ఏపీపీఎస్సీ తెలుగు మెటీరియల్

  • Home
  • AP JOB CALENDER 2026
  • తెలుగులో - PDF's
  • కరెంట్ ఆఫ్ఫైర్స్ మ్యాగజైన్స్
  • GENERAL SCIENCE
  • చిరు ఎకానమీ
  • POLITY
  • PRACTICE BITS
  • గ్రామ, వార్డు సచివాలయ మెటీరియల్
  • STATE TEXT BOOKS
  • పంచాయత్ సెక్రటరీ
  • ఏపీ మ్యాగజైన్స్
  • జనరల్ నాలెడ్జ్
  • యోజన మ్యాగజైన్స్
  • విపత్తు నిర్వహణ
  • APPSC పంచాయతీ సెక్రటరీ

రాజ్యం, సమాజం,ప్రభుత్వం,సంస్థలు అనగా నేమి ??

 

 

 

.

.

 

✌ రాజ్యం పదానికి అర్థం ఏమిటి ??
✌ రాజ్యం  నిర్వచనాలు ??
✌ రాజ్యం - ముఖ్య లక్షణాలు ??
✌ రాజ్యం, సమాజం,ప్రభుత్వం మధ్య తేడాలు ??

✌రాజ్యం ఒక రాజకీయ సంస్థ. ఇది అన్ని సామాజిక సంస్థలకంటే అత్యంత ముఖ్యమైనది, శక్తిమంతమైనది ''రాజ్యం" సహజమైన, అవసరమైన సంస్థ అని అరిస్టాటిల్ గారు తెలిపారు. 

✌మాకియవెల్లీ అనే తత్త్వవేత్త క్రీ.శ. 16వ శతాబ్దంలో ''ది ప్రిన్స్" అనే గ్రంథంలో ''రాజ్యం" అనే పదాన్ని ''లాస్టేటో"గా తొలిసారిగా ఉపయోగించాడు.ఇతడి ప్రకారం రాజ్యం అనేది అధికారాన్ని చెలాయించే సంస్థ.

✌ఆధునిక యుగంలో రాజ్యం అనే పదాన్ని ప్రభుత్వం, ప్రాంతం, జాతి అనే పర్యాయ పదాలతో సూచించారు ఆధునిక రాజ్యం ఏకాంత రాజ్యం కాదు. ఇతర దేశాలతో సంబంధాలు లేకుండా ఏ దేశం కూడా ఒంటరిగా మనలేదు. కాబట్టి ప్రతి రాజ్యానికి అంతర్జాతీయ గుర్తింపు అవసరం.

✌ మానవుడిపై అధికారంతో కూడిన ప్రాబల్యాన్ని రాజ్యం అని మాకియవెల్లీ నిర్వచించాడు. 

✌ ''రాజ్యం మానవుడి ప్రాథమిక అవసరాలను తీర్చడానికి అవతరించి, అతడికి ఉత్తమ జీవితం ప్రసాదించడానికి కొనసాగుతుంది" అని అరిస్టాటిల్ భావన

.

.

 

రాజ్యం పదానికి అర్థం ఏమిటి ??
              
✌ రాజ్యాన్ని ఆంగ్లంలో ''స్టేట్" అంటారు. స్టేట్ అనే ఆంగ్ల పదం ''స్టేటస్" అనే 'ట్యూటానిక్' భాష నుంచి ఆవిర్భవించింది. ఇటలీ దేశస్తుడై ''మాకియవెల్లీ" క్రీ.శ. 16వ శతాబ్దంలో ''ది ప్రిన్స్" అనే గ్రంథంలో రాజ్యం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించాడు.

రాజ్యం  నిర్వచనాలు ??

✌''మానవుడికి సుఖమైన, గౌరవమైన జీవనాన్ని ప్రసాదించడమే ధ్యేయంగా కలిగిన కుటుంబాలు, గ్రామాల సముదాయమే రాజ్యం" - అరిస్టాటిల్
✌  ఒక నిర్ణీత భూభాగంలో రాజకీయంగా వ్యవస్థాపితమైన ప్రజలే రాజ్యం - బ్లంట్ షీలి
✌''ఒక నిర్దిష్ట ప్రదేశంలో స్థిర నివాసులై, స్వతంత్య్రంగా ఉంటూ, వ్యవస్థాపిక ప్రభుత్వానికి విధేయులుగా ఉండే ప్రజా సముదాయమే రాజ్యం" - గార్నర్

రాజ్యం - ముఖ్య లక్షణాలు ??
          
✌ రాజ్యానికి ముఖ్యంగా ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమత్వం అనే నాలుగు ముఖ్య లక్షణాలతో పాటు 'అంతర్జాతీయ గుర్తింపు' కూడా అవసరం.

✌ ప్రజలు: రాజ్యం ఒక మానవ సంస్థ, మానవరహిత ప్రదేశాన్ని రాజ్యం అనరు. రాజ్య జనాభా ఎంత ఉండాలి అనే అంశం మీద నిర్దిష్టమైన అభిప్రాయం లేదు. రాజ్య జనాభా 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటే బాగుంటుందని అరిస్టాటిల్ తెలిపాడు.ఆధునిక భౌగోళిక రాజ్యాల్లో అత్యధిక జనాభా గల దేశాలు ఉన్నాయి.
ఉదా: చైనా, భారతదేశం.
✌ అతి తక్కువ జనాభా గల దేశాలు కూడా ఉన్నాయి
ఉదా: అండోరా, మొరాకో.

✌ అసలు రాజ్యంలో జనాభా ఎంత ఉంది అనేది ముఖ్యం కాదు. ఆ జనాభా ఎలాంటి వారు అనేది ప్రధానం. ఒక దేశంలోని జనాభా విద్యావంతులు, నైపుణ్యం కలవారు, దేశం కొరకు త్యాగం చేసే గుణం కలవారు ఉన్నట్లయితే ఆ దేశం బలవంతమవుతుంది. అది ఆదర్శ రాజ్యమవుతుంది.

✌ ప్రదేశం:
                 
✌ప్రదేశం లేదా భూభాగం అనేది రాజ్యం యొక్క రెండో ముఖ్య లక్షణం, రాజ్య జనాభా నిర్దిష్టంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న భూభాగాన్ని ప్రదేశం అంటాం. 
✌ఇందులో నిర్దిష్ట భూభాగం లేని సంచార జాతులను గుర్తించరు. 
✌1948లో యూదులంతా ఇజ్రాయెల్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక రాజ్యంగా గుర్తింపు పొందారు. 
✌రాజ్య భూభాగానికి సహజ సరిహద్దులు ఉంటే రక్షణ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు సరిహద్దుల వెంబడి సముద్ర తీరం, పర్వత శ్రేణులు ఉంటే అది రాజ్య భూభాగానికి సహజ రక్షణలుగా నిలిచి శత్రువుల దురాక్రమణను అరికడతాయి. 
✌ఇక రాజ్యానికి ఎంత ప్రదేశం ఉండాలి అనే అంశంలో ఏకాభిప్రాయం లేదు. ఎక్కువ విస్తీర్ణంతో ఉన్న దేశాలు కొన్ని ఉంటే, అతి తక్కువ విస్తీర్ణంతో ఉన్న దేశాలు కూడా కలవు. 
✌రాజ్యానికి భూభాగం ఎంత అన్నది ముఖ్యం కాదు. ఆ భూభాగం ఎలాంటిది అన్నదే ప్రధానం. ఒక రాజ్య భూభాగంలో సహజ వనరులు, నీరు, నదీజలాలు, సారవంతమైన నేలలు అనుకూలమైన శీతోష్ణస్థితి ఉంటే ఆ రాజ్యం బాగా అభివృద్ధి చెందుతుంది.

3) ప్రభుత్వం:
                
✌ప్రభుత్వమనేది రాజ్యానికి మూడో లక్షణం. రాజ్యం యొక్క ఆశయాలను నెరవేర్చే యంత్రాంగమే ప్రభుత్వం. రాజ్యం యొక్క ఆశయాలను రూపొందించి అమలుపరచడంలో నిమగ్నమైన వ్యక్తుల సముదాయాన్ని ప్రభుత్వంగా చెప్పవచ్చు.
✌ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడుతుంది. రాజ్య సరిహద్దులను కాపాడుతుంది. ప్రజలకు న్యాయాన్ని ప్రసాదిస్తుంది. ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతుంది. ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. రాజ్యం శాశ్వతమైనది. ప్రభుత్వం తాత్కాలికమైనది.

4) సార్వభౌమాధికారం:
                
✌రాజ్య ముఖ్య లక్షణాల్లో సార్వభౌమాధికారం అత్యంత ముఖ్యమైనది. ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం ఉన్నా సార్వభౌమాధికారం లేకపోతే రాజ్యం ఏర్పడదు. రాజ్యానికి ఉన్న అత్యున్నత శాసనాధికారాన్ని సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు.
సార్వభౌమాధికారం 2 రకాలు:
✌ అంతర సార్వభౌమత్వం
✌ బాహ్య సార్వభౌమత్వం

రాజ్యం - సమాజం మధ్య తేడాలు ??

       సమాజంలోని అనేక సంఘాల్లో రాజ్యం ఒకటి. రాజ్యం, సమాజం వేర్వేరు. ఈ రెండూ ఒకటి కావు
✌ రాజ్యం కంటే సమాజం ముందు పుట్టింది.
✌ సమాజ పరిణామ క్రమంలో రాజ్యం ఏర్పడి.. క్రమేణా అభివృద్ధి చెందింది.
✌ రాజ్యం కంటే సమాజం విస్తృతమైనది.
✌ రాజ్యం ఒక రాజకీయ సంఘం.
✌ ఇది సమాజంలోని అనేక సంఘాల్లో ఒకటి.
✌ సమాజంలో అనేక సంఘాలు ఉంటాయి.
✌ రాజ్య సమాజానికి నిర్ణీత భూభాగం అవసరం లేదు. కానీ రాజ్యానికి నిర్ణీత భూభాగం అవసరం.
✌ సమాజ కార్యకలాపాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.
✌ రాజ్య లక్ష్యాలు శాంతి భద్రతలు, న్యాయం, సంక్షేమానికి పరిమితమవుతాయి.
✌ సమాజానికి దండనాధికారం లేదు. సాంఘికాచారాలను ఉల్లంఘిస్తే వారిని సమాజం శిక్షించలేదు.
✌ ప్రజల సహకారం మీద సమాజం నడుస్తుంది. రాజ్యానికి దండనాధికారం ఉంటుంది. రాజ్య శాసనాలను ఉల్లంఘిస్తే అది శిక్షిస్తుంది.

రాజ్యం - ప్రభుత్వం మధ్య తేడాలు ??

✌ రాజ్యం యజమాని వంటిది. ప్రభుత్వం దాని ప్రతినిధి. రాజ్యం యొక్క నాలుగు ముఖ్య లక్షణాల్లో ప్రభుత్వం ఒకటి.
✌ రాజ్యానికి సంబంధించిన ఆశయాలను నెరవేర్చే యంత్రాంగమే ప్రభుత్వం.
✌రాజ్యం విస్తృతమైనది- ప్రభుత్వం పరిమితమైంది. రాజ్యంలో పాలకులు-పాలితులు ఉంటారు. కానీ ప్రభుత్వంలో పాలకులు మాత్రమే ఉంటారు.
✌ రాజ్యం శాశ్వతమైంది. ప్రభుత్వం తాత్కాలికమైంది. రాజ్యం శాశ్వతంగా ఉంటుంది. ప్రభుత్వం నిర్దిష్టకాలం తర్వాత మారుతుంది.
✌ రాజ్యానికి సార్వభౌమాధికారం అనే విశిష్ట లక్షణం ఉంటుంది. ఇది ప్రభుత్వ లక్షణం కాదు. రాజ్యాధికారం సహజమైంది. స్వతఃసిద్ధమైంది. కానీ ప్రభుత్వం చెలాయించే అధికారం దత్తత అధికారం.
✌ అన్ని దేశాల్లో రాజ్య స్వరూపం ఒకే విధంగా ఉంటుంది. అన్ని దేశాల్లో ప్రదేశం, ప్రభుత్వ సార్వభౌమాధికారం అనే నాలుగు లక్షణాలు ఉంటాయి. 
✌ కానీ అన్ని దేశాల్లో ప్రభుత్వ స్వరూపం ఒకే విధంగా ఉండదు. ఉదాహరణకు అమెరికాలో అధ్యక్ష తరహా ప్రభుత్వం, భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఉంది.  

రాజ్యం - సంస్థల మధ్య తేడాలు ??

✌రాజ్యంలో సభ్యత్వం నిర్బంధం - ఇతర సంఘాల్లో సభ్యత్వం వ్యక్తి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. నిర్భంద కాదు.
✌ ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం కలిగి ఉంటాడు. కానీ ఒక వ్యక్తి ఒకే సమయంలో అనేక సంస్థల్లో సభ్యత్వం కలిగి ఉండవచ్చు.
✌ రాజ్యానికి సరిహద్దులు, నిర్ణీత భూభాగం ఉంటుంది. కానీ సంస్థలకు సరిహద్దులు నిర్ణీత భూభాగం ఉండదు. కొన్ని సందర్భాల్లో కొన్ని క్లబ్‌లు, ఆఫీసులు, రాజ్య సరిహద్దులు అవతల వాటి కార్యకలపాలను నిర్వహిస్తుంటాయి.
✌ రాజ్యం సమాజ సంక్షేమం కోసం ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతుంది. కానీ సంస్థలు పరిమితమైన పనులను అందులోని సభ్యుల స్వప్రయోజనాలకోసం మాత్రమే చేపడతాయి.
✌ రాజ్యం శాశ్వతమైనది - సంస్థలు తాత్కాలికమైనవి.
✌ ఒక రాజ్యాన్ని మరో రాజ్యం జయిస్తే లేదా తనను తాను విభజించుకుంటే తప్ప రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
✌సంఘాలు తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు నెరివేరితే రద్దు చేసుకోవచ్చు. అనేక విధాలుగా అవతరిస్తుంటాయి, రద్దవుతుంటాయి.
✌ రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది. రాజ్యం, శాసనాలను ఉల్లంఘిస్తే శిక్షిస్తుంది. కాని సంఘాలకు శిక్షించే అధికారం లేదు.
✌ సంఘ నియమాలను ఉల్లంఘిస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం కలిగి ఉంటాయి. సంఘాలు రాజ్యాధికారానికి లోబడి తమ కార్యకలాపాలను నిర్వర్తిస్తాయి.
✌  సంఘాలపై రాజ్యానికి సంపూర్ణాధికారం ఉంటుంది.

.

.

 



రాజ్యం, సమాజం మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వివరించండి ??

          రాజ్యం
              సమాజం
1) రాజ్యం సహజ వికాసం కోసం ప్రయత్న పూర్వకంగా ఏర్పడిన సంస్థ.
1) సమాజం మానవుడి సహజ ప్రేరణ వల్ల ఏర్పడింది.
2) రాజ్యం సమాజం తర్వాత ఏర్పడింది.
2) సమాజం రాజ్యం కంటే ముందే ఏర్పడింది.
3) రాజ్యంలో సభ్యత్వం తప్పనిసరి.
3) సమాజంలో సభ్యత్వం స్వచ్ఛందమైనది.
4) రాజ్యం శాసనల ఆధారంగా అధికారం చెలాయిస్తుంది.
4) సమాజం సంప్రదాయాలపై ఆధారపడి పనిచేస్తుంది.
5) రాజ్యం ఒక నిర్దిష్ట భూభాగానికి పరిమితం. దానికి భౌగోళిక సరిహద్దులు ఉంటాయి.
5) సమాజానికి భౌగోళిక సరిహద్దులు ఉండవు.
6) రాజ్యానికి దండనాధికారం ఉంటుంది.
6) సమాజానికి దండనాధికారం ఉండదు.
7) రాజ్యం వ్యక్తుల రాజకీయ అవసరాలను తీరుస్తుంది. సమాజంలో శాంతి భద్రతలను రక్షించడంతోపాటు ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తుంది.
7) మానవుడి జీవన సంబంధమైన అన్ని విధులను సమాజం నిర్వహిస్తుంది.
8) రాజ్యం సమాజంగా ఏర్పడిన సంస్థ కాదు.
8) సహజంగా, స్వతఃసిద్ధంగా ఏర్పడిన సంస్థ.
9) రాజ్య చట్టాలు విధి విధానాలు కచ్చితంగా, స్పష్టంగా ఉంటాయి.
9) సమాజ సూత్రాలు అస్పష్టమైనవి. అవి సంప్రదాయాలు, కట్టుబాట్లపై ఆధారపడి ఉంటాయి.
10) రాజ్యం శాశ్వతమైంది కాకపోవచ్చు. అంతరించిపోయే అవకాశం ఉంది. వేరొక రాజ్యం దానిని బలవంతంగా ఆక్రమించుకోవచ్చు.
10) సమాజం శాశ్వతమైనది. ఇది నిరంతరం కొనసాగుతుంది.


 రాజ్యం - సంఘాల మధ్యగల సంబంధం, వ్యత్యాసాలను వర్ణించండి. ??

       రాజ్యం
            సంఘం
1) రాజ్య సభ్యత్వం నిర్భందమైనది.
1) సంఘాల్లో సభ్యత్వం ఐచ్ఛికమైనది. సంఘాల్లో సభ్యత్వం వ్యక్తి ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది.
2) ఒక వ్యక్తి ఒకే సమయంలో ఒక రాజ్యంలో మాత్రమే సభ్యత్వం కలిగి ఉంటాడు.
2) ఒక వ్యక్తి ఒకే సమయంలో అనేక సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉండవచ్చు.
3) సరిహద్దు, నిర్ణీత భూభాగం ఉంటుంది.
3) సరిహద్దులు, నిర్ణీత భూభాగం ఉంటుంది.
4) రాజ్యం శాశ్వతమైంది.
4) సంఘాలు తాత్కాలికమైనవి.
5) రాజ్యం సమాజ సంక్షేమానికి ఉపయోగపడే పనులను చేపడుతుంది.
5) సంఘాలు అందులో సభ్యత్వం ఉన్నవారి ప్రయోజనాల కోసం పని చేస్తాయి.
6) రాజ్యానికి సార్వభౌమాధికారం ఉంటుంది. రాజ్య శాసనాలను ఉల్లంఘిస్తే శిక్షించడం జరుగుతుంది.
6) సంఘాలకు సార్వభౌమాధికారం, శిక్షించే అధికారం ఉండదు. సంఘ నియమాలను ఉల్లంఘించే వారి సభ్యత్వాన్ని రద్దుచేయవచ్చు.


 

రాజ్యం - ప్రభుత్వం ఏ విధంగా వ్యత్యాసాలను కలిగి ఉన్నాయి ?

            రాజ్యం
         ప్రభుత్వం
1) రాజ్యం ప్రజలందరితో కూడుకొని ఉన్నందువల్ల విస్తృతమైంది.
1) ప్రభుత్వం కొద్దిమంది వ్యక్తులతో కూడుకొని ఉన్నందువల్ల పరిమితమైనది.
2) రాజ్యం శాశ్వత సంస్థ.
సార్వభౌమాధికారం ఉన్నంత కాలం రాజ్యం కొనసాగుతుంది.
2) ప్రభుత్వం తాత్కాలికమైనది. ఎన్నికలు, విప్లవాల ద్వారా ప్రభుత్వం మారుతూ వుంటుంది.
3) ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం అనే నాలుగు ప్రధాన లక్షణాలున్న సంపూర్ణ వ్యవస్థే రాజ్యం.
3) ప్రభుత్వం రాజ్యం యొక్క ప్రధాన లక్షణాల్లో ఒకటి మాత్రమే. ఇది రాజ్యంలో అంతర్భాగం.
4) రాజ్యానికి సార్వభౌమాధికారం అనే విశిష్ట లక్షణం ఉంటుంది.
4) ఇది రాజ్యం ద్వారా సంక్రమించిన పరిమితాధికారాలను నిర్వహిస్తుంది.
5) రాజ్యానికి స్వతఃసిద్ధమైన రూపం లేదు.
5) ప్రభుత్వం రాజ్యానికి జీవనాధారం.
6) రాజ్యం ఒక నిర్దిష్ట భూభాగంలో ఏర్పడిన సంస్థ.
6) ప్రభుత్వానికి నిర్దిష్ట భూభాగం అవసరం లేదు. అది ఎక్కడ నుంచి అయిన పనిచేయగలదు.
7) రాజ్యానికి ఏకరూపత ఉంటుంది.
7) ప్రభుత్వానికి బహురూపాలు ఉంటాయి. ప్రజాస్వామ్యం, నియంతృత్వం, అధ్యక్ష పార్లమెంటరీ వ్యవస్థ అనే వివిధ రూపాల్లో ఉంటుంది.
8) రాజ్యం ఒక నిర్ణీత ప్రదేశంలోని ప్రజలందరికీ చెందిన రాజకీయ సంస్థ.
8) ప్రభుత్వం రాజ్యానికి హృదయం లాంటింది. ఇది కొద్దిమందితో కూడి ఉంటుంది.
9) రాజ్యం యజమానిగా ఉంటూ, ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేస్తుంది.
9) ప్రభుత్వం రాజ్యానికి సేవకురాలిగా ఉంటుంది. ఇది రాజ్యాధికారానికి ప్రతీకగా వ్యవహరిస్తుంది.
10) రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే హక్కు ప్రజలకు లేదు.
10) అసమర్థమైన, నిజాయితీలేని ప్రభుత్వాన్ని ప్రజలు తొలగించవచ్చు. అలాగే ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలను వ్యతిరేకించే హక్కు ప్రజలకు ఉంటుంది.

 

 

 

at February 06, 2021 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: పాలిటి

మలబార్ తిరుగుబాటు (Moplah Riots of 1921)

 👉 మలబార్ తిరుగుబాటు లేదా 1921 నాటి మోప్లా అల్లర్లు

✊ ఈ తిరుగుబాటు యొక్క ప్రధాన నాయకులు

✊ వార్తల్లో ఎందుకు?

👉1921 మలబార్ తిరుగుబాటు లేదా మోప్లా అల్లర్లు వచ్చే ఏడాది 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. మరో మాటలో చెప్పాలంటే, 2021 సంవత్సరం 1921 మలబార్ / మోప్లా తిరుగుబాటు యొక్క 100 వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది.

.

.

 

👉 మలబార్ తిరుగుబాటు గురించి

✊ 1921 నాటి మలబార్ తిరుగుబాటు 19 వ మరియు 20 వ శతాబ్దాలలో మోప్లాస్ (మలబార్ ముస్లింలు) బ్రిటిష్ మరియు మలబార్ (ఉత్తర కేరళ) లోని హిందూ భూస్వాములకు వ్యతిరేకంగా చేసిన అల్లర్లకు పరాకాష్ట.
✊ బ్రిటీష్ వలస పాలన మరియు భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రతిఘటన తరువాత హిందువులు మరియు ముస్లింల మధ్య మత హింసలో ముగిసింది.

👉 మలబార్ తిరుగుబాటు లేదా మోప్లా తిరుగుబాటు 1921లో బ్రిటిష్ అధికారానికీ, హిందూ భూస్వాములకు విరుద్ధంగా దక్షిణ భారతదేశంలోని మలబార్ జిల్లా మప్పిలా మొహమ్మదీయులు చేసిన తిరుగుబాటు. 
✊ ఇది 19-20 శతాబ్దాలలో మరెన్నో సార్లు ఊచకోతలకు దారి తీసింది.
✊ ఖిలాఫత్ ఉద్యమాన్ని బ్రిటిష్ అధికారులు మలప్పురం జిల్లా-ఎరనాడ్, దక్షిణ మలబార్ జిల్లా-వల్లువనాడ్ లో అణిచివేసినప్పుడు, అందుకు ప్రతిచర్యగా 1921లో ఈ తిరుగుబాటు చోటు చేసుకుంది.

✊ కేరళలోని మలబార్ ప్రాంతంలో మోప్లా ముస్లిం రైతులు హిందూ అగ్రకులాలకు చెందిన నంబూద్రి, నాయర్ భూస్వాములకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు. ఖిలాఫత్ ఉద్యమం మోప్లాలకు అండగా నిలిచింది. కాంగ్రెస్, ఖిలాఫత్ ఉద్యమ నాయకులైన మహాదేవన్ నాయర్, గోపాల మీనన్, యాకూబ్ హసన్‌లను అరెస్ట్ చేయడంతో ఉద్యమం హింసాత్మకమైంది. 
✊ 1921, ఆగస్టు 20న పోలీసులు తిరురైంగాడి మసీదుపై దాడిచేయడంతో మోప్లాలు పోలీస్ స్టేషన్లను, ప్రభుత్వ కార్యాలయాలు, భూస్వాముల ఇళ్లను ధ్వంసం చేశారు. వీరు హింసాత్మక చర్యలకు పాల్పడటంతో కాంగ్రెస్ ఉద్యమానికి దూరమైంది. 
✊ 1921 డిసెంబరు నాటికి అనధికారికంగా 10,000 మంది మోప్లాలు హత్యకు గురయ్యారు.

✊ ఈ తిరుగుబాటు యొక్క ప్రధాన నాయకులు:
👉 వారియంకున్నాథ్ కుంజాహమ్మద్ హాజీ
👉 సితి కోయ తంగల్
👉 అలీ ముస్లియార్
Email ThisBlogThis!Share to TwitterShare to FacebookShare to Pinterest

 

at February 06, 2021 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: హిస్టరీ

విపత్తు నిర్వహణ ప్రశ్నలు 6

 1. ప్రపంచ విపత్తు నివేదికను ఎవరు తయారు చేస్తారు?

ఎ) ఐక్యరాజ్య సమితి
బి) జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ
సి) రెడ్‌క్రాస్‌, రెడ్‌ క్రిసెంట్‌ డి) వరల్డ్‌ బ్యాంక్‌
2. భారతదేశంలోBuilding Materials Techno logy Promotion Council (BMTPC) ÔájáÖsÁT తయారు చేసిన Vulnerability Atlas ర ప్రకారం వరదలు సంభవించే శాతం?
ఎ) 58 శాతం బి) 12 శాతం
సి) 4 శాతం డి) 30 శాతం
3. దేశంలో సాగవుతున్న భూమిలో కరువు బారినపడుతున్న భూభాగం?
ఎ) 68 శాతం బి) 58 శాతం
సి) 78 శాతం డి) 48 శాతం
4. మన దేశంలో ఏటా ఎంతమంది వరదలకు గురవుతున్నారు?
ఎ) 500 మిలియన్లు బి) 100 మిలియన్లు
సి) 200 మిలియన్లు డి) 400 మిలియన్లు
5. ప్రపంచ బ్యాంకు అంచనా ప్రకారం 1996-2010 మధ్య సంభవించిన విపత్తుల వల్ల దేశ జీడీపీలో 2 శాతం నష్టం వాటిల్లగా రెవెన్యూలో ఎంత శాతం నష్టం వాటిల్లింది?
ఎ) 13.15 శాతం బి) 12.15 శాతం
సి) 10.15 శాతం డి) 11.15 శాతం
6. కింది వాటిలో అధిక నష్టాన్ని కలిగించినవి?
ఎ) 2001 భుజ్‌ భూకంపం
బి) 2004 హిందూ మహాసముద్రంలోని సునామీ
సి) 2005 జమ్మూకాశ్మీర్‌ భూకంపం
డి) పైవన్నీ
7. 2005-10 మధ్య కాలంలో విపత్తులకు కేటాయించిన నిధులు?
ఎ) 21,333 కోట్లు బి) 20,333 కోట్లు
సి) 25,333 కోట్లు డి) 15,333 కోట్లు
8. 1990-2000 మధ్య కాలంలో ఏటా విపత్తుల బారిన పడి ఎంత మంది మరణిస్తున్నారు?
ఎ) 2344 బి) 5344 సి) 4344 డి) 9344
9. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఏ దశాబ్దాన్ని అంతర్జాతీయ విపత్తుల నివారణ దశాబ్దంగా  (Internati onal Decade for Natural Disaster Reduction)  ప్రకటించింది?
ఎ) 1995-2005 బి) 1990-2000
సి) 1980-1990 డి) 2000-2010
10. 'జాతీయ విపత్తుల నిర్వహణ బిల్లు'ను భారత పార్లమెంటు ఏ తేదీన ఆమోదించింది?
ఎ) 2005, డిసెంబరు 12
బి) 2005, డిసెంబరు 10
సి) 2005, డిసెంబరు 15
డి) 2005, డిసెంబరు 23
11. SDMAకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి) హోంమంత్రి
సి) ప్రధాన మంత్రి డి) ముఖ్యమంత్రి
12. నేషనల్‌ ఎగ్జ్జిక్యూటివ్‌ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) లోకసభ స్పీకర్‌ బి) హోమంత్రి
సి) హోం ప్రధాన కార్యదర్శి డి) ప్రధాన మంత్రి
13. మొదటి భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్‌ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 2005, డిసెంబరు బి) 2006, డిసెంబరు
సి) 2005, నవంబర్‌ డి) 2006, నవంబరు
14. రెండో భారత విపత్తుల నిర్వహణ కాంగ్రెస్‌ ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 2008 బి) 2006 సి) 2009 డి) 2010
15. భారత దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నింటిలో వరదలు వచ్చే అవకాశం ఉంది?
ఎ) 20 బి) 23 సి) 25 డి) 26


1.సి 2.బి 3.ఎ 4.సి 5.బి
6.డి 7.ఎ 8.సి 9.బి 10.ఎ
11.డి 12.సి 13.డి 14.సి 15.బి

.

.

16. ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న విపత్తుల్లో వరదల శాతం?
ఎ) 30 బి) 50 సి) 20 డి) 40
17. దేశంలో వరదల బారిన పడి ఏటా సగటున ఎంత మంది మరణిస్తున్నారు?
ఎ) 2000 బి) 3000
సి) 1600 డి) 1000
18. దేశంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్న పరి వాహక ప్రాంతం?
ఎ) గంగా-బ్రహ్మపుత్ర బి) గంగా-సింధు నది
సి) క ష్ణా-గోదావరి డి) నర్మద-తపతి
19. వరదలు సంభవించడానికి కారణాలు?
ఎ) అధిక వర్షపాతం బి) తుపానులు
సి) ఆటుపోటులు డి) పైవన్నీ
20. ప్లాష్‌ ఫ్లడ్స్‌ అంటే వర్షపాతం సంభవించిన తర్వాత ఎన్ని గంటల్లో సంభవించేవి?
ఎ) 6 బి) 5 సి) 3 డి) 8
21. పేదవాడి అణ్వాయుధాలు (పూర్‌ మ్యాన్స్‌ న్యూక్లియార్‌ బాంబ్స్‌) అని వేటిని అంటారు?
ఎ) మిథైల్‌ ఐసోసైనేట్‌ బి) ట్రైనైట్రోటోలిన్‌
సి) బయోలాజికల్‌ డిజాస్టర్స్‌ డి) గ్రీన్‌హౌస్‌ వాయువులు
22. కింది వాటిలో విపత్తులతో సంబంధమున్న అంశం ఏది?
ఎ) హ్యూగో డిక్లరేషన్‌ బి) కార్టిజనో ఒప్పందం
సి) నగోయ ఒప్పందం డి) క్యోటో ప్రోటోకాల్‌
23. భూకంప తరంగాలను నమోదు చేసే గ్రాఫ్‌ ఏది?
ఎ) బార్‌ గ్రాఫ్‌ బి) సిస్మో గ్రాఫ్‌
సి) టెక్టా గ్రాఫ్‌ డి) ఏదీకాదు
24. అవలాంచెస్‌ అంటే?
ఎ) కొండ చరియలు విరగటం
బి) మట్టి గడ్డలు విరిగి పడటం
సి) మంచు చరియలు విరిగి పడటం
డి) పైవన్నీ
25. మంచు చరియలు విరిగి పడటానికి కారణం?
ఎ) ఉష్ణోగ్రత పెరగటం
బి) వాలు కోణం (Slope angle)
సి) మంచు విస్తరణ (Snow pack) డి) పైవన్నీ
26. భూపాతాలు (Landslides) ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఏవి?
ఎ) హిమాలయ ప్రాంతం బి) పశ్చిమ కనుమలు
సి) నీలగిరి కొండలు డి) పైవన్నీ
27. భూపాతాలు (Landslides) సంభవించడానికి కారణం ఏమిటి?
ఎ) కొండ వాలుగా ఉండటం
బి) అడవులను నిర్మూలించడంతో మత్తిక కొట్టుకొని పోవడం
సి) దిగువ ప్రాంతాల్లో గనుల తవ్వకం
డి) పైవన్నీ
28. మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన భూపాతాల వల్ల ఎక్కడ 50 వేల మంది సైనికులు మతి చెందారు?
ఎ) ఆల్ఫ్స్‌ పర్వతాలు బి) ఆండీస్‌ పర్వతాలు
సి) రాఖీ పర్వతాలు డి) మిక్కెన్లీ పర్వతాలు
29. కింది వాటిలో భూపాతాలపై పరిశోధనలు చేపడుతున్న సంస్థలు?
ఎ) జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా
బి) వాడియో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ
సి) డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ డి) పైవన్నీ
30. కొండచరియలు విరిగి పడటానికి సంబంధించిన అట్లాసును రూపొందించిన సంస్థ?
ఎ) బిల్డింగ్‌ మెటీరియల్‌ అండ్‌ టెక్నాలజీ ప్రమోషన్‌ కౌన్సిల్‌
బి) అన్నా యూనివర్శిటీ సి) ఎ, బి డి) ఏదీ కాదు

16.డి 17.సి 18.ఎ 19.డి 20.ఎ
21.సి 22.ఎ 23.బి 24.సి 25.డి
26.డి 27.డి 28.ఎ 29.డి 30.సి

.

.

31. కింది వాటిలో పెద్ద భూపాతాలు సంభవించిన ప్రదేశాలు ఏవి?
ఎ) అస్సాం బి) కోహిమా, నాగాలాండ్‌
సి) మల్పా, ఉత్తరాఖండ్‌ డి) పైవన్నీ
32. 'జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం' ఏ తేదీన అమల్లోకి వచ్చింది?
ఎ) 2005, డిసెంబరు 12 బి) 2005, డిసెంబరు 10
సి) 2005, డిసెంబరు 15 డి) 2005, డిసెంబరు 23
33. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు?
ఎ) రాష్ట్రపతి బి) హోంమంత్రి
సి) ప్రధాన మంత్రి డి) ప్రధాన కార్యదర్శి
34. National Disaster Management Authority (NDMA)లో సభ్యుల సంఖ్య ఎంత?
ఎ) 10 బి) 8 సి) 15 డి) 7
35. చీణవీAకు ఉపాధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
ఎ) ప్రధాన కార్యదర్శి బి) లోక్‌సభ స్పీకర్‌
సి) కేబినెట్‌ హోదాలోని మంత్రి డి) ఏదీ కాదు
36. NDMAకు మొదటి ఉపాధ్యక్షుడు ఎవరు?
ఎ) ఎస్‌.సి. విజ్‌ బి) మర్రి శశిధర్‌ రెడ్డి
సి) మాంటెక్‌ సింగ్‌ డి) షిండే
37. విపత్తు నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, పథకాలు రూపొందించడం, విపత్తు ప్రణాళికను అమోదించడం, ప్రణాళిక అమలయ్యేలా చూడటం, సమన్వయం కలిగి ఉండటం, మార్గదర్శకాలు రూపొందించడం వంటివి దేని బాధ్యతలు?
 a) 2005, &™d+‹sÁT 12         _) 2005, &™d+‹sÁT 10
 d¾) 2005, &™d+‹sÁT 15         &) 2005, &™d+‹sÁT 23
3
38. విపత్తులకు సంబంధించిన విధి విధానాలు ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు?
ఎ) 10 బి)12 సి) 11 డి) 9
9. విపత్తులపై విద్యార్థుల్లో అవగాహన కల్గించడానికి జదీూజు ఏ తరగతుల్లో విపత్తు నిర్వహణ పాఠ్యాంశా లను చేర్చింది?
ఎ) 6, 7 బి) 7, 8 సి) 8,9 డి) 9, 10
40. ఈశాన్య రాష్ట్రాల్లో విపత్తుల నివారణకు ఏర్పడిన North-Eastern Council డిక్లరేషన్‌కు సంబం ధించింది ఏది?
ఎ) Mizoram Declaration
 b) Shillong Declaration 
 c) Nagaland Declaration   
 d) Tripura Declaration
41. వైపరీత్యాల్లో అతి శీఘ్రంగా స్పందించి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను అందించేందుకు పూర్తి స్థాయి శిక్షణ కలిగిన వ్యక్తులు, అధునాతన సాంకేతికతతో ఏర్పాటు చేసిన దళం?
a) National Disaster Response Force (NDRF)
b) Integrated coastal zone management project
c) National Institute of Disaster Management
c) State Disaster Management Authority
42. వరదల వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
ఎ) మ త్తికా క్రమక్షయం బి) పంట నష్టం
సి) తాగునీరు కలుషితమవడం డి) పైవన్నీ
43. గంగా పరివాహక ప్రాంతంలోని రాష్ట్రాల్లో వరదల నియంత్రణా, నిర్వహణకు 1972లో జల వనరుల మంత్రిత్వ శాఖ దేనిని ఏర్పాటు చేసింది?
ఎ) ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌
బి) గంగా ఫ్లడ్‌ కంట్రోల్‌ కమిషన్‌
సి) ఫ్లడ్‌ రిస్క్‌ మిటిగేషన్‌ ప్రాజెక్టు డి) పైవన్నీ
44. కేంద్ర జల కమిషన్‌ ఏర్పడిన సంవత్సరం
ఎ) 1940 బి) 1945 సి) 1950 డి) 1955
45. కింది వాటిలో వరదలకు సంబంధించిన కమిటీ?
ఎ) ఎమ్‌.కె. శర్మ కమిటీ
బి) ఆర్‌. రంగాచారి కమిటీ
సి) కేస్కర్‌ కమిటీ డి) పైవన్నీ
46. వాలు స్థిరత్వాన్ని పెంచాలంటే ఏం చేయాలి?
ఎ) వాలులో గడ్డి మొక్కలు నాటడం
బి) వాలును బలపరుచుట
సి) వాలులో సహజ ఉద్భిజ సంపదను పెంచడం
డి) పైవన్నీ
47. విపత్తుకు మొదటగా ఎవరు స్పందిస్తారు?
ఎ) ప్రభుత్వ సంస్థలు బి) ఇరుగు పొరుగు వారు
సి) కమ్యూనిటీ ప్రజలు డి) పైవన్నీ
48. విపత్తు నిర్వహణపై వేసిన తొలి కమిటీకి చైర్మన్‌ ఎవరు?
ఎ) కె.అయ్యంగార్‌ బి) బ్రిజేశ్‌
సి) జె.సి. పంత్‌ డి) మర్రి శశిధర్‌ రెడ్డి
49. ఆంధ్రప్రదేశ్‌లో కరువును అత్యధికంగా ఎదుర్కొం టున్న జిల్లాల సంఖ్య?
ఎ) 8 బి) 6 సి) 4 డి) 9
50. ప్రకతి వైపరీత్యాల వల్ల దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు మరిణిస్తే వారికి ఆర్థిక సహాయం అందించే పథకం ఏది?
ఎ) ఇందిరా క్రాంతి బి) ఆపద్భందు పథకం
సి) అభయ హస్తం డి) రాజీవ్‌ ఆవాస్‌ యోజన


.

.

31.డి 32.డి 33.సి 34.బి 35.సి
36.ఎ 37.డి 38.ఎ 39.సి 40.బి
41.ఎ 42.డి 43.బి 44.బి 45.డి
46.డి 47.బి 48.సి 49.ఎ 50.బి




at February 06, 2021 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: విపత్తు నిర్వహణ

విపత్తు నిర్వహణ ప్రశ్నలు 5

 1) విపత్తు అనే పదాన్ని ఇంగ్లీషులో Disaster అంటారు. ఈ పదం ఎందులో నుంచి పుట్టింది?

జ: Disastre అనే ఫ్రెంచి పదం నుంచి
2) Disastre అనే ఫ్రెంచి పదానికి అర్థం ఏంటి ?
జ: చెడు (Dis) నక్షత్రం (aster) : చెడు నక్షత్రం
నోట్: ఇటలీలో disastro అని, గ్రీకులో dusastro
3) ‘‘సమాజపు సాధారణ నిర్మాణానికి మరియు కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ, అకస్మాత్తుగా మరియు తీవ్రంగా సంభవించే ఆపదే విపత్తు’’ అని నిర్వచించింది ఎవరు ?
జ: ఐక్యరాజ్య సమితి (UNO)
4) విపత్తు ఒక భయంకర పరిస్థితి. దీంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. మరియు పర్యావరణ స్థితి విచ్ఛిన్నం అవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడటానికి అవసరమయ్యే అత్యవసర పరిణామమే విపత్తు’’ అన్న నిర్వచనం ఎవరిది ?
జ: కేంద్ర హోంమంత్రిత్వ శాఖ
5) 1999-2000ల మధ్య ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో విపత్తుల మరణాల శాతం ఎంత ?
జ: 4 శాతం
6) ప్రతి ఏడాది ప్రపంచంలో విపత్తుల వల్ల నష్టపోతున్న వారి సంఖ్య ఎంత ?
జ: 211 మిలియన్లు
7) 1980-2010 మధ్య మన దేశంలో విపత్తుల వల్ల మరణించిన వారి సంఖ్య ఎంత ?
జ: 1,43,039 మిలియన్లు
8) ప్రతి ఏడాది మన దేశంలో సంభవిస్తున్న మరణాల సంఖ్య ఎంత ?
జ: 4,334 మంది
9) విపత్తుల వల్ల భారత్ లో ఏటా ఎంత నష్టం జరుగుతోంది ?
జ: 10 బిలియన్ల డాలర్ల నష్టం
10) ప్రపంచ యుద్దాలు, ఉగ్రవాదం, నక్సలిజం, అణుబాంబులు లాంటివి ఏ విపత్తుల కిందకి వస్తాయి ?
జ: మానవకారక విపత్తులు

.

.

11) 1984లో జరిగిన పెద్ద మానవ కారక విపత్తు ఏది ?
జ: భోపాల్ గ్యాస్ దుర్ఘటన
12) వైపరీత్యాన్ని ఇంగ్లీషులో Hazard అంటారు. ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో ఆకస్మికంగా జరిగే సంఘటననే వైపరీత్యం. అయితే ఈ పదం ఏ భాషకు చెందినది ?
జ: Hazard అనేది Hassard అనే ఫ్రెంచి పదం, Az-zhar అనే అరబిక్ పదాల నుంచి వచ్చింది
13) ఫ్రెంచి భాషలో Hazard అంటే అర్థం ఏంటి ?
జ: Chance (అవకాశం)
14) విపత్తు పరిస్థితిని లేదా నష్టం తీవ్రతను తెలుసుకోడానికి ఏవి లెక్కలోకి తీసుకుంటారు ?
జ: ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం
15) మన దేశంలో ఎంతశాతం భూమి వరదలకు గురవుతోంది ?
జ: 12శాతం ( 8శాతం తుఫాన్లకు)
16) International day for Disaster Reduction( అంతర్జాతీయ విపత్తు కుదింపు దినం )గా ఎప్పుడు పాటిస్తారు ?
జ: అక్టోబర్ 13న
(నోట్: విపత్తుల కుదింపు దశాబ్దం- 1990-99)
17) National Day for Disaster Reduction ( జాతీయ విపత్తు కుదింపు దినోత్సవం)ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: అక్టోబర్ 29న

18) 21వ శతాబ్దం మొదటి దశాబ్దంలోనే భారత్ అనేక భయంకర విపత్తులు ఎదుర్కొంది. అవి ఏంటి  జ: 2001 లో - భుజ్ భూకంపం
2004లో - హిందూ మహాసముద్రంలో సునామీ
2008లో - కోసి నదికి వరదలు
19) భారత్ లో పునరావృతమయ్యే వరదలకు ఎంతమంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు ?
జ: 20 కోట్ల మంది ( 200 మిలియన్లు)
20) దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏయే రాష్ట్రాలు ప్రాణ, ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది ?
జ: ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, పశ్చిమబెంగాల్

.

.

21) సహజ విపత్తులను ఎదుర్కోవడంలో ప్రాథమిక బాధ్యత ఉంటుంది ?
జ: స్థానిక ప్రభుత్వం
22) 1556 సంవత్సరంలో ప్రపంచంలో నమోదైన మొదటి భూకంపం ఏ దేశంలో సంభవించింది ?
జ: చైనా
23) రాపిడ్ అన్ సెట్ డిజాస్టర్ కు ఉదాహరణ ఏది ?
జ: భూకంపం
24) సామాజిక ఆధారిత విపత్తు నష్ట నివారణను మన దేశంలో చేపట్టేది ఎవరు ?
జ: UNDP




at February 06, 2021 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Labels: విపత్తు నిర్వహణ

ECONOMIC SURVEY 2020-21

ECONOMIC SURVEY 2020-21

VOLUME-1


.

.

VOLUME-2


.

.




at January 29, 2021 No comments:
Email ThisBlogThis!Share to XShare to FacebookShare to Pinterest
Newer Posts Older Posts Home
Subscribe to: Posts (Atom)
Related Posts Plugin for WordPress, Blogger...

Labels

  • AP (1)
  • BOOKS (29)
  • CURRENT AFFAIRS MAGAZINES (27)
  • GROUP 1 MAINS (3)
  • GROUP 2 (3)
  • NOBEL PRIZES (5)
  • NOTIFICATIONS (10)
  • PANCHAYAT SECRETARY (11)
  • PERSONS (2)
  • PRACTICE BITS (23)
  • PRIZES (3)
  • QUIZ (1)
  • SACHAVALAYAM (4)
  • SCIENCE & TECHNOLOGY (1)
  • SYLLABUS (9)
  • అవార్డులు (9)
  • ఆడియో మెటీరియల్ (2)
  • ఆధునిక భౌతిక శాస్త్రం (3)
  • ఆంధ్రప్రదేశ్ విభజన (1)
  • ఇండెక్స్ (1)
  • ఎకనామిక్ సర్వేలు (5)
  • ఎకానమీ (35)
  • ఏపీ మ్యాగజైన్స్ (9)
  • ఏపీ స్టేట్ టెక్స్ట్ బుక్స్ (2)
  • గ్రామ సచివాలయం (10)
  • జనరల్ నాలెడ్జ్ (40)
  • జియోగ్రఫీ (10)
  • జీవశాస్త్రం (31)
  • పర్యావరణం (2)
  • పాలిటి (35)
  • ప్రభుత్వ పథకాలు (2)
  • ప్రాక్టీస్ బిట్స్ (24)
  • ప్రీవియస్ పేపర్స్ (6)
  • ఫిజిక్స్ (22)
  • బడ్జెట్ ప్రసంగాలు (5)
  • మ్యాగజైన్స్ (26)
  • యోజన మ్యాగజైన్స్ (15)
  • విపత్తు నిర్వహణ (13)
  • వ్యాసాలు (6)
  • హిస్టరీ (23)

పాపులర్ పోస్ట్స్

  • ANDHRULA CHARITRA BY B.S.L.HANUMANTHA RAO
    DOWNLOAD IT FROM PLAY STORE INDIAN HISTORY BY JOGINAIDU AKS APRIL 2022 CURRENT AFFAIRS MAGAZINE AKS MARCH 2022 CURRENT AFFAIRS MAGAZINE SHI...
  • GEOGRAPHY AND DISASTER MANAGEMENT BT ADV RAMANA RAJU
    VIVEK 2023 CURRENT AFFAIRS MAGAZINES INDIAN HISTORY BY JOGINAIDU AKS APRIL 2022 CURRENT AFFAIRS MAGAZINE AKS MARCH 2022 C...
  • GROUP-2 ECONOMY STUDY MATERIAL LINKS BY CHIRANJEEVI SIR
           These are the links of Economy Study Material in Telugu Medium, Prepared by State Famous Economy faculty CHIRANJEEVI Sir. We pr...
  • INDIAN POLITY BY PRABHAKAR REDDY
    APPSC GROUPS TELUGU MATERIAL   DOWNLOAD THE APP FROM PLAY STORE ANDHRULA SANGHIKA CHARITRA BY SURAVARAM ...
  • INDIA-AP HISTOTY !!! KAREEM !!! RC REDDY
    INDIAN POLITY BY PRABHAKAR REDDY AP ECONOMY --- CHIRANJEEVI SIR 2017 NOTES AP INDUSTRIES - CHIRANJEEVI SIR NOTES 201...
  • AP HISTORY BY SEENAIAH SIR
        Indian Polity In Telugu : An Study and Quiz app in Telugu refreshes knowledge on Indian Polity, who preparing for UPSC, APPSC, TSPSC ...
  • INDIAN HISTORY BY !!! NAGARAJU !!! NAGARJUNA STUDY CIRCLE
    VIVEK 2024 CURRENT AFFAIRS MAGAZINES      INDIAN POLITY BY PRABHAKAR REDDY AP ECONOMY --- CHIRANJEEVI SIR 2017 NO...
  • INDIAN ECONOMY !!! NAGARJUNA STUDY CIRCLE !!!
    . .
  • INDIAN HISTORY BY JOGINAIDU
        . .   . .      
  • WHITE PAPER 1-5 FROM AP MAGAZINE
    . . WHITE PAPER 1 FROM AP MAGAZINE . . WHITE PAPER 2 FROM AP MAGAZINE . . WHITE PAPER 3 FROM AP MAGAZINE . ...

Report Abuse

Subscribe To

Posts
Atom
Posts
All Comments
Atom
All Comments

Search This Blog

About Me

SURESH TVN
View my complete profile

Blog Archive

  • ▼  2026 (8)
    • ▼  April 2026 (3)
      • YES & YES APRIL 2026
      • SHINE INDIA APRIL 2026
      • INDIAN ECONOMY 2020 PDF
    • ►  March 2026 (5)
  • ►  2025 (3)
    • ►  May 2025 (2)
    • ►  April 2025 (1)
  • ►  2024 (4)
    • ►  September 2024 (2)
    • ►  January 2024 (2)
  • ►  2023 (3)
    • ►  December 2023 (3)
  • ►  2022 (72)
    • ►  October 2022 (1)
    • ►  September 2022 (6)
    • ►  April 2022 (4)
    • ►  March 2022 (1)
    • ►  February 2022 (9)
    • ►  January 2022 (51)
  • ►  2021 (36)
    • ►  November 2021 (2)
    • ►  October 2021 (4)
    • ►  August 2021 (5)
    • ►  July 2021 (6)
    • ►  June 2021 (3)
    • ►  March 2021 (1)
    • ►  February 2021 (14)
    • ►  January 2021 (1)
  • ►  2020 (33)
    • ►  September 2020 (1)
    • ►  August 2020 (7)
    • ►  May 2020 (16)
    • ►  February 2020 (7)
    • ►  January 2020 (2)
  • ►  2019 (28)
    • ►  December 2019 (11)
    • ►  July 2019 (4)
    • ►  June 2019 (1)
    • ►  April 2019 (1)
    • ►  March 2019 (2)
    • ►  February 2019 (5)
    • ►  January 2019 (4)
  • ►  2018 (212)
    • ►  December 2018 (35)
    • ►  November 2018 (12)
    • ►  October 2018 (35)
    • ►  September 2018 (10)
    • ►  August 2018 (14)
    • ►  July 2018 (48)
    • ►  June 2018 (58)

Followers

ఆడియో మెటీరియల్

  • ఇండియన్ హిస్టరీ
  • ఫీజికల్ సైన్సు
Awesome Inc. theme. Powered by Blogger.