▼

చంద్రశేఖర్ ఆజాద్

  


          భారత స్వాతంత్రోద్యమంలో చంద్రశేఖర్ ఆజాద్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన ఎంద‌రికో స్పూర్తిదాయకంగా నిలిచారు. రవి అస్త‌మించని బ్రిటీష్ సామ్రాజ్యం అని ప్రగ‌ల్భాలు పలికే ఆనాటి తెల్ల‌దొరల ప్రభుత్వం ఆజాద్ ని సజీవంగా పట్టుకోలేకపోయింది. 1931 ఫిబ్రవ‌రి 27న ఆల్ఫ్రెడ్ పార్క్‌ లో నిర్వ‌హించిన ప్రజాగరన్ కార్య ్జ‌క్రమంలో ఆయన హ‌తుడయ్యేంతవర‌కు పోలీసులు ఎప్పుడూ ఆయ‌న్ని కనీసం తాకే సాహసం కూడా చేయలేకపోయారు.

         చంద్రశేఖర్ ఆజాద్ తన తుదిశ్వాస వర‌కు భారత స్వాతంత్య్రం కోసమే బతికారు. ఆయన మధ్యప్రదేశ్ లోని భాబ్రా గ్రామంలో 1906 జూలై 23న జ‌న్మించారు. వారి స్వ‌స్థ‌లం ఉతర్త‌ప్రదేశ్ ఉన్నావో జిల్లాలోని బద‌ర్కా గ్రామం. కానీ తన తండ్రి సీతారామ్ తివారీ క‌రువు కారణంగా స్వ‌గ్రామాన్ని విడిచిపెట్టి బ‌తుకుదెరువు కోసం తన కుటుంబాన్ని మధ్యప్రదేశ్ లోని భాబ్రాకు తరలించారట. ఆయనది చిన్నతనం నుంచి తిరుగుబాటు ధోరణి. ఆయన చదువుకంటే క్రీడ‌ల్లో ఎక్కువ ఆస‌క్తి కనబరిచేవారు. తన పేరులో ఆజాద్ అనే ప‌దాన్ని జోడించడం వెనుక ఒక ఆస‌క్తికరమైన కథనం ఉంది.

          జలియన్ వాలాబాగ్ మారణ‌కాండ యువ చంద్రశేఖర్ ని కదిలించింది. అతని త‌ల్లి చంద్రశేఖర్ ని సంస్కృత పండితుడిగా చూడాలనుకుంది. కానీ ఆయన దేశాన్ని విముక్తి చేసే మార్గాన్నే ఎంచుకున్నారు. 1921లో స‌హాయ నిరాకరణోద్యమం జరుగుతున్న సమయంలో ద‌ర్నాలో కూర్చున్న 15 ఏళ్ళ చంద్రశేఖర్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌రిచారు. అప్పుడు మెజిస్ట్రేట్ నీ పేరు, తండ్రి పేరు, నీ అడ్రస్ ఏమని ప్ర‌శ్నించగా.. దానికి చంద్రశేఖర్ నా పేరు ఆజాద్, నా తండ్రి పేరు స్వ‌తంత్ర‌, నా అడ్రస్ జైలు అని సమాధానం చెప్పారు. ఆ జవాబుకు అతనికి శిక్ష ప‌డింది. కానీ, ఆజాద్ అనేది తన పేరుతో శాశ్వ‌తంగా ముడిపడిపోయింది.

         ఎంతో ఉధృతంగా సాగుతున్న స‌హాయ నిరాకరణోద్యమాన్ని చౌరీ- చౌరా ఘటనతో నిలిపివేయడం ఆయ‌న్ని నిరాశపరచింది. శాంతియుత మార్గాలతో స్వాతంత్ర్యాన్ని సాధించలేమని భావించి తన మ‌కాం బ‌నారస్ కు మార్చుకున్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో బెనారస్ విప్ల‌వ కార్యకలాపాల‌కు కేంద్రంగా ఉండేది. 

         1924 అక్టోబర్ లో కాన్పూర్ లో హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ ను స్థాపించారు. త‌ర్వాత అదే హిందుస్థాన్ సోషలిస్ట్రిపబ్లికన్ అసోసియేషన్గా మారింది. రామ్ ప్ర‌సాద్ బిస్మిల్, జోగేష్ చట‌ర్జీ, చంద్రశేఖర్ ఆజాద్, యోగేంద్ర శుక్లా, శ‌చీంద్ర‌నాథ్ సన్యాల్, అష్ఫాఖుల్లా ఖాన్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి, భగత్ సింగ్, భగవతి చరణ్ వోహ్రా, సుఖదేవ్ వంటి గొప్ప విప్ల‌వకారులు ఆ అసోసియేషన్ కి ముఖ్య స‌భ్యులుగా ఉన్నారు. త‌ర్వాత దశాబ్దంలో ఈ పేర్ల‌న్నీ దేశ ప్రజలని ఎంతగానో ఆక‌ర్షించి అనేక మంది వారి బాటను అనుస‌రించేందుకు దోహదప‌డ్డాయి బ్రిటీష్ వారిని భయపెట్టాయి. త‌ర్వాత 1925లో జ‌రిగిన కకోరి రైలు సంఘటనలో ఈ సంస్థ‌కు చెందిన చాలా మంది స‌భ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆజాద్, కుందన్లాల్ పోలీసుల నుంచి తప్పించుకున్నారు.

         1927 డిసెంబర్ 17న డి.ఎస్.పి జాన్ సాండర్స్ ని హత్య చేసిన అనంతరం భగత్ సింగ్, రాజ్ గురులు డిఎవి కాలేజ్ వైపు పరుగులు తీస్తుండగా చందన్ సింగ్ అనే ఒక కానిస్టేబుల్ వారి వెంటప‌డ్డాడు. చందన్ సింగ్ భగత్‌సింగ్ కి అతి చేరువగా సమీపించి అత‌న్ని ప‌ట్టుకునే ప్రయత్నం చేయగా దూరం నుంచి చంద్రశేఖర్ ఆజాద్ కాల్చిన తూటా అతని కాలిలో దిగబడింది.

         1929లో సెంట్రల్ అసెంబ్లీబాంబు దాడి కేసులో ఈ సంస్థ‌కు చెందిన అనేక మంది స‌భ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ ఈ సంఘటన‌ల్లో కీలకపాత్ర పోషించిన ఆజాద్ ని మాత్రం ప‌ట్టుకోలేకపోయారు. ఆజాద్ జన్మస్థ‌లం అయిన భాబ్రాని సందర్శంచిన తొలి ప్ర‌దాని న‌రేంద్ర మోదీ. ప్రధాని న‌రేంద్ర మోదీ 2016లో తను చేప‌ట్టిన ‘జర యాద్ కరో కుర్బానీ’ (త్యాగాన్ని స్మ‌రించుకుందాం) కార్యక్రమాన్ని ఈ గ్రామం నుంచే ఆయన మొదలుపెట్టారు.

No comments:

Post a Comment