ఈ బాంబులు ‘థర్మోబారిక్’ వర్గానికి చెందినవి. ఇప్పుడున్న సంప్రదాయ బాంబులతో పోలిస్తే ఈ థర్మోబారిక్ బాంబులు చాలా భిన్నమైనవి శక్తివంతమైనవి.
సంప్రదాయ బాంబుల్లో 25 శాతం పేలుడు పదార్థం ఉంటుంది. అది మండి పేలేందుకు
వీలుగా 75 శాతం ఆక్సిడైజర్లను వాడుతుంటారు. కానీ, ఈ థర్మోబారిక్ బాంబుల్లో
మొత్తంగా పేలుడు పదార్థాలనే వినియోగిస్తారు. బాంబును ప్రయోగించాక టార్గెట్
చుట్టూ ఉండే గాలిలోని ఆక్సిజన్ ను వాడుకుని అది పేలుతుంది. ఇది చేసే
విధ్వంసం చాలా పెద్దది.
ఈ బాంబు పేలుడు ద్వారా ఊహకందని ఉష్ణోగ్రతలు విడుదలవుతాయి. పేలిన చోట 300
మీటర్ల నుంచి 600 మీటర్ల దాకా దాని ప్రభావం ఏర్పడుతుంది.
వాక్యూమ్ బాంబులపై నిషేధం !
థర్మోబారిక్ బాంబులను రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఉపయోగించారు. ఈ
థర్మోబారిక్ బాంబుల వల్ల మనుషులపై పెద్దఎత్తున ప్రభావం పడే అవకాశం ఉన్నందున
అప్పట్లోనే వీటిని ప్రపంచదేశాలన్నీ నిషేధించాలని నిర్ణయించారు. జెనీవా
ఒప్పందంలో భాగంగా అన్ని అగ్రదేశాలు ముఖ్యంగా వాక్యూమ్ బాంబులు కలిగి ఉన్న
దేశాలు వాడబోమని సంతకాలు చేశాయి. అయితే అగ్రదేశాలు వీటిని వాడుతున్నాయన్న
ఆరోపణలు తరచుగా వస్తున్నాయి.