జ్ఞాన్ పీఠ్ అవార్డు

          జ్ఞాన్‌పీఠ్ అవార్డును ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారంగా పరిగణిస్తారు. ఈ అవార్డును 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రిక ప్రచురణకర్తలైన సాహూజైన్ కుటుంబం వారి 'భారతీయ జ్ఞాన్‌పీఠ్' ట్రస్టు నిర్వహిస్తోంది. మొదటి అవార్డును 1965లో మళయాళ రచయత జి.శంకర్ కురుప్‌కు ప్రదానం చేశారు. 
         ఈ బహుమతి కింద రూ.11 లక్షల నగదు, ప్రశంసా పత్రం, సరస్వతీ దేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. గుర్తింపు పొందిన భారతీయ భాషలో రచనలు చేసినవారుఈ పురస్కారానికి అర్హులు. తొలుత ఈ పురస్కారాన్ని ఓ పుస్తకానికి గుర్తింపుగా ఇచ్చేవారు. 1982 తర్వాత సాహిత్యంలో జీవిత కాల సాఫల్య పురస్కారంగా ఇస్తున్నారు. సంస్కృతంలో తొలిసారిగా 2006లో సత్యవత్ శాస్త్రికి ఈ పురస్కారం అందజేశారు. 


         మొదటి అవార్డును 1965లో ప్రదానం చేశారు. 1965 నుంచి 1981 వరకు ఒక పుస్తకానికి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఇచ్చేవారు. 1982 నుంచి ఒక పుస్తకానికి కాకుండా సాహితీ రంగంలో చేసిన సేవకు ఇవ్వడం ప్రారంభించారు. అవార్డు గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీ దేవి కాంస్య విగ్రహం ప్రదానం చేస్తారు.
  • తొలి జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత మలయాళ రచయిత జి.శంకర కురుప్ (1965). ‘ఒదక్కుజల్’ అనే పుస్తకానికి ఈ అవార్డు లభించింది.
  • జ్ఞాన్‌పీఠ్ అవార్డును అందుకున్న తొలి మహిళ బెంగాలీ రచయిత్రి ఆశాపూర్ణాదేవి (1976). ఆమె రాసిన ‘ప్రథమ్ ప్రతిశ్రుతి’ అనే నవలకు ఈ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఎనిమిది మంది మహిళలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డును బహూకరించారు.

తెలుగు రచయితలు
         ఇప్పటి వరకు ముగ్గురు తెలుగు రచయితలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వారు..
విశ్వనాథ సత్యనారాయణ (1970)
సి.నారాయణరెడ్డి (1988)
రావూరి భరద్వాజ (2012)


 
కృష్ణ సోబతీకి ‘2017 జ్ఞాన్‌పీఠ్ అవార్డు’
  2017కు గాను జ్ఞాన్‌పీఠ్ అవార్డును ప్రముఖ హిందీ రచయిత్రి కృష్ణ సోబతీకి ప్రకటించారు. 2017, నవంబర్ 3న జ్ఞాన్‌పీఠ్ సెలక్షన్ బోర్డు ఈ అవార్డును ప్రకటించింది. ఆమెకు 53వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. జ్ఞాన్‌పీఠ్‌కు ఎంపికైన 11వ హిందీ రచయిత/రచయిత్రి కృష్ణ సోబతీ. మహాదేవి వర్మ తర్వాత హిందీలో జ్ఞాన్‌పీఠ్‌ను పొందిన రెండో మహిళా రచయిత్రి కృష్ణ సోబతీ కావడం విశేషం.

కృష్ణ సోబతీ 1925, ఫిబ్రవరి 18న ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో జన్మించారు. ఆమె వయసు 92 ఏళ్లు. దేశ విభజన, స్త్రీ పురుష సంబంధాలు, మారుతున్న భారతీయ సమాజ స్థితిగతులు, క్షీణిస్తున్న మానవ విలువలు వంటివి ఆమె కథాంశాలు. ఆమె పలు రచనలు భారతీయ భాషలతో పాటు స్వీడిష్, రష్యన్, ఆంగ్లంలోకి కూడా అనువాదమయ్యాయి.
కృష్ణ సోబతీకి 1980లో ‘జిందగీనామా’ అనే నవలకు సాహిత్య అకాడమీ అవార్డు, 1996లో సాహిత్య అకాడమీ ఫెలోషిప్ లభించాయి. 2010లో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’ ప్రకటించినప్పటికీ ఆమె తిరస్కరించారు.

కృష్ణ సోబతీ ఇతర రచనలు: మిత్రో మర్‌జాని, దార్ సే బిచ్చుడీ, దిలో దానిష్, బాద్‌లోంకే ఘేరే, ఏ లడ్‌కీ, గుజరాత్ పాకిస్థాన్ సే గుజరాత్ హిందుస్థాన్.


 
అవార్డు గ్రహీతలు
సంవత్సరం రచయిత రచన భాష
1965 జి.శంకర కురుప్ ఉడక్కుళై మలయాళం
1966 తారా శంకర్ బంద్యోపాధ్యాయ జ్ఞానదేవత బెంగాలీ
1967 డాక్టర్ కె.వి.పుట్టప్ప శ్రీ రామాయణ దర్శనం కన్నడం
1967 ఉమాశంకర్ జోషి నిషిత గుజరాతీ
1968 సుమిత్రానంద్ పంత్ చిదంబర హిందీ
1969 ఫిరాక్ గోరఖ్‌పురి గుల్ - ఎ - నాగ్మా ఉర్దూ
1970 డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం తెలుగు
1971 బిష్ణు డే స్మృతి సత్తా భవిష్యత్ బెంగాలీ
1972 డాక్టర్ రాంధారి సింగ్ దినకర్ ఊర్వశి హిందీ
1973 దత్తాత్రేయ రామచంద్ర బింద్రే నకుతంతి కన్నడం
1973 గోపీనాథ్ మొహంతి మతిమాతల్ ఒడియా
1974 విష్ణు శాఖరం ఖండేకర్ యయాతి మరాఠీ
1975 పి.వి. అఖిలన్ చిత్రప్పవై తమిళం
1976 ఆశాపూర్ణా దేవి ప్రథమ్ ప్రతిసృతి బెంగాలీ
1977 కె.శివరామ్ కారంత్ మూకజ్జియ కనసుగళు కన్నడం
1978 ఎస్.హెచ్. వాత్సాయన్ కిత్నీ నావోం మే కిత్ని బార్ హిందీ
1979 బీరేంద్ర కుమార్ భట్టాచార్య మృత్యుంజయ అస్సామీ
1980 ఎస్.కె.పొట్టిక్కాట్ ఒరు దేశాదిందే కథ మలయాళం
1981 అమృతా ప్రీతం కాగజ్ తే కాన్వాస్ పంజాబీ
1982 మహాదేవి వర్మ యమ హిందీ
1983 మస్తి వెంకటేశ అయ్యంగార్ చిక్కవీర రాజేంద్ర కన్నడం
1984 టి.శివశంకర పిళ్లయ్ కాయర్ మలయాళం
1985 పన్నాలాల్ పటేల్ మానవి నీ భావీ గుజరాతీ
1986 సచ్చితానంద్ రౌత్రాయ్
ఒరియా
1987 వి.వి. షిర్వాద్కర్
మరాఠీ
1988 డాక్టర్ సి.నారాయణ రెడ్డి విశ్వంభర తెలుగు
1989 ఖుర్రాతులియన్ హైదర్ అఖిరే షాబ్‌కీ హమ్‌సఫర్ ఉర్దూ
1990 వి. కె. గోఖక్ భారత సింధు రష్మీ కన్నడం
1991 సుభాష్ ముఖోపాధ్యాయ్ పదాతిక్ బెంగాలీ
1992 నరేష్ మెహతా
హిందీ
1993 సీతాకాంత్ మహాపాత్ర
ఒడియా
1994 యు.ఆర్ అనంతమూర్తి
కన్నడం
1995 ఎం.టి.వాసుదేవన్ నాయర్ రండమూళం మలయాళం
1996 మహాశ్వేతా దేవి హజర్ చురాషిర్ మా బెంగాలీ
1997 అలీ సర్దార్ జాఫ్రీ
ఉర్దూ
1998 గిరీష్ కర్నాడ్
కన్నడం
1999 నిర్మల్ వర్మ
హిందీ
1999 గురుదయాల్ సింగ్
పంజాబీ
2000 ఇందిరా గోస్వామి దతల్ హతిర్ ఉన్యే కువా హౌదా అస్సామీ
2001 రాజేంద్ర కేశవలాల్ షా ధ్వని గుజరాతీ
2002 డి.జయకాంతన్
తమిళం
2003 వింద కరందీకర్
మరాఠీ
2004 ర హ్మాన్ రాహి
కాశ్మీరీ
2005 కున్వర్ నారాయణ్
హిందీ
2006 సత్యవ్రత్ శాస్త్రి
సంస్కృతం
2006 రవీంద్ర కెలేకర్
కొంకణీ
2007 ఒ.ఎన్.వి. కురూప్
మలయాళం
2008 అక్లక్ మహ్మద్ ఖాన్
ఉర్దూ
2009 అమర్‌కాంత్, శ్రీలాల్ శుక్లా
హిందీ
2010 చంద్రశేఖర్ కంబార
కన్నడం
2011 ప్రతిభా రే యజ్ఞసేని ఒడియా
2012 డా. రావూరి భరద్వాజ పాకుడురాళ్లు తెలుగు
2013 కేదార్‌నాథ్ సింగ్ అకల్ మే సరస్ హిందీ
2014 బాలచంద్ర నెమాడే హిందూ: జగన్యాచి సమృద్ధ అడ్గల్ మరాఠీ
2015 ర‌ఘువీర్ చౌధ‌రి అమృత (న‌వ‌ల‌) గుజ‌రాతీ
2016 శంఖా ఘోష్  - బెంగాలీ
2017 కృష్ణా సోబతి జిందారుఖ్‌ (నవల) హిందీ

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...