్నారు. స్వదేశీయంగా గిరాకీ పెరగడం, దిగుమతి ముడిచమురు, లోహాల ధరల పెరుగుదల కొనసాగుతూ ఉండటం వంటి పరిణామాలతో దేశంలో దిగుమతులు కూడా బాగానే కోలుకున్నాయి. కోవిడ్ ముందస్తు కాలంలో దిగుమతుల కంటే అధికంగా 2021-22వ సంవత్సరంలో దిగుమతులు 29.4శాతం స్థాయికి పెరగనున్నాయి. ఫలితంగా, 2020-21వ సంవత్సరంలో అదే కాలంతో పోల్చినపుడు 2021-22లో భారతదేశపు నిఖర ఎగుమతుల్లో పరిస్థితి రుణాత్మక ధోరణికి దారితీసింది. అయితే కరెంట్ ఖాతా లోటు మాత్రం నిర్వహణా సౌలభ్యంతో కూడిన పరిమిత స్థాయిలోనే కొనసాగవచ్చని భావిస్తున్నారు.

          ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి సవాళ్లు, అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, భారతదేశం చెల్లింపు సమతూక స్థితి గత రెండేళ్లలోనూ లాభదాయంగానే కొనసాగింది. దీనితో, రిజర్వ్ బ్యాంకు కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వలను సమకూర్చుకోగలిగింది. 2021 డిసెంబరు నెలాఖరు నాటికి రిజర్వ్ బ్యాంకు వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు 634 బిలియన్ల అమెరికన్ డాలర్లుగా ఉంది. ఇది  13.2 నెలల దిగుమతుల విలువకు సమానంగా, విదేశీ రుణాల స్థాయి కంటే బాగా ఎక్కువగా ఉంది.

 

 

         అభివృద్ధి సాధించిన దేశాల్లోనూ,  పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఎదుగుతున్న దేశాల్లోనూ ద్రవ్యోల్బణం ప్రపంచ స్థాయి సమస్యగా తిరిగి తలెత్తిందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇంధన ధరలు, ఆహారేతర సరుకులు, ఉపకరణాల ధరలు పెరగడం, ప్రపంచ సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం, సరకు రవాణా వ్యయం పెరగడం వంటి పరిణామాలతో ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీసింది. భారతదేశంలో వినియోగ ధరల సూచీ (సి.పి.ఎస్.)తో కూడిన ద్రవ్యోల్బణం 2021-22వ సంవత్సరం ఏప్రిల్-డిసెంబరు కాలంలో 5.2 శాతంగా నమోదైంది. 2020-21వ సంవత్సరం ఇదే కాలంలో ద్రవ్యోల్బణం 6.6శాతంగా నమోదైంది. డిసెంబరు 2021 నాటికి 5.6శాతంగా నమోదైంది. ఇది, భరించదగిన పరిమితికి లోగానే ఉందని భావిస్తున్నారు. 2021-22లో ఆహార సంబంధమైన ద్రవ్యోల్బణంలో తగ్గుదలతో రిటైల్ సరుకుల సంబంధిత ద్రవ్యోల్బణం కూడా తగ్గింది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యు.పి.ఐ.) మాత్రం రెండంకెల స్థాయిలో కొనసాగుతూనే ఉంది.

          ఆర్థిక వ్యవస్థకు అందించిన ద్రవ్యపరమైన మద్దతు, ఆరోగ్య రక్షణ రంగంలో తీసుకున్న చర్యల వ్యయం కారణంగా ద్రవ్య లోటు, ప్రభుత్వ రుణం వంటి 2020-21లో పెరిగాయి. అయితే, 2021-22వ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ ప్రభుత్వ ఆదాయం బలమైన స్థాయిలో కోలుకోగలిగింది. 2021వ సంవత్సరం ఏప్రిల్-నవంబరు కాలంలో కేంద్ర ప్రభుత్వపు రెవిన్యూ వసూళ్లు 67.2శాతం మేర పెరిగాయి. 2021-22వ సంవత్సరపు బడ్జెట్ అంచనాల ప్రకారం  ఈ వసూళ్ళలో 9.6శాతం వృద్ధి నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు ఊపందుకున్న దశలో ఉన్నాయి. అలాగే, నెలసరి వస్తు సేవల పన్ను (జి.ఎస్.టి.)వసూళ్లు 2021 జూలై నెలనుంచి ఇప్పటి వరకూ లక్షకోట్ల రూపాయల స్థాయిని అధిగమించాయి.

 

           రెవిన్యూ వసూళ్లను సుస్థిరం చేస్తూ, వ్యయంపై ఒక లక్ష్యంతో కూడిన విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తున్నందున 2021 ఏప్రిల్-నవంబరునెలల మధ్య ద్రవ్య లోటు బడ్జెట్ అంచనాల్లో 46.2శాతానికి నియంత్రించడం సాధ్యమైంది. అంతకు ముందు రెండు సంవత్సరాల్లో ఇదే కాలంలో నమోదైన ద్రవ్య లోటుతో పోల్చితే ఇది మూడింట ఒక వంతు ఉంటుంది. (2020 సంవత్సరం ఏప్రిల్-నవంబరు నెలల మధ్య కాలంలో బడ్జెట్ అంచనాల్లో 135.1శాతంగా, 2019వ సంవత్సరపు ఏప్రిల్-నవంబరు నెలల మధ్యకాలంలో బడ్జెట్ అంచనాలో 114.8శాతంగా ద్రవ్యలోటు రికార్డయింది.)

          సంక్షోభ కాలంలో ఆర్థిక రంగంపై ఎప్పటికీ ఒత్తిడికి అవకాశం ఉంటుందని ఆర్థిక సర్వే తెలిపింది. అయితే,..భారతదేశపు పెట్టుబడి మార్కెట్ మాత్రం ఎంతో అద్భుతమైన పనితీరును ప్రదర్శించిందని, ఇండియన్ కంపెనీల రిస్క్ క్యాపిటల్ సమీకరణ రికార్డు స్థాయిలో జరిగిందని ఆర్థిక సర్వే తెలిపింది. 2021వ సంవత్సరం అక్టోబరు 18న సెన్సెక్స్ సూచీ అత్యధికంగా 61,766పాయింట్ల స్థాయికి, నిప్టీ సూచీ 18,477పాయింట్ల స్థాయికి పెరుగుదలను నమోదు చేసింది. 2021వ సంవత్సరం ఏప్రిల్-నవంబరు మధ్యకాలంలో  75 ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐ.పి.ఒ.) ద్వారా  రూ. 89,066కోట్ల మేర పెట్టుబడులు సమకూరాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ ఇంత భారీగా పెట్టుబడులు సమకూరలేదు. దీనికి తోడుగా, బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా చక్కని పెట్టబుడుల మద్దతు లభించింది. నిరర్థక ఆస్తులు (ఎన్.పి.ఎ.) కూడా నిర్మాణపరంగా బాగా తగ్గాయి. షెడ్యూల్డ్ వాణీజ్య బ్యాంకులకు సంబంధించిన గ్రాస్ నాన్ ఫర్ఫార్మింగ్ అడ్వాన్సుల (జి.ఎన్.పి.ఎ.) నిష్పత్తి, నెట్ నాన్-ఫర్ఫార్మింగ్ అడ్వాన్సుల (ఎన్.ఎన్.పి.ఎ.) నిష్పత్తిలో కూడా 2018-19లో తగ్గుదల కొనసాగంది.  2020వ సంవత్సరం సెప్టెంబరు నెలాఖరుకు 7.5శాతంగా ఉన్నషెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల జి.ఎన్.పి.ఎ. నిష్పత్తి 2021వ సంవత్సరం సెప్టెంబరు నెలాఖరుకకల్లా 6.9శాతానికి తగ్గింది.

 

            గిరాకీకి తగినట్టుగా చర్యల చేపట్టడం కంటే, సరఫరా రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం భారతీయ ఆర్థిక ప్రతిస్పందనా విధానంలో విశిష్టమైన పరిణామమని ఆర్థిక సర్వే తెలిపింది. అనేక రంగాలకు నియంత్రణలు, నిబంధనలనుంచి విముక్తి కల్పించడం, వివిధ ప్రక్రియలను సరళీకరించడం, ‘గతించినకాలానికి పన్ను విధించే పద్ధతిని’ తొలగించడం, ప్రైవేటీకరణ చేపట్టడం, ఉత్పాదనతో అనుసంధానించిన ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి చర్యలతో ప్రభుత్వ తన ఆర్థిక విధానం అమలు చేసిందని సర్వే తెలిపింది.

             భారతీయ సరఫరా వ్యవస్థకు సంబంధించిన వ్యూహంలో రెండు ఉమ్మడి అంశాలకు చోటిచ్చారు.: (1) కోవిడ్ అనంతరం ప్రపంచంలోని అనూహ్యమైన దీర్ఘకాలిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంస్కరణలు చేపట్టి, సడలింపులను మరింత మెరుగుపరచడం. మార్కెట్ సంస్కరణలు, అంతరిక్షం, డ్రోన్లు, జియోస్పేసియల్ మ్యాపింగ్, ట్రేడ్ ఫైన్స్ ఫ్యాక్టరింగ్ వంటి రంగాలపై నియంత్రణలన రద్దు; ప్రభుత్వ సేకరణ, టెలికమ్యూనికేష్లు, గత కాలానికి పన్ను విధింపు, ప్రైవేటీకరణ, ఆస్తులను నగదుగా మార్చుకోవడం, భౌతిక మౌలక సదుపాయాల కల్పన వంటి ప్రక్రియల సంస్కరణలు వంటి చర్యలు తీసుకోవడం.  (2)  భారతీయ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా సంస్కరణలు చేపట్టడం మరో అంశం. వాతావరణ, పర్యావరణ సంబంధిత విధానాలు; పేదలకోసం కుళాయిల ద్వారా నీటి సరఫరా, మరుగుదొడ్లు, మౌలిక గృహవసతి, బీమా, వంటి సామాజిక మౌలిక సదుపాయాలు తదితర అంశాలు ఈ పరిధిలోకి వస్తాయి.; ఆత్మనిర్భర భారత్ పథకంకింద కీలకమైన పరిశ్రమలకు మద్దతు అందించడం; విదేశీ వాణిజ్య ఒప్పందాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరించడం వంటివి కూడా ఈ పరిధిలోకి వస్తాయి.

          తాజా ఆర్థిక సర్వే సందర్భంగా ‘ప్రక్రియల్లో చేపట్టే సంస్కరణల’పై కూడా ముఖ్యంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా నియంత్రణల తొలగింపు, ప్రక్రియల్లో సంస్కరణలు అన్న రెండు అంశాల తేడాను గుర్తించడం చాలా అవసరం. ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో ప్రభుత్వ పాత్రను తగ్గించడం, లేదా తొలగించడాన్నే నియంత్రణల తొలగింపుగా పరిగణిస్తారు. ప్రక్రియల్లో సంస్కరణ అంటే, సదుపాయాల కల్పనా వ్యవస్థగా ఉన్న ప్రభుత్వ పాత్రను మరింత సులభతరం చేస్తూ  ప్రక్రియను సరళీకరించడమే ప్రక్రియల సంస్కరణగా పరిగణిస్తారు.

            కోవిడ్ వైరస్ మహమ్మారి సంక్షోభం కారణంగా గత రెండేళ్లూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలంగా పరిణమించిందని ఆర్థిక సర్వే పేర్కొంది. పదేపదే వైరస్ దాడి చేయడం, సరఫరా వ్యవస్థలు విచ్ఛిన్నం కావడం, ఇటీవలి కాలంలో ప్రపంచ ద్రవ్యోల్బణం ఏర్పడటం వంటి పరిణామాలు విధాన నిర్ణాయక ప్రక్రియకు సవాళ్లుగా నిలిచాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం ‘బార్.బెల్ వ్యూహం’ చేపట్టింది. ఈ వ్యూహంలో భాగంగా సమాజంలో దెబ్బతినేందుకు ఆస్కారం ఉన్న వర్గాలకు, అలాగే వాణిజ్య రంగానికి రక్షణ కల్పించే ఒక ఉమ్మడి వ్యవస్థను ప్రభుత్వం చేపట్టింది. ఆ తర్వాత మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడుల వ్యయాన్ని గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకుంది. గిరాకీ తగినట్టుగా సరఫరా వ్యవస్థ బలోపేతమయ్యేలా, ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక విస్తరణకు దోహదపడేలా చర్యలు తీసుకుంది.

        ప్రగతి సాధనకు అండగా నిలిచే రక్షణాత్మక ద్రవ్య విధానాన్ని కోవిడ్ మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటినుంచి అమలులోకి తెచ్చినట్టు ఆర్థిక సర్వే తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలకు మద్దతు, అనుసంధానం కల్పించేలా ప్రభుత్వం తరఫునుంచి పూచీ ఇవ్వడం, ప్రత్యేకించి సూక్ష్మ, చిన్న మధ్యతరహా సంస్థలకు (ఎం.ఎస్.ఎం.ఇ.లకు) అండగా నిలవడం ఈ రక్షణ వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగం. గత రెండేళ్లలో పరిశ్రమలు, సేవలకు, ప్రపంచ పరిణామాలు, స్థూల స్థిరత్వ సూచికలు తదితర కార్యకలాపాలకు ప్రాతినిధ్యం వహించే హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్.కు ప్రభుత్వం ఆర్థికపరమైన వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ, ప్రైవేటు వనరుల ద్వారా ఈ వెసులుబాటు కల్పించారు. దీనితో సంప్రదాయ పద్ధతికి, ఆనవాయితీకి భిన్నంగా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా విధాన నిర్ణయకర్తలు ప్రతిస్పందించేందుకు అవకాశం ఏర్పడింది.

        చివరగా,.. మొత్తంగా స్థూల ఆర్థిక స్థిరత్వ సూచికలపై ఆర్థిక సర్వే ఎంతో ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సూచికల ప్రకారం,.. 2022-23వ సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే స్థితికి భారతీయ ఆర్థిక వ్యవస్థ చేరుకున్నట్టుగా సర్వే తెలిపింది. ప్రస్తుత పరిస్థితులకు విభిన్నమైన ప్రతిస్పందనతో కూడిన వ్యూహం అనుసరించినందునే ప్రస్తుతం భారతీయ ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన స్థితిలో ఉందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది.

Related Posts Plugin for WordPress, Blogger...