అతినీలలోహిత కిరణాలు

 

         వీటిని రిట్టెర్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. వీటి తరంగదైర్ఘ్య అవధి 100Å- 4000Å. క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల శక్తి చాలా ఎక్కువ. క్వార్‌‌ట్జ గాజు మినహా మిగతా గాజు పదార్థాలన్నీ ఈ కిరణాలను శోషించుకుంటాయి. అందువల్ల క్వార్‌‌ట్జతో నిర్మించిన కటకాలు, పట్టకాలను ఉపయోగించి ఈ కిరణాల ఉనికిని తెలుసుకోవచ్చు.
గమనిక:
అతినీలలోహిత కిరణాలను తేనెటీగలు చూడగలుగుతాయి.

అనువర్తనాలు:

  • పాలు, నీళ్లలో ఉన్న హానికర బ్యాక్టీరియాను నశింపజేయడానికి, ఆహార పదార్థాలను మన్నికగా ఎక్కువ కాలం నిల్వ చేయడానికి అతినీలలోహిత కిరణాలను ఉపయోగిస్తారు.
గమనిక: ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం వాటిలో సోడియం బెంజోయేట్‌ను కలుపుతారు.
  • వైద్య రంగంలో స్టెరిలైజేషన్ కోసం (హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేయడానికి) ఈ కిరణాలను ఉపయోగిస్తారు.
  • పాడైన కోడిగుడ్లను గుర్తించడానికి వాడతారు.
  • సహజ, కృతిమ దంతాల మధ్య తేడాలను తెలుసుకోవడానికి వీటిని ఉపయోగిస్తారు.
  • టీవీ, రేడియో కార్యక్రమాల ప్రసారాల్లోనూ వినియోగిస్తారు.
  • తొలిదశలో ఉన్న కేన్సర్ గడ్డలను కరిగించడానికి వీటిని వాడతారు.
  • వేలిముద్రలను విశ్లేషించడానికి వాడతారు.
  • వృక్షాలు కిరణజన్య సంయోగక్రియ జరపడానికి వీటిని ఉపయోగించుకుంటాయి.
  • అతినీలలోహిత కిరణాలు మన శరీరంపై పడినప్పుడు 1 మి.మీ. లోతుకు చొచ్చుకెళ్లి విటమిన్-డిని ప్రేరేపిస్తాయి. రికెట్స్ వ్యాధి రాకుండా విటమిన్-డి తోడ్పడుతుంది.
  • నకిలీ డాక్యుమెంట్లు, కరెన్సీ నోట్లను గుర్తించడానికి వినియోగిస్తారు.
నష్టాలు: సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల శక్తి అధికంగా ఉంటుంది. వీటి ద్వారా చర్మ కేన్సర్ సోకుతుంది. ఈ కిరణాలు నేరుగా భూమిని చేరకుండా వాతావరణంలోని ఓజోన్ పొర శోషించుకుంటుంది. కానీ క్లోరోఫ్లోరో కార్బన్‌లు, ఫ్రియాన్ వాయువుల వల్ల ఓజోన్ పొరకు రంధ్రాలు ఏర్పడుతున్నాయి. వీటి ద్వారా అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని చేరుతాయి.

No comments:

Post a Comment